జయశంకర్ స్ఫూర్తిని మరిచిపోయామా!


Fri,June 15, 2012 12:01 AM

Raju14 talangana patrika telangana culture telangana politics telangana cinema
జ యశంకర్ సార్ చనిపోయిన నెల రోజుల్లో మిత్రుడు జూలూరు గౌరీశంకర్ ‘తెలంగాణ జాతిపిత సర్ జయశంకర్’ పేరుతో ఒక పుస్తకం తీసుకొచ్చారు. మూడువందల పేజీలకు పైగా ఉన్న ఆ పుస్తకంలో దాదాపుగా డ్బ్భై మంది రాసిన వ్యాసాలున్నాయి. వివిధ విశ్వవిద్యాయాలలో జయశంకర్ గారి శిష్యులు, సహాధ్యాయులు, సహచరులు మొదలు తెలంగాణ కోసం క్షేత్రస్థాయిలో తెలంగాణ సాధనే ఊపిరిగా పనిచేస్తోన్న సామాన్య కార్యకర్తల దాకా అందులో ఆచార్య జయశంకర్ గారి గురించి రాసిన వ్యాసా లూ, వ్యాఖ్యలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఒక మనిషి మరణం తరువాత అంతటి స్పందన ఇటీవలి చరివూతలో ఇంకెవరికీ రాలేదు. తెలంగాణలో రాయగలిగే అలవాటు ఉన్న ప్రతిఒక్కరూ తమ వేదనను వ్యాసాల రూపంలో వివిధ పత్రికల్లో ఆవిష్కరించారు. వాటిల్లో జయశంకర్ గారి వ్యక్తి త్వం, జీవితం, పోరాటం, ఆరాటం ఇలా జయశంకర్ జీవితంలో ఎన్ని ఛాయలున్నాయో ఆ పుస్తకంలో అన్ని రంగులున్నాయి.
ఆ వ్యాసాలన్నిటినీ ఒక్కచోట పేర్చి అచ్చువేసిన గౌరీశంకర్ నెలరోజుల్లోనే ఆ పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆ పుస్తకానికి ‘మరువరాని మనిషి’ అనే టాగ్‌లైన్‌ను కూడా చేర్చా రు. కానీ ఆయన చనిపోయిన ఏడాది తరువాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆయన క్రమక్షికమంగా కనుమరుగవుతున్నట్టే అనిపిస్తోంది. ఆయనను ఇప్పు డు చాలామంది మరిచిపోయారు. ఇలా అంటే ఆయన విగ్రహాలు ప్రతిష్టించిన వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. నేను అంటున్నది ఆయన మూర్తిని గురించి కాదు, మరిచిపోయిన ఆయన స్ఫూర్తిని గురించి.! జయశంకర్ గారు లేని ఈ ఏడాది కాలంలో తెలంగాణ ఉద్యమం ఏం సాధించిందో చూసుకుంటే కథ మూడేళ్ళు వెనక్కి వెళ్లినట్టు కనిపిస్తోంది. పరకాల ఎన్నికలు, ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చిన తెలంగాణవాదంలోని వైరుధ్యాలు ఇప్పుడు సగటు తెలంగాణవాదిని కలవరపె కనిపిస్తున్నాయి. జయశంకర్ ఆశించిన ఐక్యత, పోరాట స్ఫూర్తి రాజకీయ ఏకాభివూపాయ సాధన పూర్తిగా కొరవడిపోవడమే కాకుండా ఇప్పుడంతా ఆయన స్ఫూర్తికి భిన్నంగా కనిపిస్తోంది. దీనికి తెలంగాణవాదుల్లో ఏ ఒక్కరినో తప్పుపట్టలేం. సాధారణంగా అవకాశవాద రాజకీయాల తీరే అది. అందులోనే ఇప్పుడు తెలంగాణవాదం చిక్కుబడి పోయింది.

ఒక సంక్షోభాన్ని ప్రజలు మరిచిపోవడానికి మరో సంక్షోభాన్ని సృష్టించడమే సరైన పరిష్కారం అన్నది పాతకాలపు రాజనీతి ఎత్తుగడ. కొత్తగా ఇది అవకాశవాద రాజకీయాలకు బాగా ఉపయోగపడుతున్నది. తెలంగాణ విషయంలో అవకాశవాదమే తమ విధానంగా అనుసరిస్తున్న రాజకీయ వర్గాల న్నీ ఇప్పుడు ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి. దానంతట అదే వచ్చిందో, కావాలనే తెచ్చారో కానీ జగన్ ఈ రాష్ట్రంలో సృష్టించిన సంక్షోభం ఇప్పుడు తెలంగాణవాదాన్ని తెరమరుగు చేసేసింది. దాదాపు మూడేళ్ళుగా ప్రజల జీవన్మర ణ సమస్యగా కనిపించిన తెలంగాణ ఇప్పుడు చడీ చప్పుడు లేకుండాపోయిం ది. ఉన్నట్టుండి జగన్ వ్యక్తిగత సమస్య ఇప్పుడు తెలుగు ప్రజల సమస్యగా మారిపోయింది. గత రెండునెలలుగా ఉపఎన్నికల్లో జగన్ గెలుస్తాడా లేదా అన్న బాధ చాలామందినే వేధించింది.

ఉపఎన్నికల్లో జగన్ అన్నీ గెలిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఏమౌతుంది? కొన్నే గెలిస్తే రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుం ది? అసలు ఊహించని విధంగా ఓటమి పాలయితే ఆయన, ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది లాంటి అనేక ప్రశ్నలు ప్రజలకు ప్రధానమైపోయాయి. సీబీ ఐ కంటే వేగంగా విచారణ జరుపుతూ, కోర్టులకంటే ఎక్కువ సాధికారంగా తీర్పులు చెపుతున్న ప్రసార సాధనాలు ఒకవైపు, నేర విచారణ వ్యవస్థలు, రాజ్యాంగ శాసనాలు, ధర్మాసనాలు అన్నీ బూటకమని జగనే సత్యం, అతనే సర్వం అని వాదిస్తున్న మీడియా మరోవైపు ఈ రాష్ట్రంలో ఇంకే సమస్యని కూడా తెరమీదికి రాకుండా చేశాయి. అందులో తెలంగాణ కూడా ఒకటి. జగన్ కోసం పదిహేడు నియోజకవర్గాల్లో వచ్చిన ఉపఎన్నికల వల్ల ఎవరికి లాభమో తెలియదు. కానీ తెలంగాణ ఉద్యమానికి మాత్రం అది తీరని నష్టా న్ని కలిగిస్తోంది. ఈ ఉపఎన్నికల పుణ్యమా అని ఇప్పుడు తెలంగాణ నినాదం కేవలం ఒక్క పరకాలకు పరిమితమైపోయింది. ఈ ఉప ఎన్నికల్లో బహుశా మొదటిసారిగా టీఆర్‌ఎస్ తన సొంత బలంతో పోటీ చేసింది. ఇది కచ్చితంగా పోటీలో ఉన్న టీఆర్‌ఎస్‌కే కాదు, మొత్తం తెలంగాణ ఉద్యమానికొక పరీక్ష.

ఎప్పుడైనా పరీక్షలు అయిపోయాకే చేసిన తప్పులేమిటో తెలిసి వస్తాయి. రాజకీయాల్లో కూడా ఎన్నికలు అయిపోయాకే జరిగిన లోపాలేమిటో తెలుస్తాయి. ఇప్పటివరకు తెలంగాణవాదానికి తిరుగులేని చిరునామాగా ఉన్న టీఆర్‌ఎస్ గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికల కోసం కష్టపడాల్సి వచ్చింది. కేవలం టీఆర్‌ఎస్‌ను ఓడించడం కోసమే ఈ ఎన్నికల్లో ఇంతమంది పోటీ పడుతున్నారని ఆ పార్టీ అంటోంది. అది నిజమే కావొచ్చు.

కానీ దానికి కారణాలు వెతకాల్సిన బాధ్యత కూడా ఆ పార్టీ మీద ఉన్నది. మొదట ఏదో ఒక ప్రధాన పార్టీతో పొత్తులతో పోటీ చేసిన టీఆర్‌ఎస్ 2009 తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఒంటరిగా పోటీ చేసి సునాయాస విజయాలు నమోదు చేసుకుంది. ఉద్యమం ఉవ్వెత్తున లేచిన కాలంలో జరిగిన ఎన్నికల్లో చారివూతాత్మక విజయా లు నమోదు చేసుకుంది. ఈ విజయాలన్నీ కేవలం ఆ పార్టీ సొంతం అనుకోవడానికి వీలులేదు. దాని వెనుక జయశంకర్ అందించిన ఐక్య కార్యాచరణ ఉన్నది. దానికి ప్రతిరూపమైన జేఏసీ, దానికి తోడుగా తెలంగాణ పౌర సమా జం కూడా ఉందన్నది వాస్తవం. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన నిరాహారదీక్ష, తదనంతర పరిణామాలు ఆ పార్టీని ప్రజలకు చేరువ చేశాయి. ఒక సాధారణ రాజకీయ పార్టీగా దాదాపు దశాబ్ద కాలం ఎన్నికల రాజకీయాలకు మాత్రమే పరిమితమైన టీఆర్‌ఎస్ 2009 ఒక ఉద్యమపార్టీగా అవతరించిం ది. తెలంగాణ పల్లెల నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ అంటే కేరాఫ్ టీఆర్‌ఎస్ అన్నంతగా ఆ పార్టీ ఎదిగింది. దాని జయశంకర్ కృషి, శ్రమ, ఆలోచ నా ఉన్నాయన్న వాస్తవాన్ని కేసీఆర్ కూడా కాదనలేడు.

అంత బలంగా ఎదిగిన పార్టీ ఇప్పుడు ఒక్క పరకాల సీటు కోసం చెమటోడ్చవలసి రావడం వెను క ఇతర పార్టీల ఎత్తుగడలతోపాటు, ఆపార్టీ వ్యూహాత్మక తప్పిదాలూ ఉన్నా యి. తెలంగాణ ఉద్యమాన్ని ఏకధాటిగా నడిపించకుండా ఢిల్లీ పెద్దల హామీలను నమ్ముతూ పోవడంవల్ల ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. కేసీఆర్ నిరాహారదీక్ష విరమణ తరువాత, దీక్ష విరమించినా పోరాట మార్గం వదిలేది లేదని కరాఖండిగా చెప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఆ తరువాత కూడా రాజకీయ ఒత్తిడి పెంచే అవకాశాలు అనేక సందర్భాల్లో వచ్చాయి. ఆ పార్టీ పిలిచినప్పుడల్లా ప్రజలు స్పందిస్తూ సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె, మిలియన్‌మార్చ్ వంటి వాటికి ముందుకు వచ్చారు. ఒత్తిడి పెంచారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ హామీలు, మాటలు పదే పదే నమ్మి టీఆర్‌ఎస్, జేఏసీలతో పాటు తెలంగాణ ప్రజలు మోసపోతూ వచ్చారు. చిట్టచివరగా ఉత్తరవూపదేశ్‌తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ఏదో జరగబోతుందన్న నమ్మకాన్ని కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ కలిగించింది. ఆ ఐదు రాష్ట్రాల సమస్యకూడా తెలంగాణ సమస్యే అన్నంతగా ఉద్యమం ఎదురుచూపులకే పరిమితమయ్యింది. రాష్ట్ర ప్రకటన కోసం ఎదురుచూస్తున్న వారికి ఉపఎన్నికల ప్రకటన తెచ్చి, దాన్ని కూడా ఆ పార్టీ తెలంగాణవాదాన్ని కనుమరుగుచేసేందుకే వాడుకుంటోంది. జగన్ కేసులను తిరగదోడి ఆంధ్రా రాజకీయాలను అయోమయంలో పడేసిన కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికల జయాపజయాలను బట్టి రాష్ట్రంలో కొత్త రాజకీయ సంక్షోభాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తోంది.

రాజకీయ పార్టీల గారడీ అయోమయంలో పడవేస్తుందన్న సత్యం జయశంకర్‌సార్‌కు తెలుసు అందుకే ఆయన ఉద్యమానికి ఒక కార్యాచరణ ఉండాలన్నాడు. ఆ కార్యాచరణను అన్ని సామాజిక, పౌరక్షిశేణులను ఒక్క తాటిపై ఐక్యం చేయడానికి దోహదపడాలని ఆశించాడు. అది ఆయన బతికి ఉన్నప్పు డే జరిగింది. కానీ పోరాటం సుధీర్ఘమై ఆటుపోట్లలో తెలిపోతున్నప్పుడు ఆ ఐక్య కార్యాచరణ నిలబడలేకపోతున్నది. జయశంకర్ తన జీవితంలో ఐక్య కార్యాచరణ ప్రయత్నాలను అనేక సందర్భాలలో చేశారు. అవన్ని విఫలమయ్యాకే తాను ఒక రాజకీయశక్తి అవసరమని భావించానని తన కలకు దగ్గర గా ఉన్న ప్రతిరూపం టీఆర్‌ఎస్ అని కూడా ఆయన ఒక సందర్భంలో అన్నా రు. టీఆర్‌ఎస్‌ను వేదికగా చేసుకుని ఢిల్లీలో రాజకీయ పార్టీల ఇల్లిల్లూ తిరిగి తెలంగాణ సమస్య వివరించి వారిలో సానుకూలతకు ప్రయత్నించారు.

ఆయ న కృషి వల్లే జాతీయ పార్టీల వైఖరులు మారి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పార్టీలన్నీ ఎవరి దారి వారివే అంటున్నాయి. రాజకీయపార్టీల ఈ వేరు వేరు దారులు రాజకీయ జేఏసీని కూడా అయోమయంలో పడేశాయి. జేఏసీలో భాగస్వాములుగా ఉన్న బీజే పీ- టీఆర్‌ఎస్ రెండూ పరకాల స్థానానికి పోటీ పడడంతో సహజంగానే జేఏసీ సందిగ్ధంలో పడింది.ఉద్యమ లక్ష్యంతో పనిచేయాల్సిన పార్టీలు స్వార్థ ప్రయోజనాలకోసం ఇప్పుడు ముఖాముఖి తలపడుతున్నాయి. ప్రధానంగా బీజేపీకి, ఆ పార్టీ అధినేత కిషన్‌డ్డికి ఇప్పుడు 2014 మాత్రమే కనిపిస్తోంది. దీనికి మహబూబ్‌నగర్ ఉప ఎన్నికల్లోనే బీజం పడింది. ఉద్యమంలో పెద్దరికం కలిగిఉన్న టీఆర్‌ఎస్ బీజేపీని లెక్కచేయడంలేదని అందుకే జేఏసీలో చీలిక వచ్చిందని కొందరు వాదిస్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఇది జేఏసీలో మూడో ముసలం. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలు జేఏసీ వదిలి వేరు వేరు సందర్భాల్లో వెళ్ళిపోయాయి. అది జేఏసీకి గానీ, టీఆర్‌ఎస్‌కు గానీ ఏమాత్రం నష్టం కలిగించలేదు సరికదా మరింత బలోపేతం చేశాయి. టీఆర్‌ఎస్, జేఏసీ మాత్ర మే తెలంగాణ ఉద్యమ ప్రతినిధులు,మిగితావాళ్ళు ద్రోహులన్నంతగా ప్రచా రం జరిగి ఆ పార్టీలకు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని స్థితి వచ్చింది. బహుశా బీజేపీనీ ఆ జాబితాలో చేర్చాలని టీఆర్‌ఎస్ భావిస్తుందనవచ్చు.

జేఏసీలో మిగిలిఉన్న పార్టీలలో టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఎన్నికలే ఎజెండాగా పనిచేస్తున్నాయని మొన్న మహబూబ్‌నగర్‌లో, ఇప్పుడు పరకాలలో రుజువయ్యింది. రాజకీయ పార్టీలుగా అది వారిహక్కు, దాన్ని అడ్డుకోలేము. కానీ ఈ ఆధిపత్యపోరులో జేఏసీ అస్తిత్వాన్నే మిగలకుండా చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఒక దశలో జేఏసీ నాయకత్వాన్ని మార్చే ప్రయత్నాలు జరిగాయి.

ఈ ప్రయత్నాన్ని జేఏసీ శ్రేణులు వ్యూహాత్మకంగా అడ్డుకోగాలిగాయని వార్తలొచ్చాయి. ఇవి సహజంగానే జేఏసీ-టీఆర్‌ఎస్‌ల మధ్య అగాధాన్ని సృష్టించాయి. చివరకు జేఏసీ పరకాలలో ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేని స్థితిలో పడిపోయింది. శాస్త్రీయ అధ్యయనం అనే మెలిక పెట్టి జేఏసీ మొత్తానికి ఆ సంక్షోభం నుంచి బయటపడగలిగింది. కానీ బీజేపీ దాడులను తిప్పికొట్టలేకపోయింది. బీజేపీ ఎన్నికల్లో గెలవడానికి ఉద్యమం అంతో ఇంతో సాధించిన కుల, మత సమైక్యతను కూడా దెబ్బ తీయగలదని అది కుదరనప్పుడు, తెలంగాణవాదులను రాళ్ళతో తరిమికొట్టి మరీ ఓట్లు వేసుకోగలదని రుజువయ్యింది. మహబూబ్‌నగర్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ-లాల్-కిషన్ రెడ్డి చూపించిన నరేంవూదమోడీ అవతారాన్ని మరిచిపోకముందే శాసనసభలో బీజేపీ నాయకుడుగా ఉన్న లక్ష్మినారాయణ పరకాలలో బాల్ థాకరే భాషతో ప్రత్యక్షమయ్యారు.

ఆయనకు ఆవేశం ఎందుకు ఆవహించిందో గానీ తెలంగాణ ఉద్యమానికి గుండె కాయలా పనిచేస్తోన్న ప్రొఫెసర్ కోదండరామ్‌ను మానుకోట రాళ్ళతో కొట్టాలని పిలుపునిచ్చాడు. తనమీద వచ్చే ఏ విమర్శకూ స్పందించని కోదండరామ్‌కు బీజేపీ వేస్తోన్న రాళ్ళు కూడా తగిలినట్టు లేవు. కానీ చాలా మంది తెలంగాణ ఉద్యమకారుల ను అవి గాయపరిచాయి. కరీంనగర్‌తో సహా చాలాచోట్ల కాషాయ దళాలు కోదండరామ్ దిష్టిబొమ్మలు, జేఏసీ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి అధికారంలోకి రాకముందే గుజరాత్‌ను గుర్తుకు తెచ్చారు. కచ్చితంగా తెలంగాణవాదమంటే కాషాయవాదం మాత్రమే అనే ధోరణి బలపడితే ఈ ప్రాంతంలోని, ముస్లిం లు, దళితులు, వామపక్షంలో ఉన్న ప్రజల్లో అభవూదతా పెరగడం ఖాయం. అదే వారి ఎజెండా అయితే ఈ ప్రాంతం గుజరాత్‌గా మారడం కంటే ఆంధ్రవూపదేశ్‌లో ఉండడమే మేలు!. ఇప్పుడు ఈ ధోరణిని అడ్డుకుని, ఉద్యమాన్ని కాపాడవలసిన బాధ్యత జేఏసీ మీద ఉంది.
ప్రొఫెసర్ జయశంకర్‌ను స్మరించుకుంటూ ఇప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో స్ఫూర్తి వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇది ఉద్య మ దశను సమీక్షించుకోవాల్సిన సమయం. గడిచిన ఏడాదిలో తెలంగాణ సాధనలో ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు.

పైగా సకల జనుల సమ్మె లాంటి అనేక సందర్భాలలో ఉద్యమమే వెనకడుగు వేసింది. పరకాల ఫలితం ఎలా ఉన్నా జేఏసీ వెను ఒక సమష్టి పోరాటానికి సన్నద్ధం కావాలి. రాజకీయ పార్టీలు నాయకత్వాల ఎత్తుగడల వల్ల ఇప్పటికే చాలామంది తెలంగాణవాదులు, బాధ్యతాయుతమైన సంస్థలు జేఏసీకి దూరంగా ఉన్నాయి. వారిని కూడా కలుపుకుని జేఏసీ స్వతంత్ర రాజకీయ అస్తిత్వం గల శక్తిగా ఎదగాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటిదాకా జేఏసీ అంటే టీఆర్‌ఎస్ అనుబంధ సంస్థ అన్న భావన బలంగా ప్రచారంలో ఉంది. ముందుగా అందులోనుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. అలాగని రాజకీయ పార్టీలతో సం బంధం ఉండకూడదని కాదు. జేఏసీ స్వతంవూతంగా కార్యాచరణను రూపొందించుకుని అందులో అన్ని పార్టీలనూ నేతలను కలుపుకుని పోవాలి. ఇంకా పార్టీలు వైఖరులు అన్న పాత వ్యూహాలు వదిలేసి జెండాలు వదిలేసి జేఏసీ ఎజెండాతో పనిచేసే అందరినీ ఐక్యకార్యాచరణలో భాగం చేయాలి. దీనికోసం కొత్తగా మేథో మధనాలు అక్కరలేదు. ప్రొఫెసర్ జయశంకర్ చూపి న మార్గాన్ని మరిచిపోకుండా నడిస్తే చాలు.!

పొఫెసర్ ఘంటా చక్రపాణి
సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ఈ మెయిల్ : [email protected]

35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ