దేవుడు చేసిన మనుషులు!


Fri,June 1, 2012 12:46 AM

దేవుడు ఉన్నాడా లేడా అన్న చర్చ ముగిసి చాలాకాలమే అయ్యింది. నమ్మేవాళ్ళు ఉన్నాడని, నమ్మనివాళ్ళు లేడని నిర్ధారించుకున్నాక ఆ చర్చకు కాలం చెల్లింది. కానీ ఇప్పుడు అదే చర్చ మళ్ళీ తెరమీదికి వస్తోంది. ఇప్పుడు దేవుడు ఉన్నాడని అనుకున్నవాళ్ళకు లేడేమోనని, లేనే లేడని వాళ్లకు ఉన్నాడేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. నిజాని కి దేవుడు ఉన్నాడా లేదా అన్న సంశయానికి కారణం మనుషులే తప్ప దేవు డు కాదు. ఎవనా తప్పులు చేసినప్పుడు, అన్యాయంగా ప్రవర్తించినప్పుడు, వాటిని ఎదిరించే శక్తి, ధైర్యం లేనప్పుడు దేవుడు ఉంటే బాగుండునని కోరుకుంటారు. అటువంటి వాళ్లకు శిక్షలు పడ్డప్పుడు దేవుడున్నాడని నమ్ముతారు. అలా జరగకుండా అన్యాయమే అధికారమై రాజ్యమేలుతున్నప్పుడు దేవుడు లేడన్న నిర్ధారణకు వస్తారు. దేవుడే ఉంటే ఇలా జరగకపోయేదన్న నమ్మకం ఆ అపనమ్మకానికి కారణమౌతుంది. రాష్ట్ర రాజకీయాలలో ఇటీవలి పరిణామాల్లో ఇప్పుడు చాలామంది నేతలు దేవుడిని ప్రస్తుతిస్తున్నారు.

ముఖ్యంగా అక్రమాస్తులు, ఆర్ధిక నేరాల కేసులో పీకలలోతు కూరుకుపోయిన వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఆయన కుటుంబసభ్యులు దేవుడున్నాడని పదే పదే ప్రజలకు గుర్తుచేస్తున్నారు. తనపై అన్యాయంగా నిందలేసి వేధిస్తున్నారని ఇదంతా దేవుడు పైనుంచి గమనిస్తున్నాడని జగన్ అంటున్నాడు. దానిని ఆయన ప్రత్యర్థులు కూడా సమర్థిస్తున్నారు. ఒకరు జగన్ తప్పులను దేవుడు ఆలస్యంగా గమనించాడని సినీ నటుడు బాలకృష్ణ అంటే, తండ్రిని అడ్డం పెట్టుకుని కొడుకు సాగిస్తున్న అక్రమాలు గమనించే దేవుడు రాజశేఖర్‌డ్డిని త్వరగా తీసుకెళ్ళాడని లగడపాటి రాజగోపాల్ అంటున్నారు. మన ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు జరిగే సహజ పరిణామాలకు అలాంటి మహిమలు ఆపాదిస్తుంటాం. ఉద్యమం ఊపు లో ఉన్నప్పుడు తెలంగాణలో రచ్చబండకు వెళ్ళిన ముఖ్యమంవూతిని జనం సుడిగాలిలా చుట్టుముట్టిన సందర్భాలు చూశాం. వరంగల్ జిల్లాలో కొన్ని సభల్లో ఆయన మాట్లాడకుండానే వెనక్కి వచ్చిన సంఘటనలున్నాయి. ఇప్పుడు అదే వరంగల్ జిల్లాలో ఎవరూ అడ్డుకోకపోయినా ప్రకృతి సుడిగాలై ఆయనను తరిమేసింది. అది కూడా దైవ సంకల్పమే అనే వాళ్ళూ ఉన్నారు.
నిరంతరం దేవుడి పేరు చెప్పినంత మాత్రాన దేవుడు మనం ఏం చేసినా మన్నిస్తాడనుకోవడం పొరపాటు. పాపం ఆయనకు కూడా కొన్ని నీతి నియమాలు ఉంటాయి. మత ప్రచారకుడు కేఏ పాల్ సంగతే చూడండి.

దైవోపాసకుడిగా ప్రపంచమంతా గుర్తించిన వ్యక్తి, ఆయన వై.ఎస్. కుటుంబానికి బద్ధ విరోధి. తన మీద కుట్ర పన్నినందుకే రాజశేఖర్ రెడ్డిని దేవుడు తీసుకెళ్ళాడని పదే పదే చెప్పిన ఆయనను ఒక హత్య, కుట్ర కేసుల్లో పోలీసులు ఈడ్చుకెళ్ళి జైలులో పెట్టారు. గాలి జనార్దన్‌డ్డి అయితే తిరుపతి వెంక స్వామికి 42 కోట్లు ఖర్చుచేసి వజ్ర వైడూర్యాలు పొదిగిన బంగారు కిరీటం కానుకగా ఇచ్చాడు. మరెందరో దేవుళ్ళకు గుడులు గోపురాలు కట్టించాడు. అయినా ఏడాది తిరిగేలోపే పాపాలు పండి జైలుకు వెళ్ళాడు. ఒక్క దేవుడైనా పూనుకుని ఆ భక్తుడికి కనీసం బెయిలు కూడా ఇప్పించలేకపోయాడు. దేవుడితో ఉన్న చిక్కే ఇది. ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియనీయడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపుతుంటాడు.

అసలు అతనే ఉన్నాడా, లేడా అన్న అనుమానం కలిగేలా చేస్తుంటాడు. అది ఆయన లీల అని సరిపెట్టుకునే వాళ్ళూ ఉన్నారు. అదే ఇప్పుడు దేవుడికి చిక్కులు తెస్తోంది. మనుషులు తమ లీలలకు దేవుడిని వాడుకుంటున్నారు.
సాధారణంగా దైవ చింతన ఉన్నవాళ్ళకు పాపభీతి కూడా ఉంటుందంటా రు. అన్ని మతాలు అదే చెపుతాయని అంటారు. అసలు దేవుడు పుట్టిందే మనిషిని సన్మార్గంలో నడిపించడానికి. మానవ సమాజపు ఆవిర్భావపు తొలి దశలో దేవుడు లేడు. మతం లేదు. మనుషులు తమ ఊహకందని అన్ని చర్యలకూ ఏదో మహిమను ఆపాదించడం, ఆ మహిమ వెనుక ఏదో శక్తి దాగి ఉందని నమ్మడం మొదలుపెట్టారు. ఆ రాజ్యాలు ఏర్పడ్డ తరువాత ఆ నమ్మ కం మీదనే చాలాఏళ్ళు పాలన సాగింది. ప్రపంచాన్ని దేవుడే పరిపాలిస్తాడని, ఆ దైవ నిర్ణయాన్ని పురోహితులు అమలు చేస్తారని చాలాకాలం నమ్మించా రు. ఆ తరువాత రాజుల కాలం వచ్చింది. రాజే దైవం, రాజే న్యాయం అనే రోజులూ నడిచాయి. రాజులు కూడా దేవుళ్ళ పేరుచెప్పి దోచుకున్న వాళ్ళే. రోమన్ సామ్రాజ్యంలో పురోహిత వర్గమైనా, రాచరికమైనా దేవుడి పేరు చెప్పింది తమ దోపిడీని స్థిర పరచుకోవ దానికే తప్ప దేవుడు న్యాయాన్యాయ విచక్షణ చేయగలడని చెప్పడానికి కాదు.

ఇప్పటికీ చాలాదేశాలు, చాలామంది మనుషులు దేవుడున్నాడని, అన్నీ గమనిస్తున్నాడని నమ్ముతున్నా అవినీతికి మాత్రం అంతులేకుండాపోతోంది. సమాజంలో భక్తి భావం పెరుగుతున్నట్టే అవినీతి కూడా పెరుగుతోంది. నిరంతరం బైబిల్ పఠించేవాళ్ళు, మాటి మాటి కీ భగవద్గీతను ఉటంకించే వాళ్ళు, భక్తిక్షిశద్ధలతో రోజుకు ఐదు పూటలా ప్రార్థనలు చేసే వాళ్ళు కూడా నేరస్తులుగా తేలుతున్నారు. కాబట్టి భగవంతుడికి భక్తుడికీ ఉన్న బంధం వ్యక్తిగతం. అది నేరాలకు శిక్షలకు వర్తించదు. చరిత్ర పొడుగునా దేవుడికి మనిషికీ జరిగిన సంఘర్షణ, పోరాటాలు, తిరుగుబాట్లు, ఉద్యమాలు, విప్లవాలు శాస్త్రీయ విజ్ఞాన ఆవిష్కరణకు, స్వతంత్ర పరిపాల నా వ్యవస్థల ఆవిర్భావానికి దోహదపడ్డాయి. దైవ న్యాయం, రాజ న్యాయం స్థానంలో రాజ్యాంగ న్యాయవ్యవస్థలు అవతరించాయి. ఇప్పుడు మనిషి సచ్ఛీలత రుజువు చేసేది దైవభక్తి కాదు, రాజ్యాంగబద్ధత.

చట్ట నిబద్ధత. అదొక్కటే న్యాయస్థానంలో నిలబడుతుంది. దేవుడి మీద ప్రమాణంచేసి అంతా నిజమే చెపుతానని, అబద్ధం చెప్పనని ఒట్టేసి చెప్పినా చెప్పిందంతా నిజమేనని న్యాయమూర్తి నమ్మడానికి వీలు లేదు. దేవుళ్ళు, మత విశ్వాసాలను కాకుండా రుజువులు, సాక్షాలను మాత్రమే నమ్మాలన్నది సార్వవూతిక న్యాయ సూత్రం. కోర్టులకు మీరు దైవభక్తి పరాయనులా కాదా అన్నదానితో సంబం ధం లేదు, మీరు తప్పు చేశారా లేదా అన్నదే కావాలి. ఎమ్మార్ కుంభకోణం లో పీకలదాకా కూరుకుపోయిన ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య తన దైవభక్తి ని న్యాయమూర్తికి చూపించి పాపపరిహారం కోరాలనుకున్నాడో ఏమో గానీ ఆంజనేయస్వామి చిత్రపటాన్ని నేరుగా కోర్టుహాలులోకే తీసుకు న్యాయమూర్తి నాగమారుతి శర్మకు దేవుడి బొమ్మ కనిపించేలా ఉంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు. అది గమనించిన న్యాయమూర్తి ‘భయపడకండి మీరు ఏ తప్పూ చేయకపోతే దేవుడు మిమ్మల్ని తప్పక కాపాడుతాడు’ అన్నా రు. తప్ప మీరు దైవభక్తులు కాబట్టి ఏ తప్పూ చేయలేదని తీర్పు చెప్పలేదు.

అయినా సరే ఇప్పుడు చాలామంది నేరాభియోగం మోస్తున్న వాళ్ళు పదే పదే దేవుడి ప్రస్తావన తెస్తున్నారు. ఇది న్యాయ వ్యవస్థను నమ్మించడానికి కాదు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి. చేతిలో సొమ్ములుంటే న్యాయస్థానాల్లో తమ వాదన వినిపించడానికి కేసును ఏ కీలుకు ఆ కీలు విరిచి వాదించే వకీళ్ళు వందలాదిమంది క్యూ కడతారు. ఆ కేసులు రుజువై, సాక్ష్యా లు దొరికి శిక్ష పడడానికి కొన్ని దశాబ్దాల కాలం పట్టొచ్చు. సాక్షాధారాలు సరిగా లేక కేసు మధ్యలోనే కొట్టుడు కూడాపోవచ్చు. ఈ లోగా జనంలో కొట్టుడుపోగూడదు. వాళ్ళను నమ్మించాలి. ఓట్లు వేయించుకోవాలి.

అలా నమ్మించడానికి అంది వచ్చిన అన్ని విశ్వాసాలను వాడుకోవాలి. ఇది ఇప్పు డు నడుస్తోన్న రాజకీయం. వై.ఎస్. జగన్ కేసులో ఇప్పటికే ఆయన నేపథ్యం చాలామందిని ఆకట్టుకుంటోంది. వాటిల్లో మొదటిది ఆయన వారసత్వం. వై.ఎస్. కుమారుడిగా ఆయన ఒక వెలుగు వెలిగిపోయారు. స్వతహాగా రాజశేఖర్‌డ్డి ఆహార్యం, శైలి, మిత్ర వాత్సల్యం చాలామందినే మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఆయన పాలన, పథకాలు, వాటికున్న ప్రజాదరణ వారిని మరింత సమ్మోహునుల్ని చేసింది. ఆయన బతికున్న కాలంలోనే కాదు ఆయన మరణించి మూడేళ్ళు గడుస్తున్నా ఆ జిలుగు వెలుగుల వెనుక సాగిన చీకటి బాగోతాలను గురించి మాట్లాడే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. ఆ చీకటినే ఇప్పుడు సీబీఐ కేసు ఛేదిస్తున్నది. నిజానికి ఈ విషయంలో జగన్ ఒక్కడే స్పష్టంగా ఉన్నాడని అనిపిస్తోంది. జగన్ తన తండ్రి పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించాడని, రాజశేఖర్ రెడ్డి తన కొడుకు కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని సీబీఐ మోపుతున్న అభియోగాలను ఆయన నిర్ద్వందంగా తోసిపుచ్చుతున్నారు. అధికారంలో తాను లేనని, తానెప్పుడూ సచివాలయానికి, ముఖ్యమంత్రి కార్యాలయానికీ వెళ్లలేదని, తన తండ్రి అక్రమాలకూ తనకు ముడిపెట్టవద్దని అంటున్నాడు.

తప్పులకు రాజశేఖర్‌డ్డి మంత్రి మండలి బాధ్యత వహించాలి, తప్ప తాను కాదని కూడా వాదిస్తున్నాడు. ఇది వై.ఎస్. అభిమానులకు అర్థం కావ డం లేదు. చాలామంది తెలుగు మీడియా చిత్రీకరించినట్టు ఆయన ఈనేల మీద నడిచిన దేవుడు అనే నమ్ముతున్నారు. దేవుడు ఏదిచేసినా మంచికోసమే అన్న భక్తి పారవశ్యంలో వాళ్ళు ఇంకా ఉన్నారనిపిస్తుంది. రాజశేఖర్‌డ్డి దేవు డు అని నిరూపించడానికి వాళ్ళు ఎప్పుడో కృతయుగంలో గతించిపోయిన చంద్రబాబు కథలను ప్రస్తావిస్తున్నారు. రాజశేఖర్‌డ్డి అవినీతిపరుడైతే చంద్రబాబు సంగతేమిటి అని ప్రశ్నిస్తున్నారు. నిజమే ఒకడు రాక్షసుడని చెప్పడానికి ఇంకొకరిని దేవుడని నెత్తిన ఎత్తుకోవాల్సిన పనిలేదు. రాజశేఖర్‌డ్డి తప్పులను వాళ్ళు గుర్తించ నిరాకరించడానికి చంద్రబాబు మీదున్న ద్వేషం కూడా ఒక కారణం కావొచ్చు.

ఇలాంటి వారిని కాపాడుకోవడం కోసమే జగన్ కోర్టు లో తన తండ్రి పాలనతో తనకు సంబంధం లేనే లేదని వాదించినా ప్రజల ముందు మాత్రం తన తండ్రి స్వర్ణ యుగం మళ్ళీ తెస్తానని చెపుతున్నాడు.
దేవుడిని నమ్మని కొందరు తాత్వికులు, గతితార్కికులు ఇప్పుడు జగన్‌లో ఒక ఆదర్శ వాద ప్రగతిశీల నేతను చూస్తున్నారు. యువకుడు, విద్యావంతు డు, పారిక్షిశామికవేత్త, మీడియా సంస్థల అధినేత, నిరంతరం ప్రజల్లో ఉండి వారిని ఓదార్చే స్వాంతనమూర్తిగా ఆయన ఈ రాష్ట్రానికొక రాజకీయ ప్రత్యామ్నాయశక్తిగా వీరు భావిస్తున్నాయి. ఆ ఆలోచనా భావజాలం వారిని నిష్పాక్షికంగానో, న్యాయంవైపో ఉండనీయడం లేదు. అందుకే ఇప్పుడు అవినీతిని ఆమోదయోగ్యంగా మార్చి వేస్తున్నారు. అసలు అవినీతిలేని నాయకుడేడి అని ప్రశ్నిస్తున్నారు. ఒక్క జగన్‌నే కాదు భూమి పుట్టినప్పటినుంచి జరిగిన అవినీతి అంతటి మీదా విచారణ జరగాలని వాదిస్తున్నారు. అక్కటితో ఆగకుండా ఇదొక రాజకీయ కక్ష అనీ, జగన్ కాంగ్రెస్‌లోనే ఉంటే అసలు ఈ విచారణ జరిగేదా అని కూడా అడుగుతున్నారు.

కారణాలు ఏవైనా, వ్యక్తులు ఎవరైనా మింగింది ప్రజల సొమ్ము అయినప్పుడు కక్కి తీరవలసిందే. నిజమే రాజకీయ కక్షలు లేకపోతే అటు చంద్రబాబు అవినీతి అయినా, జగన్ అక్రమ సంపాదన అయినా బయటికి రావు, బయటికొచ్చినందుకు ఆనందిద్దామా, రాకపోతే బాగుండేదని అనుకుందామా ఆలోచించాలి. ఒక కేసులో విచారణ జరుగుతున్నప్పుడు వాదన ఆ అభియోగ పత్రానికే పరిమితం కావాలి, తప్ప దాన్ని సాధారణీకరించడం కేసును నీరు గార్చడమే అవుతుంది. అంతేకాదు సమాజాన్ని మరింత దిగాజార్చడానికి దోహదపడుతుంది. అది దేవుడు చేసినా న్యాయ సమ్మతం కాదు.
జగన్ దేవుడున్నాడని చెపుతున్నట్టే మానుకోట ప్రజలు కూడా దేవుడు ఉండే ఉంటాడని అనుకుంటున్నారు.

దేవుడు ఆకాశంలోనే కాదు, నేలమీద, కంకర రాళ్ళల్లో కూడా ఉన్నాడని అంటున్నారు. ఎవరికైనా నమ్మరానిది నిజమైనప్పుడు ఇటువంటి విశ్వాస వైపరీత్యం కలుగుతుంటుంది. రెండేళ్ళ క్రితం తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రదర్శన చేసిన అనంతరం సైనిక పటాలంతో తెలంగాణలో ప్రవేశించాలని చూసిన జగన్‌ను వరంగల్ ప్రజలు వట్టి చేతులతో నిలువరించారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో కంకర రాళ్ళే కరుకు తుపాకులను ఎదిరించాయి. 2010 మే 2న జగన్ బహుశా ఆయన జీవితంలో తొలిసారిగా మడమ తిప్పారు. తెలంగా ణ ఉద్యమ చరివూతలోనే అదొక చీకటి రోజు. ఎందుకంటే ఈ విడత తెలంగాణ ఉద్యమం పట్ల ప్రభుత్వాలు ఎంత అమానుషంగా వ్యవహరించినా తుపాకిని పేల్చలేదు. రబ్బరు బుల్లెట్లు, భాష్పావాయు గోళాలు విసిరారు, తప్ప మనుషులమీడికి మరతుపాకులు ఎక్కుపెట్టలేదు. మహా కర్కోటకమైన రాజ్యం చేయలేని సాహసానికి జగన్ అనుచరగణం ఒడిగట్టింది. గుళ్ల వర్షం కురిపించి తెలంగాణ హృదయాలను గాయపరిచింది. కాకతాళీయమే కావ చ్చు కానీ సరిగ్గా రెండేళ్లకు అదే రోజున ఆయన జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. దీన్ని తెలంగాణవాదులు మానుకోట రాళ్ళ మహిమగా అభివర్ణిస్తున్నారు. వాటిని ఇప్పుడు గ్రామక్షిగామానా నిలిపి పూజిస్తున్నారు.

నిజానికి జగన్ కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేయకుండా ఉంటే ఎలా ఉండేదో ఆలోచించండి. ఇప్పటికి మనం తెలంగాణ రాష్ట్రంలో ఉండేవాళ్ళం. జగన్ తిరుగుబాటు కాంగ్రెస్‌ను బలహీనపరచడానికే కాదు, తెలంగాణ నిర్ణయాన్ని నిలిపివేయడానికి కూడా కారణమయ్యింది. కాంగ్రెస్ సీమాంధ్ర శాసనసభ్యులు జగన్ వెంట వెళ్తారన్న తప్పుడు నివేదికలు కారణమయ్యాయి. కాంగ్రెస్ భయపడింది, భయపడుతున్నది. మూలిగే ముసలి నక్కలా ఉన్న టీడీపీని చూసి కాదు, మింగేసే యువ కిశోరంగా గర్జిస్తోన్న జగన్‌ను చూసి మాత్రమేనని గమనించాలి. జగన్‌ను లోలోపలో, బహిరంగంగానో సమర్థించేవాళ్ళు ముందుగా తెలంగాణపై ఆయన వైఖరి స్పష్టంగా చెప్పిస్తే మంచిది. అప్పుడు ఆయనను నేరుగా అనుసరించినా అడ్డుకునే వాళ్ళు ఉండరు.

తెలంగాణ ఉద్యమం కేవలం దేవుళ్ళను, దేవుడు చేసిన ఇలాంటి మనుషులనో నమ్ముకోకూడదు. ఈ ఉద్యమం కులమైనా, మతమైనా తమకు తెలంగాణ మాత్రమే అనే ఆలోచనాపరులైన ఒక క్రియాశీల వర్గాన్ని తయారు చేసింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల, రాజకీయ సమీకరణాల పట్ల ఈ వర్గం అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు చట్టాన్ని, న్యాయా న్ని, రాజ్యాంగ ధర్మాన్ని మాత్రమే నమ్ముతారని ఇప్పటికే ఉద్యమం రుజువు చేసింది. మతమైనా, కులమైనా అది పెంచి పోషించే అభిమానం ఏదైనా మనిషిని ఒక మత్తులోకి తీసుకెళ్తుంది. మాయలో ముంచివేస్తుంది. అలా మాయ లో పడిపోయిన ఎవరైనా తమనే కాదు, తమ లక్ష్యాన్ని కూడా మరిచిపోతారు. తెలంగాణ ప్రజానీకం ఆ మాయ వలలో పడకూడదనే అనుకోవాలి.
పొఫెసర్ ఘంటా చక్రపాణి

రచయిత సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ఈ మెయిల్ : ghantapatham@gmail.com


35

Ghanta Chakrapani

Published: Tue,June 20, 2017 12:11 AM

తెలంగాణ కాలజ్ఞాని

ఒక మనిషిని నిద్ర పోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తున్నది. తెలంగాణ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్ల

Published: Fri,August 1, 2014 01:29 AM

విధానం చెప్పకుండా వితండవాదం!

ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రజలకు పక్కింటివాడి ఫోటోకథ ఒకటి చెప్పేవారు. టీడీపీ తదితర పరాయి పార్టీవ

Published: Fri,July 25, 2014 05:59 PM

1956: ఒక వివాదాస్పద సందర్భం!

స్థానికత అనేది ప్రపంచంలో ఎక్కడైనా స్థానికులు మాత్రమే నిర్ణయించుకునే అంశం. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి నిజానికి ఇదొక్కటే. పార్

Published: Thu,July 10, 2014 11:32 PM

గురుకులంలో కలకలం..!

మా పంతుళ్ళు ఉస్మాన్ లాంటి చిన్నవాళ్ళు చిన్నచిన్న పనులు చేస్తే ప్రశంసిస్తారు, శంకరన్ గారి లాంటి పెద్దలు చేస్తే గౌరవిస్తారు, పూజిస్త

Published: Fri,June 13, 2014 01:44 AM

కలవరపెడుతున్న బంగారు కలలు

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి రైతు రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టబోతోందన్న వార్త బయటకు పొక్కిందో లేదో తెలంగాణ పల్లె

Published: Sat,June 7, 2014 12:18 AM

నిదానమే ప్రధానం

ముందుగా తెలంగాణ తొలి ప్రభుత్వానికి స్వాగతం. తెలంగాణ ఉద్యమ సారథిగా ఇంతవరకు ప్రజ ల్లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పుడు రాష్ర్

Published: Fri,May 30, 2014 12:06 AM

మోడీ అండతో మొదలయిన దాడి..!

రామాయణాన్ని చరిత్రగా నమ్మేవాళ్ళు అందలి విశేషాలను కథలు కథలుగా చెపుతుంటారు. రాముడు తన రాజ్యం వదిలి గంగానది దాటి వచ్చి దండకారణ్యంలో

Published: Fri,May 23, 2014 01:17 AM

పొంచి ఉన్న ప్రమాదం

ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా సరే కొందరికి ఆనందాన్ని కలిగిస్తే మరికొందరికి బాధను మిగిలిస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు దేశంలో చాలా

Published: Sun,May 18, 2014 12:38 AM

పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలం!

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పొడుస్తున్న పొద్దుకు పరిచయం అవసరం లేదు, నడుస్తున్న కాలానికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. అట్లాగే యావత్ ప్రత్యక్ష

Published: Fri,May 16, 2014 01:31 AM

జడ్జిమెంట్ డే

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలంగాణచరిత్రలో కీలక మార్పు కు దోహదపడే రోజు ఇది. తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఉండాలో ప్

Published: Fri,April 25, 2014 01:07 AM

యుద్ధం అనివార్యం..!

ఇన్ని షరతులు, ఒప్పందాలు, చిక్కుముడులు, సవాళ్ళ మధ్య పదేళ్ళ సావాసం ముందుంది. ఈ సందర్భంలో తెలంగాణ కోసం నిలబడే సైనికులు కావాలి. తెల

Published: Fri,April 18, 2014 01:42 AM

వాళ్లకు రాజనీతి బోధించండి!

మార్గం సుదీర్ఘం,భూమి గుం డ్రం అన్న మాటలతో మోదుగుపూలు నవలను ముగిస్తాడు దాశరథి. మోదుగుపూలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలాన్ని, ఆంధ్

Published: Fri,April 11, 2014 12:13 AM

దొరలెవరు? దొంగలెవరు?

పునర్నిర్మాణం అంటే ఉన్న నిర్మాణాలను కూల్చి వేస్తారా? అంటూ వెనుకటికి ఒక తలపండిన జర్నలిస్టు ఒక కొంటె వాదన లేవదీశారు. ఆయనకు పునర్నిర్

Published: Fri,April 4, 2014 01:36 AM

ప్రజాస్వామ్య పునాదులే ప్రాతిపదిక కావాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష . దాని వెనుక ఇప్పటిదాకా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన ప్రజల ఆవేదన ఉంది. ముక్క

Published: Fri,March 28, 2014 12:33 AM

సామాజిక తెలంగాణ సాధించుకోలేమా?

ఎక్కడయినా నాయకులు ఎదిగి వస్తారు తప్ప ఎవరూ నియమించలేరు.నియమించిన నాయకులు నిజమైన నాయకులు కారు. అగ్రవర్ణాల పార్టీల్లో బడుగులకు అధికార

Published: Fri,March 21, 2014 01:42 AM

పునర్నిర్మాణానికి ప్రాతిపదిక ఏమిటి?

ఇప్పుడు తెలంగాణలో ఎవరికివాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదులో తెలంగాణ, ప్రజలు, పౌర సమాజం పాత్ర లేకుండాపోయింది. ఉద్యమానికి ఊ

Published: Fri,February 28, 2014 12:28 AM

కేసీఆర్‌ను అభినందిద్దాం !!

తెలంగాణ చరిత్రను ఎవరు రాసినా ఆయనను మరిచిపోయే అవకాశం ఎంతమాత్రం లేదు. రాజకీయం గా ఆయన ఏమవుతాడో, ఏమవ్వాలని అనుకుంటున్నాడో ఆయన ఇష్టం

Published: Fri,February 21, 2014 01:03 AM

తెలంగాణ జైత్రయాత్ర

ఒక్కటి మాత్రం నిజం. తెలంగాణవాదులకు నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా అనేక ఉద్యమాల్లో ముందుండి నడిచిన వాళ్లకు, నడిపిన వాళ్లకు, అలాంటి ఉద్యమ

Published: Fri,February 14, 2014 12:43 AM

సీమాంధ్ర ఉగ్రవాదం!

రాజ్యాంగాన్ని కాపాడుతూ దానిని సంపూర్ణంగా అమలు చేసే బాధ్యతను పార్లమెంటుకు అప్పగించారు. ఇప్పుడు ఆ పార్లమెంటే ఇటువంటి చర్యలకు వే

Published: Fri,February 7, 2014 01:07 AM

చివరి అంకంలో చిక్కుముడులు

జీవితకాలం లేటు అనుకున్న తెలంగాణ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కి ప్లాట్ ఫారం మీద సిద్ధంగా ఉంది. ఇక జెండాలు ఊపడమే తరువాయి అనుకున్నారంతా.ఇ