ఉద్యమం సాగాల్సిందే


Thu,December 29, 2011 12:34 AM


అధికార కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్8 పార్టీ వైఫల్యమో, చిత్తశుద్ధి రాహిత్యమో లోక్‌పాల్‌కు రాజ్యాంగ హోదా కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. లోక్‌పాల్ వ్యవస్థ స్వరూప, నిర్మాణానికి సంబంధించిన బిల్లును మాత్రం లోక్‌సభ ఆమోదించింది. రాజ్యసభలో అధికార కూటమికి సాధారణ మెజారిటీ లేదు గనుక ఈ బిల్లు విషయం కూడా అనిశ్చితంగానే ఉన్నది. అచ్చంగా అన్నా హజారే చెప్పినట్టే పార్లమెంటు సభ్యులు చట్టాలు చేయాలనేమీ లేదు. అన్నా బృందం సూచిస్తున్న లోక్‌పాల్ స్వరూప స్వభావాలపై రాజ్యాంగ వేత్తలలో కూడా భిన్నాభివూపాయాలున్నాయి. కానీ అవినీతి ఆటకట్టడానికి రాజ్యాంగ హోదా కలిగిన శక్తిమంతమై న లోక్‌పాల్ వ్యవస్థ అవసరం అనే విషయమై స్థూలంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజాభివూపాయం రూపుదిద్దుకుని ఉన్నది. తదనుగుణంగా రాజ్యాంగ సవరణ చేసి లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన బాధ్యత మొత్తం రాజకీయ వ్యవస్థపై ఉన్నది. అధికార ప్రతిపక్షాలు పరస్పర విమర్శలకు దిగుతూ, రాజ్యాంగ సవరణ బిల్లు వీగి పోవడానికి తమ బాధ్యత లేదని తప్పించుకోవడం సబబు కాదు. ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన నాటి నుంచి అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. క్రమం గా ప్రజల్లో అసహనం కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే అన్నా హజారే కేంద్రంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం ఈఏడాది పొడుగునా సాగింది. ఏడాది ముగింపునకు వస్తున్న దశలో-రాజకీయ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు ప్రజలను, ఉద్యమకారులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నది.
జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సాగుతున్న అవినీతిని ఏడాదుల వారిగా విడదీసి చూడడం సాధ్యం కాదు కానీ ఈ ఏడాది కూడా ఇస్రో స్పెక్ట్రం కేటాయింపు, ఇన్వెస్ట్‌మెంట్ స్కాం మొదలైనవి సంచలనం సృష్టించాయి. ఒక్కో కుంభకోణం వేల కోట్ల రూపాయల గని! ఇక గనుల తవ్వకాలలో సాగుతున్న అక్రమాలు, వాటితో రాజకీయాలు ముడిపడి ఉండడం ఆంధ్ర ప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలలో కలవరం కలిగిస్తున్నది. మరోవైపు స్విస్8బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న వారి బండారం బయట పెట్టడానికి కేంద్రం చిత్తశుద్ధితో వ్యహరించడం లేదనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ నేపథ్యంలో అన్నా దీక్షకు ముందుగానే అవినీతికి వ్యతిరేకంగా ప్రజాభివూపాయం బలపడడం మొదలైంది. గత ఏడాది చివరలో స్వచ్ఛంద సంస్థలు ఢిల్లీలో సమావేశమై అవినీతిపై చర్చించాయి. స్పెక్ట్రమ్ కుంభకోణానికి వ్యతిరేకంగా వేలాది మంది ఢిల్లీలో ప్రదర్శన జరిపారు. ఈ ఏడాది మొదట్లో అవినీతి వ్యతిరేక చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు ప్రభుత్వంపై విమర్శలు చేసింది. కొందరు పారిక్షిశామిక వేత్తలు బహిరంగంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏప్రిల్ ఐదవ తేదీన ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద అన్నా హజారే నిరాహార దీక్ష చేపట్టడంతో అవినీతి వ్యతిరేకోద్యమం తీవ్రరూపం సంతరించుకున్నది. అన్నా, రామ్‌దేవ్ బాబాల దీక్ష సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో నెలకొన్న అవ్యవస్థ స్పష్టైంగా బయటపడ్డది. ప్రభుత్వం ఎంత తప్పించుకోజూచినా, అన్నా రెండవ దశ దీక్ష సందర్భంగా లోక్‌పాల్ ఏర్పాటుకు సూత్ర ప్రాయంగా అంగీకరిస్తూ పార్లమెంటు తీర్మానం చేయక తప్పలేదు. ఈ అనివార్య స్థితి వల్లనే ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఒక రూపంలో లోక్‌పాల్ బిల్లును ప్రవేశ పెట్టి తమాషా నడిపిస్తున్నది.
ఆరోగ్యం క్షీణిస్తుండడం వల్ల అన్నా హజారే బుధవారం నిరాహార దీక్ష విరమించ డం హర్షణీయం. నిరాహార దీక్ష ప్రజలను జాగృతం చేయడానికి, ప్రభుత్వంపై నైతిక ఒత్తిడి సృష్టించడానికి ఒక మార్గం. అంతే తప్ప ప్రాణాలు తీసుకోవడానికి కాదు. అవినీతి జాడ్య నిర్మూలనాంశాన్ని పాలకుల ముందు పెట్టడంలో అన్నా ఇప్పటికే విజయవంతం అయ్యారు. లోకాయుక్త స్వరూప స్వభావాలు ఎట్లున్నా అవినీతిని నిర్మూలించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. దీక్ష విరమించి, జైల్‌భరో కార్యక్షికమాన్ని కూడా రద్దు చేసుకున్న అన్నా హజారే ఇక ప్రజల ముందుకు వెళతానని ప్రకటించడం కూడా అభినందనీయం. ప్రజలను జాగృత పరిచినప్పుడు అవినీతి మూలాలు ఏమి , పరిష్కారాలు ఏమిటి, ఒత్తిడి ఎవరిపై ఏ విధంగా తేవాలనే విషయాలపై విస్తృత చర్చ జరుగుతుంది. ప్రజలు జాగృతమైతే ఉద్యమ రూపు రేఖలు మారిపోతాయి. అయితే అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరు కొన్ని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏదో ఒక రాజకీయ పక్షానికి వ్యతిరేక పోరాటంగా మారకూడదు. వాస్తవానికి అన్నా హజారే సూచించిన లోకాయుక్త నమూనాను అడ్డుకోవడంలో పైకి అధికార పక్షం వైఫల్యం కనిపిస్తున్నా, అందులో మొత్తం రాజకీయ తరగతి సాధించిన కుట్ర పూరిత ‘విజ యం’ దాగి ఉన్నది.

అందువల్ల అన్నా పోరాటం రాజకీయ పక్షాలకు అతీతంగా అవినీతి మూలాలపై సాగాలె. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా, విలువల కోసం పోరాడడం వామపక్షాల, సామ్యవాదుల కార్యక్షికమంగా ఉండేది. ప్రముఖ వామపక్ష నాయకుడు, మేధావి జ్యోతిర్మయి బసు పార్లమెంటులో కూర్చుంటే నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వానికి సింహ స్వప్నంగా ఉండేది. జయ ప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో సాగిన ఉద్యమంలోనూ సామ్యవాదుల పాత్ర కీలకమైనది. కానీ నాటి తరం నేతలు ఇప్పుడు లేరు. ప్రపంచీకరణ నేపథ్యంలో పౌర సమాజం పేరుతో స్వచ్ఛంద సంస్థలు వివిధ ఉద్యమాలను నడుపుతున్నాయి. ఈ సంస్థల పోరాటం కొన్ని పరిమితులకు లోబడే ఉంటుంది తప్ప మౌలిక మార్పులకు దోహదం చేయదు. అన్నా హజారే, స్వచ్ఛంద సంస్థలు కనీసం ఆ పరిమితుల మేర ప్రజలను కదిలించగలిగినా ఒక అడు గు ముందుకు పడినట్టవుతుంది. లోక్‌పాల్ ఏర్పాటుతో సంబంధం లేకుండా ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం ముందుకు సాగవలసిందే.

35

Ghanta Chakrapani

country oven

Featured Articles