గోండుల తొలి పోరాటయోధుడు


Sat,October 6, 2012 03:51 PM

భారత స్వాతంత్య్ర పోరాటం అంటే స్ఫురించేది సిపాయిల తిరుగుబాటు. మధ్య భారతదేశంలో గోండ్వానా ప్రాంతానికి చెందిన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గోండు నాయకత్వంలోని రాంజీగోండు రోహి ల్లా తిరుగుబాటు, కొమురం భీం జోడెన్‌ఘాట్ తిరుగుబాటు చారివూతక పోరాటాలుగా నిలిచాయి. కానీ గోండుల వీరయోధుడైన రాంజీగోండును స్మరించుకునే వారే లేరు. మధ్యభారతంలోని మహారాష్ట్ర, ఒడిశా,మధ్యవూపదేశ్, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రా ల్లో నివసించే అనేక గిరిజన తెగల సమూహాలతో గోండ్వానా రాజ్యం బ్రిటిష్ పాలనకు పూర్వమే ఏర్పడి ఉన్నది. గిరిజన తెగలలో ప్రధానమైనది గోండు. మధ్యవూపదేశ్‌లో మురియా గోండు, మారియా గోండు ఉప తెగలు కాగా, మహారాష్ట్ర,ఆంధ్ర,ఒడిశాల్లో రాజ్‌గోండు, దుర్వుగోండు ఉప తెగలుగా ఉన్నాయి. వీరినే ‘కోయత్తోర్’గా కూడా పిలుస్తారు.గోండుల పరిపాలన క్రీ.శ 1240 నుంచి 1750 వరకు సుమారు ఐదు శతాబ్దాలు సాగింది. గోండ్వానా రాజ్యాన్ని భీం బలాల్‌సింగ్ సిర్పూర్‌ను రాజధానిగా చేసుకుని పాలించాడు. తర్వాత అతని వారసులుగా కుర్జ బలాల్‌సింగ్, హీర్‌సింగ్, తల్వర్‌సింగ్, కేర్‌సింగ్, రాం సిం గ్, సుర్జా బలాల్‌సింగ్ గోండ్వానా రాజులుగా పాలన సాగించారు. సుర్జా బలాల్‌సింగ్ ఢిల్లీ సుల్తానుల సైన్యంతో యుద్ధం చేసి విజయం సాధించా డు. దీంతో సుల్తానులు గోండ్వాలోని దక్షిణ మండ ల ప్రాంతాన్ని, ‘షేర్ షా’ బిరుదును బలాల్‌సింగ్‌కు కానుకగా ఇచ్చారు. అందుకే గోండు రాజులు తమ పేరు చివర సింగ్‌కు బదులుగా ‘షా’ పెట్టుకున్నారు. సూర్జా బలాల్‌సింగ్ తనయుడు ఖండాయా బలాల్ షా రాజధానిని సిర్పూర్ (టి) నుంచి చంద్రాపూర్‌కు మార్చాడు. తొమ్మిది మంది గోండు రాజులలో చివరివాడైన నీల్‌కంఠ్ షాను మరాఠీలు బందీచేసి చంద్రాపూర్‌ను ఆక్రమించుకున్నారు. దీంతో గోండ్వానా ప్రాంతం క్రీ.శ 1750-102 వరకు మరాఠీల ఆధీనంలోకి వెళ్లిం ది. మరాఠీ రాజులు బ్రిటిష్ వారికి తలొగ్గి గోండ్వానాను తెల్లదొలరకు అప్పగించారు. దీంతో గోండుల పాలన అంతమై.. ఆంగ్లేయుల, నైజాము పాలన ఆరంభమైంది. ఈ పాలకుల దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా గిరిజనుల తిరుగుబాటు ఉద్యమాలు ఆరంభమయ్యాయి.ఆదిలాబాద్‌లోని గోండుల్లో ధైర్యశాలిగా పేరున్న మార్సికోల్లా రాంజీగోం డు 136-160 మధ్యకాలంలో నాటి జనగాం (ఆసిఫాబాద్)కేంద్రంగా బ్రిటిష్ సైన్యాలను దీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు. బ్రిటిష్ సైన్యంతో ఎదురొడ్డి వీర మరణం పొందిన ఝాన్సీలక్ష్మీబాయి, ఆ తర్వాత నానాసాహెబ్, తాంతియా తోపే, రావు సాహెబ్‌లు తమ బలగాలతో విడిపోయారు. తాంతియాతోపే నర్మదానది దాటి హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించే ప్రయత్నంలోనే, అప్పటికే ఇక్కడికి చేరుకున్న బ్రిటిష్ అనుబంధ వర్గమైన నైజాం నవాబుల వల్ల తోపే తన గమ్యాన్ని మార్చుకున్నారు.

తన అనుచరగణం- రోహిల్లా సిపాయిలు పెద్దసంఖ్యలో మహారాష్ట్రంలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ; ఆంధ్రవూపదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించారు. రోహిల్లా సిపాయిలు అజంతా, బస్మత్, లాథూర్, మఖ్తల్, నిర్మల్‌లను పోరాట కేంద్రాలుగా చేసుకున్నారు. రోహిల్లాల సమాచారాన్ని పసిగట్టి న బ్రిటిష్ రెసిడెంట్ డేవిడ్సన్ సైనికులను అప్రమత్తం చేశాడు. రోహిల్లాల నాయకుడిగా ప్రకటించుకున్న రంగారావు నిజాం ప్రభుత్వాన్ని పడగొట్టి, బ్రిటిష్ వాళ్లను తరిమేయాలని పోరాటానికి పూనుకున్నాడు.సైనిక బలగాల శిక్షణలో భాగంగా ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసే క్రమంలో బ్రిటిష్ సైన్యానికి పట్టుబడ్డాడు. యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తూ అండమాన్ జైలులో 160లో మరణించాడు. ఆ తర్వాత రోహిల్లాల తిరుగుబాటు రాంజీగోండు నాయకత్వంలో తీవ్రరూపం దాల్చింది.రోహిల్లా సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా ఆసిఫాబాద్ తాలూకా నిర్మ ల్ కేంద్రంగా జరిగింది. ప్రధానంగా గోండులు, కోలాము, కోయ తెగల గిరిజనులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. నాటి గోండులలో పోరాట పటిమ గల రాంజీగోండు సారథ్యంలో రోహిల్లా సిపాయిల తిరుగుబాటు ఉధృతంగా మారింది. రోహిల్లాల తిరుగుబాటు తుది కీలక ఘట్టం 160 మార్చి-ఏవూపిల్‌లో జరిగింది. బ్రిటిష్ వారి ఆకృత్యాలతో గోండు గిరిజనులు బానిస బతుకులు వెళ్లదీశారు. తెల్లదొరల నిర్బంధాన్ని వ్యతిరేకించడం, వెట్టికి ప్రతిఫలం అడగటాన్ని తెల్లదొరలు సహించలేకపోయారు. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, లక్సెట్టిపేట, ఊట్నూర్, జాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాలు బ్రిటిష్ వారి దౌర్జన్యంతో అల్లకల్లోలంగా మారాయి. రాంజీ నాయకత్వంలో రోహిల్లాలతోపాటు 500 పైగా గోండులు విల్లంబులు, బరిసెలు, తల్వార్లు ధరించి కదన రంగానికి సిద్ధమయ్యారు. వెయ్యిమంది రోహిల్లాలు, గోండులు కలిసి నిర్మల్ సమీప కొండలను కేంద్రంగా చేసుకుని పోరాటం చేశారు.

బ్రిటిష్ పాలకులను అడుగడుగునా ముప్పుతిప్పలు పెట్టారు. తమ ప్రాంతం నుంచి తెల్ల పాలకులను తరిమి కొట్టారు. నిర్మల్ సమీప కొండలను స్థావరంగా చేసుకుని పోరాడుతున్న విషయాన్ని తెలుసుకున్న నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగా లు వారిపై దాడులు చేశాయి. అడవంతా తుపాకుల మోతతో మారుమోగింది. సంప్రదాయక ఆయుధాలపై ఆధారపడి పోరాటానికి దిగిన ఆదివాసులు ఆధునిక ఆయుధాలు, తుపాకుల ముందు నిలువలేకపోయారు. తెగించి పోరాడుతున్న ఆదివాసులను బ్రిటిష్ సైనికులు చాలామంది ఆదివాసుల ను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. కడదాకా పోరాడిన రాంజీగోండుతో సహా 1000 మందిని పట్టుకొని నిర్మల్ నడిబొడ్డున ఉన్న ‘ఊడల మర్రి’ చెట్టు కు 160 ఏప్రిల్ 9న ఉరితీశారు. ఆ మర్రిచెట్టు ‘వెయ్యి ఊరిల మర్రిచెట్టు’గా ప్రసిధ్ది. తెల్లదొరల దురాగతాలకు చిహ్నంగా నిలిచిన ఆ మర్రిచెట్టును తరువాతి కాలంలో వలసవాద పాలకులు 1995లో నరికివేశారు. దేశ ప్రథమ స్వాతం త్య్ర పోరాటం తరువాత బ్రిటిష్-నిజాం నిరంకుశత్వాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన ఘనత తొలి వీర యోధుడిగా రాంజీగోండుకే దక్కింది. ఇంతటి వీరోచితపోరాట చరివూతను పాలకులు నిర్లక్ష్యం చేశా రు. ఇప్పుడు తెలంగాణ తన మూలాలను వెతుక్కుంటూ.. తన చరివూతను పునర్ నిర్మించుకుంటున్న తరుణంలో రాంజీగోండు చరివూతను వెలుగులోకి తేవాలి. తెలంగాణ సాహిత్యం లో, విప్లవ పోరాట సాహిత్యంలో కూడా ఆయనకు సముచిత స్థానం ఉన్నట్లు కనిపించకపోవడం విచారకరం. ఇప్పటికైనా రాంజీగోండు పోరాటా న్ని, అతని త్యాగ జీవితాన్ని భావితరాలకు అందించాల్సిన గురుతర బాధ్యతను గుర్తెరగాలి. నిర్మల్‌లో మర్రిచెట్టు స్థానంలో అతని స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయాలి.

-గుమ్మడి లక్ష్మీనారాయణ
ఆదివాసీ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి
( రేపు రాంజీగోండు 151వ వర్ధంతి)

35

GUMMADI LAXMINARAYANA

Published: Mon,February 18, 2013 06:09 PM

ధీర వనిత రాణిమా

భారత స్వాతంవూత్యోద్యమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించి పోరాడిన ఆదివాసీ వీరనారి రాణి గైడిన్ల్యూ. తెల్లదొరల దురాక్షికమణ నుంచి గిరిజన

Published: Tue,January 1, 2013 03:56 PM

ప్రశ్నార్థకమవుతున్న హక్కులు

ప్రపంచ దేశాలు ప్రతియేటా డిసెంబర్ 10 న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవమును ఆనవాయితీగా నిర్వహిస్తున్నాయి. జాతి, మతం, కులం, భాష, ప్రా

Published: Wed,December 26, 2012 02:50 PM

గిరిజన మాణిక్యం

మడవి తుకారం ఒక సాధారణ గోండు తెగ గిరిజన వ్యక్తి. ఆయ న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్సెట్టిపేట ఏజెన్సీ గూడెంలో 1951 మే 4వ

Published: Sat,October 6, 2012 03:46 PM

వాకపల్లి బాధితులకు న్యాయం దక్కేనా?

భారత రాజ్యాంగం ప్రకారం మతం, కులం,లింగం ఆధారంగా వివక్ష చూపకూడదు. ఇది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. 1979 లో వియన్నాలో జరిగిన ‘సీడా’

Published: Sat,October 6, 2012 03:47 PM

ఆదివాసుల పోరాట స్ఫూర్తి అల్లూరి

భారత స్వాతంత్య్ర కోసం ప్రాణాన్ని తృణవూపాయంగా అర్పించి అసువులు బాసిన పోరాటవీరుల్లో అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయు డు. ఆదివాసీల మన

Published: Sat,October 6, 2012 03:51 PM

ఆదివాసీల ఆప్తుడు బియ్యాల

ఆదివాసీల ఆత్మబంధువుగా, మలిదశ తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జనార్దన్‌రావు తెలంగాణ సకల జనుల మనస్సుల్లో చెరగని ము