యుద్ధ వచనం


Sun,April 7, 2013 11:51 AM

marchఇక తప్పదు, దెబ్బతప్పదు, దెబ్బలూ తప్పవు, సహనాన్ని ఎంతని అదిమిపెట్టాలిరా!ఆగ్రహాన్ని ఎవరూ కట్టేయలేరురా! అన్నీ చూస్తూనే ఉన్నాం, అన్నింటిని కంటూనే ఉన్నాం. ఇగో కవి నాలుగోకన్ను తెరుస్తున్నాడు. ఎవరైనా.. ఈ కావ్య మంటల్లో మాడక తప్పదు. యుద్ధాలంకారాలు కూర్చుతున్నప్పుడు కూర్పులు మాటలుండవు. పూదోటల సయ్యాటలుండవు. అన్నీ ఆగ్రహ అల్లంకారాలే! అన్ని కట్టలు తెంచుకుంటున్న తెగదెంపుల సంగ్రామాలే. శివాక్షిగహాలుగా నటరాజ జననృత్యాలు మొదలయ్యాక, కవిత్వమిక ప్రచండ యుద్ధభేరీనే. కవిత్వం మండే సింగరేణి బొగ్గే. ఫెళఫెళ విరుచుకు పడుతున్న ఫెనుతుఫానుల అక్షర ప్రళయఘోషల్లో.. మెటఫర్లు, జీఫర్లు, సింబాలిజాలు వెతక్కండిరా..! ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న వాడిపై అశ్శరభ శరభలైన పదాల పెనుగులాటలు. నా బువ్వలో మట్టికలిపినోణ్ణి, నా నీళ్లను కలుషితం చేసినోణ్ణి దునుమాడే సందర్భమిది. అటో ఇటో తేలాలిప్పుడు. నిజం నిర్భయంగా బయటకురావాలి.
చెట్టుమీది కొంగ కాంగ్రెస్ దొంగ
ఆక్...అల్లం... సూదీసుక్క...హేయ్
కబడ్డి...కబడ్డి...కబడ్డి
ఇక కాంగ్రెస్‌తోనే కబడ్డి...కబడ్డి...
ఇక కాంగ్రెస్‌పై కలబడి...ఎగబడి...కబడ్డి కబడ్డి..

విరబూస్తున్న ఆలోచనల పూలను
నలిపేస్తున్న చోట
విరగకాస్తున్న ఆశయాల కోసం
ఆత్మార్పణలు జరుగుతున్న చోట
కవిది యుద్ధభాషే
తెగనరికే భాష
తెగించి తన్నులాడే భాషే
అడ్డాల కాంగ్రెస్‌ను అడ్డంగా చీరేసే చీలిక భాషే
ఈ నేల మీద పుట్టి, ఈ నేల మీద పెరిగి, పరాయిపాట పాడుతున్న ఓ నా సమీప ద్రోహులారా! మంత్రులారా!! మనుషులకు, మంత్రులకు పోటీ జరుగుతున్న వేళ మీరు మంత్రులౌతారా? మనుషులౌతారా? ప్రజాక్షిగహం పక్కన నిలబడ్డవానిదే నేటి చరిత్ర. ద్రోహం పక్కన నిలిచిన వాడిది ఎప్పటికీ చరిత్ర కాదు. పశువుల పెంట కూడా ఎరువు. కాంగ్రెస్ ఒక్కటే ప్రకృతిలో పనికిరాని పదం. కనకపు సింహాసనంపై మంత్రులు తప్ప, జనమంతా జై తెలంగాణ అంటున్నరు. కష్టంలో, దుఃఖంలో, సుఖంలో, సంతోషంలో, ఆనందంలో, ఆహ్లాదంలో, దారుల్లో, పోరుల్లో, వీరుల త్యాగాల రహదారుల్లో, నడుస్తూ మున్ముందుకు సాగటం దీర్ఘయావూతగా అక్షరాలను పరుచుకుంటూ పోవటమే కవిత్వం. మనిషిగా చచ్చాకే వాడు కాంగ్రెసై పోతాడేమో!

ఇంకెన్నాళ్లురా ఓపిక! ఇంకెన్నెళ్లురా ఎదురుచూపు? నీతి, నియమంలేని నేతలారా!, మీ చావులు మీరు చావండి. మీ కుర్చీలు మీరు పదిలంచేసుకోండి. పిల్లలు ఉమ్మినా ఉచ్చ బోసినా, మీకు కదలిక లేకపోయే. చెప్పులతో కొట్టినా ఛీకొట్టినా కనీస కదలిక లేదాయే. కదలిక లేనిది కాంగ్రెస్. చావుల్ని చూస్తూనవ్వేది కాంగ్రెస్. కన్నీళ్లను చూసి కులికేది కాంగ్రెస్. మిమ్ముల్ని మోస్తున్న ఈ నేల, ఓట్లేసి ఎన్నుకున్న జనం, మిమ్మల్ని చూసి తెలంగాణ సమాజమే సిగ్గుతో తలదించుకుంటున్నది. ఆత్మబలిదానాలతో, తల్లడిల్లుతున్న తల్లుల గర్భశోకం చూస్తూ కూడా కదలని రాతిబండ కాంగ్రెస్. మంటల్లో మాడిపోతూ, జై తెలంగాణన్న పిడికిళ్లను చూశాక కూడా మీరు మీసీట్లల్లో కులుకుతారా? దౌర్భాగ్యానికి చిహ్నాలైన ఓ తెలంగాణ మంత్రులారా! ఏమున్నదిరా ఆ కుర్చీల్లో! ఒక్కతన్నుతన్ని మహాజనావళిలో దూకండి.

ఈ నేలపాలు తాగిన బిడ్డలేనా మీరు! ఈ నేలతల్లి బువ్వతిన్న నోళ్లేనా అవి? ఈ నేలపౌరుషాన్ని, త్యాగాల్ని, మంటగలిపిన మహా నేతలారా! మీది , రంగురంగుల మారి నెహ్రయ్య పార్టీ, ఇంద్రవల్లిలో వందమందిని మింగిన ఇందిరమ్మ , తెలంగాణను నెత్తురు ముద్ద చేసిన పటేల్, వీరుల నెత్తురు తాగిన దొరగడీల వారసులైన మీ అందరితో కలిసి ‘జై తెలంగాణ’ అని ఒక్క నినాదమైనం. ఎందుకు? తెలంగాణకోసం.
తెలంగాణ కోసం
దొరలూ, నక్సలైట్లు కలిసిన వేదికలు..
కులమతాలు వదిలి కదిలిన మహానది తెలంగాణ
జయశంకర్ పిలుపుతో
అందరం కలిశాం అందరం నిలిచాం
వీరుల త్యాగాలను గుండెల్లో దాసుకున్నాం
ఎర్రజెండాలను పక్కన బెట్టాం
ఖద్దరు చొక్కాల రాక్షసత్వం తెల్సిమరీ..
జతకట్టి నడిచాం
ప్రజాకంటకులు
ప్రజావూదోహులు కూడా
గొంతులు మార్చి జై కొడితిరికదరా?
ఇక సమరమే!
ఇక యుద్ధమే!!
ఇక శత్రువుపై నేరుగా పోరే
ఎప్పటికైనా శత్రువు పాత్ర ఆ ఖద్దరు చొక్కాలదే
పదవుల పీఠాల మీద నుంచి
మంత్రి పదవుల తలపాగాల మీద నుంచి
ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజోద్యమం నిర్మించబడిందా?

నీచ నికృష్ట క్రూరమృగాల
ద్రోహచరిత్ర వారసత్వం ఆ ఖద్దరుది
కాకపోతే యూపీఏ కాంగ్రెస్‌ది

ప్రజల చేత, యొక్క, కొరకు,
ఎన్నుకోబడి జనాకాంక్షలకు అడ్డుపడుతున్న మిమ్మల్ని చూసి
తెలంగాణ సమాజం గుండె పగిలిందిరా!
మిమ్మల్ని చూసి జాతి
సిగ్గుతో తలదించుకుంటుంది
మీలాంటోళ్లను పెంచినందుకు
ఈ నేలంతా తల్లడిల్లుతుంది
ఇక మీకొకటే దారి
మనుషులుగా మారే అవకాశం
మీ చేతుల్లోనే..
మహాజన బాహుళ్యం పాదాలకింద
నలిగి చస్తారో బతుకుతారో తేల్చుకొండి!
ఇది కవిగాడి శాపం. కవికి జెండాలుండవు. కవికి కుర్చీలు, పదవులుండవు. ఈ ఉద్యమాన్ని తాకట్టుపెట్టిన ఎవ్వరైనా ద్రోహులే. ద్రోహులకు పాతర తప్పదు.

కాంగ్రెస్ ఒక ద్రోహ నిర్వచనం. అదొక ద్రోహపు విషపుకత్తి. అబద్ధాల, అన్యాయాల, అక్రమాల, అసత్యాలగుట్ట కాంగ్రెస్. ద్రోహాలతో కపటాలతో, ప్రజా ఉద్యమాల గొంతుకోసే, కత్తి కాంగ్రెస్. నేలతల్లి విముక్తి కోసం అడుగులు వేసుకుంటూ.., కాంగ్రెస్ గడీలను దాటుకుంటూ.. మంత్రి పదవుల్ని ఎడమకాలి చిటికెన వేలితో తన్నుకుం టూ వచ్చిన ప్రతివాడు నేటీహీరోనే. జనపక్షం వహించిన వాళ్లంతా ఈ నేలమీద నేతలే. ఆకాంక్షలను మార్కెట్ చేసే వాళ్లంతా పుండాకోరులే.

ఇందిరాపార్క్‌లు, మిలియన్ మార్చ్‌లు, గన్‌పార్క్‌లు, ట్యాంక్‌బండ్‌లు, సాగరతీరాలు, సకలజనుల సమ్మెలు అన్నీ జనాక్షిగహాలే. ఇపుడు శత్రువును వెంటాడి వేటాడి తరిమేయటానికి తెలంగాణలో గడపగడప కదలివస్తోంది. శత్రువును చంపాల్సిన అవసరమూలేదు. ఓటు ఆయుధంతో పొడిచేస్తారు. బ్యాలెట్ బాక్సులలో వారికి చెల్లుచీటీలు తప్పవు. సత్యం ఆగ్రహం చెందితే తెలంగాణ నేలంతా ఆగ్రహాల సత్యాక్షిగహాల ఉద్యమతోట! ఈ ఆఖరి మోకలో, కుట్రపేరు కాంగ్రెస్. అంతిమ యుద్ధంలో తేలిన శత్రువు నెహ్రూటోపీ. మిమ్మల్ని చెరువులు శపిస్తున్నాయ్. డొంకదార్లు ఆగ్రహిస్తున్నాయ్. తాటి మట్టలు లేస్తున్నాయ్. ఈత ముళ్లు పదునెక్కుతున్నాయ్. పల్లేరుగాయలు కత్తులు నూరుతున్నయ్. నీళ్లు ఆవేశంతో వేడెక్కిబుసకొడ్తున్నయ్. ‘కాంక్షిగెస్ కో ఖతమ్ కరో’ అని జనాక్షిగహం కదం తొక్కుతున్నది..

ఇపుడు నేను ఉద్యమవూదోహుల
ద్రోహచరిత్ర రాస్తున్నాను
ఇంకిపోయిన కళ్లతో
కనుచూపునే గురిగా చేసుకుని
ఆగ్రహా కవిత్వాస్త్రాన్ని ఎక్కుపెడ్తున్నాను
రాలిపోతున్న ఆత్మ బలిదానాల త్యాగాలను చూసి
వ్యాసుణ్ణి కాలేను
యుద్ధవాఙ్మయ వ్యాసకవిత్వ భేరిగా మోగుతాను
ఇపుడు కచటతపలు కాదు
కాంగ్రెస్ దౌడపళ్లు రాల్చే కవిత్వ పంక్తులవుతున్నాను
కాంగ్రెస్ విషనాగుల
వికృతత్వ ద్రోహాలంకారాలను విరిచి
విప్లవాలంకారాలు విరచిస్తున్నాను
అందరం కలిసిన ఒకటే పిడికిలి, ఒకటే నినాదమన్న ఐక్యతలో విష పురుగులా తిరుగుతున్న శత్రువును ఖరారు చేశాను. విప్లవ వైప్లవ గీతాల్లో ఊగిసలాడిన నేను, దళిత బహుజన గీతాల సూత్రదారిని. అస్థిత్వ కవిత్వ దండనై తెలంగాణ తల్లి మెడలో హారమైనాను.
కెసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడోనన్న
తెగదెంపుల సంగ్రామ గీతాన్ని అల్లిన నేను
కాంగ్రెస్‌తో కలిపి జై తెలంగాణ
ఐక్యత దండలో ఇమడటం కోసం కదా ‘జానా’
‘జానా’ అంటే తెలంగాణ జనమనుకున్నాను కానీ, కుర్చీల చుట్టూ చెక్కర్లు కొట్టే రొటీన్ లీడరనుకోలేదు. ఎన్ని సార్లయినా ఎన్నిపూక్కలు కట్టినా కాంగ్రెస్ అన్నది పచ్చి అబద్దం. యూపీఏ ఒక అసత్యం. చిదంబరం అర్థం కాని బ్రహ్మపదార్థం. జాదు ఆటగాడు ఆజాద్. ఉండవల్లి కాంగ్రెస్ విషనాలుకల పుత్రిక. షిండే కాంగ్రెస్ డోక్రే.. ఒక మోసాన్ని నమ్మి ఇన్నేళ్లు అడుగు వేయటమే జీవితంలో క్షమించరాని తప్పు. ఒక తప్పుల తడకలతో మహా సౌధాన్ని నిర్మిస్తాననేది కలనే అవుతుంది. వందల సంవత్సరాల ద్రోహచరిత్ర గల కాంగ్రెస్ ఎక్కడా? అస్థిత్వ ఉద్యమాన్ని గుండెలకత్తుకున్న కవుల కలాపూక్కడా? ద్రోహానికి కవి కలానికి ఎప్పటికీ పడదు. కూల్చివేతకు నిర్మాణానికున్నంత తేడావుంది.

‘బూతులు’ కూడా విన్నవించుకున్నాయ్! మమ్ముల్ని ఆ శత్రువుపైకి విసిరితే మలినపడతామన్నాయి. కాంగ్రెస్‌తో తమను జతకట్టవద్దని బూతులు గొల్లుమన్నాయి. శత్రువు తేలకనే యుద్ధం ఆగింది. జైపాలుడు కదలి రాలేక పోతున్నాడని తెలిసాకే శత్రువుపై పోరుకేక. జానపాడు సైదులుమీదొట్టు ‘జానా’ ద్రోహాన్ని కౌగిలించుకుంటడని తెల్వదు. ఈ లోకంలో దేన్నైనా జయించవచ్చు ద్రోహం మాత్రం సహించలేనిది. శత్రువును ప్రకటించాకనే జేఏసి మహా శక్తయ్యింది. కేసీఆర్ ఉద్యమపంచాంగం ఇప్పినాకనే కాంగ్రెస్ మెడలు సరిచేసుకుంటుంది. జయశంకర్ నువ్వు చెప్పినట్లే చేస్తున్నం. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యు వరకు ఆలింగనం చేసుకుంటే కాంగ్రెస్ కత్తయి దిగింది.
పార్టీలు, రంగులు లేని జెండాలు పడదాం
జనజాతరల్లో పాటలనెగురేద్దాం
జై కొడుతున్న జనకాంఠానికి కవిత్వ మౌదాం
కదలిపోదాం! పద.. తరలిపోదాం! పద
వడివడి అడుగులు వేస్తూ..
ఉరుకులు, పరుగులు పెడదాం! పద
అశ్శరభ శరభ శరభ శరభ ఇక యుద్ధమేరా..! నాయనా
తల్లీ.. ఇక అంతర్యుద్ధమే...
సూర్యాస్తమయంతో నేల ఎర్రగైంది
‘తెలంగాణ’నే ఒక యుద్ధభేరి

-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు

37

GOURI SHANKAR JULUR

Published: Sun,April 7, 2013 11:39 AM

‘తెలంగాణ’ లేకుండా తెలుగు మహాసభలా!

తెలంగాణ సాహిత్య సాంస్కృతిక ముఖ్యులు లేకుండా జరిగినవి ప్రపంచ తెలుగు మహాసభలు ఎట్లా అవుతాయి? తెలంగాణను గాయాలకు గురిచేశారు కాబట్టే ఈ న

Published: Sun,April 7, 2013 11:19 AM

వివక్షలే ఉద్యమాల పుట్టుకలు

ఒక ప్రాంతం సాంస్కృతిక ఆధిపత్యమే రెండు ప్రాంతాల మధ్య అనెక్యతకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఒక ప్రాంతం తన సాంస్కృతిక ఆధిపత్యాన్నే రా

Published: Sun,April 7, 2013 10:03 AM

సాగర సమరహారం

ఎంత రాసినా తనివితీరని కావ్యం/ఎంత చెప్పినా వొడవని ముచ్చట గాయాలతో విముక్తి పాఠాలను రాస్తూ అనుభవాలతో పోరాటాలను పండిస్తూ చెదిరిన పి