‘తెలంగాణ’ లేకుండా తెలుగు మహాసభలా!


Sun,April 7, 2013 11:39 AM

inauguralspeechతెలంగాణ సాహిత్య సాంస్కృతిక ముఖ్యులు లేకుండా జరిగినవి ప్రపంచ తెలుగు మహాసభలు ఎట్లా అవుతాయి? తెలంగాణను గాయాలకు గురిచేశారు కాబట్టే ఈ నేల మీద ఎగుస్తున్న ఉద్యమాలకు గుర్తుగా ఆత్మబలిదానాలు చేసుకున్నవారి తల్లుల గర్భశోకం సాక్షిగా, తెలంగాణ కవులు, రచయితలూ ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించారు. ప్రపంచంలో ఇంతమంది కవులు, రచయితలు ఇంత స్థాయిలో నిరసన వ్యక్తం చేసి బహిష్కరించటం జరిగి ఉండదు. ఇంత పెద్ద హెచ్చరిక చేస్తున్నప్పటికినీ ఒక జాతిపేర తెలుగు మహాసభలు నిర్వహించటం అన్నది మరో ప్రాంతం సాంస్కృతిక ఆధిపత్యాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. ఒక ప్రాంతం తమ హక్కుల కోసం గొంతువిప్పుతుంటే, మరో ప్రాంతం ఆధిపత్యంతో ఆ గొంతులను నులిమే ప్రయత్నం చేయటం బహిరంగంగా కనిపించింది. ఒక నేలపై సాంస్కృతికంగా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలిగితే ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం సులభం. అందుకే ఈ తెలుగు సభలను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా తిరుపతిలో జరిపింది.

తెలుగు భాషపై తెలుగు సంస్కృతి, సంప్రదాయ, భాష పరిరక్షణ కోసం జరుగుతున్న సభలుగా వాటిని భావిస్తే, వాటిని బహిష్కరించవలసిన అవసరంలేదు. కానీ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాన్ని అణచటానికి ఆధిపత్య సాహిత్య సాంస్కృతిక ఆయుధంగా మార్చి అధికార బలంతో ముందుకు రావటంవల్లనే ఈ సభలను తిప్పికొట్టవలసి వచ్చింది. ఈ సభలను బహిష్కరించిన పలు సాహిత్య సాంస్కృతిక సంస్థల్లో భిన్న ఆలోచనలున్నాయి. తెలంగాణ కవులు, రచయితలు మాత్రం స్పష్టంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఆకాంక్షిస్తూ ఈ సభలను నిరసించారు. ప్రాంతేతరులైన ఆలోచనాపరులు, కవు లు, రచయితలు కూడా బహిష్కరించారు. కత్తిపద్మారావు, కోయికో బహుజన కెరటాల బృందాలు, దళిత, బహుజన వర్గాలకు చెందిన కలం యోధులు ఈ సభలను బహిష్కరించారు.

రోశయ్య ముఖ్యమంవూతిగా ఉన్నకాలంలోనే ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలని నిర్ణయించారు. ఈ సభలకు సంబంధించిన చర్చ బయటకు రాగానే తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆ సభలను బహిష్కరించాలని రెండేళ్ల క్రితమే చెప్పింది. బరంపురం తెలుగు సభలను పెట్టి తెలంగాణ కవి నందిని సిధాడ్డిపై అనుచితంగా వ్యవహరించారని తెలిసి తెరవే ఆగ్రహించింది. సాంస్కృతిక ఆధిపత్యాన్ని నిరసిస్తూ ఒంగోలులో ర్యాంకీ గ్రూపు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించిన ప్రపం చ తెలుగు మహాసభలను తెలంగాణ రచయితల వేదిక, విరసం బహిష్కరించాయి.

మా గొంతులను అణిచిపెట్టి, మా సాహిత్య సాంస్కృతిక మూలాలను ధ్వంసం చేస్తూ మీరు నిర్వహించే ఆధిపత్య సభలకు మేం రావటమేమిటి? మా భాషా సభలను మేమే నిర్వహించుకుంటామం టూ తొలిసారిగా తెలంగాణ రచయితల వేదిక నేతృత్వంలో అఖిలభారత తెలంగాణ రచయితల సభలను నిర్వహించాం. అఖిలభారత తెలంగాణ రచయితల వేదికను ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో సభలను బహిష్కరించే కార్యవూకమాన్ని ఉధృతంగా 6 నెలల నుంచి ప్రచా రం చేస్తూవచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం, అన్ని జిల్లాల కలెక్టర్లు చేసిన ప్రచార ఆర్భాటాల కంటే బహిష్కరిస్తూ తెలంగాణ కవులు, రచయితలు, పలు సంఘాలు చేసిన ప్రచారమే ఎక్కువగా జరిగింది.

హైద్రాబాద్‌లో 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలను విరసం బహిష్కరించింది. ఇపుడు 2012లో తెలంగాణ రాష్ట్రం కావాలని నినదిస్తూ మొత్తం తెలంగాణలోని కవులు, రచయితలు తిరుపతి సభలను బహిష్కరించారు. మొదటి, రెండు, మూడు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న తెలంగాణ కవులు, రచయితలు ఈసారి తిరుపతి సభలను బహిష్కరించి వెళ్లకపోవటం విశేషం. విరసం ఇచ్చిన పిలుపు మేరకు శ్రీశ్రీ తదితర విప్లవ కవులు బహిష్కరించారు.

కానీ ఇప్పుడు తెలంగాణ రచయితల సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు వందల సంఖ్యలో కవులు, రచయితలు, కళాకారులు, సినీదర్శకులూ తిరుపతి పోకపోవటం సంచలనం కలిగించింది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణడ్డి లాంటి దిగ్గజం లేకుండా జరిపే సభలు తెలుగు మహాసభలు ఎల్లా అవుతాయి? కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డా.ఎన్. గోపి, అంపశయ్య నవీన్, ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు చుక్కా రామయ్య, ప్రసిద్ధ జానపద బ్రహ్మ, పరిశోధకులు ప్రొ॥ జయధీర్ తిరుమలరావులతో పాటుగా ఎందరో ప్రసిద్ధకవులూ, రచయితలూ ఆ సభలకు పోకపోవటం తెలంగాణ ఉద్యమ నైతిక విజయం. ప్రపంచ సాహిత్య సాంస్కృతిక వేదిక మీద గర్వంగా చెప్పుకోదగ్గ చారివూతాత్మక అంశంగా ఈ మహాసభల బహిష్కరణ నిలిచిపోతుంది.

తిరుపతి సభల్లో శాలువాల కవులు, ప్రభుత్వ రచయితలు, ఆధిపత్య సంస్కృతికి పాటలుపాడే శ్రీనివాసులు మాత్రమే పాల్గొన్నారు. ఈ సభలను ఆత్మగౌరవంతో నిరసించటంతో తెలంగాణ కవులు విశ్వవేదిక మీద మార్గదర్శకులుగా నిలిచారు. ఆధిపత్యాన్ని ధిక్కరించే మహత్తర శక్తిగా నిలిచి తెలంగాణ రచయితలు అస్తిత్వ ఉద్యమబాటను వేశారు. గద్దర్, అంద్శై, గోరటి వెంకన్న, గూడ అంజన్న, జయరాజు, మిత్ర, మిట్టపల్లి సురేందర్, అంబటి వెంకన్న, రసమయి బాలకృష్ణ, విమల, దేశపతి శ్రీనివాస్‌ల మాటల పాటలు లేకుండా జరిగే తెలుగు సభలు ఎప్పటికీ పరిపూర్ణం కాలేవు. వందలాది మంది కవులు, కథా రచయితలు లేకుం డా జరిగినవి ఎవరి సభలు? అవి ఆధిపత్య ఆంధ్ర సభలు.

అస్తిత్వ ఉద్యమాల గొంతునులిమే నిరంకుశ సభలు. ఈ సభలను తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ రచయితల వేదిక, విప్లవ రచయితల సంఘం, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ రీసోర్స్ సెంటర్, అభ్యుద య రచయితల సంఘం, మంజీర రచయితల సంఘం, సింగిడి మట్టిపూలు, ప్రజా కళామండలి, అరుణోదయ (జనశక్తి), ప్రజా స్వామిక రచయివూతుల వేదిక, అరుణోదయ (న్యూ డెమోవూకసీ), పాలమూరు అధ్యయన వేదికలాంటి జనసాహితి, భాషోద్యమ సమాఖ్య, బహుజన కెరటాలు లాంటి సంస్థలు బహిష్కరించాయి. తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి అండగా నిలిచిన ప్రాంత, ప్రాంతేతర కవులను కూడా చరిత్ర తన పొత్తిళ్లలో దాచుకుంటుంది. తెలుగు భాషోద్యమ సమాఖ్య, జనసాహితి, అరసం, విరసం ఈ బహిష్కరణ పిలుపునిచ్చాయి. కవి, పత్రికా రచయి త, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు అల్లం నారాయణ, విద్యావేత్త, శాసనమండలి సభ్యులు చుక్కా రామయ్య ఈ మహాసభలను బహిష్కరించాలని ప్రచారం చేశారు.
ఈ సభలతో తెలుగు సమాజమంతా ఏకంగా ఉంది.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రభావం సన్నగిల్లిందని చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆధిపత్య సాంస్కృతికవాదులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మీది తెలుగుతల్లి, మాది తెలంగాణ తల్లి. మీరూ మేమూ ఒకటికాదని తెలంగాణ సాహిత్యలోకం ఈ సందర్భంగా చాటిచెప్పింది. ఇది మామూ లు విజయం కాదు. ఇది తెలంగాణ సాహితీలోకం అఖండ విజయంగా చరివూతలో నిలిచిపోతుంది. ఇంత చెప్పినా తిరుపతిలో జరిగిన ఆ సభల కు ఏ పిడికెడు మందో తెలంగాణవాళ్లు వెళ్లారన్న వార్తలొచ్చాయి. అలా వెళ్లిన వాళ్లు ద్రోహ చరివూతలో రికార్డవుతారు. దాదాపుగా తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోని తెలుగుశాఖలకు చెందిన ప్రొఫెసర్లు, లెక్చరర్లు, అధ్యాపకులు మెజారిటీ సంఖ్యలో ఈ సభలను బహిష్కరించటంవిశేషం.

-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు

37

GOURI SHANKAR JULUR

Published: Sun,April 7, 2013 11:51 AM

యుద్ధ వచనం

ఇక తప్పదు, దెబ్బతప్పదు, దెబ్బలూ తప్పవు, సహనాన్ని ఎంతని అదిమిపెట్టాలిరా!ఆగ్రహాన్ని ఎవరూ కట్టేయలేరురా! అన్నీ చూస్తూనే ఉన్నాం, అన్నిం

Published: Sun,April 7, 2013 11:19 AM

వివక్షలే ఉద్యమాల పుట్టుకలు

ఒక ప్రాంతం సాంస్కృతిక ఆధిపత్యమే రెండు ప్రాంతాల మధ్య అనెక్యతకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఒక ప్రాంతం తన సాంస్కృతిక ఆధిపత్యాన్నే రా

Published: Sun,April 7, 2013 10:03 AM

సాగర సమరహారం

ఎంత రాసినా తనివితీరని కావ్యం/ఎంత చెప్పినా వొడవని ముచ్చట గాయాలతో విముక్తి పాఠాలను రాస్తూ అనుభవాలతో పోరాటాలను పండిస్తూ చెదిరిన పి