ఒకే మాట, ఒకే బాట


Sat,October 6, 2012 03:43 PM

కేంద్రాన్ని, ఆంధ్రా ఆధిపత్య శక్తులను ఒక పక్క ఎదుర్కొంటూనే మరో పక్క తెలంగాణలో భిన్న రాజకీయ చైతన్యాల మధ్య తెలంగాణ రాష్ట్ర అంశంపై ఏకీకరణతో అడుగులు ముందుకు వేయటం జరగాలి. గత అనుభవాలను నుంచి ఇక వేయబోయే ప్రతి అడుగుఅచి తూచి వేయాలి.

తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమం కొత్త మలుపు తీసుకుని రాజ్యాంగ సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నది. 141 మంది ప్రజా ప్రతినిధులు సర్వోన్నత అసెంబ్లీకి శాసనమండలికి రాజీనామా సమర్పించి తెలంగాణ ఉద్యమ రాజకీయ అంకంలో కొత్త అడుగులకు శ్రీకారం చుట్టారు. ఇలా అన్ని పార్టీలకు చెందినవారు ఒక్కసారిగా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం అరుదైన సంద ర్భం. కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు తర్వాత 48 గంటలకు దీక్షకు దిగి ప్రజా ప్రతినిధులంతా ఒక వేదిక మీదకు వచ్చారు. రాజీనామాలు సమర్పించి టీడీపీ శాసనసభ్యులు బస్ యాత్రను చేపట్టారు. వీరందరికంటే ముందుగా తెలంగాణ టీడీపీ తిరుగుబాటు నేతలు నాగం, హరీశ్వరడ్డి, వేణుగోపాలాచారి, రామన్నలు రాజీనామా లు సమర్పించి ఇందిరాపార్క్ దగ్గర ఒకరోజు దీక్ష చేపట్టారు. ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు 5 రోజులు అమరణ నిరాహారదీక్ష చేశారు.

ఇక టీఆర్‌ఎస్ శాసనసభ్యులు రాజీనామాల బాటకే తోవ చూపినవారు. ఈ సందర్భంలో తెలంగాణ కోసమే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి నేత కేసీఆర్ ఉద్యమ కుంపటిని మరింత రాజేశారు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమపోరు ఊపందుకుంటున్న సందర్భంలో అన్ని పార్టీలు ఒకే గొంతు తో తమ ఎజెండాలను పక్కన పెట్టి ఒక్కటే తెలంగాణ గొంతుగా ఏకమౌతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఈ ఉద్యమంపై దాడి చేసింది. ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులపై స్టీఫెన్ రవీంద్ర లాఠీచార్జి లాగా తెలంగాణ ఉద్యమంపై కేంద్ర మంత్రి ఆజాద్ తన అడ్డగోలు మాటలతో తెలంగాణను తీవ్రంగా గాయపరిచారు. ఆజాద్ మాటలకు తెలంగాణ ఒక్కసారిగా భగ్గుమన్నది. ఈసారి తన సొంత పార్టీ కాంగ్రెస్‌కు ఆజాద్ మంటలు తాకాయి. తెలంగాణ నాయకులు ఆజాద్‌ను నిలదీసి మాట్లాడారు. ఎవరి మాట వినం.

రాష్ట్ర సాధనే ధ్యేయమని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా గొంతు సవరించుకుని మాట్లాడారు. తమ రాజీనామాలు ఉత్తుత్తవి కావని ఎవరికీ లొంగమని చెప్పారు. మళ్లీ కేంద్రం నుంచి ఆ జాదు పిలుపు వచ్చింది. ఇప్పుడు ఎవరు పోవాలో ? ఏం మాట్లాడాలో? అనే సందర్భం తెలంగాణ కాంగ్రెస్ ముందు ఉంది. గద్దర్‌ను కలిసిన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు నీ పార్టీనేత చంద్రబాబు స్పష్టమైన వైఖరి తీసుకోమని చెప్పారు. ఈ నేపథ్యంలో టీఎన్జీవోలు ఆగస్టు 1తర్వాత చారివూతాత్మకమైన సార్వవూతిక సమ్మెకు దిగేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అన్ని ప్రజాసంఘాలు ఒక్క తాటిపైకి తీసుకు వచ్చే పనిని కోదండరాం చేస్తున్నారు. ఒక్కతాటిపైకి వచ్చేందుకు ఏం చేయాలో చుక్క రామయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి పెద్దలు ఆలోచిస్తున్నారు.

ఈ సమయంలో ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి? రాజీనామా చేసిన సభ్యులందరినీ ఒక్క ప్రజా వేదికపైకి తీసుకు వచ్చేందుకు చేయవలసిన కర్తవ్యాలు ఏమిటి? రాజీనామాలు చేసిన సభ్యులు అధిష్ఠానాల కాళ్లకాడ కాకుండా ప్రజా అసెంబ్లీ నిర్వహించటానికి కార్యరంగాన్ని ఎలా తయారు చేయాలి? అంద ర్నీ ఏకం చేయడానికి అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు ఏమిటి? నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అండగా ఇప్పుడు ప్రజా ఉద్యమాన్ని ఏ దిశగా మళ్లించాలి? తెలంగాణలో పలు పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలను పక్కన బెట్టి వారి మధ్య ఉన్న వైషమ్యాలను ఎలా తొలిగించాలి? తెలంగాణ ఉన్న ప్రజాసంఘాలు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలకు యుద్ధ ప్రాతిపదికపై ఎలా అడ్డుకట్టలు వేయాలి? రాజీనామాలు చేసినవారిని అడుగు వెనక్కి వేయకుండా ముందుకు సాగేందుకు ఏరకమైన వ్యూహాలను రచించాలి? త్వరలో రాజీనామా చేసినవారందర్నీ ఒక వేదికపైకి తీసుకురావడానికి అన్ని శక్తులు ఏకం కావాలని అందుకు అందరు ఒప్పుకునే విధంగా రూపకల్పన చేయాలని తెలంగాణలోని ఆలోచనాపరులు, సృజనశీలురు ఆలోచనలు చేస్తున్నారు.

సరిగ్గా ఆ ఆలోచనలకు దర్పణంగా హైదరాబాద్‌లో తెలంగాణ రీసెర్చి సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం ఒక చర్చ జరిగింది. ఇటీవల 5 రోజు లు ఆమరణ నిరహారదీక్ష చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులతో కలిసి పలువురు ప్రజా సంఘాలకు చెందిన నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నేతలు పలు రకాల అంశాలపై ప్రస్తుత సందర్భంపై సుదీర్ఘంగా చర్చించా రు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఛైర్మన్ గద్దర్, ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య, తెలంగాణ జర్నలిస్టు ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ, తెలంగాణ ఉద్యోగ సంఘా ల నేతలు స్వామిగౌడ్, దేవీవూపసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్, తెలంగాణ టీచర్స్, ఆధ్యాపకులు, ఓయూ ప్రొఫెసర్లు, పలువురు కవులు, రచయితలు, మహిళా సంఘాల నేతలు, ఓయూ విద్యార్థులతో కలిసి జరిగిన భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చా యి.

‘ఇప్పుడేం చేద్దాం’ అన్న ఆలోచనతో ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు ముందుకు సాగాయి. రాజీనామా చేసిన వారందర్నీ ఒక వేదికపైకి తీసుక వచ్చి తెలంగాణ కోసం ఒకటే మాట, ఒకటే బాట అన్న దానిని ప్రతిష్టించాలని అల్లం నారాయణ చేసిన సూచనను గద్దర్, చుక్క రామయ్యలు, అన్ని ప్రజా సంఘాలు ఏకక్షిగీవంగా ఒప్పుకున్నాయి. స్వామిగౌడ్ ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ అనుభవాలను నెమరువేశారు. ప్రజాసంఘాల నాయకులు మధ్య వైరుధ్యాలు నాలుగు గోడల మధ్య ఉండాలి, ఉద్యమంలో తెలియకుండా జరిగిన తప్పులను బహిరంగంగా గాకుండా అంతర్గతంగా మాట్లాడుకోవాలన్న దిశగా అనేక ప్రజా సంఘాల నాయకులు తమ అభివూపాయాలను వెలిబుచ్చారు. అందరం కలిసి శత్రువును బలహీనపర్చాల్సిన సమయంలో మిత్రవైరుధ్యాలు పక్కన పెట్టాలి. ఎన్నో త్యాగాలు, ఎన్నో దీక్షలు, వేల జాక్‌లు, కోట్ల గొంతులు, వేల ర్యాలీలు, ఎన్నెన్నో తెలంగాణ గుండెలకు తగిలిన గాయాలు వీటన్నింటిని నుంచి గుణపాఠాలు తీసుకొని అడుగు లు ముందుకు వేయాల్సిన చారివూతక సందర్భమిది.


కేంద్రాన్ని, ఆంధ్రా ఆధిపత్య శక్తులను ఒక పక్క ఎదుర్కొంటూనే మరో పక్క తెలంగాణలో భిన్న రాజకీయ చైతన్యాల మధ్య తెలంగాణ రాష్ట్ర అంశంపై ఏకీకరణతో అడుగులు ముందుకు వేయటం జరగాలి. గత అనుభవాలను నుంచి ఇక వేయబోయే ప్రతి అడుగు అచి తూచి వేయాలి. రాజీనామాలు చేసిన ప్రజావూపతినిధులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మొత్తం తెలంగాణ సమాజంపైనే ఉంది. అలాగే రాజీనామాలు చేసిన ప్రజా ప్రతినిధులు, అధిష్ఠానాలు చెప్పాయని మెత్తబడే దశ రాకుండా చూడాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అధిష్ఠానాలపై తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశం ప్రజావూపతినిధులు తిరుగుబాటు జెండా ఎగురవేసే విధంగా చూడాలి. రాజీనామాలు వెనక్కు తీసుకుంటే అది తెలంగాణ ఆత్మగౌరవానికి తీరని నష్టం చేస్తుందన్న విషయం గమనించాలి.

కేంద్ర ప్రభుత్వం అడుతున్న ఆటలకు సమాప్తం చెప్పాలి. ఆగస్టు 1 నుంచి ఉద్యోగ సంఘాలు చేపట్టబోయే సార్వవూతిక సమ్మెకు మొత్తం తెలంగాణ సమాజం అండగా ఉండేందుకు వ్యూహ రచనలు చేయవలసి ఉంది. విద్యాలయాల నుంచి బొగ్గుబావుల దాకా స్తంభన జరగా లి. పూర్తిగా పాలనా యంత్రాంగం స్తంభించిపోవాలి. ఉపాధ్యాయ లోకం తమ ఆలోచనలతో విద్యార్థి లోకానికి అండగా నిలవాలి. తెలంగాణలోని సబ్బండ వర్ణా లు ఈ సార్వవూతిక సమ్మెకు సంఘీభావం తెలపటమే కాకుండా వినూత్న రూపంలో కేంద్రంపై నిరసన రూపాలు ప్రదర్శించాలి. ఆ రూపాలు ఏలా ఉండాలి? ఉద్యమాన్ని ఏ దశకు తీసుకపోవాలి? ప్రభుత్వం పెట్టే నిర్బంధాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామన్న ప్రభుత్వ హెచ్చరికలన్ని ఎలా తిప్పి కొట్టాలి? ఆత్మ బలిదానాలు చేసుకోకుండా పటుత్వంతో ఈ మలిదశ పోరాటాన్ని ఎలా పట్టాలకెక్కించాలి? ఒకరిపై ఒకరు విమర్శలు మానుకోవాలి? మొత్తం మీద ఈ మలిదశ తెగతెంపుల సంగ్రామంలో ఆలోచనతో అడుగులు వేయాలి. తెగని ఆవేశాన్ని లక్ష్యానికి గురి పెట్టాలి. ఇప్పుడు ఎక్కుపెట్టే ఆలోచనల అస్త్రాలు ఏ ఒక్కటి విఫలం కాకుండా చూసుకోవాలి.


ఇప్పుడేం జరగబోతుంది? ఇప్పుడేం చేయాలి? మనందరం ఏ దిశగా ముందు కు సాగితే త్వరగా లక్ష్యానికి చేరుకోగలుగుతాం, అన్న దృష్టితో ఉన్న మొత్తం తెలంగాణ సమాజానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏరకమైన దిశా నిర్దేశం చేయగలుగుతాయోనని ఎదురుచూస్తున్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పని చేస్తామని ప్రమాణం చేసిన తెలంగాణ శక్తులన్నీ ఇందుకు సమాధానం చెప్పాలి. కొత్త తోవలు చూపాలి. రాష్ట్ర సాధన వైపుకు మరింత ముందుకు నడిపించాలి.

-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి

40

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

country oven

Featured Articles