ఉద్యమాలకు అన్నం పెట్టిన అవ్వ


Sat,October 6, 2012 03:43 PM

-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శిఅడవి ఉద్యమానికి మైదాన ఉద్యమానికి సంబంధించిన కీలకమైన సమాచారానికి మధ్య వారధిగా నర్సమ్మ నిలబడింది. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని వారెవరైనా కానీ ‘తిండి తిన్నావా’ అని అడిగిన మహత్తర మాతృమూర్తి ఆమె. ఉద్యమానికి పరోక్ష రూపం నర్సమ్మ. కష్టాలు, నష్టాలు, కోపాలు, తాపాలను సవరించుకుంటూ పోయే గృహిణిగా ఇంటి బాధ్యతలన్నీ నర్సమ్మ చూసేది.

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మాక్సిమ్ గోర్కి ‘అమ్మ’ నవలలోని పావెల్ అమ్మ అందరికీ తెలుసు. తుపాకి చేత పట్టి లేడిపిల్లలా దుమికి చెమటలు పట్టించిన ఆరుట్ల కమలాదేవి తెలియని వాళ్లు లేరు. ఆనాటి తెలంగాణ సాయుధ పోరులో బువ్వగింజల పోరు చేసిన చాకలి ఐలమ్మ ఈ తరానికి తెలు సు. 65 ఏళ్ల సుదీర్ఘకాలం విప్లవోద్యమ భావ జాలం పక్క నిలబడి వేలాది మంది కమ్యూనిస్టులకు, విప్లవకారులకు బువ్వ పెట్టిన చేతులవి. వీరికే కాదు ఇంటి కొచ్చిన ప్రతి ఒక్కరికి బువ్వ పెట్టిన తెలంగాణ పోరాటపు మట్టి పేగు బండ్రు నర్సమ్మ. లక్షలాది మందికి ప్రేరణ కలిగింప చేసే వక్తేమీకాదు నర్సమ్మ. ఆమె తుపాకులు పట్టుకొని పోరాడిన వనితేమీకాదు.


Narasamma-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaపేరు కోసం ఏనాడు తాపవూతయపడ్డ వ్యక్తి అంతకన్నాకాదు. కానీ తుపాకుల మోతలు మోగిస్తూ అడవి ఉద్యమాన్ని నడిపిస్తున్న ఎందందరో నక్సలైట్ ఉద్యమనేతలకు ఆమె అన్నం పెట్టింది. భర్త బండ్రు నర్సింహులు కూడా ఆ ఇంట్లో అతిథే. ఎందుకంటే ఆమె పెళ్లయిన తర్వాత నర్సింహులు 10 ఏళ్లు జైల్లోనే ఉన్నాడు. నల్లగొండ జిల్లా ఆలేరులో ఊరుబయట (ఇప్పుడు వూరు మధ్యలో) ఒక్క ఇల్లే ఉండేది. ఆ ఇంటి ముందు అమరవీరుల స్మారక స్థూపం ఉంది. ఆ ఇల్లే బండ్రు నర్సమ్మ, నర్సింహులు ఇల్లు. నర్సమ్మకు ఐదుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మొగ పిల్లలు. ఈనాడు తన గజ్జెలతో తన తెలంగాణ ఉద్యమానికి పాటను ప్రాణవాయువుగా చేసుకుని పాడుతున్న విమలక్క నర్సమ్మ సంతానమే. ఇక 90 ఏళ్ల భర్త బండ్రు నర్సింహులు ఆనాటి తెలంగాణ సాయుధ పోరులో నిలిచాడు. ఆతర్వాత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలిపోయిన తర్వాత కొంతకాలం సిపిఎంలో ఆ తర్వాత గత ఐదు దశాబ్దాలుగా విప్లవోద్యమంతో ఉన్నాడు.

భారత విప్లవోద్యమానికి ఎంత చరిత్ర ఉందో అందరికీ బువ్వ పెట్టిన బండ్రు నర్సమ్మ చేతికీ అంతే చరిత్ర ఉంది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో ఆనాటి అగ్రనేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకూ అంద రూ నర్సమ్మ చేతి వంట తిన్నవాళ్లే. పుచ్చల పల్లి సుందరయ్య, తరిమెల నాగిడ్డి, చండ్ర పుల్లాడ్డి, దేవులపల్లి వెంక నీలం రామచంవూదయ్య, పొట్ల రాంనర్సయ్య, పైలా వాసుదేవరావు, చంద్రన్న, దొడ్డానర్సయ్య, ధర్మభిక్షం, భీమిడ్డి నర్సింహాడ్డి, మల్లు వెంకటనర్సింహాడ్డి, స్వరాజ్యం, కూర రాజన్న, మధుసూధన్‌రాజ్ యాదవ్, వీరన్న తదితర పోరాట యోధులందరికీ అన్నం పెట్టిం ది. ఎందరో అజ్ఞాత కమ్యూనిస్టు నేతలకు సద్దికట్టి పంపించేది.

ఎందరో విప్లవ యోధులకు నర్సమ్మ ఇల్లే షల్టర్‌గా ఉండేది. మైదాన ఉద్యమంలో ఉన్న నేతలందరూ ఆ ఇంటికి ఎప్పుడంటే అప్పుడు వెళ్లేవారు. అడవి ఉద్యమానికి మైదాన ఉద్యమానికి సంబంధించిన కీలకమైన సమాచారానికి మధ్య వారధిగా నర్సమ్మ నిలబడింది. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని వారెవరైనా కానీ ‘తిండి తిన్నావా’ అని అడిగిన మహత్తర మాతృమూర్తి ఆమె. ఉద్యమానికి పరోక్ష రూపం నర్సమ్మ. కష్టాలు, నష్టాలు, కోపాలు, తాపాలను సవరించుకుంటూ పోయే గృహిణిగా ఇంటి బాధ్యతలన్నీ నర్సమ్మ చూసేది. దాంతోపాటు విప్లవోద్యమంలో ఒడుదొడుకులన్నింటిని తట్టుకుని నిలబడింది. లెక్కలేనన్ని సార్లు ఆ ఇంటి మీద పోలీసులు దాడులు చేశారు.

పోలీసులకు, పోలీసు ఉన్నతాధికారులకు ఎదురు నిలిచి ఎంతో సమయస్ఫూర్తితో సమాధానం చెప్పేది. విప్లవకారులను,ఉద్యమకారులను పట్టుకోవటం చేతకాక మా ఇంటిమీద పడి వస్తువులను, సామాన్లను ధ్వంసం చేస్తే ఏం లాభం అని పోలీసు ఉన్నతాధికారులను ఎదురు తిరిగి నర్సమ్మ ప్రశ్నించింది. ఎంతో మంది విప్లవయోధులను పోలీసుల కంట పడకుండా కాపాడిన ధీశాలి. పి. వి నర్సింహారావు రాసిన ‘గొల్ల రామవ్వ’ కథలోని రామవ్వ పాత్ర కంటే విభిన్న కోణాల్లో, విప్లవోద్యమంలోని అనేక దశల్లో బండ్రు నర్సమ్మ కనిపిస్తుంది.

1947 నవంబర్ 29న ఆలేరులో రైల్వే గేటు దగ్గర జరిగిన కాల్పుల్లో అమరులైన ఐదుగురు యోధుల అమరవీరుల స్థూపాన్ని నర్సింహులు ఇంటి ముందే నిర్మించారు. ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలోని అగ్రనేతలంతా వచ్చి ఆ స్థూపం దగ్గర ప్రసంగాలు చేసినవారే. అయితే కమ్యూనిస్టు పార్టీ చీలిపోయిన తర్వాత బండ్రు నర్సింహులు సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లాడ్డి నేతృత్వంలో పోరుదారిపట్టారు. 1983 సంవత్సరంలో సిపిఎం జాతీయ నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య ఆలేరులో సిపిఎం సభకు హాజరయ్యారు. బండ్రు నర్సింహులు అప్పుడు జైల్లో ఉన్నాడు. సిపిఎం ఊరేగింపు తన ఇంటి వద్దకు రాగానే నర్సమ్మ ఆ ర్యాలీని అడ్డుకుంది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో ఉన్నప్పుడు ఈ స్థూపం దగ్గర మాట్లాడావు, ఇప్పుడెందుకు మాట్లాడవని సుందరయ్యను నిలదీసిం ది. సుందరయ్య ఆ స్థూపం దగ్గరకు వచ్చి ప్రసంగించి వెళ్లారు. అమరవీరుల స్థూపం దగ్గర ఆ రోజు నివాళులర్పించాలని అనుకున్న నర్సమ్మ చివరకు సుందరయ్యతో మాట్లాడించింది.

అప్పడు సిపిఎం కు నక్సల్స్ పార్టీలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రోజులవి. విప్లవోద్యమ నిర్భందకాలంలో ఆ అమరవీరులకు నివాళులర్పించేందుకు నర్సమ్మ పడ్డ తపన, ఆరాటం ఎంతో గొప్పది. ఈ సంఘటన మచ్చుకు మాత్రమే. దీంతో నర్సమ్మ కు విప్లవోద్యమం పట్ల ఎంత నిబద్ధత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తెలంగాణ నేలలో ఇలాంటి నర్సమ్మలు వేల మంది ఉన్నారు. తెలంగాణ మట్టిలో ఉన్న స్వచ్ఛతకు, త్యాగానికి ఆ అమ్మ నిదర్శనం. 65 సంవత్సరాలపాటు విప్లవోద్యమ స్ఫూర్తితో నిలబడటం, అలుపెరుగకుండా అన్నం పెట్టటం, తన ఇంటిని జమ్మిచెట్టులో భద్రపర్చిన ఆయుధగారం చేసి గుప్తంగా దాచి పెట్టింది.

ఇంటినే కాదు, విప్లవోద్యమాన్ని తన రెక్కలతో కాపాడిన తల్లి కోడి నర్సమ్మ. ఆకలి అని ఆ గడప దగ్గరకు పోయిన వారికి బువ్వ పెట్టి ఆకలి తీర్చిన చెలిమె నర్సమ్మ.
80 ఏళ్ల వయస్సులో కూడా నర్సమ్మ శారీరకంగా, మానసికంగా ఏనాడు కుంగిపోలేదు. వృద్ధాప్యంలో కూడా ఆమె నిటారుగా నిలబడి ఉండేది. ఆమె విప్లవోద్యమ భావజాలపరంగా కూడా ఆమె ఎప్పుడూ కుంగిపోలేదు. ఆమె ఆరిపోని పొయ్యిలాగా మండుతూనే ఉంది. ఉద్యమ చరివూతను తన వంటింట్లో వండి తలాపిడికెడు ముద్దలు చేసి తినిపించింది. చాకలి ఐలమ్మ బువ్వగింజల కోసం పోరాడుతూ నిలిచిన చరిత్రైతే, ఈ బండ్రు నర్సమ్మ భూమి భుక్తి విముక్తి పోరులో పరోక్షంగా నిలబడి బువ్వ పెట్టిన అమ్మ.

40

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.