ఈ మహాకావ్యం పేరు తెలంగాణ


Sat,October 6, 2012 03:37 PM

హద్దులు, లెక్కల పద్దులు లేని వాడే కవి
కవిత్వం విప్పిన సద్దిమూట,
తనను తాను ఆరేసుకున్న ప్రకృతి పైట
కవిత్వం నదుల నోటి నురుగ
దట్టంగా అల్లుకున్న పచ్చటి అడవి కవిత్వం
గుట్టను చీరేసిన దార్లు
ఒక్కసారిగా దర్శనమిచ్చిన
నదుల సంగమపు అందాలు
ఎన్నెన్ని రూపాల అందమది
దేనికదే అందం
ఎటు చూసినా తరగని సౌందర్యాలు
అది సొట్టబుగ్గల అందం కావొచ్చు
నది ముడతల మధ్య
సోయగాల సొంపులు కావొచ్చు
అక్కడ రాళ్లన్నీ శిల్పుల చేతిలో చెక్కినట్లున్నయ్
ఆ అందం చూస్తూ కరిగిపోయాను
ఈ అందమంతా
ఏ కాలంనాటి ప్రళయమో కదా
ప్రళయం ఎంత అందమైంది
పురోగతికి పుట్టుక ప్రళయమే
నేను యాడనో పచ్చదనం మీద
మెరవాల్సిన నీటిబొట్టును
కరుకునేల మీద
కమ్ముకోవాల్సిన మేఘాన్ని
భవబంధాలు లేని ప్రకృతి వొళ్లోకి వొదిగి
తనివితీరని దారుల్లో తిరగగాల్సిన కవిని కదా!
సమస్తాన్ని
నాలోకి నింపుకుని వెదజల్లబడతాను
నెర్రెలు బారిన నేలపై కురిసే వర్షాన్ని
మట్టి వాసనల సుగంధాన్ని కదా!
కవిత్వానికి జెండాలెవ్వు
కవి కర్రకాదు, కట్టేస్తే కట్టుబడేవాడు కాదు
కవిత్వం వడిసెల రాయి, అదొక తీతువు పిట్ట
తేలి, మునిగి,
సొరంగంలోకి సొరేసి, అలసి, సొలసిపోయి
ఆ అందాల మందారాల విరగపూతల తోపుల్లో
వర్ణించలేని అందాలతో
చెప్పనలవికాని లోతుల్లో, ఎత్తుల్లో
ప్రకృతి అక్షర రూపం కవిత్వం
తాత్తికతకు నేనే భాష్యం
మట్టి రహస్యాల గని కవిత్వం
పదాల అడుగులు
సప్త స్వరాలు అక్షర సంగీత నాదాలు
పురివిప్పిన నెమలి నాట్యం
నిక్కరించిన చెవులు,
మెరుస్తున్న ఆ మూగజీవాల కళ్లు
ఆ పక్షుల రెక్కల శబ్దం ఈ ప్రపంచం
నిద్రనులేపి ప్రకృతి ఒళ్లో
పరవశించి కన్నుమూయటమే కవిత్వం.

ఈ కవిప్పుడు
తన నేలపాట పాడుతున్నాడు
మట్టిపాట పాడి, మట్టికి అక్షర రూపమిచ్చి
కవి అంతమౌతాడు.
నేలను చెరబట్టిన వాళ్లను
సెరపెట్టిన వాళ్లపైన్నే కవితాగ్రహం
జెండాలు ఎజెండాలు లేని వాడే కవి
కన్నీళ్ల వెనుక ఉన్న
ముళ్ల సూత్రాల్ని విప్పటం కవిత్వం
జెండాలు వద్దన్న నేను జెండానైతున్నానేంది!
తుపాకుల వనం చుట్టూ తిరగాల్సిన వాణ్ణి
బ్యాలెట్ యుద్ధగీతాన్ని అల్లుతున్నానేంది?
మీరంతా మనుషులు కండిరా
అని శపించిన నేను
ఇప్పుడు..
నువ్వూ నేనూ ఒకటి కాదంటున్నానేంది?
గడ్డకట్టిన ఈ నెత్తుటి నేల మీద నిలబడితే
నిజం గొంతు విప్పుకుంటుంది
ఒక పక్క గుక్కపట్టిన ఏడుపు
మరోపక్క సుఖాల కులుకు
అధిపత్యాన్ని అడ్డంగా నరుకుతున్న కవిని
అణిచివేతను చీరేస్తూ అక్షరశాపం పెడ్తున్నా

ఎవ్వర్రా నన్ను ఎడారిని చేసేంది?
ఎవడ్రా నన్నిక్కడ దుఃఖపుటేరు చేసింది?
సోమశిల శివునిపై ఆన..
ఈ నదుల సంగమం సాక్షిగా..
పచ్చిగా చెబుతున్నా
నా నేల మీద ఎవడాధిపత్యం చెలాయించినా
తిప్పికొట్టే అక్షరాయుధాన్నే
నేను పచ్చిగా నేలపాటగాణ్ణే..
నేను మట్టి కవినే..
నా నేల విముక్తి అయ్యేంతవరకు
అక్షరాలను ఆయుధాలుగా పరిచి ఉంచుతా
కవి సచ్చినా బతికినా మట్టి కోసమే
మట్టి మీద మహానిర్మాణాల కోసమే
ఈ అక్షర మట్టి ముద్దల చేతులతోనేగా
సమస్తం పెరిగి పెద్దయ్యింది..
తన నేలమీద తానుపాడే పాటే ప్రపంచగీతం
తెలంగాణ అన్న పదమే మహాకావ్యం.

-జూలూరు గౌరీశంకర్
(తెలంగాణవాదం గెలుపును కోరుతూ, తెలంగాణ కోసం పదవులను గడ్డిపరకల్లా విసిరిన వారినే గెలిపించాలని ఉప ఎన్నికల్లో కొల్లాపూర్,నాగర్ కర్నూల్ నియోజక వర్గాల్లో తిరిగి వచ్చాక..)

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.