నివురుగప్పిన నిప్పులు


Sat,October 6, 2012 03:37 PM

osman talangana patrika telangana culture telangana politics telangana cinemaఒక భావజాలంతో కలిసి నడిచిన మిత్రులు ఏక కంఠమై నినదించిన మిత్రు లు, ఒకే లక్ష్యంతో ఏకమైన పిడికిళ్లు, కలిసి పనిచేసి అలసిపోయిన మిత్రులు, అందనంత దూరాలకు వెళ్లిన సహచరులు, జీవితదారు ల్లో చీలిపోయిన వాళ్లు.. వివిధ వృత్తుల్లో ఉన్నత స్థానాలకు ఎదిగిన మిత్రులు, ఇంకా పోరుదారుల్లో కాగడాగా వెలుగుతున్న వాళ్లు, జీవితంలో రకరకాలుగా స్థిరపడిన మిత్రులందరూ ఓ ఇరవై ఐదు ముప్పయేళ్ల తర్వాత కలుసుకుంటే.. ఉండే అనుభూతులు మాటల్లో చెప్పలేం. రాసేందుకు అక్షరాలు చాలవు. మళ్లీ గతంలోకి వెళ్లిపోయి నూనూగు మీసాల పిల్లల్లాగా, కాలేజీ ప్రాంగణాలను మా అడుగుల సవ్వళ్లతో విరబూయించటం గుర్తుకు వస్తుంది. ఒకే భావజాలంలో నడిచిన వాళ్లు చాలా కాలం తర్వాత ఎదురుపడితే వాటిని నెమరు వేసుకునే సందర్భం అపురూపంగా ఉంటుంది.

ఎవవరో? ఎక్కడెక్కడివారో? ఏ తల్లికన్నబిడ్డలో? ఎవరికులం ఏమిటో తెలియదు కాక తెలియదు. ఆ కలియిక ఒక స్వచ్ఛమైనది. ఆ కలయిక ఆ కాలానికి ఒక అనివార్యత, ఒక అవసరం. కలవడానికి విడిపోవడానికి కారణాలు అనేకం ఉండవచ్చును. మనిషి ఒక ఆలోచనతో కలిస్తే ఆ ఆశయం సిద్ధించేవరకు నిలబడాలన్న విష యం తెలియదు. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, మావో, మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, సావివూతీబాయి పూలేలు తెలియదు. మా వూరు, మా వూరు పక్కన వాగు వంకలు, మా వూళ్లో ఉండే గుట్టలు, పొంగిపొరలే చెరువు, ఆ చెరువు నురగలు కక్కుతూ పారే అలుగులు, ఆ అలుగుల మీద నీటికి ఎదురీదుతూ మెరుస్తూ ఎగిసెగిసి పడుతున్న తెల్లటి చందమామ చేపలు, మా నడిగూడెం నుంచి నడుచుకుంటూ మా నాయన నేర్పిన సాహిత్యపాఠాల్ని గుండెల నిండా దాచుకుంటూ, మా వూరి మట్టి వాసనలను పీల్చుకుంటూ, పదవ తరగతి తర్వాత కోదాడకు చేరుకున్నాం. మా మిత్రులు గింజల రమణాడ్డి నేను ఒక్కరూమ్ లోనే ఉన్నాం. ఒక్క తరగతి గదికే వెళ్లాం. ఎర్రసెలకల మట్టి పాదాల దర్శనం దగ్గర నుంచి వికాసాన్ని చూసి, విశ్వదర్శనం చేయించే కళాశాల ప్రాంగణంలోకి అడుగుపెట్టాం.

ముప్పయేళ్ల క్రితం డిగ్రీ కాలేజీలో సదువుకోవటమంటే మామూలు విషయం కాదు. ఆ కాలేజీలో చదువుకుంటూ అమ్మనాన్నల్ని వదిలిపెట్టి ఒక రూంలో మిత్రులతో కలిసుండటం కూడా అదే మొదలు. ఆ రూములో కలిసిన మిత్రులందరూ ఒక తరగతి కావటం, ఒక గుంపుకావడం, ఆ గుంపు ఒక ఆనందంతో కలిసి అడుగులు వేయటం అపూర్వ సందర్భం.

అందరం కలిసి చదువుకుంటూ అడుగులు వేస్తున్నాం. అంతా సాదాసీదాగా సాగిపోతున్నది. యవ్వన శైశవ దశల మధ్యలోంచి లేస్తున్న ఆలోచనల మంటలు ఎట్లుంటయో ఎవరు చెపుతారు. ఆ కాలేజీ ప్రాంగణంలో అనుకోకుండా ఒక మెరుపు మెరిసింది. ఒక ‘వసంత మేఘగర్జన’ వినిపించింది. ఆ మెరుపు, ఆ గర్జన పాటగా ఆ చల్లని గాలి నుంచి వచ్చి మమ్మల్ని చుట్టుముట్టింది. ఆ పాట మా మనోఫలకంపై ఎలా ముద్ర వేసిందంటే దాన్ని ఇప్పటికిప్పుడు చెప్పటం అసాధ్యం. పాటలు మైమరపించే రహదారులు. పాటకు పరవశింప చేసి తనలోకంలోకి తీసుకెళ్లి ఈ సమాజాన్నే ఒక చంటిపాపగా చేసి నవ్వించగల శక్తి, కేరింతలు కొట్టించగల శక్తి దానికుంది. మేమంతా ఆ ‘వసంత మేఘగర్జన’ నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనల ధార నుంచి, ఆ పాటలను ఆస్వాదిస్తూ ఆటువైపుగా అడగులు వేశాం. ఆ అడుగులే మమ్ములందర్నీ ఒక్కటి చేసింది. అది కులమత భేదాలు లేకుండా కలిసుండటానికి హేతువైంది. అట్లా కలిసిన మేమంతా పోటు రంగారావుతో కలిసి గోడ రాతలయ్యాం.

మా కానూరి అరుణోదయ రామారావు, విమల, నాగ న్న, జానయ్యలతో కలిసి సామూహిక పాటయ్యాం. పోరు దారికి వెళ్లే మార్గాల ను చూసి ఆ దార్లులో ‘గ్రామాలకు తరలండి’ అన్న కార్యక్షికమమయ్యాం. గ్రామా లు తిరుగుతుంటే కలిగిన అనుభూతులు, అనుభవాలు మా జీవితాలకు వెలుగు బాటలయ్యాయి.

మట్టి పాదాలు దర్శించుకుంటూ ఆ వూళ్లల్లో మట్టిని వంటికి రాసుకుంటూ, ఆ గ్రామ చావడిలో మేమందరం కలిసి కంజర్‌పై వేళ్లుగా మారాం. మా కంఠాలను విప్పి చేసిన గానం వూరంతటిని మేల్కొలిపింది. ఆ వూరు కన్నీళ్లను మా చేతుల తో తుడిచి, ఆ వూరు పెట్టిన పిడికెడు బువ్వను తిని, భవిష్యత్తంతా పోరాడేతేనే విముక్తి అని చెప్పే విముక్తి గీతంగా మారిపోయాం. యవ్యనం పొద్దు పొడుస్తున్నప్పుడు మార్క్స్‌లు, లెనిన్‌లు, మావోలు, అంబేద్కర్, పూలే ప్రవేశిస్తే ఎలా ఉంటా మో అందుకు నిదర్శనంగా మారిపోయాం. అది ఏవూరైనా కానీ అక్కడ అన్యా యం చేసేవాణ్ని నిలదీశాం. ‘సుగుణవంతమైనదే జ్ఞానమ’ని సోక్రటీస్ చెప్పినట్టు గా కళాశాలల్లో నేర్చుకున్న చదువును గ్రామవాకిళ్ల మట్టిపాదాల దగ్గరకు చేర్చి దోపిడీ గుట్టు విప్పి చెప్పే సాధకులమయ్యాం. కళాశాల ప్రాంగణాల్లో ఆధ్యాపకు లు చెబుతున్న పాఠాల్ని గ్రామాల్లోని రచ్చబండల ఆకురాళ్లపై రుద్ది చూశాం.

అప్పు డు మాకు పాఠాలు జీవితాలుగా మారిపోయాయి. జీవితంలో ఎటు నడవాలో మార్గం చూపాయి. ఆ మార్గంలో నడవటం అంత సులువైనది కాకపోయినా కొంతకాలం కష్టంగానే నడవగలిగాం. ఆ దూర ప్రయాణంలో కొందరు అలిసిపోయారు. కొందరు కనిపించకుండా పోయారు. కొందరు ఎన్‌కౌంటర్ అయ్యారు. కొందరు జైళ్లల్లో ఖైదీలుగా ఉన్నారు. కొందరి తలలకు ప్రభుత్వం వెలలు ప్రకటించింది. కొందరు నిత్య నిర్బంధాన్ని ఈదుకుంటూ పులులై గర్జిస్తూనే ఉన్నారు. కొందరు సాదాసీదా బతుకుబండిని నడుపుకుంటూపోతున్నారు. కొందరు ఉద్యోగాల ఛట్రంలో ఇరికిపోయారు. ఇంకొందరు అనివార్యంగా అభివృద్ధి రంగంలో కి అడుగులు పెట్టారు. కొందరు తెలంగాణ తల్లి విముక్తి కోసం ఉద్యమ నాయకులుగా, జేఏసీ జెండాలుగా మారారు. ఈ దేశ విముక్తి కోసం మార్క్స్, లెనిన్, మావోలే కాదు అంబేద్కర్ అవసరం ఎంతో వుందని దళిత ఉద్యమ జెండాలై రెపపలాడు తున్నారు.

జీవిత కాలంలో సగం గడిచిపోయిన తర్వాత, తిరిగి జయించిన గత కాలపు అంచుల మీంచి ఇప్పుడు నడువగలమా? ఇప్పుడు అడుగులు వేయగలమా? ఇప్పుడు ఆ స్ఫూర్తితో నడిచే శక్తిని మళ్లీ కూడగట్టుకోగలమా? మన రంగాలలోనే ఉండి ఆ పోరు స్ఫూర్తిని రగిలించగలమా? ఏమో! తెలియదు. కానీ ముఫ్పై ఏళ్ల నాడు మా గుండెల నిండా నిండుకున్న ఆ స్ఫూర్తి మాత్రం చల్లారలేదు. అది నిక్షిప్తమై నివురుగప్పిన నిప్పులాగా ఉంది. అది మనసుకు అంటింది. అది హృదయానికి తాకింది. గుండెల నిండా నిండిపోయింది. అందుకేననుకుంటా! ఈ పేగుబంధమే మళ్లీ మమ్ములందర్నీ ఇన్నేళ్ల తర్వాత కలిపింది. అప్పటి రూపాలు ఇప్పుడు లేవు. నాటి యవ్వనతేజం కనిపించటం లేదు. నాటి కట్టలు తెంచుకునే ఆవేశం ఇప్పుడు లేదు.

జీవితంలో సగ భాగం పూర్తయ్యాక కూడా అంతర్గతంగా అంతరాంతరాల్లో ఎక్కడో ఏ మూలనో దాగున్న ఆ ఆలోచనల దావాగ్ని మళ్లీ ఇపుడు కదిలించినా భగ్గుమనేటట్టు ఉంది. మళ్లీ గోదావరిలో య ప్రతిఘటనా స్వరమై కొత్తపాట నల్లుకుని ఆలపించేందుకు సిద్ధంగా ఉంది.
చండ్ర పుల్లాడ్డి, తరమెల నాగిడ్డి, పైలా వాసుదేవరావులు నూరిపోసిన భావజాలం అట్లనే నిక్షిప్తంగా ఉన్నది. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మల స్ఫూర్తి పోడు భూముల నుంచి దండకారణ్యం దాకా సజీవంగానే ఉంది. మళ్లీ కళాశాల మైదానాల్లో జై తెలంగాణ అంటూ నినదిస్తున్న నినాదాల మధ్య లో అంతర్గతంగా బిగియించిన పిడికిలి భావజాలం ఉంది. అట్టడుగు వర్గాల సమూహాల ఆలోచనలను మూటగట్టుకున్న మారోజు వీరన్న వారసత్వం ఉంది.

మార్కెటీకరణ చెందుతున్న ఈ ప్రపంచంలో మల్లోజుల పోరు బాట కూడా ఎంతో బలంగా ఉంది. మార్కెట్ సమాజానికి విరుగుళ్లుగా, రాకాసిపాలనకు వ్యతిరేకంగా పోరాడి నేలకొరిగిన జార్జిరెడ్డి, జంపాల, శ్రీపాద శ్రీహరులు, రిక్కల సహదేవడ్డిలు పుడుతూనే ఉంటా రు. తన నేలమీద తననే పరాయిని చేస్తే తననేలపై ఆధిపత్యం చెలాయిస్తే అస్తిత్వ గొంతుతో శ్రీకాంతాచారి, యాదయ్యలుగా, ఎగిసిపడ్డ మంటలౌతారు. కాలమేదైనా, సమయమేదైనా, సందర్భమేదైనా ఆ కళాశాల మైదానాలు నాటిన జ్ఞాన మొక్కల నీడల్లోనే ఇప్పటి దాకా సేద తీరుతున్నాం. దప్పికను తీర్చి మమ్మల్ని మనుషులుగా తీర్చిదిద్దిన భావజాల ఉద్యమ నది అది. గోదావరిలోయ పోరుకేక అది. జగిత్యాల జాతర అది. సమ్మక్క, సారలమ్మల పౌరుష వారసత్వమది.

జీవితంలో ఒకసారి మొదలైన పోరాట పాఠాల సంఘర్షణ తుదికంటా కొనసాగుతుంది. నాడు యువతరంపై వెదజల్లిన విత్తనాలు చాలా శక్తివంతమైనవి. అవి బండరాళ్ల మధ్య నుంచి మొలిచినవి. ఆ భావజాలం ఏ రంగంలో ఉన్నా తొలుస్తూ ఉంటుంది. అది నిత్య చైతన్యానికి, ఇంకా మనలో కదలిక వుందని చెప్పటానికి నిదర్శనం. మనలో చైతన్య భావధారల కదలికలు లేకపోతే మనం ఉన్నా, లేనట్లే. నాటి మిత్రలందరిలో ఆ సోయి ఇంకా బతికే ఉంది. అందుకే ఇప్పటి సమాజం ఇంతటి సమర శీలంగా ఉంది.
- జూలూరు గౌరీశంకర్
( ముఫ్పై ఏళ్ల తర్వాత పిడిఎస్‌యు ఉద్యమంలో
పనిచేసిన మిత్రులు ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో కలిసి సందర్బంగా....)

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Published: Fri,June 14, 2013 12:20 AM

ఆకాంక్ష పట్టని అసెంబ్లీ

ప్రజాస్వామ్యానికి ప్రతి రూపం, ప్రజలందరి సామూహిక ముక్తకంఠం అసెంబ్లీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనంకోసం కదిలిపోయి, మంది కోసం పనిచేస

Published: Mon,June 10, 2013 12:00 AM

అసెంబ్లీని ముట్టడించనున్న ప్రజాకాంక్ష

ఏ ఉద్యమ పిలుపుకైనా తరలివచ్చే ప్రజలున్నారు. ఎంతటి నిర్బంధాన్నైనా ఎదుర్కొనగల శక్తి సామర్ధ్యాలున్న ప్రజలున్నారు. రాజ్యం వికృత చేష్ట

Published: Mon,June 3, 2013 04:29 AM

పచ్చని పల్లెటూరి పాట వెంకన్న

నిబద్ధత ఉన్న సాహిత్యం కొండమప్లూల్లాగా, బతుకమ్మలో పేర్చిన జీవమున్న పూలలాగా, పచ్చని అడవిలాగా ఉంటుంది. ప్లాస్టిక్ పూలలాంటి కవులు, బ

Published: Sun,February 10, 2013 12:17 AM

పోరు అక్షరాభ్యాసం

చుక్కా రామయ్య లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. రామయ్యలాంటి వ్యక్తులను ఒక వ్యవస్థకే నమూనాగా చెప్పవచ్చును. కళ్లముందు అన్యాయం జరుగుత

Published: Sat,January 19, 2013 11:53 PM

తెలంగాణ సాహిత్య యుద్ధభేరి

కవులూ,రచయితలూ కాలంవెంట నడుచుకుంటూ పోరని, కాలాన్నే తమ వెంట నడిపించుకుంటూ పోతారని తెలంగాణ కవులూ, రచయితలూ మరోసారి నిరూపించారు. ప్రజల

Published: Wed,December 26, 2012 11:44 PM

ఎందుకు బహిష్కరిస్తున్నామంటే..

రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి అన్ని అధికారాలను ప్రయోగించి రాజమువూదలతో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించేందు

Published: Sat,November 24, 2012 11:37 PM

సమరాలను అల్లే సూర్యాపేట సమరభేరి

ఒక సమూహం ఎక్కడైనా జమైందంటే.. ఆ నేలే పరవశం కలిగిస్తుంది. చీమల దండ్లుగా జనం కదలాడటం లాగా ఆశయాలుంటాయి. ఆశయాల ఆకాంక్షలు ఎలా జమిలిగా క

Published: Fri,December 14, 2012 04:07 PM

సమాజ నిర్మాణాలు-విలువలు-కాళోజీలు

కాళోజీ అంటే విలువలతో జీవించి జీవితాంతం నిబద్ధతతో నిలబడ్డ వ్యక్తి. ఆ తరానికే కాదు ఈతరానికి కూడా కాళోజీ ప్రతీక. ఆయన ఆ కాలానికి, ఆ త

Published: Sat,December 1, 2012 04:45 PM

సమాజాన్ని నడిపేవి త్యాగాలు, భావజాలాలే

ఒక తరంలో ప్రగతిశీల భావజాలాల విత్తనాలను నాటడం అంతసులభమైన పనేమీ కాదు. ఆ విత్తనాలను నాటడానికి నేలను పదును చేసి, దుక్కిదున్ని, వాతావరణ

Published: Sat,October 27, 2012 05:31 PM

సిరా చుక్కల సమరం

కలం సృష్టించిన జ్ఞానమే కాలం. అక్షరమే కాలాన్ని కలకాలం నిలుపుతుంది. కలం సర్వకాలాలకు కన్నులుగా, సమాజాలకు కాళ్ల చేతులుగా, ఏ వ్యవస్థలకై

Published: Wed,October 10, 2012 06:50 PM

జీవ వైవిధ్యం- జీవన విధ్వంసం

అక్టోబర్ 1 నుంచి 19 వరకు జరుగుతున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుపై ఉన్న శ్రద్ధ, గత అరవై ఏళ్లుగా రాష్ట్రం కావాలని నాలుగున్నర కోట్ల

Published: Wed,October 10, 2012 07:06 PM

పాటను బంధించలేరు

ఆకంఠ స్వరం వింటుంటే చెట్ల సామూహిక తలలపైన పక్షుల గుంపులు ఎగు రు తున్నట్లుంది. దట్టమైన అడవి అందాలు కళ్ళ ముందు కదలాడుతుంటాయి. ఆమె గొం

Published: Thu,October 11, 2012 06:03 PM

కాళన్న దారిలో కదం తొక్కుదాం

భోగోళం మీద ఎప్పుడెనా, ఎక్కడెనా ఆధిపత్యాన్ని అడ్డంగా నరికేసే ధిక్కార స్వరా లు కలాల కంఠాలే. తిరుగుబాట్లన్నీ సృజనకారుల ఆలోచనల్లోనే పొ

Published: Sat,October 6, 2012 03:26 PM

సాహిత్య సాంస్కృతిక సైన్యం ‘తెరవే’

సంఘాలకు, వేదికలకు సాహిత్య సృష్టికి సంబంధం ఉందా? సాహిత్యం సృజనకు సంబంధించినది. సంఘం అన్నది నియమ నిబంధనలకు, లక్ష్యాలకు సంబంధించింది.

Published: Sat,October 6, 2012 03:27 PM

తొలుస్తున జ్ఞాపకాలు

ఒక కాలం ఎప్పుడూ మరో కాలానికి పాఠం చెబుతూనే ఉంటుంది. ఇలా కాలానికి కాలం పాఠం చెప్పటమే పరిణామక్షికమం అనుకుంటా. ఒక కాలం ఇచ్చిన స్ఫూర్త

Published: Sat,October 6, 2012 03:27 PM

వెలిదండ: తల్లి పేగు బంధం

పుట్టిన ఊర్లను ఎలా మరిచిపోలేమో అలాగే మనలో చైతన్యాన్ని రగిలించిన ఊర్లను కూడా మరిచిపోలేం.ఎప్పుడైనా పుస్తకా లు మనలోని సృజనను తట్టిలేప

Published: Sat,October 6, 2012 03:28 PM

ఈ గర్భశోకాలకు కారణమెవ్వరు తల్లీ..!

‘తెలంగాణ ’ ఒక శక్తి సూత్రం ‘తెలంగాణ ఒక చలనం, ఒక ప్రళయం ప్రజలంటే ఆత్మాభిమాన జెండాలు పోరుదారులు తెలంగాణను ఎవరూ కాలరాయలేరు ఈ పో

Published: Sat,October 6, 2012 03:37 PM

ఈ మహాకావ్యం పేరు తెలంగాణ

హద్దులు, లెక్కల పద్దులు లేని వాడే కవి కవిత్వం విప్పిన సద్దిమూట, తనను తాను ఆరేసుకున్న ప్రకృతి పైట కవిత్వం నదుల నోటి ను

Published: Sat,October 6, 2012 03:39 PM

ఓరుగల్లు పోరు క్షేత్రం

తెలంగాణలో నిత్య నిర్బంధం కొనసాగుతున్న దశలో నక్సలైట్లు సభలు జరిపితే ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. పోలీసుశాఖవారు ఆ సభలకు వెళ్లవద్దని

Published: Sat,October 6, 2012 03:39 PM

ఉద్యమ నిర్వచనం మారుతున్నవేళ.

ఉద్యమం అంటే రాజకీయంగా ఒకరికొకరు విమర్శలతో విరుచుకుపడటం కాదు. ఉద్యమమంటే ఉరితాళ్ళు తీసుకొని సవాళ్లు, ప్రతిసవాళ్లతో గన్‌పార్క్‌లోని

Published: Sat,October 6, 2012 03:40 PM

శ్రీ కృష్ణకు , సుదర్శనుడికి ఎంత తేడా!

డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందన్న హోంమంత్రి చిదంబరం నోటితోనే..,డిసెంబర్ 23 న ఇరు ప్రాంతాల అభివూపాయం తీసుకున్నాకే

Published: Sat,October 6, 2012 03:44 PM

విరామమెరుగని పోరు

మలిదశ తెలంగాణ పోరులో ప్రజలు అత్యంత చారివూతాత్మకమైన పాత్ర పోషిస్తున్నారు. ఏ పోరాటంలోనైనా ఇంతకంటే తెగించి పోరాడుతున్న ప్రజలుంటారా? త

Published: Sat,October 6, 2012 03:44 PM

సకల జనాగ్రహం

ప్రశ్నలు.. సంఘర్షణలు.. వాదోపవాదా లు.. ఒత్తిడులు.. ఒడిదొడుకులు..లాఠీలు.. తూ టాలు.. ఆత్మ బలిదానాలు.. రాజకీయాలు, రాజకీయక్రీడలు, ఎత్త

Published: Sat,October 6, 2012 03:43 PM

ఒకే మాట, ఒకే బాట

కేంద్రాన్ని, ఆంధ్రా ఆధిపత్య శక్తులను ఒక పక్క ఎదుర్కొంటూనే మరో పక్క తెలంగాణలో భిన్న రాజకీయ చైతన్యాల మధ్య తెలంగాణ రాష్ట్ర అంశంపై ఏక

Published: Sat,October 6, 2012 03:43 PM

ఉద్యమాలకు అన్నం పెట్టిన అవ్వ

-జూలూరు గౌరీశంకర్ తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి అడవి ఉద్యమానికి మైదాన ఉద్యమానికి సంబంధించిన కీలకమైన సమాచారానికి మధ్య

Published: Sat,October 6, 2012 03:42 PM

మన సాంస్కక్షుతిక ఉద్యమ తల్లిపేగు జయశంకర్

-ఆయన తెలంగాణ గుండె చప్పుడు. ఆయన తెలంగాణ సాంస్కృతిక పేగుబంధం. అయనను తెలంగాణ పదబంధాల నుంచి విడదీసి చూడలేం. ప్రొఫెసర్ కొత్తపల్లి

Published: Sat,October 6, 2012 03:41 PM

తెలంగాణ కలాల కోలాటం.. తెరవే

కడుపులో పిండం పెరిగి పెద్దయి, కడుపులో తండ్లాడి, మాతృగర్భం చీల్చుకుని శిశువు పెట్టిన కేక ఒక జననం. కాలం జీవించటానికి, కదలటానికి, ముం