ఓరుగల్లు పోరు క్షేత్రం


Sat,October 6, 2012 03:39 PM

తెలంగాణలో నిత్య నిర్బంధం కొనసాగుతున్న దశలో నక్సలైట్లు సభలు జరిపితే ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. పోలీసుశాఖవారు ఆ సభలకు వెళ్లవద్దని హెచ్చరికలు చేసేవారు. నక్సల్స్ సభలు జరిపే ప్రదేశానికి ముందుగానే జనం తరలిరాకుండా సభకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను అడ్డుకునేవారు. ఆ పోలీసు చెకింగ్‌లు, నిర్బంధాలు దాటుకుంటూ ఎంత మంది జనం వస్తే పోలీసులు కూడా అంతేమంది వచ్చి పహారా కాసేవారు. మొత్తం మీద నక్సలైట్ల సభ విజయవంతమయ్యేది. డ్యూటీ ప్రకారం పోలీసులు ఆ సభలకు వచ్చి మన గద్దరన్న పాడే పాటలకు పరవశించిపోయేవారు. ‘మాలోని మనిషివే మా మనిషివే నువ్వు పొట్టకూటికి నువ్వు పోలీసువయ్యావు’ అన్న పాట పాడుతుంటే ఇనుప టోపీల మీద దరువు వేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మొన్న చంద్రబాబు ‘రైతు పోరుబాట’ పాలకుర్తిలో జరిగింది. ఈ సభ తీరును పర్యవేక్షించడానికి, స్థితిగతులను అంచనా వేయడానికి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సారథ్యంలో జీవన్‌కుమార్ (మానవ హక్కుల వేదిక అధ్యక్షులు) జూలూరు గౌరీశంకర్ (తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి) పల్లె రవికుమార్, రాజేష్ (తెలంగాణ జర్నలిస్టుల ఫోరం), నల్ల పు ప్రహ్లాద్, జ్యోతికిరణ్ (తెలంగాణ న్యాయవాదుల జేఏసీ), వి. రఘునాథ్ (ఆంవూధవూపదేశ్ పౌరహక్కుల సంఘం) తదితరు లం కలిసి వెళ్లాం. అక్కడ చూశాక తెలంగాణ జిల్లాల్లో నక్సలైట్ల బహిరంగ సభలు జరిగిన తీరు గుర్తుకు వచ్చాయి. రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నక్సలైట్లు సభకు రాకుండా అక్కడ నిషేధాజ్ఞలైతే, ఇక్కడ చంద్రబాబు సభకు ప్రజలను తరలించుకరావడానికి పోలీసులు అండగా నిలిచారు. సభలకు ప్రజలు రాకుండా చేయడానికి క్రూరమైన విధానాలు చేసిన పోలీసులు, ప్రజలను రప్పించడానికి కూడా వాళ్లే వాహకులుగా పని చేశారు. వరంగల్ ఎస్పీ ప్రస్తు త పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని చెప్పినప్పటికీ చంద్రబాబు రైతుపోరు బాట సభను నిర్వహించారు. హైదరాబాద్‌లోని తార్నాక నుంచి వరంగల్ జిల్లా పాలకుర్తి వరకు భారీగా పోలీసులు మోహరించారు. వేలాదిమంది పోలీసులు దారిపొడుగునా పహారా కాశారు. మఫ్టీ పోలీసులు, డ్రస్‌లోని పోలీసులు, చంద్రబాబు ప్రైవేట్ పచ్చచొక్కాల దండులతో రోడ్లన్నీ నిండిపోయాయి. చంద్రబాబు సభ విజయవంతమయ్యిందని చెప్పుకునే దానికన్నా, నిరసనల హోరే ఎక్కువ వెల్లు పాలకుర్తి తన పోరు వారసత్వాన్ని నిరూపించింది.

పాలకుర్తి సభకు జనం రారని ఎవరూ ఊహించలేదు. వచ్చిన సంఖ్య తక్కువ నా? ఎక్కువనా? అన్నది వేరే విషయం. తెలుగుదేశం పార్టీకి 25 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. తొమ్మిదేళ్లు ముఖ్యమంవూతిగా, కేంద్రంలో చక్రం తిప్పడంలోను, కాంగ్రెస్ వ్యతిరేక ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ల నిర్మాణంలోను చంద్రబాబు పాత్ర తక్కువేమీ కాదు. అలాంటి అపర చాణక్యుడి తెలుగుదేశం రథం కొన్నేళ్లుగా తెలంగాణలో కదలకుండా ఆగిపోయింది. టీడీపీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆ పార్టీకి తెలుగునాట అన్ని ప్రాంతాల్లో కార్యకర్తలున్నారు. టీడీపీ, కాంగ్రెస్ అనే రెండు గుంపులులేని ఊరు ఉండదు. అట్లాంటి టీడీపీ ‘తెలంగాణ రాష్ట్ర’ సాధన ఉద్యమం మొదలయ్యాక తెలంగాణలో అడుగుతీసి అడుగు వేయలేపోయింది. అందుకు కారణం చంద్రబాబునాయుడి రెండు కళ్ల సిద్ధాంతమే. రెండు ప్రాంతా ల్లో రెండు కమిటీలను వేయించి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఇటు తెలంగాణ టీడీపీ, అటు సీమాంధ్ర టీడీపీలనే రెండు షోలను వేయించారు. తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా చేయడంలో చంద్రబాబు తెర కీలకపాత్ర పోషించారని తెలంగాణ ఆలోచనాపరులంతా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నేల మీదకు ఏ రకంగా అడుగుపెట్టాలన్న విషయంలో టీడీపీ కొన్నేళ్లుగా బాగా కసరత్తు చేసింది. దీని నుంచే ‘రైతు పోరు బాట’ను రూపొందించారు. తమ ఎమ్మెల్యేలు, తమ క్యాడర్‌తోనే జన సమీకరణ చేసుకోవడం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో టీడీపీకి సవాల్‌గా మారింది. ఆ సవాళ్ల నేపథ్యంలోనే పాలకుర్తి బహిరంగ సభను టీడీపీ నేతలు ఒక ప్రతిష్ఠగా భావించారు.

ఈ సభపై పలురకాల విశ్లేషణలు వస్తున్నాయి. బాబు సభ విజయవంతమైంది. ఇక తెలంగాణ ఉద్యమం సన్నగిల్లిన కొందరు తమ విశ్లేషణలతో ఊగిపోతున్నారు. కొందరు ఆ సభకు అన్ని ప్రాంతాల నుంచి జనాన్ని ఒక పథకం ప్రకారం తరలించారని అంటున్నారు. కానీ చంద్రబాబు సభకంటే నిరసనకారులే ఎక్కువ సంఖ్యలో వస్తారని ఊహించారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పాలకుర్తి సమీప ప్రాంతాలలోని చురుకైన తెలంగాణవాదులందరినీ నాలుగైదు రోజుల ముందుగానే వేలాది మందిని అరెస్టు చేసి నిర్బంధించారు. ఇప్పటికీ చంద్రబాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరితో లేరన్నది నిజం. అది ఆయ న మాటల్లోనే తేటతెల్లమయ్యింది. ఉద్యమం పతాకస్థాయికి వచ్చిన సందర్భంలో చంద్రబాబు సభ విజయవంతం కావడం ఆశ్చర్యమేమీ కాదు. తెలంగాణ ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. కానీ టీడీపీనో, తెలంగాణను సమర్థించని కమ్యూనిస్టు పార్టీలను నామరూపాలు లేకుండా చేయాలని కోరుకోవడం లేదు. తెలంగాణకు ఐదున్నర దశాబ్దాలుగా ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు చేయని ప్రయ త్నం లేదు. ఎవన్ని నాటకాలాడినా, కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు మాత్రం ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నారు. ఉద్యమాన్ని హింసాత్మకంవైపు మళ్లించి అణచివేయాలని సీమాంధ్ర పాలకులు చేయని ప్రయత్నం లేదు. అయినా తెలంగాణ ప్రజలు 700 మంది బిడ్డల్ని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంతో తెలంగాణ కావాలని అడుగుతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నంలో మనీ, మాఫియాతో పాటుగా మీడియా పాత్ర కూడా కీలకమైనది. సకల జనుల సమ్మె లాంటి మహత్తర ఉద్యమాలు తిరిగి రాకుండా చేయాలంటే ఉద్యమాన్ని అస్థిరపరచాలి, గందరగోళపరచాలి. ఈ విషయంలో అధికారపార్టీకి, టీడీపీకి తేడా లేదు. అందుకు బాన్సువాడ ఉప ఎన్నికలే నిదర్శనం. అందువల్ల బహిరంగ సభలు దిగ్విజయమైతే సమస్యలు తీరిపోవు.

తెలంగాణ ఉద్యమం ఎవరో అణగదొక్కితే అణిగిపోయేది కాదు. మిలియన్‌మార్చ్, సకలజ నుల సమ్మెలు జరిగిన తర్వాత ఈనేల కొంత ఊపిరి పీల్చుకుంటూ ఉద్యమ రచనలు చేసుకుంటున్న సందర్భంలో కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణలో నేలలో జొరబడి కొంత గందరగోళపరుస్తాయి. అదే వాళ్ల ఎత్తుగడ. ఇందుకు తాజా ఉదాహరణ చంద్రబాబు ‘పోరుబాట’. చంద్రబాబుకు ఈ మధ్య రాజకీయంగా కొంత రేటింగ్ తగ్గిందని అంటున్నారు. చివరికి పాలకుర్తి సభ నిరసనల మధ్య జరగడం వల్ల బాబుకు సీమాంవూధలో కాస్తంత రేటింగ్ పెరిగిందని మీడియా మాఫియా విశ్లేషణలు చేస్తున్నాయి. ఒక్క సభతోనే రాజకీయాలు తలకిందులు కావు. పాలకుర్తి సభ వల్ల టీడీపీకి ఏ మేరకు లాభం చేకూరిందో ఏమో కానీ తెలంగాణ ఉద్యమానికి ఎంతో మేలు చేసింది. ప్రజల ప్రత్యక్ష ఉద్యమాన్ని ఏ రూపంలోనైనా అణచడానికి, పక్కదారి పట్టించడానికి చంద్రబాబు ఏం చేస్తారో ప్రజలకు స్పష్టంగా తెలిసింది. పాలకుర్తి సభకు దారిపొడుగునా టీడీపీ ఫ్లెక్సీలలో తెలంగాణ అని రాశా రు. కానీ రాజకీయ పార్టీల దృష్టంతా 2014 ఎన్నికలపైననే ఉంది. అందులో భాగంగానే పావులు కదుపుతున్నారు. తెలంగాణ ప్రజల వీపులపై లాఠీలతో కొడు తూ వెళుతున్న టీడీపీ రథాన్ని తెలంగాణ ప్రజలు సీరియస్‌గానే గమనిస్తున్నారు. పోలీసు బందోబస్తులు పెట్టుకుని ప్రతిరోజూ సభలు నిర్వహించలేరు. తెలంగాణ వూపజలు మాత్రం రోజూ ధూంధాంలతో నిర్వహించగలరని గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ పార్టీలు ఓట్ల పందేరానికి పాలకుర్తిని కేంద్రంగా చేసుకుని చూస్తున్నాయి. ఆ పాలకుర్తి మాత్రం పోరాటాలను కన్న నేల. తెలంగాణ ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో మానుకోటలుగా మారుతాయో ఎవరూ చెప్పలేరు. సభలు విజయవంతమైనంత మాత్రాన చరిత్ర తిరగబడ్డట్టు కాదు.
తెలంగాణలో టీడీపీకి ప్రచారం చేసుకునే హక్కు ఉంది. అదే విధంగా తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రం విషయంలో ఎవ్వరినైనా ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నారు. ఆ హక్కును చంద్రదండుల ద్వారా, పోలీసుల ద్వారా అణచివేయించడం అన్యాయం. పాలకుర్తి చంద్రబాబు రైతుపోరు బాట విషయం లో సరిగ్గా అలాంటి అరాచకమే జరిగింది. ఇలాంటి ఆలోచనలున్న పార్టీలు, నాయకులు తెలంగాణకు న్యాయం చేస్తారంటే ఎట్లా నమ్మాలి. దానికి తెలంగాణ ప్రజలే సమాధానం చెబుతారు. రెండేళ్లుగా సాగుతున్న తెలంగాణ ఉద్య మ ఉధృతిలో తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టలేని స్థితిలో ఉన్న సీమాంధ్ర నేతలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది జగన్‌మోహన్‌డ్డి ఆ ప్రయత్నం చేయబోయి చవిచూసిన దెబ్బ నుంచి ఆయన పార్టీ అడుగు పెట్టలేక పోయింది. స్వయంగా ముఖ్యమంత్రి రచ్చబండ పేరుతో సకల శక్తులను వెంటబెట్టుకుని వరంగల్‌జిల్లా రాయినిగూడెంలో అధికార దర్పాన్ని చాటుకోవాలని వస్తే అక్కడి సామాన్య మహిళలు చూపిన తెగువతో ఎదురైన పరాభవం తెలిసిందే. ఇదే తరహాలో తెలుగు తమ్ముళ్ల పెద్దదిక్కు చంద్రబాబు చేయబోయిన యత్నాలను ఓరుగల్లు ప్రజలు ముందుకు సాగనీయలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ సభను జరిపి తమ సత్తా చాటుకున్నామని తెలుగు తమ్ముళ్లు అనుకుంటే తెలంగాణ చైతన్యాన్ని తక్కువగా అంచనా వేసినట్టే. చంద్రబాబు సభకు జనం తోలుకొస్తే వచ్చారే తప్ప వచ్చిన వాళ్లలో చంద్రబాబుకు జై కొట్టినవాళ్లు లేరు. అదును చూసుకుని, చంద్రబాబు మైకందుకోగానే అక్కడ ప్రజలందుకున్న ‘జై తెలంగాణ’ నినాదం చెప్పింది. చంద్రబాబు మీదకు ఎగిసిన ఒక సామాన్య మహిళ కాలిచెప్పు చెప్పింది అసలు సంగతి. మట్టి మనుషులతో బందూకులు, బరిసెలు పట్టించి రాక్షస రజాకార్లను, కిరాతక భూస్వాములను తరిమి కొట్టిన పోరుగడ్డ, పోతుగడ్డ పాలకుర్తి. ఎప్పుడేం చేయాలో ఆ మట్టికి బాగా తెలుసు.

-జూలూరు గౌరీశంకర్, తెరవే ప్రధాన కార్యదర్శి
-పల్లె రవికుమార్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.