ఉద్యమ నిర్వచనం మారుతున్నవేళ.


Sat,October 6, 2012 03:39 PM

ఉద్యమం అంటే రాజకీయంగా ఒకరికొకరు విమర్శలతో విరుచుకుపడటం కాదు. ఉద్యమమంటే ఉరితాళ్ళు తీసుకొని సవాళ్లు, ప్రతిసవాళ్లతో గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం దగ్గరకు రావడం అంతకన్నకాదు. ఉద్యమమంటే అసెంబ్లీ, పార్లమెంటుల్లో తమపార్టీకి పెరిగిన సీట్ల సంఖ్యల లెక్కలు అస్సలు కాదు. ఉద్యమమంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద, 700 మంది యువకుల బలిదానాల మంటల మీద చలికాచుకోవడం కాదు. ఉద్యమమంటే ప్రజల ఆకాంక్షల గెలుపు కోసం, ప్రజల దీర్ఘకాలిక లక్ష్యసాధన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ ముందుకు సాగాలి. తమపార్టీ అధినేత కాళ్లకాడ నుంచి కదలకుండా ఉండి ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిలబడటాన్ని ఉద్యమమని ప్రపంచంలో ఎవరూ అనరనుకుంటా. ఒకవేళ ఆ పార్టీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నా అదే విధానానికి కట్టుబడ్డ కార్యకర్తను కానీ, నాయకుణ్ణి కానీ ఆ పార్టీ విధానానికి విధేయుడని అంటారు.

ఏ రాజకీయ పార్టీకైనా కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలకు లోబడి పని చేయటం, అందుకోసం నిలబడటాన్ని ఎవరూ కాదనరు. ఏ పార్టీ అయినా తమ రాజకీయ భావజాలాన్ని ఏ ప్రాంతంలోనైనా స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చును, దాన్నెవరూ కాదనలేరు. పైగా అది ఆ రాజకీయ పార్టీకున్న హక్కుగా గుర్తించాలి. అదే పని ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని రాజకీయపార్టీలు చేస్తున్నాయి. దాన్నెవ్వరూ కాదనలేరు. ఈ ఎన్నికల పద్ధతుల్లో మునిగితేలుతూ స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి పార్లమెంటు వరకు పోటీపడి నిలబడే పార్టీలు ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ కాలంలోనైనా ఉద్యమ పార్టీలు, పోరాట పార్టీలు కాలేవు. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో ప్రతిష్ఠాత్మకమైన జాతీయ పార్టీ అంటారు. కానీ కాంగ్రెస్, టీడీపీ పార్టీలను ఉద్యమపార్టీలని కానీ, పోరాటపార్టీలని కానీ ఎవరూ అనరు, ఆ పార్టీల నేతలను కూడా ఆ కోణంలోనే చూస్తారు.

అసలు ‘ఉద్యమం’ విప్లవం అన్న పదాల కు వీళ్లంతా విరుద్ధ అలంకారాలు. ఉద్యమం, విప్లవం అన్న పదాలు కలలో వస్తేనే ఉలిక్కిపడిలేచే ఈ పార్టీల నేతలు తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం పేరుతో ఉద్యమకారులుగా, ఇంకా కాస్తా విషమించి కొన్ని సందర్భాలలో విప్లవకారులుగా తిరునాళ్లలో శిగాలూగినట్లు ఊగిపోతున్నారు. వీళ్లు మామూలుగా కాదు శ్రీశ్రీ కవిత్వం కంటే, గద్దర్ పదునైన పాటకంటే ఎక్కువగా ఊగిపోతున్నారు. ‘ఊగరా ఊగరా ఉరికొయ్యను అందుకుని ఊగరా, నువ్వూగుతుంటే శత్రువు గుండెల్లో గాబరా’ అని శ్రీ శ్రీ అన్నాడు. ‘ఉరికంబం మీద నిలిచి వూహా గానం చేసేదనా, వూహల వూయలలో మరో జగత్తు వీక్షించెద’ అంటూ శివసాగర్ పోరు కవిత్వమై పోటెత్తాడు. ఉరికొయ్యలు, చెరసాలలు ఉద్యమాన్ని ఆపలేవు’ అన్న నినాదాన్ని గోడ మీద రాసినందుకు ఒకప్పుడు పోలీసులు లాఠీలతో కొట్టుకుం టూ తీసుకపోయి నక్సలైట్లని కేసులు పెట్టారు.

పిడికిలి బిగించి ఈ ఉద్యమాల నినాదాల్నిస్తూ గుండెల నిండా విప్లవోద్యమాన్ని నింపుకొని ముందుకు సాగినప్పుడు దండకారణ్యంలో చెట్లన్నీ ఎర్రటి అగ్నిపుష్పాలుగా విరగబూశాయి. ఆ ఉద్యమ పోరుదారుల్లో పోటెత్తి ఉప్పొంగిన అనేకమంది ఈ నేల బిడ్డలు బూటకపు ఎన్‌కౌంటర్లలో నెత్తురు ముద్దలయ్యారు. రామనర్సయ్య, జంపాల ప్రసాద్, జనార్దన్‌లు పంచాది నిర్మలలు అయ్యారు. దండకారణ్యాల నుంచి అజాద్‌లు, మల్లోజుల కోటేశ్వరరావులై ప్రభవించారు. ఆ మార్గంలో ఇప్పటికి నిలబడి ముందుకు సాగేవాళ్లను విప్లవకారులని, ఆ ఆశయదారుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న వారిని ఉద్యమకారులని అంటారు. ప్రజలు కూడా వాళ్ళను గుండెల్లో పెట్టుకుని ఉద్యమకారుల్ని నిర్మిస్తారు... కానీ తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం మొదలైన తర్వాత ఏమిటో కానీ ప్రతి ఒక్కరూ ఉద్యమకారులమే అంటున్నారు.

ఇంకా ఈ ఉద్యమపదం దాటి విప్లవకారులమే అంటున్నారు. భూమయ్య, కిష్ణగౌడ్ లను ఉరితీస్తుంటే చోద్యంలా చూస్తూ అధికార భోగాలను అనుభవించిన సంబంధిత అధికారపార్టీ వాళ్ళు ఇప్పుడు తామే నిజమైన తెలంగాణ ఉద్యమకారులమని తాము మోసం చేస్తే మమ్ముల్ని ఉరితీయండి అని గొంతెత్తి అరుస్తున్నారు. అసెంబ్లీ ముందు గల గన్‌పార్క్ దగ్గర వీరంగం వేస్తున్నారు. అసెంబ్లీలో గాంధీ బొమ్మసాక్షిగా ఉద్యమ పదాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు విప్లవకారుల్ని ఎన్‌కౌంటర్‌తో నెత్తురు ముద్దల్ని చేసిన ఒక అధికార పసుపురంగు పార్టీకి చెందినవారు తామే త్యాగధనులమని చెబుతున్నారు. ఉద్యమం పేరెత్తితే గుర్రాలతో తొక్కించి, అధికార లాఠీలతో వీపుల్ని పగులగొట్టి, అసెంబ్లీ సాక్షిగా తూటాలను ప్రయోగించి, బషీర్‌బాగ్ సాక్షిగా రామకృష్ణ ప్రాణాలను బహిరంగంగా బలిగొన్న పార్టీకి చెందినవాళ్లు ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులమని గొంతెత్తి అరుస్తుంటే ఉద్యమమన్న పదం దీనంగా రోదిస్తూ చూస్తుంది.

నిండు సభలో స్పీకర్ స్ధానం సాక్షిగా ‘తెలంగాణ’ అన్న పదం ఉచ్చరించకండి, ఆ పదాల్ని రికార్డుల నుంచి తీస్తేస్తున్నాం వెనుకబడిన ప్రాంతమని చెప్పండన్న యనమల, ఆయన పార్టీకి చెందిన నేతలిప్పుడు తాము తెలంగాణ ఉద్యమకారులమని తమను మించిన ఉద్యమకారులు ఎవరూలేరని మాట్లాడుతుంటే ‘ఉద్యమం’ అన్న పదం తనకు ఇంతటి దుర్గతి వస్తుందని ఏనాడు అనుకోలేదని సూర్యరాయాంధ్ర నిఘంటువుల్లో రోదిస్తుంది. ఉరితాళ్లను సగర్వంగా తమ కంఠాలకు ధరించుకుని సామ్రాజ్యవాద శక్తుల్ని గేలిచేసిన కెన్‌సారో వివేరా, దక్షిణావూఫికా జాతి విముక్తి గీతాన్ని పాడి తమ కంఠానికి ఉరితాడు తగిలించుకున్న బెంజిమన్ మొలైసా ఆత్మబలిదానం చేసుకున్న యోధులు భగత్‌సింగ్ లాంటి వీరులు ఉరితాళ్లకే పోరు పాటలు నేర్పారు. ఉద్యమ పథానికే వూపిరి పోశారు. అలాంటి త్యాగధనుల ప్రాణాలతో ప్రపం చ చరివూతలో ఉరితాళ్లు అన్న పదానికి ఉద్యమం అన్న పదానికి కొత్త అర్థాలను అందించారు.

కానీ ఇదేం దౌర్భగ్యమో ఏమో కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్య మం ఎదిగిన దగ్గర నుంచి అధికార పాదాల కాడ కావలి కాసే వాళ్లంతా ఉద్యమకారుల పేరుతో వీధుల్లోకి వచ్చారు. తెలంగాణ సమాజంలోని ఆలోచనాపరులంతా ఆలోచించారు. కానీ చివరకు తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ఉరితాళ్లతో, ఉద్యమపదాలతో, సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ విమర్శల యుద్ధానికి దిగిన తర్వాత తెలంగాణ ప్రజల గుండె తల్లడిల్లిపోతుంది. ఊహించని ఈ స్థితి ఎదురు కావటంతో తెలంగాణ ఉద్యమం మళ్లీ ఒక్కసారి తనను తాను ఆత్మవిమర్శతో పరిశీలించుకునేందుకు సిద్ధపడుతుంది.
అసలు మీమీ రాజకీయ పార్టీలు ఉద్యమపార్టీలా? విప్లవపార్టీలా? ఉరితాళ్లను ముద్దాడే పార్టీలా? అన్న విషయాన్ని స్పష్టం చేయాలి. అసలు ప్రజాపోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు మీ రాజకీయ పార్టీలకున్న సంబంధం ఏమిటి? మావోయిస్టు పార్టీకి వామపక్షపార్టీలకు తేడా వుంది. టీడీపీ, కాంగ్రెస్ అధికారపార్టీలకు, ఉద్యమపోరు పార్టీలకు తేడా ఉంది.

‘ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, ఇది దోపిడీ రాజ్యం’ అని శాసనసభలో ప్రతిపక్షపార్టీ వాళ్లు పోడియం దగ్గరకు వచ్చి నినదిస్తుంటే ఒక జర్నలిస్టుగా ప్రెస్ గ్యాలరీలో కూర్చుని రిపోర్టింగ్ చేస్తుంటే నాకు ఆశ్చర్యమనిపించింది. చివరకు పోరాట నినాదాలను కూడా అసెంబ్లీలో అధికారం కోసం స్పీకర్ పోడియం ముందుబెట్టి ఉద్యమ పదాలను ఎలా బేరానికి పెట్టారో కళ్లారా చూడటం జరిగింది. అడవి సంపదలను కాపాడుతూ తమ కంఠాలను పగులగొట్టుకుని జనంపాటను కీర్తించిన ప్రజా వాగ్గేయకారుడు జీతన్‌మరాండీకి ఉరిశిక్షవేస్తే నోరుమెదపని రాజకీయపార్టీలు తెలంగాణ ఉద్య మం పేరుతో గన్‌పార్క్ దగ్గరకు ఉరితాళ్లు పట్టుకుని రావడం ఆశ్చర్యాలకే ఆశ్చర్యంగా మారింది.

తెలంగాణ రాష్ట్ర సాధన అన్నది మొత్తం వ్యవస్థ మార్పుకాదు. వ్యవస్థ మార్పంటే విప్లవమే. రాష్ట్ర సాధన ఉద్యమం మౌలిక మార్పుల కోసం ముందుకు సాగుతుంది. కానీ ఉద్యమ పథ వ్యతిరేకులే ఈ ఉద్యమం గురించి ఎక్కువగా మాట్లాడటంతో అసలు ఉద్యమంలో నిజమైన ఉద్యమకారులు మరుగునపడే ప్రమాదముంది. అందుకే కాబోలు పాలక పార్టీలు తామే నిజమైన ఉద్యమకారులమని జెండాలు పట్టుకుని వస్తున్నారు. ప్రజలు వారిని నమ్మరు. కానీ వాళ్లు ఉద్యమాన్ని తాత్కాలికంగానైనా గందరగోళపరచగలరు. సరిగ్గా తెలంగాణ నేలలో పాలక పార్టీలు అదే పనిచేస్తున్నాయి. అందుకే ఉద్యమకారులు తమ పంథాను రూపొందించుకుని రాజీలేని పోరాటం చేసినప్పుడు మాత్రమే ఉద్యమంలో అసలీపూవరో? నకిలీపూవరో? స్పష్టంగా తేలిపోతుంది.

ఉద్యమమన్నది నిత్యం ప్రవహించే జీవనది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఎవరో ఆపితే ఆగేది కాదు. ఎవరో లేపితే వెంటనే లేచి నిలబడేది కాదు. అది జనగుండెల ఘోష నుంచి పెల్లుబుకుతున్న మహోద్యమం. ఉద్యమం పేరును ఉచ్చరించటానికి తమకు ఏ మేరకు అర్హత ఉందో చూసుకొని ఆమేరకే మాట్లాడితే సంబంధిత పార్టీలకున్న కనీస గౌరవం మిగులుతుంది. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తారని సంబంధిత రాజకీయ పార్టీలు గుర్తించటం మంచిది. ఉద్యమమంటే42 రోజులు కొనసాగిన సకలజనుల సమ్మె. ఉద్యమమంటే కళ్ళముందు నిర్బంధాన్ని తట్టుకుంటూ కూడా మిలియన్ మార్చ్‌గా మిగలటం. ఎల్‌బీనగర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా శ్రీకాంతాచారి మండిపోయి ఉద్యమానికి ఊపిరి పోశారు. తమ యవ్వనాన్ని, జీవితాన్ని త్యాగం చేస్తూ చేసిన ఆత్మబలిదానాలు రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఎరుపెక్కించాయి. ఉద్యమమంటే రాజకీయ నాయకుల ప్రకటనలు కాదు. ఉద్యమమంటే రాష్ట్రాన్ని సాధించే వరకు మడిమ తిప్పకుండా పోరాడటం.

-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Published: Fri,June 14, 2013 12:20 AM

ఆకాంక్ష పట్టని అసెంబ్లీ

ప్రజాస్వామ్యానికి ప్రతి రూపం, ప్రజలందరి సామూహిక ముక్తకంఠం అసెంబ్లీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనంకోసం కదిలిపోయి, మంది కోసం పనిచేస

Published: Mon,June 10, 2013 12:00 AM

అసెంబ్లీని ముట్టడించనున్న ప్రజాకాంక్ష

ఏ ఉద్యమ పిలుపుకైనా తరలివచ్చే ప్రజలున్నారు. ఎంతటి నిర్బంధాన్నైనా ఎదుర్కొనగల శక్తి సామర్ధ్యాలున్న ప్రజలున్నారు. రాజ్యం వికృత చేష్ట

Published: Mon,June 3, 2013 04:29 AM

పచ్చని పల్లెటూరి పాట వెంకన్న

నిబద్ధత ఉన్న సాహిత్యం కొండమప్లూల్లాగా, బతుకమ్మలో పేర్చిన జీవమున్న పూలలాగా, పచ్చని అడవిలాగా ఉంటుంది. ప్లాస్టిక్ పూలలాంటి కవులు, బ

Published: Sun,February 10, 2013 12:17 AM

పోరు అక్షరాభ్యాసం

చుక్కా రామయ్య లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. రామయ్యలాంటి వ్యక్తులను ఒక వ్యవస్థకే నమూనాగా చెప్పవచ్చును. కళ్లముందు అన్యాయం జరుగుత

Published: Sat,January 19, 2013 11:53 PM

తెలంగాణ సాహిత్య యుద్ధభేరి

కవులూ,రచయితలూ కాలంవెంట నడుచుకుంటూ పోరని, కాలాన్నే తమ వెంట నడిపించుకుంటూ పోతారని తెలంగాణ కవులూ, రచయితలూ మరోసారి నిరూపించారు. ప్రజల

Published: Wed,December 26, 2012 11:44 PM

ఎందుకు బహిష్కరిస్తున్నామంటే..

రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి అన్ని అధికారాలను ప్రయోగించి రాజమువూదలతో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించేందు

Published: Sat,November 24, 2012 11:37 PM

సమరాలను అల్లే సూర్యాపేట సమరభేరి

ఒక సమూహం ఎక్కడైనా జమైందంటే.. ఆ నేలే పరవశం కలిగిస్తుంది. చీమల దండ్లుగా జనం కదలాడటం లాగా ఆశయాలుంటాయి. ఆశయాల ఆకాంక్షలు ఎలా జమిలిగా క

Published: Fri,December 14, 2012 04:07 PM

సమాజ నిర్మాణాలు-విలువలు-కాళోజీలు

కాళోజీ అంటే విలువలతో జీవించి జీవితాంతం నిబద్ధతతో నిలబడ్డ వ్యక్తి. ఆ తరానికే కాదు ఈతరానికి కూడా కాళోజీ ప్రతీక. ఆయన ఆ కాలానికి, ఆ త

Published: Sat,December 1, 2012 04:45 PM

సమాజాన్ని నడిపేవి త్యాగాలు, భావజాలాలే

ఒక తరంలో ప్రగతిశీల భావజాలాల విత్తనాలను నాటడం అంతసులభమైన పనేమీ కాదు. ఆ విత్తనాలను నాటడానికి నేలను పదును చేసి, దుక్కిదున్ని, వాతావరణ

Published: Sat,October 27, 2012 05:31 PM

సిరా చుక్కల సమరం

కలం సృష్టించిన జ్ఞానమే కాలం. అక్షరమే కాలాన్ని కలకాలం నిలుపుతుంది. కలం సర్వకాలాలకు కన్నులుగా, సమాజాలకు కాళ్ల చేతులుగా, ఏ వ్యవస్థలకై

Published: Wed,October 10, 2012 06:50 PM

జీవ వైవిధ్యం- జీవన విధ్వంసం

అక్టోబర్ 1 నుంచి 19 వరకు జరుగుతున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుపై ఉన్న శ్రద్ధ, గత అరవై ఏళ్లుగా రాష్ట్రం కావాలని నాలుగున్నర కోట్ల

Published: Wed,October 10, 2012 07:06 PM

పాటను బంధించలేరు

ఆకంఠ స్వరం వింటుంటే చెట్ల సామూహిక తలలపైన పక్షుల గుంపులు ఎగు రు తున్నట్లుంది. దట్టమైన అడవి అందాలు కళ్ళ ముందు కదలాడుతుంటాయి. ఆమె గొం

Published: Thu,October 11, 2012 06:03 PM

కాళన్న దారిలో కదం తొక్కుదాం

భోగోళం మీద ఎప్పుడెనా, ఎక్కడెనా ఆధిపత్యాన్ని అడ్డంగా నరికేసే ధిక్కార స్వరా లు కలాల కంఠాలే. తిరుగుబాట్లన్నీ సృజనకారుల ఆలోచనల్లోనే పొ

Published: Sat,October 6, 2012 03:26 PM

సాహిత్య సాంస్కృతిక సైన్యం ‘తెరవే’

సంఘాలకు, వేదికలకు సాహిత్య సృష్టికి సంబంధం ఉందా? సాహిత్యం సృజనకు సంబంధించినది. సంఘం అన్నది నియమ నిబంధనలకు, లక్ష్యాలకు సంబంధించింది.

Published: Sat,October 6, 2012 03:27 PM

తొలుస్తున జ్ఞాపకాలు

ఒక కాలం ఎప్పుడూ మరో కాలానికి పాఠం చెబుతూనే ఉంటుంది. ఇలా కాలానికి కాలం పాఠం చెప్పటమే పరిణామక్షికమం అనుకుంటా. ఒక కాలం ఇచ్చిన స్ఫూర్త

Published: Sat,October 6, 2012 03:27 PM

వెలిదండ: తల్లి పేగు బంధం

పుట్టిన ఊర్లను ఎలా మరిచిపోలేమో అలాగే మనలో చైతన్యాన్ని రగిలించిన ఊర్లను కూడా మరిచిపోలేం.ఎప్పుడైనా పుస్తకా లు మనలోని సృజనను తట్టిలేప

Published: Sat,October 6, 2012 03:28 PM

ఈ గర్భశోకాలకు కారణమెవ్వరు తల్లీ..!

‘తెలంగాణ ’ ఒక శక్తి సూత్రం ‘తెలంగాణ ఒక చలనం, ఒక ప్రళయం ప్రజలంటే ఆత్మాభిమాన జెండాలు పోరుదారులు తెలంగాణను ఎవరూ కాలరాయలేరు ఈ పో

Published: Sat,October 6, 2012 03:37 PM

ఈ మహాకావ్యం పేరు తెలంగాణ

హద్దులు, లెక్కల పద్దులు లేని వాడే కవి కవిత్వం విప్పిన సద్దిమూట, తనను తాను ఆరేసుకున్న ప్రకృతి పైట కవిత్వం నదుల నోటి ను

Published: Sat,October 6, 2012 03:37 PM

నివురుగప్పిన నిప్పులు

ఒక భావజాలంతో కలిసి నడిచిన మిత్రులు ఏక కంఠమై నినదించిన మిత్రు లు, ఒకే లక్ష్యంతో ఏకమైన పిడికిళ్లు, కలిసి పనిచేసి అలసిపోయిన మిత్రులు,

Published: Sat,October 6, 2012 03:39 PM

ఓరుగల్లు పోరు క్షేత్రం

తెలంగాణలో నిత్య నిర్బంధం కొనసాగుతున్న దశలో నక్సలైట్లు సభలు జరిపితే ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. పోలీసుశాఖవారు ఆ సభలకు వెళ్లవద్దని

Published: Sat,October 6, 2012 03:40 PM

శ్రీ కృష్ణకు , సుదర్శనుడికి ఎంత తేడా!

డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందన్న హోంమంత్రి చిదంబరం నోటితోనే..,డిసెంబర్ 23 న ఇరు ప్రాంతాల అభివూపాయం తీసుకున్నాకే

Published: Sat,October 6, 2012 03:44 PM

విరామమెరుగని పోరు

మలిదశ తెలంగాణ పోరులో ప్రజలు అత్యంత చారివూతాత్మకమైన పాత్ర పోషిస్తున్నారు. ఏ పోరాటంలోనైనా ఇంతకంటే తెగించి పోరాడుతున్న ప్రజలుంటారా? త

Published: Sat,October 6, 2012 03:44 PM

సకల జనాగ్రహం

ప్రశ్నలు.. సంఘర్షణలు.. వాదోపవాదా లు.. ఒత్తిడులు.. ఒడిదొడుకులు..లాఠీలు.. తూ టాలు.. ఆత్మ బలిదానాలు.. రాజకీయాలు, రాజకీయక్రీడలు, ఎత్త

Published: Sat,October 6, 2012 03:43 PM

ఒకే మాట, ఒకే బాట

కేంద్రాన్ని, ఆంధ్రా ఆధిపత్య శక్తులను ఒక పక్క ఎదుర్కొంటూనే మరో పక్క తెలంగాణలో భిన్న రాజకీయ చైతన్యాల మధ్య తెలంగాణ రాష్ట్ర అంశంపై ఏక

Published: Sat,October 6, 2012 03:43 PM

ఉద్యమాలకు అన్నం పెట్టిన అవ్వ

-జూలూరు గౌరీశంకర్ తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి అడవి ఉద్యమానికి మైదాన ఉద్యమానికి సంబంధించిన కీలకమైన సమాచారానికి మధ్య

Published: Sat,October 6, 2012 03:42 PM

మన సాంస్కక్షుతిక ఉద్యమ తల్లిపేగు జయశంకర్

-ఆయన తెలంగాణ గుండె చప్పుడు. ఆయన తెలంగాణ సాంస్కృతిక పేగుబంధం. అయనను తెలంగాణ పదబంధాల నుంచి విడదీసి చూడలేం. ప్రొఫెసర్ కొత్తపల్లి

Published: Sat,October 6, 2012 03:41 PM

తెలంగాణ కలాల కోలాటం.. తెరవే

కడుపులో పిండం పెరిగి పెద్దయి, కడుపులో తండ్లాడి, మాతృగర్భం చీల్చుకుని శిశువు పెట్టిన కేక ఒక జననం. కాలం జీవించటానికి, కదలటానికి, ముం