తెలంగాణ కలాల కోలాటం.. తెరవే


Sat,October 6, 2012 03:41 PM

కడుపులో పిండం పెరిగి పెద్దయి, కడుపులో తండ్లాడి, మాతృగర్భం చీల్చుకుని శిశువు పెట్టిన కేక ఒక జననం. కాలం జీవించటానికి, కదలటానికి, ముందుకు సాగటానికి నిత్యం ఒక చైతన్య ప్రవాహం ప్రవహిస్తూనే ఉంటుంది. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. నిత్యం మారే చలనజీవి కాలం. కాలానికి కూడా కొన్ని ప్రేమలుంటా యి. కోరికలుంటాయి. కాలం కూడా నేలపడే బాధల్ని చూస్తుంది. మట్టి మనిషిని అక్కున చేర్చుకుంటుంది. ఈ నేల మీద జరిగిన అనేకానేక పోరాటాలు, పెనుగులాటలు మరువలేని చరిత్ర. పోరాటానికి నిర్వచ నం. తెలంగాణ సాహిత్యం సింగరేణి బొగ్గుగని. తెలంగాణ సాహిత్యం గొంతెండిన వాడికి నీటి సెలిమ. తెలంగాణ జానపదం తరతరాలకు తరగని సంపద. నిత్య చైతన్య కూడలి.

తెలంగాణ రాష్ట్రం కోసం గత కొన్నేళ్లుగా నిరంతర ధారగా జరుగుతున్న రాష్ట్ర సాధన ఉద్యమంలో సాహిత్యం, కళలు సృష్టించిన పాత్ర తిరుగులేనిది. ఈ సందర్భంలోనే తెలంగాణ రచయితల వేదిక అడుగులు వేసింది. అనేక పాటలు కట్టింది. అనేక కవితలనల్లింది. అనేక పుస్తకాలను ప్రచురించింది. నాగేటి చాళ్లల్లో నా తెలంగాణ అంటూ గొంతెత్తింది. పొక్కిలైన తెలంగాణ దృశ్యాన్ని చిత్రీకరించింది. తెలంగాణ సమాజమంతా ఏకం కావటానికి అక్షరాల బలాన్ని అందించింది. తెలంగాణ సమాజాన్ని చీల్చటానికి జరుగుతున్న రాజకీయ కుట్రలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ తిప్పికొడుతూ వచ్చింది. 600 మంది విద్యార్థులు, యువకుల త్యాగాలను గుండెనిం డా నింపుకుని అక్షర ఆయుధాల్ని సంధించింది. డిసెంబర్ 9 ప్రకటన, ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ మోసాల్ని, కుటిల నీతుల్ని తెలంగాణ రచయితలు ప్రశ్నించారు. తెరవే దేశవ్యాప్తంగా ఉన్న తెలంగాణ రచయితలందర్నీ ఒక వేదికపైకి తీసుకవచ్చే ప్రయత్నం భుజం మీద వేసుకుంది. అందుకు శ్రీకారం చుడుతూ జూన్ 10వ తేదీన హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్లో భారత తెలంగాణ రచయితల మహాసభలను నిర్వహించింది.

తెలుగు నేల నలు దిక్కులా కవులు, రచయితలు ఈ అఖిల భారత సభలకు తరలివచ్చారు. ముంబై, ఢిల్లీలో ఉన్న కవులు, రచయితలు కదిలారు. 500 మంది కవులు, రచయితలు ఈ అఖిల భారత సభలకు కదలిరావటం ఒక చారితక సందర్భం, ఒక చారితక అవసరం కూడాను. ఉద్యమ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర సాధన నేపథ్యంలో, ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడబోతున్న అఖిలభారత తెలంగాణ రచయితల సంఘానికి ఈ మహాసభలు శ్రీకారం చుట్టాయి. ఈ సభలకు అన్ని రాజకీయ పార్టీల నేతల్ని పిలిచినా కొందరే వచ్చారు.

తెలంగాణరచయితల వేదిక అధ్యక్షులు జూకంటి జగన్నాథం తెరవే జెండా ఎగురవేసారు. తెలంగాణ ప్రజాఫంట్ చైర్మన్ ప్రజా యుద్ధనౌక గద్దర్ మహాసభల గండదీపం వెలిగించారు.గద్దర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సుదీర్ఘంగా తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల గురించి వివరించే ప్రయత్నం చేశారు.తెలంగాణ సాహిత్య ఉద్యమ దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో రాజకీయ అంశాలను ఆయన నర్మగర్భంగా తడిమారు. తనకు తానుగా ఆత్మ విమర్శ కూడా చేసుకున్నారు. తెలంగాణ రచయితల వేదికలో గద్దర్ ఉపన్యాసం ఒక కొలిమిలా మంటరాజేసింది. గద్దర్ ఉపన్యాసంలో ఆవేశం, ఆవేదన, దుఃఖం, తెలంగాణ గోస కన్పించాయి. ప్రముఖ కవి మరాఠీ ప్రజా వాగ్గేయకారుడు సంభాజి భగత్, గద్దర్ కలిసి హిందీ, తెలుగులో కలగలిపి చెరబండరాజు పాటను ఆలపించారు. ప్రముఖ మరాఠీ కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత లక్ష్మణ్ గైక్వాడ్ అస్తిత్వ సాహిత్య ఉద్యమం గురించి సోదాహరణంగా వివరించారు. అంబేడ్కర్, ఫూలే మార్గంలో జరుగుతున్న ఉద్యమాలను తడిమారు. గోరటి వెంకన్న పాటతో సభ నూతన ఉత్తేజం పొందింది.

ప్రారంభ సమావేశానికి ఎన్.బి.టి. తెలుగు అసిస్టెంట్ ఎడిటర్ డా. పత్తిపాక మోహన్ సమావేకర్తగా వ్యవహరించగా , తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి నివేదికను సమర్పించారు. రెండో సమావేశానికి తెరవే నిజామాబాద్ జిల్లా కార్యదర్శి డా. రాజేశ్వరశర్మ సమావేశకర్తగా వ్యవహరించగా తెరవే వరంగల్ జిల్లా అధ్యక్షులు ప్రొ. బన్న ఐలయ్య అధ్యక్షత వహించారు.

తెలంగాణ ఉద్యమంరాజకీ పార్టీల వైఖరి అనే అంశంపై పొలిటికల్ జెఎసి కన్వీనర్ ప్రొ. ఎం. కోదండరాం సుదీర్ఘంగా వివరించారు. భూమిక అన్న అంశం పై ఆంధ్రజ్యోతి దినపతిక సంపాదకులు డా. కె. శ్రీనివాస్ మాట్లాడారు. ఆదిలాబాద్ తెరవే అధ్యక్షులు ఉదారి నారాయణ వందన సమర్పణ చేశారు. మూడో సమావేశానికి సమావేశకర్తగా తెరవే ఖమ్మం జిల్లా కార్యదర్శి ఎన్. రఘు వ్యవహరించారు. వరంగల్ జిల్లా తెరవే నేత అనిశెట్టి రజిత అధ్యక్షత వహించారు. తెలంగాణ కథవిస్తరణ అన్న అంశంపై ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్కుమార్ ప్రసంగం చేశారు. తెలంగాణ తొలి తరం రచయితులు అన్న అంశంపై తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వి. త్రివేణి మాట్లాడారు.

కవి పొన్నాల బాలయ్య వందన సమర్పణ చేశారు.నాలుగో సమావేశంలో ముంబైలో ఉన్న తెలంగాణ రయితలతో ఉత్కం సాగింది. ప్రముఖ కవి డా. ఎన్. మల్లికార్జునడ్డి సమావేశకర్తగా వ్యవహరించగా తెరవే కార్యదర్శి డా. దామెర రాములు అధ్యక్షత వహించారు. నిర్మాణములో తెలంగాణీయుల పాత్ర అన్న అంశంపై ప్రముఖ కవి, ముంబై రచయిత మచ్చ ప్రభాకర్ ప్రసంగించారు. మహారాష్ట్రలో తెలంగాణ కవిత్వం అన్న అంశంపై ముంబై వన్ సంపాదకులు ప్రముఖ కవి సంగెనేని రవీంద్ర మాట్లాడారు. వలస పత్రాన్ని ఆయన ప్రకటించారు. ఐదవ సమావేశానికి సమావేశకర్తగా తెరవే నల్గొండ జిల్లా అధ్యక్షులు డా. బెల్లి యాదయ్య వ్యవహరించగా తెరవే రాష్ట్ర ఉపాధ్యక్షులు పొట్లపల్లి శ్రీనివాసరావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఉద్యమంస్త్రీల రచనలు అన్న అంశంపై తెలంగాణ దళిత మహిళా వేదిక అధ్యక్షురాలు, ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంముస్లింల పాత్ర అన్న అంశంపై సింగిడి తెలంగాణ రచయితల సంఘం కన్వీనర్ ్కబాబా మాట్లాడారు.

వేర్పాటు ఉద్యమాల్ని, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల్ని ప్రేమించే వాళ్లకు తెలంగాణ ఉద్యమ లోతుల్ని మరింత తెలుసుకోవటానికి ఈ మహాసభలు ఉపయోగపడ్డాయి. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించేవాళ్లకు కూడా ఈ ఉద్యమం ఎంత బలంగా ఉందో తెలుసుకోవడానికి ఈ జాతీయ మహాసభలు ఉపయోగపడ్డాయి. అస్తిత్వవాద ఉద్యమ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా కవుల, రచయితల సమ్మేళనం తెలంగాణ రచయితల వేదిక నేతృత్వంలో జరగడం ఒక కదలిక. దేశవ్యాప్తంగా కవులు, రచయితలకు సంఘాలున్నాయి. కాని అవి కేవలం సాహిత్య కోణంలో మాత్రమే ఏర్పడ్డాయి. ఉద్యమ కోణంలో అఖిలభారత స్థాయిలో ఒక రచయితల సంఘం రూపు దాల్చడానికి ఈ అఖి ల భారత మహాసభలు కొత్త ఊపునిచ్చాయి. ఉద్యమ కోణంలో ఓ రచయితల సంఘం దేశవ్యాప్త సమ్మేళనం ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది తొలిసారి.

తెలంగాణ నేలలో పెనుగులాటల్ని చూసిన తర్వాత దేశవిదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు తమ పేగుబంధాన్ని తడుముకున్నారు. ఈ తెగదెంపుల సంగ్రామంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదికపైకి రావాలని పిలుపునిస్తున్నాం. రాష్ట్రాన్ని సాధించుకునేంత వరకు అందరిది ఒక మాట, ఒక బాట, ఒక పాట. అదే జై తెలంగాణ

జూలూరు గౌరీ
తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి

39

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Published: Fri,June 14, 2013 12:20 AM

ఆకాంక్ష పట్టని అసెంబ్లీ

ప్రజాస్వామ్యానికి ప్రతి రూపం, ప్రజలందరి సామూహిక ముక్తకంఠం అసెంబ్లీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనంకోసం కదిలిపోయి, మంది కోసం పనిచేస

Published: Mon,June 10, 2013 12:00 AM

అసెంబ్లీని ముట్టడించనున్న ప్రజాకాంక్ష

ఏ ఉద్యమ పిలుపుకైనా తరలివచ్చే ప్రజలున్నారు. ఎంతటి నిర్బంధాన్నైనా ఎదుర్కొనగల శక్తి సామర్ధ్యాలున్న ప్రజలున్నారు. రాజ్యం వికృత చేష్ట

Published: Mon,June 3, 2013 04:29 AM

పచ్చని పల్లెటూరి పాట వెంకన్న

నిబద్ధత ఉన్న సాహిత్యం కొండమప్లూల్లాగా, బతుకమ్మలో పేర్చిన జీవమున్న పూలలాగా, పచ్చని అడవిలాగా ఉంటుంది. ప్లాస్టిక్ పూలలాంటి కవులు, బ

Published: Sun,February 10, 2013 12:17 AM

పోరు అక్షరాభ్యాసం

చుక్కా రామయ్య లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. రామయ్యలాంటి వ్యక్తులను ఒక వ్యవస్థకే నమూనాగా చెప్పవచ్చును. కళ్లముందు అన్యాయం జరుగుత

Published: Sat,January 19, 2013 11:53 PM

తెలంగాణ సాహిత్య యుద్ధభేరి

కవులూ,రచయితలూ కాలంవెంట నడుచుకుంటూ పోరని, కాలాన్నే తమ వెంట నడిపించుకుంటూ పోతారని తెలంగాణ కవులూ, రచయితలూ మరోసారి నిరూపించారు. ప్రజల

Published: Wed,December 26, 2012 11:44 PM

ఎందుకు బహిష్కరిస్తున్నామంటే..

రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి అన్ని అధికారాలను ప్రయోగించి రాజమువూదలతో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించేందు

Published: Sat,November 24, 2012 11:37 PM

సమరాలను అల్లే సూర్యాపేట సమరభేరి

ఒక సమూహం ఎక్కడైనా జమైందంటే.. ఆ నేలే పరవశం కలిగిస్తుంది. చీమల దండ్లుగా జనం కదలాడటం లాగా ఆశయాలుంటాయి. ఆశయాల ఆకాంక్షలు ఎలా జమిలిగా క

Published: Fri,December 14, 2012 04:07 PM

సమాజ నిర్మాణాలు-విలువలు-కాళోజీలు

కాళోజీ అంటే విలువలతో జీవించి జీవితాంతం నిబద్ధతతో నిలబడ్డ వ్యక్తి. ఆ తరానికే కాదు ఈతరానికి కూడా కాళోజీ ప్రతీక. ఆయన ఆ కాలానికి, ఆ త

Published: Sat,December 1, 2012 04:45 PM

సమాజాన్ని నడిపేవి త్యాగాలు, భావజాలాలే

ఒక తరంలో ప్రగతిశీల భావజాలాల విత్తనాలను నాటడం అంతసులభమైన పనేమీ కాదు. ఆ విత్తనాలను నాటడానికి నేలను పదును చేసి, దుక్కిదున్ని, వాతావరణ

Published: Sat,October 27, 2012 05:31 PM

సిరా చుక్కల సమరం

కలం సృష్టించిన జ్ఞానమే కాలం. అక్షరమే కాలాన్ని కలకాలం నిలుపుతుంది. కలం సర్వకాలాలకు కన్నులుగా, సమాజాలకు కాళ్ల చేతులుగా, ఏ వ్యవస్థలకై

Published: Wed,October 10, 2012 06:50 PM

జీవ వైవిధ్యం- జీవన విధ్వంసం

అక్టోబర్ 1 నుంచి 19 వరకు జరుగుతున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుపై ఉన్న శ్రద్ధ, గత అరవై ఏళ్లుగా రాష్ట్రం కావాలని నాలుగున్నర కోట్ల

Published: Wed,October 10, 2012 07:06 PM

పాటను బంధించలేరు

ఆకంఠ స్వరం వింటుంటే చెట్ల సామూహిక తలలపైన పక్షుల గుంపులు ఎగు రు తున్నట్లుంది. దట్టమైన అడవి అందాలు కళ్ళ ముందు కదలాడుతుంటాయి. ఆమె గొం

Published: Thu,October 11, 2012 06:03 PM

కాళన్న దారిలో కదం తొక్కుదాం

భోగోళం మీద ఎప్పుడెనా, ఎక్కడెనా ఆధిపత్యాన్ని అడ్డంగా నరికేసే ధిక్కార స్వరా లు కలాల కంఠాలే. తిరుగుబాట్లన్నీ సృజనకారుల ఆలోచనల్లోనే పొ

Published: Sat,October 6, 2012 03:26 PM

సాహిత్య సాంస్కృతిక సైన్యం ‘తెరవే’

సంఘాలకు, వేదికలకు సాహిత్య సృష్టికి సంబంధం ఉందా? సాహిత్యం సృజనకు సంబంధించినది. సంఘం అన్నది నియమ నిబంధనలకు, లక్ష్యాలకు సంబంధించింది.

Published: Sat,October 6, 2012 03:27 PM

తొలుస్తున జ్ఞాపకాలు

ఒక కాలం ఎప్పుడూ మరో కాలానికి పాఠం చెబుతూనే ఉంటుంది. ఇలా కాలానికి కాలం పాఠం చెప్పటమే పరిణామక్షికమం అనుకుంటా. ఒక కాలం ఇచ్చిన స్ఫూర్త

Published: Sat,October 6, 2012 03:27 PM

వెలిదండ: తల్లి పేగు బంధం

పుట్టిన ఊర్లను ఎలా మరిచిపోలేమో అలాగే మనలో చైతన్యాన్ని రగిలించిన ఊర్లను కూడా మరిచిపోలేం.ఎప్పుడైనా పుస్తకా లు మనలోని సృజనను తట్టిలేప

Published: Sat,October 6, 2012 03:28 PM

ఈ గర్భశోకాలకు కారణమెవ్వరు తల్లీ..!

‘తెలంగాణ ’ ఒక శక్తి సూత్రం ‘తెలంగాణ ఒక చలనం, ఒక ప్రళయం ప్రజలంటే ఆత్మాభిమాన జెండాలు పోరుదారులు తెలంగాణను ఎవరూ కాలరాయలేరు ఈ పో

Published: Sat,October 6, 2012 03:37 PM

ఈ మహాకావ్యం పేరు తెలంగాణ

హద్దులు, లెక్కల పద్దులు లేని వాడే కవి కవిత్వం విప్పిన సద్దిమూట, తనను తాను ఆరేసుకున్న ప్రకృతి పైట కవిత్వం నదుల నోటి ను

Published: Sat,October 6, 2012 03:37 PM

నివురుగప్పిన నిప్పులు

ఒక భావజాలంతో కలిసి నడిచిన మిత్రులు ఏక కంఠమై నినదించిన మిత్రు లు, ఒకే లక్ష్యంతో ఏకమైన పిడికిళ్లు, కలిసి పనిచేసి అలసిపోయిన మిత్రులు,

Published: Sat,October 6, 2012 03:39 PM

ఓరుగల్లు పోరు క్షేత్రం

తెలంగాణలో నిత్య నిర్బంధం కొనసాగుతున్న దశలో నక్సలైట్లు సభలు జరిపితే ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. పోలీసుశాఖవారు ఆ సభలకు వెళ్లవద్దని

Published: Sat,October 6, 2012 03:39 PM

ఉద్యమ నిర్వచనం మారుతున్నవేళ.

ఉద్యమం అంటే రాజకీయంగా ఒకరికొకరు విమర్శలతో విరుచుకుపడటం కాదు. ఉద్యమమంటే ఉరితాళ్ళు తీసుకొని సవాళ్లు, ప్రతిసవాళ్లతో గన్‌పార్క్‌లోని

Published: Sat,October 6, 2012 03:40 PM

శ్రీ కృష్ణకు , సుదర్శనుడికి ఎంత తేడా!

డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందన్న హోంమంత్రి చిదంబరం నోటితోనే..,డిసెంబర్ 23 న ఇరు ప్రాంతాల అభివూపాయం తీసుకున్నాకే

Published: Sat,October 6, 2012 03:44 PM

విరామమెరుగని పోరు

మలిదశ తెలంగాణ పోరులో ప్రజలు అత్యంత చారివూతాత్మకమైన పాత్ర పోషిస్తున్నారు. ఏ పోరాటంలోనైనా ఇంతకంటే తెగించి పోరాడుతున్న ప్రజలుంటారా? త

Published: Sat,October 6, 2012 03:44 PM

సకల జనాగ్రహం

ప్రశ్నలు.. సంఘర్షణలు.. వాదోపవాదా లు.. ఒత్తిడులు.. ఒడిదొడుకులు..లాఠీలు.. తూ టాలు.. ఆత్మ బలిదానాలు.. రాజకీయాలు, రాజకీయక్రీడలు, ఎత్త

Published: Sat,October 6, 2012 03:43 PM

ఒకే మాట, ఒకే బాట

కేంద్రాన్ని, ఆంధ్రా ఆధిపత్య శక్తులను ఒక పక్క ఎదుర్కొంటూనే మరో పక్క తెలంగాణలో భిన్న రాజకీయ చైతన్యాల మధ్య తెలంగాణ రాష్ట్ర అంశంపై ఏక

Published: Sat,October 6, 2012 03:43 PM

ఉద్యమాలకు అన్నం పెట్టిన అవ్వ

-జూలూరు గౌరీశంకర్ తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి అడవి ఉద్యమానికి మైదాన ఉద్యమానికి సంబంధించిన కీలకమైన సమాచారానికి మధ్య

Published: Sat,October 6, 2012 03:42 PM

మన సాంస్కక్షుతిక ఉద్యమ తల్లిపేగు జయశంకర్

-ఆయన తెలంగాణ గుండె చప్పుడు. ఆయన తెలంగాణ సాంస్కృతిక పేగుబంధం. అయనను తెలంగాణ పదబంధాల నుంచి విడదీసి చూడలేం. ప్రొఫెసర్ కొత్తపల్లి