సంచార కులాల్లో వెలుగు


Sat,December 2, 2017 11:21 PM

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో పాటు తమకు ప్రత్యేక గ్రూపులు చేస్తే మేలు జరుగు తుందని సంచార జాతులు కోరుతున్నాయి. సంచారజాతులు స్థిరనివాసులు కావాలి. వాళ్ల జీవన విధా నం సంపూర్ణంగా మారాలి. యాచకవృత్తి నుంచి ఉద్యోగ స్థిరనివాస స్థితికి రావాలి.

తెలంగాణ కొత్త చరిత్రను బహుజనాక్షరాలతో లిఖించుకునే ప్రయ త్నం మొదలుపెట్టింది. గతమం తా బీసీలను బలహీనవర్గాల పథకాలుగానే చూసింది. బీసీలంటే బలహీనవర్గాల పథకాలు కాదు, దేశసంపదలు. అభివృద్ధికి పునాదిరాళ్లు. ఈ భావన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుది. అందుకే తెలంగాణ రాష్ట్రం బీసీ వర్గీయులను అభివృద్ధి సాధనాలుగా, గొప్పమానవ వనరుగా తీర్చిదిద్దేందు కు సిద్ధమవుతున్నది. బీసీలను ఉత్పత్తి శక్తులుగా మార్చే ప్రయత్నానికి ముగ్గులుపోస్తున్నది. ప్రధానంగా విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుదలపై ఆయన ప్రత్యేక దృష్టిపెట్టారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్డ్ ప్రకా రం తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు ఇవ్వకపోతే అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా వెనుకాడమని కేసీఆర్ అంటున్నారు.

తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా బీసీ వర్గాల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ స్టేట్స్‌మెన్‌గా ఆలోచించారు. దానికి పునాదిగా విద్యా, ఉద్యోగాల్లో బీసీ (ఈ) గ్రూపునకు చెందిన ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. సమాజంలో సగభాగానికి మించిన బీసీలకు రిజర్వేషన్ల విషయం లో రాష్ర్టాలకు స్వతంత్రత ఇవ్వాలని కేంద్రంపై పోరాటం చేస్తానని కేసీఆర్ చెప్పటమే గాక, ఈ అంశంపై అన్ని రాష్ర్టాలను కలుపుకొని ముందుకు సాగుతానని అసెంబ్లీలో బాహాటంగా ప్రకటించటం హర్షణీయం. కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాజ్యాంగ సవ రణ చేసి 9వ షెడ్యూల్డ్ ద్వారా రిజర్వేషన్లు పెంపుదల చేయాలన్న దారికి ఏపీ సీఎం చం ద్రబాబు కూడా కలిసిరాక తప్పదు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో అత్యధిక శాతం రిజర్వేషన్లు ఇచ్చిన రాష్ట్రంగా తమిళనాడు అగ్రభాగాన నిలిచింది. షెడ్యూల్డ్ 9 ద్వారా 69 శాతం రిజర్వేషన్లను తమిళనాడు సాధించుకుంది. తమిళనాడు తరహాలోనే రాష్ట్రంలో రిజర్వేషన్లు సాధించుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకు దేశంలోని అన్ని రాష్ర్టా లను ఈ అంశంపైకి ఒక దగ్గరకు తెచ్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. ఫెడరల్ వ్యవస్థ లో ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం తమకున్న జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఇచ్చుకునే హక్కుకావాలన్న దానికి కేసీఆర్ ఊపిరిపోస్తున్నారు. ఇందుకోసం బీసీ (ఈ) గ్రూపులో ఉన్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒకరోజు అసెంబ్లీని సమావేశపరిచి సభ ఏకగ్రీవ తీర్మానానికి సన్నద్ధం చేయటం, అన్నిపార్టీలు అంగీకరించాయి. రాష్ర్టాల్లో ఉన్న కులాల ఆధారంగా విద్య, ఉద్యోగ రంగాల్లో, కుటుంబ ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం తమ పరిధిలో రిజర్వేషన్లు ఇచ్చుకునే అధికారం కావాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 85 శాతంగా బహుజనవర్గాలున్నందున వారి జనాభా లెక్కలప్రకారం రిజర్వేషన్లు ఇచ్చుకునే అధికారం ఆయా రాష్ట్రాలకు ఉండాలన్న అంశంలో భారత సహకార సమాఖ్య స్ఫూర్తి ఉండాలి. అదేవిధంగా కేంద్రంలో ఓబీసీ జాబితాలోకి రాని బీసీ కులాలు ఆయా రాష్ర్టాల్లో ఉన్నాయి. బీసీల వర్గీకరణ విషయానికొస్తే తమిళనాడు, రాజస్థాన్‌ల తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా ఉన్నారు. బీసీలు 52 శాతం మంది ఇక్కడున్నారు. వీరికి 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వటం ఇప్పుడున్న విధానాల వల్ల సాధ్యం కాదు. దీన్ని జయించాలంటే రాజ్యాంగ రచన చేసుకోవాలి.

అంటే బీసీ వర్గాల్లో కొన్ని కులాలు సొంతకాళ్లపై నిలబడగలిగే స్థితిలో ఉన్నాయి. కొన్ని కులాల పరిస్థితి దారుణంగా ఉంది. ఎస్సీ, ఎస్టీల కంటే దారుణంగా ఉన్న బీసీ వర్గాలూ ఉన్నాయి. మరి వీరిపై మొదట ప్రత్యేక దృష్టి పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ డి గ్రూపులో ఉప్పర కులంతోపాటు మరో రెండు సంచార జాతులున్నాయి. కొన్ని బీసీ కులా లు బాగా దెబ్బతిని ఉన్నాయి. అగ్నికుల క్షత్రియ, మంగలి, చాకలి లాంటి కులాలు మోస్ట్‌బ్యాక్ వర్డ్‌గా ఉన్నాయి. వీళ్లకు న్యాయం జరుగాలి. చాకలి, మంగలి, వడ్రంగి, కంసాలి, మేర తదితర కొన్ని కులాలు కులవృత్తి ఆధారంగానే జీవిస్తున్నాయి. వీళ్ల ను ఎంబీసీలుగా చూడటం న్యాయం. అదేవిధంగా సంచార జాతులను ఎంబీసీలను కలిపి చూస్తే కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. బీసీలలో ఉన్న ఎ,బి,సి,డి గ్రూపుల్లో మొత్తం 61కి పైగా సంచారజాతుల లక్షణాలున్న కులాలున్నాయి. ఎస్సీ, ఎస్టీలలోని సంచార జాతులను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 85 కులాలుగా ఉన్నాయి. ముస్లిం గ్రూపుల లో 6 వరకు సంచారజాతులవారున్నారు. ఫకీర్లు, బండలు పగులగొట్టే ఖాసీంల వంటి కులాలు సంచారజాతుల వాళ్లు.
సంచారజాతులను ప్రత్యేకించి ఒక గ్రూపులో ఉంచితే ఈ వర్గాలకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో లోతుగా అధ్యయనం చేసి ఒక నిర్ణయం తీసుకుంటే అది పెద్ద మార్పునకు దారి చూపినట్లవుతుంది. కులవృత్తులను విడువని వారున్నారు. ఆ వృత్తిని విడిచి వేరే వృత్తులలోకి అడుగుపెట్టినవారు, అలాగే తమ వృత్తిని వ్యాపారవృత్తిగా మార్చుకొని నిలువగలిగిన వాళ్లున్నారు. దీనిపై కూడా విభిన్న కోణాల్లో కేసీఆర్ మేధోమథనం చేస్తున్నారు. కొన్ని కులాలకు ఆదాయ వనరుగా ఉండే వృత్తులకు సాయం ఈ కోణం నుంచే చేస్తూ వస్తున్నారు. సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో పాటు తమకు ప్రత్యేక గ్రూపులు చేస్తే మేలు జరుగు తుందని సంచార జాతులు కోరుతున్నాయి. సంచారజాతులు స్థిరనివాసులు కావాలి. వాళ్ల జీవన విధా నం సంపూర్ణంగా మారాలి. యాచకవృత్తి నుంచి ఉద్యోగ స్థిరనివాస స్థితికి రావాలి.

నేటికీ కొందరు అడవులపై ఆధారపడి జీవిస్తున్నా రు. అడుక్కు తినేవాళ్లు, పిట్టలు తినేవాళ్లు.. వీళ్లు బీసీ లే. తరతరాలుగా కొందరు యాచకవృత్తిలో జీవిస్తున్నారు. వీరు కూడా బీసీలే. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు సంచారజాతులు, పళ్లు, కూరగాయ లు, మూలికలు అమ్ముకునేవారు, కథలు చెప్పుకొని జీవించేవారు, పటం కథలు చెప్పుకుంటూ జీవించేవారు, రోడ్డుపక్కన ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటూ సెకండ్ హ్యాండ్ వస్తువుల వ్యాపారం చేసే సంచారజీవులు, ప్లాట్‌లలో చెత్తమోసుకపోయే సంచారజాతులున్నారు. వీరంతా బీసీలే. వీళ్ల బతుకులు మారా లి. అదే తన లక్ష్యంగా కేసీఆర్ ప్రతినబూనారు.

వృత్తులను నమ్ముకొని వేరే పని లేకుండా ఉన్నవా ళ్లు ఎంబీసీలు, వీరికోసం కేసీఆర్ ప్రత్యేకించి ఎం బీసీ కార్పొరేషన్‌నే నెలకొల్పారు. కుమ్మరులు, మం గలి, చాకలి, విశ్వకర్మలు, వడ్రంగి, కమ్మరి, ఔసుల, కమ్మరి, మాంసం అమ్ముకుంటూ ఎదుగుబొదుగు లేకుండా జీవిస్తున్న ఆరె కటికలు లాంటి ఎంబీసీల ను వీరిని ఆధునికత వైపునకు, ఉద్యోగ రంగాల్లోకి తీసుకురావాలి. వీరికి అత్యవసరంగా ప్రభుత్వ సా యం అవసరమని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, మంగలిషాపులు, నిర్మాణం వైపునకు దృష్టిపెట్టింది. చేతివృత్తులపై ఆధారపడి జీవించే సేవాకులాలవారు చిన్నవృత్తుల వారున్నారు. వీరం తా ఎంబీసీలుగా ఉన్నారు. వీళ్ల అభివృద్ధిని ఎలా సాధించాలన్న దానిపై ప్రభుత్వమే ప్రశ్నించుకొని ఒక సవాలుగా తీసుకొని కేసీఆర్ ఎంబీసీ కార్పొరేషన్‌ను రూపొందించారు. వృత్తులు బాగా నడిచే కులాల వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవాలి. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ఎంబీసీలను, సంచారజాతులను గుర్తించింది. వీళ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టబోతున్నది.
ఇప్పటికీ తమకు కులం సర్టిఫికెట్లు లేవని, దీనివ ల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని క్షేత్రస్థాయిలోకి వెళ్లిన బీసీ కమిషన్‌కు సంచారజాతులవా రు తెలియజేశారు. వీరి పరిస్థితి మరింత దారుణం గా ఉన్నది. మాకు కులం సర్టిఫికెట్లు ఇస్తే చాలని 24 బీసీ కులాలకు చెందిన బీసీకులాల వారు మొర పెట్టుకుంటున్నారు. తమ కులం పేరు చెప్పి సర్టిఫికె ట్లు అడిగితే ఆధారాలేమిటని అధికారులు ప్రశ్నిస్తున్నారని వారు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. వాళ్లు ఇల్లు లేని వాళ్లు, స్థిర నివాసం లేనివాళ్లు కావడంతో ఆధారాలు చూపటం తమకు కష్టంగా ఉం దంటున్నారు. తమకు కుల సర్టిఫికెట్లు ఇచ్చిన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతారని సంచారజాతులు అంటున్నాయి.
shekar
ఎంబీసీలలో నేటికీ కులవృత్తి సరిగాలేక తన్నుకులాడుతున్నారు. కులవృత్తులను వ్యాపార వృత్తులు గా మార్చుకునే శక్తులులేని పాతకాలపు కులవృత్తులున్నాయి. చాకలి వారికి మోడ్రన్ లాండ్రీ రావాలి. మంగలివారికి బ్యూటీపార్లర్లు నెలకొల్పాలి. ఆధునిక సెలూన్లు వారు పెట్టుకోలేరు. వీళ్లకు తక్షణసాయం అందాలి. పాతకాలపు పద్ధతులను వదులుకోకుండా వృత్తి ఆధునీకరణ చెందనివారు ఎంబీసీలు. ఈ స్థితి గతులన్నీ మారాలి. రాష్ట్రంలో సంచారజాతులు, ఎంబీసీలలో కొత్త వెలుగులు రావాలి. బీసీలను బలహీనవర్గాల పథకాలుగా చేసిన గత చరిత్రను తిరుగరాయాలి. బీసీలను ప్రభుత్వ పథకాలు గా కాకుం డా వీళ్ల జీవితాలను సంపూర్ణంగా మార్చే గమ్యాలు గా ముందుకు సాగుదామన్న ముఖ్యమం త్రి కేసీఆ ర్ ఆలోచనలు ఆచరణరూపం దాల్చాలని సబ్బండ వర్ణాలు కోరుకుంటున్నాయి. కేసీఆర్ తెలంగాణను బహుజన్ ప్యాట్రన్ ఆఫ్ సొసైటీగా తీర్చిదిద్దే పనిని చేపడుతున్నారు. ఇందుకు తలా ఒక చేయివేసి తెలంగాణను శక్తివంతంగా పునర్నిర్మించుకుం దాం అన్న కేసీఆర్ తలంపునకు బీసీలు ఆచరణాత్మకరూపులుగా ఎదుగాలి. తెలంగాణ పునర్నిర్మాణం అంటే సగం జనాభా గలిగిన బీసీల సంపూర్ణ అభివృద్ధి నిర్మాణం.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు )

642

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Published: Fri,June 14, 2013 12:20 AM

ఆకాంక్ష పట్టని అసెంబ్లీ

ప్రజాస్వామ్యానికి ప్రతి రూపం, ప్రజలందరి సామూహిక ముక్తకంఠం అసెంబ్లీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనంకోసం కదిలిపోయి, మంది కోసం పనిచేస

Published: Mon,June 10, 2013 12:00 AM

అసెంబ్లీని ముట్టడించనున్న ప్రజాకాంక్ష

ఏ ఉద్యమ పిలుపుకైనా తరలివచ్చే ప్రజలున్నారు. ఎంతటి నిర్బంధాన్నైనా ఎదుర్కొనగల శక్తి సామర్ధ్యాలున్న ప్రజలున్నారు. రాజ్యం వికృత చేష్ట

Published: Mon,June 3, 2013 04:29 AM

పచ్చని పల్లెటూరి పాట వెంకన్న

నిబద్ధత ఉన్న సాహిత్యం కొండమప్లూల్లాగా, బతుకమ్మలో పేర్చిన జీవమున్న పూలలాగా, పచ్చని అడవిలాగా ఉంటుంది. ప్లాస్టిక్ పూలలాంటి కవులు, బ

Published: Sun,February 10, 2013 12:17 AM

పోరు అక్షరాభ్యాసం

చుక్కా రామయ్య లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. రామయ్యలాంటి వ్యక్తులను ఒక వ్యవస్థకే నమూనాగా చెప్పవచ్చును. కళ్లముందు అన్యాయం జరుగుత

Published: Sat,January 19, 2013 11:53 PM

తెలంగాణ సాహిత్య యుద్ధభేరి

కవులూ,రచయితలూ కాలంవెంట నడుచుకుంటూ పోరని, కాలాన్నే తమ వెంట నడిపించుకుంటూ పోతారని తెలంగాణ కవులూ, రచయితలూ మరోసారి నిరూపించారు. ప్రజల

Published: Wed,December 26, 2012 11:44 PM

ఎందుకు బహిష్కరిస్తున్నామంటే..

రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి అన్ని అధికారాలను ప్రయోగించి రాజమువూదలతో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించేందు

Published: Sat,November 24, 2012 11:37 PM

సమరాలను అల్లే సూర్యాపేట సమరభేరి

ఒక సమూహం ఎక్కడైనా జమైందంటే.. ఆ నేలే పరవశం కలిగిస్తుంది. చీమల దండ్లుగా జనం కదలాడటం లాగా ఆశయాలుంటాయి. ఆశయాల ఆకాంక్షలు ఎలా జమిలిగా క

Published: Fri,December 14, 2012 04:07 PM

సమాజ నిర్మాణాలు-విలువలు-కాళోజీలు

కాళోజీ అంటే విలువలతో జీవించి జీవితాంతం నిబద్ధతతో నిలబడ్డ వ్యక్తి. ఆ తరానికే కాదు ఈతరానికి కూడా కాళోజీ ప్రతీక. ఆయన ఆ కాలానికి, ఆ త

Published: Sat,December 1, 2012 04:45 PM

సమాజాన్ని నడిపేవి త్యాగాలు, భావజాలాలే

ఒక తరంలో ప్రగతిశీల భావజాలాల విత్తనాలను నాటడం అంతసులభమైన పనేమీ కాదు. ఆ విత్తనాలను నాటడానికి నేలను పదును చేసి, దుక్కిదున్ని, వాతావరణ

Published: Sat,October 27, 2012 05:31 PM

సిరా చుక్కల సమరం

కలం సృష్టించిన జ్ఞానమే కాలం. అక్షరమే కాలాన్ని కలకాలం నిలుపుతుంది. కలం సర్వకాలాలకు కన్నులుగా, సమాజాలకు కాళ్ల చేతులుగా, ఏ వ్యవస్థలకై

Published: Wed,October 10, 2012 06:50 PM

జీవ వైవిధ్యం- జీవన విధ్వంసం

అక్టోబర్ 1 నుంచి 19 వరకు జరుగుతున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుపై ఉన్న శ్రద్ధ, గత అరవై ఏళ్లుగా రాష్ట్రం కావాలని నాలుగున్నర కోట్ల

Published: Wed,October 10, 2012 07:06 PM

పాటను బంధించలేరు

ఆకంఠ స్వరం వింటుంటే చెట్ల సామూహిక తలలపైన పక్షుల గుంపులు ఎగు రు తున్నట్లుంది. దట్టమైన అడవి అందాలు కళ్ళ ముందు కదలాడుతుంటాయి. ఆమె గొం

Published: Thu,October 11, 2012 06:03 PM

కాళన్న దారిలో కదం తొక్కుదాం

భోగోళం మీద ఎప్పుడెనా, ఎక్కడెనా ఆధిపత్యాన్ని అడ్డంగా నరికేసే ధిక్కార స్వరా లు కలాల కంఠాలే. తిరుగుబాట్లన్నీ సృజనకారుల ఆలోచనల్లోనే పొ

Published: Sat,October 6, 2012 03:26 PM

సాహిత్య సాంస్కృతిక సైన్యం ‘తెరవే’

సంఘాలకు, వేదికలకు సాహిత్య సృష్టికి సంబంధం ఉందా? సాహిత్యం సృజనకు సంబంధించినది. సంఘం అన్నది నియమ నిబంధనలకు, లక్ష్యాలకు సంబంధించింది.

Published: Sat,October 6, 2012 03:27 PM

తొలుస్తున జ్ఞాపకాలు

ఒక కాలం ఎప్పుడూ మరో కాలానికి పాఠం చెబుతూనే ఉంటుంది. ఇలా కాలానికి కాలం పాఠం చెప్పటమే పరిణామక్షికమం అనుకుంటా. ఒక కాలం ఇచ్చిన స్ఫూర్త

Published: Sat,October 6, 2012 03:27 PM

వెలిదండ: తల్లి పేగు బంధం

పుట్టిన ఊర్లను ఎలా మరిచిపోలేమో అలాగే మనలో చైతన్యాన్ని రగిలించిన ఊర్లను కూడా మరిచిపోలేం.ఎప్పుడైనా పుస్తకా లు మనలోని సృజనను తట్టిలేప

Published: Sat,October 6, 2012 03:28 PM

ఈ గర్భశోకాలకు కారణమెవ్వరు తల్లీ..!

‘తెలంగాణ ’ ఒక శక్తి సూత్రం ‘తెలంగాణ ఒక చలనం, ఒక ప్రళయం ప్రజలంటే ఆత్మాభిమాన జెండాలు పోరుదారులు తెలంగాణను ఎవరూ కాలరాయలేరు ఈ పో

Published: Sat,October 6, 2012 03:37 PM

ఈ మహాకావ్యం పేరు తెలంగాణ

హద్దులు, లెక్కల పద్దులు లేని వాడే కవి కవిత్వం విప్పిన సద్దిమూట, తనను తాను ఆరేసుకున్న ప్రకృతి పైట కవిత్వం నదుల నోటి ను

Published: Sat,October 6, 2012 03:37 PM

నివురుగప్పిన నిప్పులు

ఒక భావజాలంతో కలిసి నడిచిన మిత్రులు ఏక కంఠమై నినదించిన మిత్రు లు, ఒకే లక్ష్యంతో ఏకమైన పిడికిళ్లు, కలిసి పనిచేసి అలసిపోయిన మిత్రులు,

Published: Sat,October 6, 2012 03:39 PM

ఓరుగల్లు పోరు క్షేత్రం

తెలంగాణలో నిత్య నిర్బంధం కొనసాగుతున్న దశలో నక్సలైట్లు సభలు జరిపితే ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. పోలీసుశాఖవారు ఆ సభలకు వెళ్లవద్దని

Published: Sat,October 6, 2012 03:39 PM

ఉద్యమ నిర్వచనం మారుతున్నవేళ.

ఉద్యమం అంటే రాజకీయంగా ఒకరికొకరు విమర్శలతో విరుచుకుపడటం కాదు. ఉద్యమమంటే ఉరితాళ్ళు తీసుకొని సవాళ్లు, ప్రతిసవాళ్లతో గన్‌పార్క్‌లోని

Published: Sat,October 6, 2012 03:40 PM

శ్రీ కృష్ణకు , సుదర్శనుడికి ఎంత తేడా!

డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందన్న హోంమంత్రి చిదంబరం నోటితోనే..,డిసెంబర్ 23 న ఇరు ప్రాంతాల అభివూపాయం తీసుకున్నాకే

Published: Sat,October 6, 2012 03:44 PM

విరామమెరుగని పోరు

మలిదశ తెలంగాణ పోరులో ప్రజలు అత్యంత చారివూతాత్మకమైన పాత్ర పోషిస్తున్నారు. ఏ పోరాటంలోనైనా ఇంతకంటే తెగించి పోరాడుతున్న ప్రజలుంటారా? త

Published: Sat,October 6, 2012 03:44 PM

సకల జనాగ్రహం

ప్రశ్నలు.. సంఘర్షణలు.. వాదోపవాదా లు.. ఒత్తిడులు.. ఒడిదొడుకులు..లాఠీలు.. తూ టాలు.. ఆత్మ బలిదానాలు.. రాజకీయాలు, రాజకీయక్రీడలు, ఎత్త

Published: Sat,October 6, 2012 03:43 PM

ఒకే మాట, ఒకే బాట

కేంద్రాన్ని, ఆంధ్రా ఆధిపత్య శక్తులను ఒక పక్క ఎదుర్కొంటూనే మరో పక్క తెలంగాణలో భిన్న రాజకీయ చైతన్యాల మధ్య తెలంగాణ రాష్ట్ర అంశంపై ఏక

Published: Sat,October 6, 2012 03:43 PM

ఉద్యమాలకు అన్నం పెట్టిన అవ్వ

-జూలూరు గౌరీశంకర్ తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి అడవి ఉద్యమానికి మైదాన ఉద్యమానికి సంబంధించిన కీలకమైన సమాచారానికి మధ్య

Published: Sat,October 6, 2012 03:42 PM

మన సాంస్కక్షుతిక ఉద్యమ తల్లిపేగు జయశంకర్

-ఆయన తెలంగాణ గుండె చప్పుడు. ఆయన తెలంగాణ సాంస్కృతిక పేగుబంధం. అయనను తెలంగాణ పదబంధాల నుంచి విడదీసి చూడలేం. ప్రొఫెసర్ కొత్తపల్లి

Published: Sat,October 6, 2012 03:41 PM

తెలంగాణ కలాల కోలాటం.. తెరవే

కడుపులో పిండం పెరిగి పెద్దయి, కడుపులో తండ్లాడి, మాతృగర్భం చీల్చుకుని శిశువు పెట్టిన కేక ఒక జననం. కాలం జీవించటానికి, కదలటానికి, ముం