భావ విప్లవానికి నాంది


Wed,April 13, 2016 01:20 AM

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా సాహెబ్ అంబేద్కర్. కులం లేని, మతం లేని సమాజాన్ని నిర్మించాలని విశ్వపౌరుడిగా, విశ్వ శ్రేయోరాజ్యం కోసం తపించి అందుకోసం జీవితా న్ని అంకితం చేసిన వ్యక్తి అంబేద్కర్. అలాంటి ఉన్నతమైన అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సీఎం కేసీ ఆర్ హైదరాబాద్‌లో స్థాపించాలనుకోవటం భావ విప్లవానికి నాంది కాబోతున్నది.
తరతరాల చరిత్రకు, సాంస్కృతిక సంపదకు నిలయమైన భాగ్యనగరం ఇప్పుడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన చేయాలన్న సంకల్పంతో విశ్వవేదిక మీద ఒక చారిత్రక గుర్తుగా మిగలబోతున్నది. ప్రపంచ దేశాల చరిత్రను గమనిస్తే అద్భుత ఆవిష్కరణలతో కొన్ని దేశాలు ప్రపంచానికే మణిహారంగా నిలిచాయి. 502 అడుగులతో (153 మీటర్లు) స్ప్రింగ్ టెంపుల్ బుద్ధా హెనాన్ చైనాలో నిర్మించబడింది. అమెరికాలో స్ట్యాచ్యూ ఆఫ్ లిబర్టీ 93 మీట ర్ల ఎత్తులో నిర్మించారు. సోవియట్ యూనియన్‌లో ది మదర్‌ల్యాండ్ కాల్స్‌ను 91 మీటర్లతో మమా వేక్ ఖుర్‌గాన్ నిర్మించారు. మనదేశంలో కర్ణాటకలోని శ్రావణ బెళాగోల గోమఠేశ్వరి స్వామి పేరుతో 57 అడుగులతో మహావీర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. గుజరాత్‌లో నరేంద్ర మోదీ నేతృత్వంలో నర్మదా సరోవర్ నది మధ్యలో 597 అడుగులు (182) మీటర్లతో వల్లభ్ భాయి పటేల్ విగ్రహాన్ని నెలకొల్పటం పూర్తి కావొచ్చింది.
చైనా అంటే గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా గుర్తుకు వస్తుంది. అమెరికా అంటే ఫ్రీడవ్‌ు ఆఫ్ స్ట్యాచ్యూ, రష్యాలో ఎత్తైన లెనిన్ విగ్రహం, అమెరికాలో వైట్‌హౌస్ ఎలా చారిత్రకంగా గుర్తుకువస్తాయో, భారతదేశం అంటే తాజ్‌మహ ల్, హైదరాబాద్ అంటే చార్మినార్ గుర్తుకు వస్తుంది. హైదరాబాద్‌లో ఆర్ట్స్ కాలేజీ, హైకోర్టు అసెంబ్లీ, ఉస్మానియా దవఖానాలు చారిత్రక కట్టడాలుగా ప్రపంచపర్యాటక స్థలాలుగా నిలిచాయి.

తెలంగాణ రాష్ర్టావతరణ తర్వాత ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రెండు పడకల గదుల ఇళ్ల పథకం లాంటి కార్యక్రమాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కేసీఆర్ సమాజాన్ని, పుస్తకాలను, నడుస్తున్న చరిత్రను ఆకళింపు చేసుకున్న ముఖ్యమంత్రి కావడం వల్ల ఆయన చేసే ప్రతీ కార్యక్రమం ఒక చారిత్ర క మలుపుగా ఆవిష్కరించబడుతూ వస్తుంది. ఒక సుదీర్ఘ కాలం పట్టువిడవకుండా తెలంగాణ రాష్ట్ర సాధన అస్తిత్వ ఉద్యమాన్ని వెనకడుగు వేయకుండా కొనసాగించారు. ప్రపంచ అస్తిత్వ ఉద్యమాలకు, అట్టడుగు బహుజనావళికి తాత్త్విక బాట చూపి, వారి విముక్తికి బాటలు వేసిన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తున నిర్మించాలని కేసీఆర్ తలంచటం, అందుకు ఈ నెల 14న శ్రీకారం చుట్టబోవటం చారిత్రాత్మకమైనది. ఇది తెలంగాణ రాష్ర్టానికే కాకుండా దేశ ప్రతిష్ఠను ప్రపంచ వ్యాపితంగా చాటి చెప్పేది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తయితే అది ప్రపంచ పర్యాటక కేంద్రంగా నిలుస్తుంది. ఇప్పటికే గుజరాత్‌లో సర్దార్ వల్లభ్ భాయిపటేల్ అతిపెద్ద భారీ విగ్రహ నిర్మాణానికి మోదీ కంకణదారుడయ్యాడు.

Gourishankerఇప్పుడు కేసీఆర్ నిర్ణయంతో భారత రాజ్యాంగ నిర్మాత పేర భారీ విగ్రహ నిర్మాణం చరిత్రలో చెరిగిపోని పేజీగా నిలుస్తుంది. కొన్ని పను లు చేయటం వల్ల కొందరు వ్యక్తులు చరిత్రకారులుగా నిలుస్తారు. పద్నాలుగేళ్లు సుదీర్ఘకాలం రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తన భుజ స్కంధాలపై వేసుకుని వెన్ను చూపకుండా ముందుకుసాగటంతో కేసీఆర్‌కు తరగని కీర్తిని తెచ్చిపెట్టింది. 125 అడుగుల ఎత్తుగల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం చేపట్టబోవటంతో ఆయన శాశ్వతంగా దళితుల చెలికాడుగా నిలువబోతున్నాడు. ప్రపంచంలో మనిషి ఆత్మగౌరవం కంటే మించినది మరోటిలేదు. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం మరణం అంచుదాకా పోగలిగినవాడు కాబట్టే అట్టడుగు వర్గాల ఆత్మగౌరవ పతాకమైన అంబేద్కర్ భారీ విగ్రహం నెలకొల్పేందుకు నిర్ణయం తీసుకోగలిగాడు. ఇప్పుడు హైదరాబాద్‌కు చార్మినార్ సొబగులతోపాటుగా ఆత్మగౌరవాన్ని అంబేద్కర్ విగ్ర హ రూపం భాగ్యనగరం కంఠాభరణంగా నిలువనున్నాయి. చికాగోలో ప్రపంచ కార్మికుల పర్వదినమైన మేడే చిహ్నం, ఢిల్లీలోని గేట్‌వే ఆఫ్ ఇండియా లాగా, జైనుల మహావీరులాగా, ప్రపంచంలో ఎత్తయిన పిరమిడ్లలాగా, అంబేద్కర్ అతి పెద్ద భారీ విగ్రహం అస్తిత్వ ఉద్యమాల ఆత్మగౌరవ చిహ్నంగా తెలంగాణ నేలపై చిరస్థాయిగా నిలుస్తుంది. ఆ భారీ విగ్రహం నిర్మాణంతో కేసీఆర్ జన్మధన్యం కాబోతున్నది. ఇది మామూలు విషయం కాదు. భారత రాజ్యాంగానికి, రాజ్యాం గ నిర్మాతలందరికీ ఘనమైన సత్కారంగా నిలుస్తుంది. కేసీఆర్ అంబేద్కర్ విగ్ర హ నిర్మాణ నిర్ణయం తీసుకున్న తర్వాత మొత్తం తెలంగాణ సమాజం ప్రపంచ ఆత్మగౌరవ పాఠశాలగా చరిత్ర లో నిలిచిపోతుంది. ఆ విగ్రహ నిర్మాణం సంకల్పం రావటమే ఒక మహత్తర ఆలోచన. ఆ విగ్రహ నిర్మాణం లో కేసీఆర్‌కు అండగా కోట్లాది మంది దళిత బహుజను లు అండగా నిలుస్తారు. దేశమే తలవొంచి ఇందుకు ఏ సాయం చేయమన్నా చేస్తుంది. ఆ విగ్ర హ నిర్మాణం పూర్తయితే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ తమ జీవిత కాలంలో ఆ విగ్రహాన్ని ఒక్కసారైనా దర్శించాలన్న మొక్కుగా, ఒక కోరికగా మిగులుతుంది.

సంకల్ప సాధనల నుంచే కొత్త చరిత్ర పుడుతుంది. కేసీఆర్ సంకల్ప సాధకుడు తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరన్న శ్రీశ్రీ పద్య పాదాల్లో శ్రామికశక్తి విముక్తి ఉంది. కానీ ఈ అంబేద్కర్ భారీ విగ్రహ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలం మేమేనని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకుంటారు.
అధికారంలోకి వచ్చిన వాళ్లు ఎవ్వరైనా ఐదేళ్లుంటా రు. ఆ పాలన బాగుంటే మరో పదేళ్లూ ఉంటారు. కానీ, హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలన్న కేసీఆర్ ఆలోచన ప్రజాస్వామిక ప్రభుత్వ తలంపుగా చూడాలి. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలన్న ఆలోచనలు చేయటం, అంబేద్కర్ విగ్రహం వేయాలన్న తలంపు సామాజిక భావ విప్లవానికి సూచనలుగానే కన్పిస్తున్నాయి. ప్రజా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన పాలనాదక్షత వల్ల, డబుల్ బెడ్‌రూంల ఇళ్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులు జరుగుతాయని ఎక్కువ మందికి భరోసా కలిగించగలిగాడు. 1956 నవంబరు 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ అలజడుల నుంచి తెలంగాణ ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత అస్థిరత నుంచి సుస్థిరత వైపు నకు ప్రయాణం చేస్తున్నది. జాతిని నడిపించే నాయకులను కాలమే రూపొందించుకుంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసేందుకు కేసీఆర్ ను సృష్టించుకుంది. హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని వేసేందుకు కేసీఆర్ కృషిచేయటం సామాజిక వర్గాలకు భరోసాగా నిలుస్తున్నది. కేసీఆర్ చేయబోయే ఈ పని వల్ల యావత్ భారతజాతి తెలంగాణ రాష్ట్రం వైపు దృష్టి సారిస్తుంది.

1434

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల