విరామమెరుగని పోరు


Sat,October 6, 2012 03:44 PM

మలిదశ తెలంగాణ పోరులో ప్రజలు అత్యంత చారివూతాత్మకమైన పాత్ర పోషిస్తున్నారు. ఏ పోరాటంలోనైనా ఇంతకంటే తెగించి పోరాడుతున్న ప్రజలుంటారా? తెలంగాణ ప్రజలు ఇంతకంటే ఏం చేయాలి? ప్రపంచ పటంలో ఎక్కడ చూసినా ప్రజా ఆగ్రహం కట్టలు తెగితే హింస ప్రజ్వరిల్లుతుంది. కానీ తెలంగాణలో అందుకు భిన్నంగా ప్రజలు అహింసామార్గంలో గాంధీ మార్గంలో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం ఇక్కడ తెలంగాణపై హింసను ప్రయోగిస్తోంది. పాలకులే హింసకు పాల్పడటం విడ్డూరం. ప్రజలందరూ సామూహికంగా కదిలివచ్చారు. ఎవ్వరు ఏ పిలుపునిచ్చినా కదిలారు. పిలుపునిచ్చిన నాయకులు, సంఘాలను వాళ్లు చూడలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన అన్న ఒక్క విషయాన్నే ప్రజలంతా సామూహికంగా ఏకమై ఉద్యమంలో కదిలివచ్చేందుకు దోహదపడింది. ఇంత ఐక్యత ఉండటం వల్లనే చరివూతలో ఎన్నడూ లేని విధంగా సింగరే ణి, ఆర్టీసీ సమ్మె విజయవంతమైంది. లక్షలా ది ఉద్యోగులు తమ విధులను బహిష్కరించా రు. సమాజంలోని అన్ని వర్గాలు ఈ పోరు బరిలో దూకాయి. ప్రజలంతా ఒక్కటై తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్న తరుణంలో, ఈ సకల జనుల సమ్మెను అణచివేసేందుకు పాలకులు మిలిటరీ బలగాలను తెలంగాణ నేలపై దింపారు.

తీవ్రమైన నిర్బంధం, అరెస్టులు, కేసులు పెడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలను 13 రోజులు రిమాండుకు పంపడాలు, 3500 మందిని ముందస్తుగా అరెస్టు చేశారు. మొత్తంగా తెలంగాణను ఖాకీలు బీభత్సం చేశారు. ప్రజల ఆకాంక్షలను విని పరిష్కరించాల్సిన ప్రభు త్వం ప్రజల గొంతును నొక్కేందుకే మిలటరీని ప్రజలపైకి పంపింది. రైలు రోకోకు ముందు రెండు రోజులుగా డీజీపీ దినేష్‌డ్డి ప్రజలను భయ బ్రాంతులను చేసేందుకు ప్రకటనల మీద ప్రకటలు చేశారు. ఉద్యమంలో పాల్గొన్నా, పరోక్షంగా ప్రేరేపించినా కేసులు నమోదు చేస్తామని ప్రచార ప్రసార సాధనాల ద్వారా హెచ్చరికలు చేశారు. మొత్తం తెలంగాణ ప్రజలను బెదిరింపులకు గురి చేశారు. అయితే ఈ రాష్ట్ర సాధన సమస్య ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశం. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పా లి. రాష్ట్ర పాలకులు ఈ సమస్య పరిష్కారానికి కృషిచేయాలి. ప్రజలు సామూహికంగా ఉద్యమిస్తుంటే ఇందుకు సమాధానం చెప్పవలసిన తెలంగాణ మంత్రులు నోరుమెదపకుండా కూర్చున్నారు. ప్రభుత్వం బెదిరింపులకు దిగినా ప్రజలు ఎవరూ బెదరలేదు. వెనకడుగు వేయలేదు. రైలు పట్టాలపైకి తెలంగాణ సమాజం కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉద్యమంలోకి దూకింది. మమ్ములందర్నీ అరెస్టు చేయండని సామూహికం గా ఉద్యమకారులు డిమాండ్ చేశారు. అనేక మంది నేతలను, ఉద్యమకారులను అరెస్టుచేసినా, కేసులు మోపినా రైలు రోకోను జరిపి తీరారు.
సీమాంవూధకు చెందిన నేతలు తమ ఆలోచనను తెలంగాణ మంత్రులతో అమలు జరిపించుకోవడం దారుణమైనది.

చావోరేవో తేల్చుకుంటామని తెలంగాణ సమాజమంటుంటే సమ్మెను విరమించమని మంత్రులు కోరడం విచిత్రం. ప్రజలకు అండగా నిలవాల్సిన తెలంగాణ మంత్రులు ప్రజల ఆకాంక్షల గొంతుకోసేందుకే సిద్ధం కావడం ద్రోహం. ఇంతపెద్ద ఉద్యమం జరుగుతున్నా ఇంకా తమ పదవులు పట్టుకొని వేలాడుతున్న వీరిని ప్రజావూదోహులని, ప్రజాకం ప్రజలు ఈసడించుకుంటున్నారు. తెలంగాణకు చెందిన నేతలే ఈ సకల జనుల ఉద్యమానికి ద్రోహులుగా మారడం ఇక్కడి ప్రజలు జీర్జించుకోలేకపోతున్నారు. ఈ నెలలోనే ముప్ఫై మందికి పైగా ఆత్మబలిదానాలు చేసుకున్నారు. దీనికి కారకులు కేంద్ర రాష్ట్ర ప్రభువులు, తెలంగాణ ద్రోహపూరిత నేతలే. ప్రజలు చేస్తు న్న ఈ సకల జనుల సమ్మెలో పాల్గొని వారిపై ఈగ వాలకుండా చూసుకోవాల్సిన తెలంగాణ మంత్రులు అందుకు భిన్నంగా ప్రభుత్వంతో చేతు లు కలిపారు. తెలంగాణ సమాజంపై నిర్బంధం ప్రయోగించడానికి, తెలంగాణ మంత్రులే దోహదపడటం, సీమాంధ్ర మంత్రులతో కలిసి గొంతు కలపడం దారుణమైనది.

మిలటరీ పోలీసు బలగాలతో పాలనను ఎలా కొనసాగిస్తారని, తెలంగాణ మంత్రులు ఇక తమ నియోజకవర్గాల్లో కూడా తిరగడం కష్టమేనని ఇప్పటికీ పలు జేఏసీలు ప్రకటించాయి. సమ్మె విరమించండని మంత్రి జానాడ్డి చేసిన ప్రకటన మొత్తం తెలంగాణ సమాజాన్ని బాధపెట్టింది. ప్రజలు ఆ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమానికి పెద్ద దిక్కుగా నిలుస్తాడని ఎదురుచూస్తున్న ఈ సందర్భంలో మంత్రి జానాడ్డి ఈ రకంగా మాట్లాడతారని తెలంగాణ సమాజం ఊహించలేదు. జానాడ్డి ఆచితూచి వ్యవహరిస్తారనే నమ్మకం కూడా ఉంది. ఎందుకు జానాడ్డి లాంటి నాయకుడు ఇలా వ్యవహరించారని కేకే కేకలు కూడా పెట్టారు. జానాడ్డి మాత్రమే కాదు. మొత్తం తెలంగాణ మంత్రుల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమౌతుంది.
సకల జనుల సమ్మెను మిలటరీ బలగాల ద్వారానో, పోలీసుల బెదిరింపుల ద్వారానో , లేదా తెలంగాణ మంత్రులతో ప్రకటనలు చేయించి అణచివేయాలని చూస్తే అందుకు భిన్నమైన ఫలితాలు వస్తాయి. ఇప్పు డు సకల జనుల సమ్మెను ఎవరు విరమింపజేసే ప్రయత్నం చేసినా తెలంగాణ ఉపేక్షించే స్థితిలో లేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం పెదవి విప్పి ప్రకటన చేసేంతవరకు ఈ పోరాటం సాగుతుంది. ఉక్కుపాదాలతో, హెచ్చరికలతో, రాజ్యహింసలతో ఈ ఉద్యమాన్ని అణచలేరు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఈ పోరాటం ఆగకుండా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన తప్ప మరేమాట వినే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు.


తెలంగాణ ఉద్యమాన్ని అన్ని కోణాలనుంచి సామాజిక తత్త్వవేత్తలు, ఆలోచనాపరులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు దశల తెలంగాణ పోరాటాన్ని చూడటం జరిగింది. ఇప్పుడు మూడో దశ పోరు కొనసాగుతున్నది. నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో వేల మంది నేలకొరిగారు. 1969లో 369 మంది పోలీసు కాల్పుల్లో అసువులు బాశారు. ఒక ఉద్యమ పోరు ప్రవాహంలో వేల మంది ఎన్‌కౌంటర్‌లో నెత్తురు ముద్దలయ్యారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను తామే ఆత్మాహుతి చేసుకొని 700 మందికి పైగా ఆత్మబలిదానాలను చేస్తూ ఈ ఉద్యమాగ్ని రగిలించా రు. ప్రజల సంకల్ప బలం బలమైనది. నాయకత్వమే ఊగిసలాడుతున్నది. ప్రజలు స్వరాష్ట్రం కోసం పోరాడుతుంటే, నేతలు తమ కుర్చీల కోసం తన్నుకు చస్తున్నారు. అందుకే, ఇంత మహత్తర సకల జనుల మహాక్షిగహంలో కూడా మంత్రు ల చూపంతా అధికారంవైపే ఉండటం తెలంగాణ దురదృష్టం. ప్రజల దృష్టంతా తమ నేల బంగారు భవిష్యత్‌పై ఉంది. ఈ ప్రజలకు పార్లమెంట్, అసెంబ్లీ కుర్చీలు అక్కర్లేదు. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడని తెలంగాణ రాష్ట్రం కావాలన్న లక్ష్యంతో ముందుకు నడుస్తున్న మహత్తర ఉద్యమిది. తెలంగాణ తన 60 ఏళ్ల కలలను నిజం చేసుకోవాలని తహతహలాడుతున్నది. ఇంకా ఈ సమస్యను నాన్చడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. ఈ నేలను ఒకనాడు సోవియట్ యూనియన్ కదిలించింది. ఆ తర్వాత ఆఫ్రికా దేశాల్లో ఉద్యమాలు కదిలించాయి. నేడు వాల్ స్ట్రీట్ ఉద్యమం కదిలిస్తున్నది. అది నూయార్క్ నుంచి మొద లై రోమ్ వరకు వచ్చింది.

ఇది తెలంగాణ నేల కూడా హైదరాబాద్ దిగ్బంధనంతో తాకనుంది. అరబ్‌దేశాల మంటలు, మిలియన్ మార్చ్ లు ఈ నేలలో మండుతున్నాయి. ఇంత అద్భుత చరిత్ర ఆవిష్కరణలో తెలంగాణ మంత్రులు ద్రోహులుగా మారడమే దారుణాతి దారుణమైనది. తెలంగాణ విద్రోహ నేతలను చరిత్రే అసహ్యించుకుంటుంది. తెలంగాణ మంత్రులు ఇప్పుడు విరగటానికి సిద్ధంగా ఉన్నా అధికారాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. అవి విరిగితే కానీ వాళ్ళు నేల మీద కాలుమోపరు. తెలంగాణ మంత్రులు వహిస్తున్న నీచ పాత్రను సమస్త సమా జం ఏవగించుకుంటోంది. ఉద్యమ ప్రవాహం నుంచి వేరుపడ్డ వారి నెవరినైనా చరిత్ర క్షమించదు.

-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Published: Fri,June 14, 2013 12:20 AM

ఆకాంక్ష పట్టని అసెంబ్లీ

ప్రజాస్వామ్యానికి ప్రతి రూపం, ప్రజలందరి సామూహిక ముక్తకంఠం అసెంబ్లీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనంకోసం కదిలిపోయి, మంది కోసం పనిచేస

Published: Mon,June 10, 2013 12:00 AM

అసెంబ్లీని ముట్టడించనున్న ప్రజాకాంక్ష

ఏ ఉద్యమ పిలుపుకైనా తరలివచ్చే ప్రజలున్నారు. ఎంతటి నిర్బంధాన్నైనా ఎదుర్కొనగల శక్తి సామర్ధ్యాలున్న ప్రజలున్నారు. రాజ్యం వికృత చేష్ట

Published: Mon,June 3, 2013 04:29 AM

పచ్చని పల్లెటూరి పాట వెంకన్న

నిబద్ధత ఉన్న సాహిత్యం కొండమప్లూల్లాగా, బతుకమ్మలో పేర్చిన జీవమున్న పూలలాగా, పచ్చని అడవిలాగా ఉంటుంది. ప్లాస్టిక్ పూలలాంటి కవులు, బ

Published: Sun,February 10, 2013 12:17 AM

పోరు అక్షరాభ్యాసం

చుక్కా రామయ్య లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. రామయ్యలాంటి వ్యక్తులను ఒక వ్యవస్థకే నమూనాగా చెప్పవచ్చును. కళ్లముందు అన్యాయం జరుగుత

Published: Sat,January 19, 2013 11:53 PM

తెలంగాణ సాహిత్య యుద్ధభేరి

కవులూ,రచయితలూ కాలంవెంట నడుచుకుంటూ పోరని, కాలాన్నే తమ వెంట నడిపించుకుంటూ పోతారని తెలంగాణ కవులూ, రచయితలూ మరోసారి నిరూపించారు. ప్రజల

Published: Wed,December 26, 2012 11:44 PM

ఎందుకు బహిష్కరిస్తున్నామంటే..

రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి అన్ని అధికారాలను ప్రయోగించి రాజమువూదలతో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించేందు

Published: Sat,November 24, 2012 11:37 PM

సమరాలను అల్లే సూర్యాపేట సమరభేరి

ఒక సమూహం ఎక్కడైనా జమైందంటే.. ఆ నేలే పరవశం కలిగిస్తుంది. చీమల దండ్లుగా జనం కదలాడటం లాగా ఆశయాలుంటాయి. ఆశయాల ఆకాంక్షలు ఎలా జమిలిగా క

Published: Fri,December 14, 2012 04:07 PM

సమాజ నిర్మాణాలు-విలువలు-కాళోజీలు

కాళోజీ అంటే విలువలతో జీవించి జీవితాంతం నిబద్ధతతో నిలబడ్డ వ్యక్తి. ఆ తరానికే కాదు ఈతరానికి కూడా కాళోజీ ప్రతీక. ఆయన ఆ కాలానికి, ఆ త

Published: Sat,December 1, 2012 04:45 PM

సమాజాన్ని నడిపేవి త్యాగాలు, భావజాలాలే

ఒక తరంలో ప్రగతిశీల భావజాలాల విత్తనాలను నాటడం అంతసులభమైన పనేమీ కాదు. ఆ విత్తనాలను నాటడానికి నేలను పదును చేసి, దుక్కిదున్ని, వాతావరణ

Published: Sat,October 27, 2012 05:31 PM

సిరా చుక్కల సమరం

కలం సృష్టించిన జ్ఞానమే కాలం. అక్షరమే కాలాన్ని కలకాలం నిలుపుతుంది. కలం సర్వకాలాలకు కన్నులుగా, సమాజాలకు కాళ్ల చేతులుగా, ఏ వ్యవస్థలకై

Published: Wed,October 10, 2012 06:50 PM

జీవ వైవిధ్యం- జీవన విధ్వంసం

అక్టోబర్ 1 నుంచి 19 వరకు జరుగుతున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుపై ఉన్న శ్రద్ధ, గత అరవై ఏళ్లుగా రాష్ట్రం కావాలని నాలుగున్నర కోట్ల

Published: Wed,October 10, 2012 07:06 PM

పాటను బంధించలేరు

ఆకంఠ స్వరం వింటుంటే చెట్ల సామూహిక తలలపైన పక్షుల గుంపులు ఎగు రు తున్నట్లుంది. దట్టమైన అడవి అందాలు కళ్ళ ముందు కదలాడుతుంటాయి. ఆమె గొం

Published: Thu,October 11, 2012 06:03 PM

కాళన్న దారిలో కదం తొక్కుదాం

భోగోళం మీద ఎప్పుడెనా, ఎక్కడెనా ఆధిపత్యాన్ని అడ్డంగా నరికేసే ధిక్కార స్వరా లు కలాల కంఠాలే. తిరుగుబాట్లన్నీ సృజనకారుల ఆలోచనల్లోనే పొ

Published: Sat,October 6, 2012 03:26 PM

సాహిత్య సాంస్కృతిక సైన్యం ‘తెరవే’

సంఘాలకు, వేదికలకు సాహిత్య సృష్టికి సంబంధం ఉందా? సాహిత్యం సృజనకు సంబంధించినది. సంఘం అన్నది నియమ నిబంధనలకు, లక్ష్యాలకు సంబంధించింది.

Published: Sat,October 6, 2012 03:27 PM

తొలుస్తున జ్ఞాపకాలు

ఒక కాలం ఎప్పుడూ మరో కాలానికి పాఠం చెబుతూనే ఉంటుంది. ఇలా కాలానికి కాలం పాఠం చెప్పటమే పరిణామక్షికమం అనుకుంటా. ఒక కాలం ఇచ్చిన స్ఫూర్త

Published: Sat,October 6, 2012 03:27 PM

వెలిదండ: తల్లి పేగు బంధం

పుట్టిన ఊర్లను ఎలా మరిచిపోలేమో అలాగే మనలో చైతన్యాన్ని రగిలించిన ఊర్లను కూడా మరిచిపోలేం.ఎప్పుడైనా పుస్తకా లు మనలోని సృజనను తట్టిలేప

Published: Sat,October 6, 2012 03:28 PM

ఈ గర్భశోకాలకు కారణమెవ్వరు తల్లీ..!

‘తెలంగాణ ’ ఒక శక్తి సూత్రం ‘తెలంగాణ ఒక చలనం, ఒక ప్రళయం ప్రజలంటే ఆత్మాభిమాన జెండాలు పోరుదారులు తెలంగాణను ఎవరూ కాలరాయలేరు ఈ పో

Published: Sat,October 6, 2012 03:37 PM

ఈ మహాకావ్యం పేరు తెలంగాణ

హద్దులు, లెక్కల పద్దులు లేని వాడే కవి కవిత్వం విప్పిన సద్దిమూట, తనను తాను ఆరేసుకున్న ప్రకృతి పైట కవిత్వం నదుల నోటి ను

Published: Sat,October 6, 2012 03:37 PM

నివురుగప్పిన నిప్పులు

ఒక భావజాలంతో కలిసి నడిచిన మిత్రులు ఏక కంఠమై నినదించిన మిత్రు లు, ఒకే లక్ష్యంతో ఏకమైన పిడికిళ్లు, కలిసి పనిచేసి అలసిపోయిన మిత్రులు,

Published: Sat,October 6, 2012 03:39 PM

ఓరుగల్లు పోరు క్షేత్రం

తెలంగాణలో నిత్య నిర్బంధం కొనసాగుతున్న దశలో నక్సలైట్లు సభలు జరిపితే ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. పోలీసుశాఖవారు ఆ సభలకు వెళ్లవద్దని

Published: Sat,October 6, 2012 03:39 PM

ఉద్యమ నిర్వచనం మారుతున్నవేళ.

ఉద్యమం అంటే రాజకీయంగా ఒకరికొకరు విమర్శలతో విరుచుకుపడటం కాదు. ఉద్యమమంటే ఉరితాళ్ళు తీసుకొని సవాళ్లు, ప్రతిసవాళ్లతో గన్‌పార్క్‌లోని

Published: Sat,October 6, 2012 03:40 PM

శ్రీ కృష్ణకు , సుదర్శనుడికి ఎంత తేడా!

డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందన్న హోంమంత్రి చిదంబరం నోటితోనే..,డిసెంబర్ 23 న ఇరు ప్రాంతాల అభివూపాయం తీసుకున్నాకే

Published: Sat,October 6, 2012 03:44 PM

సకల జనాగ్రహం

ప్రశ్నలు.. సంఘర్షణలు.. వాదోపవాదా లు.. ఒత్తిడులు.. ఒడిదొడుకులు..లాఠీలు.. తూ టాలు.. ఆత్మ బలిదానాలు.. రాజకీయాలు, రాజకీయక్రీడలు, ఎత్త

Published: Sat,October 6, 2012 03:43 PM

ఒకే మాట, ఒకే బాట

కేంద్రాన్ని, ఆంధ్రా ఆధిపత్య శక్తులను ఒక పక్క ఎదుర్కొంటూనే మరో పక్క తెలంగాణలో భిన్న రాజకీయ చైతన్యాల మధ్య తెలంగాణ రాష్ట్ర అంశంపై ఏక

Published: Sat,October 6, 2012 03:43 PM

ఉద్యమాలకు అన్నం పెట్టిన అవ్వ

-జూలూరు గౌరీశంకర్ తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి అడవి ఉద్యమానికి మైదాన ఉద్యమానికి సంబంధించిన కీలకమైన సమాచారానికి మధ్య

Published: Sat,October 6, 2012 03:42 PM

మన సాంస్కక్షుతిక ఉద్యమ తల్లిపేగు జయశంకర్

-ఆయన తెలంగాణ గుండె చప్పుడు. ఆయన తెలంగాణ సాంస్కృతిక పేగుబంధం. అయనను తెలంగాణ పదబంధాల నుంచి విడదీసి చూడలేం. ప్రొఫెసర్ కొత్తపల్లి

Published: Sat,October 6, 2012 03:41 PM

తెలంగాణ కలాల కోలాటం.. తెరవే

కడుపులో పిండం పెరిగి పెద్దయి, కడుపులో తండ్లాడి, మాతృగర్భం చీల్చుకుని శిశువు పెట్టిన కేక ఒక జననం. కాలం జీవించటానికి, కదలటానికి, ముం