సకల జనాగ్రహం


Sat,October 6, 2012 03:44 PM

ప్రశ్నలు.. సంఘర్షణలు.. వాదోపవాదా లు.. ఒత్తిడులు.. ఒడిదొడుకులు..లాఠీలు.. తూ టాలు.. ఆత్మ బలిదానాలు.. రాజకీయాలు, రాజకీయక్రీడలు, ఎత్తుగడలు, వ్యూహాలు ఒకటా రెండా... వందల వేల జేఏసీలు.. విరబూసిన సమస్త రంగులు.. అన్నీ ఇక్కడే.. అంతా ఇక్కడే.. అందరి కన్నులు ఇక్కడే.. అందరి దృష్టి మా మీదే.. కేసీఆర్ ఒక్కడే.. లక్షల మంది జేఏసీలు. గద్దర్ ఒక్కడే.. వేల పాటలతోటలు..

బహుజన స్వరాలు, బడుగుల బహుదూరపు చూపులు, దలిత ద్వారాలు.. తెరుచుకుంటున్నాయి. అదిగదిగో చుక్కారామయ్య తన చేతులతో సాంకేతిక తెలంగాణను రచిస్తున్నాడు చూడు. అల్లం నారాయణ , కెఎస్, టంకశాలలు తెగని రాతలతో అక్షరాల ప్రవాహంగా పొంగి ప్రవహించాల్సిందే.
ఇంత ఉద్యమమూ, ఇన్ని ప్రశ్నలూ ఎక్కడుంటాయ్? ఇంత నిత్యనిర్బంధమూ ఎక్కడుంటుది? నిర్బంధం ప్రసవించిన ప్రతి సారి పుట్టే ఉద్యమాల సంతానమే తెలంగాణ కదా! ఇక్కడ రహదారులన్నీ చూస్తుంటే కదలిక లేదు. నిత్యం తన వాహన సంతానంతో కళకళలాడే రోడ్లన్నీ బిక్కు బిక్కుమంటున్నాయి. తమ బిడ్డల్ని కోల్పోయిన తల్లుల గర్బశోకంతో తెలంగాణ ఎర్ర సెలకలు. నదుల చలనం ఆగింది. నీళ్లకు కదలిక లేక నిలకడయ్యాయి. గాలి వీచటం మానింది. అడవులన్నీ మంటలతో దహించుకుపోతున్నాయి. పట్టాలున్నాయి రైళ్లు రావు. బస్ స్టాండ్‌లున్నాయి బస్సులు లేవు. సింగరేణిలో కదలని బొగ్గు పెల్ల. భగ్గున మండే బొగ్గుబాయిలు చల్లబడ్డాయి. బొగ్గు తాను మండుతనన్నది. కానీ తన మీద చెయ్యేస్తే ఒప్పుకోనని సింగరేణి సామూహికంగా చెప్పింది. నిత్యం పాల బుగ్గలతో పసి నవ్వులతో తిరగాడే చదువుల ప్రాంగణాలు నిర్జీవంగా బోసిపోయాయి.

బ్లాక్ బోర్డులు నల్లని నిరసన గీతాలయ్యాయి. పిల్లలు రాక తరగతి గదులు మనాది పట్టి మంచమెక్కినట్లున్నయ్. పిల్లలు దూరమైన పంతుళ్లు చెప్పలేని బాధా కావ్యాలయ్యారు. విద్యుత్ తీగల్లోంచి తెలంగాణ ఉద్యమం ప్రవహిస్తోంది. న్యాయవాదుల నల్లకోట్ల నుంచి ఇరగకాస్తున్న ఎండలు, ముగ్గులు పోస్తున్న వెన్నెలలు అన్నీ తెలంగాణ ఉద్యమానికి బాసటైనయ్.

సకల జనానికి ప్రకృతి సాష్టాంగపడింది. కాలం ఒక్కసారిగా పురివిప్పిన సంతోషంతో జై తెలంగాణ అన్నది. జనస్వప్నాల దగ్గర కవులు కవితలల్లుతున్నారు. ఉసిళ్ల పుట్టల్లా అక్షరాలు పుడుతున్నయ్. కవిత్వం పాటై, పాట కవిత్వమై, కలగలిసి చిక్కటి తెలంగాణ అయ్యింది. పాటలు పదునెక్కటమే కాదు పాట మీంచే ఉద్యమం నడుసుకుంటూ పోతోంది. సకల జనం ఒక్క కంఠమై తెలంగాణ అంటోంది.మాను కోట మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంది. మానుకోట మళ్లీ పాలేరు సరిహద్దున‘కో’దాడిగా మారి కోదాడయ్యింది. మానుకోట, సూర్యాపేట, నక్రేకల్లు, చిట్యాల, చౌటుప్పల్, ఆలేరు, జనగామలు పోరుగల్లులవుతున్నాయ్. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా మనుకోటల రాళ్లవర్షాలే. మానుకోటల పునర్జన్మలే. ఈ వడగండ్ల వానలకు పంటలు దెబ్బతిన చ్చును. ఈ రాళ్ల వర్షానికి బడులు గాయపడవచ్చును. ఈ పెల్లలు పెల్లల కుండపోతలకు సింగరేణి గడ్డకట్టవచ్చును. తట్టుకోలేని ఈ తెలంగాణ ఈదురుగాలుల ముందు ఏ శక్తులు నిలువలేవు.
వందరాజకీయ కుట్రల్ని భగ్నం చేసిన సకల జనం
వేయి కుతంవూతాలను ముక్కలు చేసిన ఒక్క సకల జన సమ్మె
నేతల ద్రోహాలు నేలరాలాయి
కేంద్రాల, రాష్ట్రాల జిమ్మిక్కులు జనగాలి కెగిరాయ్
సకల జనం సమస్త తెలంగాణం ఒక్కటైంది.
వేయి సంఘర్షణల మధ్య ఏకమైన కంఠం తెలంగాణ
వందల విభేదాల మధ్య ఐక్యత సకల జన ఉద్యమం...
నువ్వూ నేను ఒకటి కాదు. నీ కులం నా కులం ఒకటి కాదు. నీమతం నామతం ఒక్కటెప్పుడూ కాదు. నీ దేవుడు నాదేవుడు ఒక్కడసలే కారు. కానీ అందరి కోసం అందరూ ఏకమవ్వటం తెలంగాణ. అందరూ కలిసి కదలటం తెలంగాణ. విభేదాల భేదనల నుంచి విమర్శల విస్ఫోటాల నుంచి అందరూ ఒకటి కావటమే అసలు చరిత్ర.

తన కోసం తను పాడుకునే పాటే కవిత్వం
తన నేలకోసం తను గొంతు విప్పటమే కవిత్వం
కవిత్వమంటే గుడ్లను పొదిగే తల్లికోడి
మందికోసం పుట్టి మందికోసం మరణించటమే కవిత్వం
కవిత్వమంటే బెర్రలు గీసుకున్న బందిఖానా కాదు
కవిత్వమంటే జగిత్యాల పల్లె, జనజాతరైన పోరుగల్లు
కవిత్వమంటే సకల జనాక్షిగహం
కవిత్వమంటే తెలంగాణ ఎర్రసెలక.
కవిత్వమంటే బతుకుదారుల్లో బతుకమ్మ
తన గోసను మోసుకుంటూ పోయి
విముక్తి కోసం ఆక్షరాలకు మంటపెట్టడం కవిత్వం
కలం పట్టిన వారంతా అల్లం నారాయణలు, కెఎస్‌లు కారు
తెలంగాణలో లేఖరులంతావూపాణహితలే!
వీళ్ల రాతలన్నీ సందర్భాలే, సంభాషణలే!
పోటెత్తిన సకల జన ఘోష తెలంగాణ
సకలజనుల ఐక్యతే తెలంగాణ
గ్లోబల్ పటాన్ని పలగ్గొట్టిన నేల తల్లి పాట తెలంగాణ

శ్రీకాంతాచారి ఒంటికంటుకున్న నిప్పు ఇంకా ఆరలేదు. మన చెరుకు సుధాకర్ బిడ్డ పెళ్లి కార్డులు పంచకుండా జైల్లో కవిత్వం రాస్తున్నాడు. ఇప్పటికీ నెల రోజులుగా పిల్లలు పుస్తకాలు పట్టకుండా తెలంగాణ యజ్ఞం చేస్తున్నారు. ఇక కేంద్ర ప్రకటనతోనే బడులకు తాళాలు తెరుస్తారు. ఎండిపోతున్న నేలకు కాసిన్ని నీళ్లు దొరుకుతాయి. సింగరేణి తనకోసం తాను సివంగి లాగ దుంకుతుంది. ఇన్ని కోట్ల మందిని ఒక్క కంఠం చేసిన ఘనత తెలంగాణదే. నేల తల్లి విముక్తి కోసం సుదీర్ఘ పోరాటం ఈ నేల మీద జరగాల్సిందే..
కేంద్రమా! నువ్వు కరగని బండరాయిగా ఉంటావా?
ఈ తల్లుల గర్భశోకం మందు దహించుకుపోతావా?
సకల జన సమ్మె ముందు వినవూమంగా తలదించి తెలంగాణ రాష్ట్రాన్నిస్తావా??

-జూలూరు గౌరీశంకర్, ప్రధానకార్యదర్శి తెలంగాణ రచయితల వేదిక

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.