పోరాట ప్రతీకలు..


Sun,June 23, 2013 12:27 AM


వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల శక్తివంతులు. ఆధిపత్య సంస్కృతిని తిప్పికొట్టే అస్తిత్వ ఉద్యమ గొంతులు వాళ్లు. ఏ ఉద్యమానికైనా వెన్నెముకలు వాళ్లే. యువతరం ఎలుగెత్తనిది ఏ విప్లవం కూడా ఎర్రగా పండదు. నవతరం శిరసెత్తనిది ఏ ఉద్యమమూ చిగురించదు. నేలను పండించటానికి కురిసే తొలకరి వర్షం వాళ్లు. పుట్టిన జన్మకు సార్థకత దారులు చూపే క్రాంతదర్శులూ వాళ్లే. రాజ్యం ఉక్కుపాదాలను తుత్తునియలు చేయగల నవశక్తులు, యువశక్తులు వీళ్లు. తమ యవ్వన తేజంతో రాజ్య నిర్బంధాన్ని ఎదుర్కోగల ధీశాలురు. అధికారం లాఠీలను విసిరితే తమ దేహాలను అడ్డుపెట్టి ఉద్యమదారి వైపు జనాన్ని మళ్లించగల మొనగాళ్లు వాళ్లు. తుపాకి తూటాలకు గుండెలను ఎదురొడ్డి కొత్త చరివూతను రక్తంతో రాసుకుంటూ పోయే చరివూతకారులు వారు.

వీర తెలంగాణ పోరాటాన్ని తిరగరాస్తున్న వేరు తెలంగాణ చరివూతకారులూ వీరే. వీరే విప్లవాల జే గంటలు. ఉద్యమానికి వేళ్లు, పిడికిళ్లు. వాళ్లు తమకు తాముగా విసిరేసుకున్న దేహాలతోటే, ఈ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. విద్యార్థులు నవసమాజ నిర్మాతలుగా నిలిచి ప్రపంచ చరివూతను తిరగరాశారు. సూర్యుడే పొద్దు తిరుగుడు పువ్వు అయి ఈ విప్లవవీరుల చుట్టూ తిరుగుతూ తన తేజస్సును పెంచుకుంటాడు. ఆ పిల్లల శైశవ యవ్వన దశలే దేశానికి ఆరోగ్యరేఖలుగా ఉంటాయి. చరిత్ర, సర్వశాస్త్రాలు, తత్త్వాలు, కళలు, క్రీడలు, నవరసాలు, పరిణామవూకమాలు, కాలచవూకాలు అన్నీ యువశక్తి నుంచే ప్రభవిస్తాయి. అందుకే విద్యార్థులు, యువకులు లేకపోతే చరివూతకు చరిత్ర వుండదు. అన్ని శాస్త్రాలు వీళ్ల నుంచి అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతాయి. చరివూతకు నగిషీలు చెక్కే ది వీళ్ల చేతులే.

సాయుధ విప్లవ పోరాటాలను కన్న నేల తెలంగాణ నేల. తెలంగాణ నేలలో ఎక్కడ ఏ మట్టిని కదిలించిన అదొక పోరు చరివూతను చెబుతుంది. తెలంగాణ పది జిల్లాల చరిత్ర ఎంత ఉన్నతమైనదో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల చరిత్ర కూడా అంతే ఉన్నతమైనది. ఆనాటి దేశ స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం నినాదం ఎగిసిపడింది ఇక్కడ నుం చే. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమ నిప్పులను రగిలించిం ది కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయమే. 1969 ఉద్యమంలో ఎగిసిపడ్డ పోరుకెరటాలన్నీ ఈ విద్యా ప్రాంగణాల నుంచి పుట్టుకొచ్చాయి. విప్లవాల ను పండించువాడు, అన్ని దోపిడీ, దుర్మార్గాల నుంచి సమాజాన్ని రక్షించువాడు, తన నేలపై జరుగుతున్న అన్యాయాలను చూసి అగ్గిరవ్వలుగా మం డి నూతన నిర్వచనాలను రచించి, వాటిని ఆచరించిన ఆచరణాత్మక రూపులు ఉస్మానియా విశ్వవిద్యాలం విద్యార్థులు. తెలుగు సమాజానికి చెగువేరా లాంటి జార్జిడ్డిల ను అందించింది ఉస్మానియా విశ్వవిద్యాలయమే.

ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలకు ఇంజనీరింగ్ కాలేజీ పురుడు పోసింది. జంపాల చంద్రశేఖర్‌ప్రసాద్, మధుసూదన్‌రాజ్ యాదవ్‌లను అందించింది. ఈఆర్ట్స్ కాలేజీ మెట్ల దగ్గర నుంచి అన్ని అస్తిత్వ ఉద్యమాలు ఎగిసిపడ్డాయి. ఆర్ట్స్ కాలేజీ తరగతి గది నుంచి చైతన్యం జ్వలించి పో రు మంటలయ్యింది. ఆ ఆర్ట్స్ కాలేజీ మెట్ల దగ్గర నుంచే జ్ఞాన నదులు పుట్టి ఈ దేశమంతా ప్రవహించాయి. ఈ మెట్ల దగ్గర నుంచే ఇండియన్ సివిల్ సర్వీస్‌లలో మేలైన విద్యార్థులుగా నిలిచి తమ జ్ఞానంతో భారత పాలనారంగాన్ని కూడా నడిపించే రధసారధులయ్యారు. అదేవిధంగా దండకారణ్యాలల్లో తుపాకీ మోతలై మోగుతున్నాయి. ఈ మెట్లే జ్ఞాన కేంద్రాలుగా మారి మహాత్మాజ్యోతి భా పూలేలై విశ్వవిద్యాలయమంతా విరబూస్తున్నాయి.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇపుడు దళిత, బహుజన, గిరిజన, ఆదివాసీ, మైనార్టీ ఉద్యమాలను ధరించిన జ్ఞాన నిలయమయ్యింది.అంబేద్కర్ చూపుడు వేలు తో తరగతి గదులు సామాజిక తాత్త్విక చింతనతో ప్రశ్నల కొడవళ్లయి మెరుస్తున్నాయి. వర్గదృష్టితో ఎగిసిన భారత విప్లవోద్యమ శిఖరంపై ఒక చూపుడు వేలును బెట్టి, పూలే ఆలోచనలను వెదజల్లి వర్గకుల సమాజంలో కొత్త విప్లవాలకు రూపురేఖలను మారోజు వీరన్న ఇక్కడనుంచే రచించారు. పలు విప్లవాల ఉద్యమాల రహస్యస్థలి ఈ ఉస్మాని యా విశ్వవిద్యాలయం. అంపశయ్య నవీన్ అల్లిన నవలా కాంతులన్నీ యిక్కడనుంచే ప్రవహించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయమంటే నిజాం నిర్మించిన మహత్తర చారివూతక కట్టడమేకాదు. విభిన్న ఆలోచనల, భిన్న సంస్కృతుల, భిన్న రాజకీయ భావజాలాలకు, భిన్న శాస్త్రాల విభిన్న వాదనలకు వేదికగా నిలిచిన విశ్వజ్ఞాన నిలయం. సమస్త సమాజానికి సామాజిక న్యాయం కోసం, మాట్లాడే హక్కు కోసం గొంతునందించింది ఈ ప్రాంగణమే.

జ్ఞానం ఎప్పుడు ఒక దగ్గరే గడ్డకట్టుకుని కదలని పర్వతంలా ఉండదు. అది జనం కోసం కరిగిపోయే హిమవత్ పర్వతం లాంటిది. అందుకే రాజ్యరక్షకులు ఇక్కడ నుంచే పోయారు.రాజ్యహింసను ఎదురించే ఉద్యమ తుపాకులూ ఇక్కడ నుంచే కదలిపోయాయి. రాజకీయపార్టీలు ఎట్లా ఉండాలో సామాజిక చింతనను వ్యక్తం చేసిన తత్త్వవేత్తలు ఇక్కడి విద్యార్థులు. చైతన్యవంతులైన విద్యార్థులకు పాఠాలు చెప్పిన పంతుళ్లు సకల శాస్త్రాలకు మణిదీపాలై మెరిసిపోయారు. కామ్రేడ్‌గా మిగలక పోయినా, రెనగేడ్‌గా మారవద్దన్న నినాదాలు ఇక్కడి గోడల మీద హెచ్చరిక రాతలుగా కనిపిస్తాయి. విప్లవాల యుగంలోన విద్యార్థులను కెరటాలుగా, వెల్లువలుగా, పెను తుఫానుగా ఈ విశ్వవిద్యాలయమే తీర్చిదిద్దింది. ఈ డిజిటల్ యుగం లో కూడా ఈ విశ్వవిద్యాలయం మానవీయ విలువలను మరిచిపోలేదు. అందుకే విద్యార్థులు ఈ గ్లోబల్ మార్కెట్ సమాజంలో తమ ప్రాణాలను అర్పించి జై తెలంగా ణ అంటూ మహత్తర నినాదమై మార్మోగుతున్నారు.

ఇంత సారవంతమైన పోరునేలలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పెల్లుబికింది. తమ వీపులను, దేహాలను లాఠీలకు, బుల్లెట్లకు అందించి, తమ త్యాగంతో, తమ ప్రాణాలను విసిరికొట్టి తెలంగాణ ఉద్యమాన్ని గడప గడపదాకా తీసుకుపోయిన భావజాల ప్రచారకులు ఈ విద్యార్థులే.ఒక్కొక్క విద్యార్థి వందల పోలీసు కేసులను మోస్తూ, నిత్య నిర్బంధాలను ఎదుర్కుంటున్నారు. తప్పుడు రాజకీయ పార్టీల లెక్కలు తేల్చేసుకుంటూ, దొర గడీలను కూల్చుకుంటూ, సామాజిక న్యాయాలను నాటుకుం టూ, పార్టీల ఒంటెద్దు పోకడల ధోరణులను తిప్పికొడుతూ చైతన్యాన్ని పండిస్తుంది ఈ విద్యార్థులే. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమ పార్టీ ఆమరణ నిరాహారదీక్షా రూపంగా మారి, మూడక్షరాల కేసీఆర్ ఆమరణ దీక్షను కొనసాగిస్తే, మరోపక్క ఉస్మానియా జ్ఞానాలయాన్ని ఉద్యమ మంటగా రాజేసి మొత్తం తెలంగాణను కదిలించిన ఈ విద్యార్థుల త్యాగం మరువలేనిది. ఇక్కడ చదువుకునే అమ్మాయిలపై పోలీసులు విచ్చలవిడిగా దాడులు చేసినా, తూటాలతో కాల్చినా అవి తమ కళ్లల్లో దాచుకుని ఉద్యమ జ్యోతిని రగిలించిన జిలకారీబాయిలు, చాకలి ఐలమ్మలు, స్వర్ణక్కలు, రంగ ఎందందరో ఇక్కడున్నారు.

ఉస్మానియా పచ్చటి చెట్లపై ఆ విద్యార్థులతో అప్పటిదాకా సహజీవనం చేసిన పావురాలు కూడా ఆ భాష్పవాయువులను పీల్చి తెలంగాణ ఉద్యమం కోసం నేలరాలాయి.ఇక్కడి విద్యార్థులు ఒక చేత్తో పుస్తకం, ఉద్యమంకోసం మరో చేతిలో ఒక రాయి పట్టుకుని నడుస్తూ ఢిల్లీ అసెంబ్లీలో బాం బులు విసిరిన భగత్‌సింగ్ లాగా కనిపిస్తుంటారు. ఈ పిల్లలు ఆధిపత్య సంస్కృతిపై తిరుగుబడుతున్న పాలస్తీనా యోధుల్లాగా, ఆరాఫత్ చేతిలోని తుపాకి కంటిచూపులాగా కనిపిస్తారు. మాట్లాడే హక్కు కోసం పోరాడిన అమెరికాలోని బర్కెలీ విశ్వవిద్యాలయం లాగా ఉస్మానియా ఈ విశ్వవీధిలో ఒక స్వేచ్ఛా గొంతుకగా నేటికి గర్జిస్తుం ది. బాతాకాని క్లబ్‌గా మారిన అసెంబ్లీ తన రెండుకళ్లూ మూసుకుని నిద్రను నటిస్తూ తలతిప్పేసుకుంది. తెలంగాణ రాష్ట్రం రావాలని జరుగుతున్న ఈ విభజన రేఖల ఉద్యమంలో ప్రతిరోజు దేశ సరిహద్దుల కాడ కాపలాదారుల్లాగా ఉస్మానియా క్యాంపస్‌లో రాపిడ్‌యాక్షన్ ఫోర్సులతో ఈ పిల్లలు తలపడుతున్నారు.


ఉస్మానియా మెడచుట్టూ ఇనుపకంచెలను కట్టారు. తరగతి గదులు, వసతి గృహాల్లో లాఠీలు తూటాలు నిత్యం నాట్యం చేస్తుంటాయి. అలసటలేని పోరాటానికి బాసటగా నిలవాల్సిన రాజకీయపార్టీలు దొంగాటలు ఆడుతుంటే వారి ఆటలు కట్టించి అగ్గయి మండుతున్నారు.నిజాయితీలేని నాయకులను,పార్టీలను చూసిన సున్నిత మనస్కులు ఉస్మానియా గ్రంథాలయం సాక్షిగా తాడుకు వూపిరినిచ్చి చెట్లకు వేలాడుతున్నారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన వచ్చేంతవరకూ నిత్యనిర్బంధపు క్రీనీడల్లో కునారిల్లిన ఉస్మానియా క్యాంపస్ డిసెంబర్ 23 మోసం చూసి మళ్లీ దీర్ఘయావూతకు నడుంకట్టి అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. ఇపుడది ఒక యుద్ధ రిహార్సల్స్ కేం ద్రంగా మారింది. రాజ్యం తుపాకులతో మీద పడుతుంటే తన రెండు చేతులతో గుండెల్లో రగులుతున్న సెగలను పిడికిళ్లు చేసుకుని రణం చేస్తూనే ఉన్నది. మా అలజడి, మా ఆందోళన తెలంగాణ రాష్ట్ర సాధనే అని ప్రపంచానికి చాటి చెప్పింది. ఉస్మానియా విద్యార్థులు సిలబస్‌తో జరిగే పరీక్షలు, పోటీ పరీక్షల్లో ఎంతో ప్రతిభావంతులుగా నిలుస్తున్నారు.

ఉద్యమ పరీక్ష లో కూడా అదే చిత్తశుద్ధితో తిరుగుబాటు సిలబస్‌లవుతున్నారు. ఒక చేత్తో కలం, మరో చేతిలో రాయి పట్టుకుని దీర్ఘయాత్ర చేస్తున్నారు. విద్యార్థుల పౌరుష ప్రతాపాలను చూపే ఎలక్ట్రానిక్ మీడియా తన రేటింగ్‌ను పెంచుకుని ధీమాగా చూస్తుంది. లక్షలాదిమంది విద్యార్థులు గడ్డిమొక్కలుగా పరుచుకుని రాజ్యాధికారమనే మదపు బంధించి వేశాయి. జూలియస్ ఫ్యూజిక్ రక్తాక్షరాలను తమలో యిముడ్చుకుని రాజకీయ పార్టీలకు కనువిప్పులు కలిగిస్తున్నారు.మహానగర గర్భం నుంచి చీల్చుకుని మహా సంక్షిగామాలను సృష్టిస్తూ గ్రామాలకు తరలిపోతున్నారు. ఈనేల తల్లికి జరిగిన అన్యాయాలను గడప గడపకు చేరవేస్తున్నా రు. ఈ పిల్లలు కదలిపోతుంటే బయ్యారం గుట్టలు కొండంత ధైర్యంతో తలెత్తి నిలబడుతున్నాయి. ఈ చైతన్యమూర్తులు ముందుకు సాగుతుంటే కరీంనగర్‌లో గుట్టలు గుండె ధైర్యంతో ఎదురు తిరుగుతున్నాయి. వీళ్లంతా స్వేచ్ఛను పండించే పంటకారు లు. వీళ్లంతా కొత్త సమాజాన్ని నిర్మించే నిర్మాతలు. వీళ్లంతా తమకు తాము అర్పిస్తూ, తమకు తాము దగ్ధమవుతూ పచ్చటి తెలంగాణకు విత్తనాలు అవుతున్నారు. ఈ పిల్లల త్యాగాలకు ఈ సమాజం ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు!

-జూలూరు గౌరీశంకర్
తెలంగాణరచయితల వేదిక అధ్యక్షులు

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Fri,June 14, 2013 12:20 AM

ఆకాంక్ష పట్టని అసెంబ్లీ

ప్రజాస్వామ్యానికి ప్రతి రూపం, ప్రజలందరి సామూహిక ముక్తకంఠం అసెంబ్లీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనంకోసం కదిలిపోయి, మంది కోసం పనిచేస

Published: Mon,June 10, 2013 12:00 AM

అసెంబ్లీని ముట్టడించనున్న ప్రజాకాంక్ష

ఏ ఉద్యమ పిలుపుకైనా తరలివచ్చే ప్రజలున్నారు. ఎంతటి నిర్బంధాన్నైనా ఎదుర్కొనగల శక్తి సామర్ధ్యాలున్న ప్రజలున్నారు. రాజ్యం వికృత చేష్ట

Published: Mon,June 3, 2013 04:29 AM

పచ్చని పల్లెటూరి పాట వెంకన్న

నిబద్ధత ఉన్న సాహిత్యం కొండమప్లూల్లాగా, బతుకమ్మలో పేర్చిన జీవమున్న పూలలాగా, పచ్చని అడవిలాగా ఉంటుంది. ప్లాస్టిక్ పూలలాంటి కవులు, బ

Published: Sun,February 10, 2013 12:17 AM

పోరు అక్షరాభ్యాసం

చుక్కా రామయ్య లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. రామయ్యలాంటి వ్యక్తులను ఒక వ్యవస్థకే నమూనాగా చెప్పవచ్చును. కళ్లముందు అన్యాయం జరుగుత

Published: Sat,January 19, 2013 11:53 PM

తెలంగాణ సాహిత్య యుద్ధభేరి

కవులూ,రచయితలూ కాలంవెంట నడుచుకుంటూ పోరని, కాలాన్నే తమ వెంట నడిపించుకుంటూ పోతారని తెలంగాణ కవులూ, రచయితలూ మరోసారి నిరూపించారు. ప్రజల

Published: Wed,December 26, 2012 11:44 PM

ఎందుకు బహిష్కరిస్తున్నామంటే..

రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి అన్ని అధికారాలను ప్రయోగించి రాజమువూదలతో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించేందు

Published: Sat,November 24, 2012 11:37 PM

సమరాలను అల్లే సూర్యాపేట సమరభేరి

ఒక సమూహం ఎక్కడైనా జమైందంటే.. ఆ నేలే పరవశం కలిగిస్తుంది. చీమల దండ్లుగా జనం కదలాడటం లాగా ఆశయాలుంటాయి. ఆశయాల ఆకాంక్షలు ఎలా జమిలిగా క

Published: Fri,December 14, 2012 04:07 PM

సమాజ నిర్మాణాలు-విలువలు-కాళోజీలు

కాళోజీ అంటే విలువలతో జీవించి జీవితాంతం నిబద్ధతతో నిలబడ్డ వ్యక్తి. ఆ తరానికే కాదు ఈతరానికి కూడా కాళోజీ ప్రతీక. ఆయన ఆ కాలానికి, ఆ త

Published: Sat,December 1, 2012 04:45 PM

సమాజాన్ని నడిపేవి త్యాగాలు, భావజాలాలే

ఒక తరంలో ప్రగతిశీల భావజాలాల విత్తనాలను నాటడం అంతసులభమైన పనేమీ కాదు. ఆ విత్తనాలను నాటడానికి నేలను పదును చేసి, దుక్కిదున్ని, వాతావరణ

Published: Sat,October 27, 2012 05:31 PM

సిరా చుక్కల సమరం

కలం సృష్టించిన జ్ఞానమే కాలం. అక్షరమే కాలాన్ని కలకాలం నిలుపుతుంది. కలం సర్వకాలాలకు కన్నులుగా, సమాజాలకు కాళ్ల చేతులుగా, ఏ వ్యవస్థలకై

Published: Wed,October 10, 2012 06:50 PM

జీవ వైవిధ్యం- జీవన విధ్వంసం

అక్టోబర్ 1 నుంచి 19 వరకు జరుగుతున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుపై ఉన్న శ్రద్ధ, గత అరవై ఏళ్లుగా రాష్ట్రం కావాలని నాలుగున్నర కోట్ల

Published: Wed,October 10, 2012 07:06 PM

పాటను బంధించలేరు

ఆకంఠ స్వరం వింటుంటే చెట్ల సామూహిక తలలపైన పక్షుల గుంపులు ఎగు రు తున్నట్లుంది. దట్టమైన అడవి అందాలు కళ్ళ ముందు కదలాడుతుంటాయి. ఆమె గొం

Published: Thu,October 11, 2012 06:03 PM

కాళన్న దారిలో కదం తొక్కుదాం

భోగోళం మీద ఎప్పుడెనా, ఎక్కడెనా ఆధిపత్యాన్ని అడ్డంగా నరికేసే ధిక్కార స్వరా లు కలాల కంఠాలే. తిరుగుబాట్లన్నీ సృజనకారుల ఆలోచనల్లోనే పొ

Published: Sat,October 6, 2012 03:26 PM

సాహిత్య సాంస్కృతిక సైన్యం ‘తెరవే’

సంఘాలకు, వేదికలకు సాహిత్య సృష్టికి సంబంధం ఉందా? సాహిత్యం సృజనకు సంబంధించినది. సంఘం అన్నది నియమ నిబంధనలకు, లక్ష్యాలకు సంబంధించింది.

Published: Sat,October 6, 2012 03:27 PM

తొలుస్తున జ్ఞాపకాలు

ఒక కాలం ఎప్పుడూ మరో కాలానికి పాఠం చెబుతూనే ఉంటుంది. ఇలా కాలానికి కాలం పాఠం చెప్పటమే పరిణామక్షికమం అనుకుంటా. ఒక కాలం ఇచ్చిన స్ఫూర్త

Published: Sat,October 6, 2012 03:27 PM

వెలిదండ: తల్లి పేగు బంధం

పుట్టిన ఊర్లను ఎలా మరిచిపోలేమో అలాగే మనలో చైతన్యాన్ని రగిలించిన ఊర్లను కూడా మరిచిపోలేం.ఎప్పుడైనా పుస్తకా లు మనలోని సృజనను తట్టిలేప

Published: Sat,October 6, 2012 03:28 PM

ఈ గర్భశోకాలకు కారణమెవ్వరు తల్లీ..!

‘తెలంగాణ ’ ఒక శక్తి సూత్రం ‘తెలంగాణ ఒక చలనం, ఒక ప్రళయం ప్రజలంటే ఆత్మాభిమాన జెండాలు పోరుదారులు తెలంగాణను ఎవరూ కాలరాయలేరు ఈ పో

Published: Sat,October 6, 2012 03:37 PM

ఈ మహాకావ్యం పేరు తెలంగాణ

హద్దులు, లెక్కల పద్దులు లేని వాడే కవి కవిత్వం విప్పిన సద్దిమూట, తనను తాను ఆరేసుకున్న ప్రకృతి పైట కవిత్వం నదుల నోటి ను

Published: Sat,October 6, 2012 03:37 PM

నివురుగప్పిన నిప్పులు

ఒక భావజాలంతో కలిసి నడిచిన మిత్రులు ఏక కంఠమై నినదించిన మిత్రు లు, ఒకే లక్ష్యంతో ఏకమైన పిడికిళ్లు, కలిసి పనిచేసి అలసిపోయిన మిత్రులు,

Published: Sat,October 6, 2012 03:39 PM

ఓరుగల్లు పోరు క్షేత్రం

తెలంగాణలో నిత్య నిర్బంధం కొనసాగుతున్న దశలో నక్సలైట్లు సభలు జరిపితే ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. పోలీసుశాఖవారు ఆ సభలకు వెళ్లవద్దని

Published: Sat,October 6, 2012 03:39 PM

ఉద్యమ నిర్వచనం మారుతున్నవేళ.

ఉద్యమం అంటే రాజకీయంగా ఒకరికొకరు విమర్శలతో విరుచుకుపడటం కాదు. ఉద్యమమంటే ఉరితాళ్ళు తీసుకొని సవాళ్లు, ప్రతిసవాళ్లతో గన్‌పార్క్‌లోని

Published: Sat,October 6, 2012 03:40 PM

శ్రీ కృష్ణకు , సుదర్శనుడికి ఎంత తేడా!

డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందన్న హోంమంత్రి చిదంబరం నోటితోనే..,డిసెంబర్ 23 న ఇరు ప్రాంతాల అభివూపాయం తీసుకున్నాకే

Published: Sat,October 6, 2012 03:44 PM

విరామమెరుగని పోరు

మలిదశ తెలంగాణ పోరులో ప్రజలు అత్యంత చారివూతాత్మకమైన పాత్ర పోషిస్తున్నారు. ఏ పోరాటంలోనైనా ఇంతకంటే తెగించి పోరాడుతున్న ప్రజలుంటారా? త

Published: Sat,October 6, 2012 03:44 PM

సకల జనాగ్రహం

ప్రశ్నలు.. సంఘర్షణలు.. వాదోపవాదా లు.. ఒత్తిడులు.. ఒడిదొడుకులు..లాఠీలు.. తూ టాలు.. ఆత్మ బలిదానాలు.. రాజకీయాలు, రాజకీయక్రీడలు, ఎత్త

Published: Sat,October 6, 2012 03:43 PM

ఒకే మాట, ఒకే బాట

కేంద్రాన్ని, ఆంధ్రా ఆధిపత్య శక్తులను ఒక పక్క ఎదుర్కొంటూనే మరో పక్క తెలంగాణలో భిన్న రాజకీయ చైతన్యాల మధ్య తెలంగాణ రాష్ట్ర అంశంపై ఏక

Published: Sat,October 6, 2012 03:43 PM

ఉద్యమాలకు అన్నం పెట్టిన అవ్వ

-జూలూరు గౌరీశంకర్ తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి అడవి ఉద్యమానికి మైదాన ఉద్యమానికి సంబంధించిన కీలకమైన సమాచారానికి మధ్య

Published: Sat,October 6, 2012 03:42 PM

మన సాంస్కక్షుతిక ఉద్యమ తల్లిపేగు జయశంకర్

-ఆయన తెలంగాణ గుండె చప్పుడు. ఆయన తెలంగాణ సాంస్కృతిక పేగుబంధం. అయనను తెలంగాణ పదబంధాల నుంచి విడదీసి చూడలేం. ప్రొఫెసర్ కొత్తపల్లి

Published: Sat,October 6, 2012 03:41 PM

తెలంగాణ కలాల కోలాటం.. తెరవే

కడుపులో పిండం పెరిగి పెద్దయి, కడుపులో తండ్లాడి, మాతృగర్భం చీల్చుకుని శిశువు పెట్టిన కేక ఒక జననం. కాలం జీవించటానికి, కదలటానికి, ముం