ఆకాంక్ష పట్టని అసెంబ్లీ


Fri,June 14, 2013 12:20 AM


ప్రజాస్వామ్యానికి ప్రతి రూపం, ప్రజలందరి సామూహిక ముక్తకంఠం అసెంబ్లీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనంకోసం కదిలిపోయి, మంది కోసం పనిచేసే ప్రజాస్వామ్య శిఖరం అసెంబ్లీ. అందుకే జన విన్నపాలను స్వీకరించి వారికి పరిష్కారం చూపే విశాల ఆలోచనల వేదికలుగా శాసనసభకు, పార్లమెంటుకు మహోన్నత గౌరవమున్నది. ప్రజలు తమ కనీస అవసరాలను తీర్చమని, తమ కూడు, గూడు, గుడ్డకు సంబంధించిన నిత్యావసరాలను తీర్చమని అడిగేది అసెంబ్లీ. అసెంబ్లీలో ఉండే ప్రతినిధులంతా ప్రజా ఆకాంక్షలకు ప్రతీకలుపజల కు ఏ ఆపద వచ్చినా ఆదుకునేదే కదా అసెంబ్లీ. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నది. కొన్ని సార్లు నిద్రను నటిస్తున్నది. ప్రజల ఆకాంక్షల గురించి చర్చ వచ్చేసరికి మెల్లగా జారుకుంటున్నది. ప్రజలందరి సౌఖ్యం కోరి పరితపించవలసిన అసెంబ్లీ తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నది. మంటల్లో మాడి పోతూ, అస్తిత్వ గొంతులు విప్పుకుం టూ తమ దేహాలను విడిచిపోతున్న వందలాదిమంది శ్రీకాంతచారులను, యాదిడ్డిలను, చూస్తూ కూడా అసెంబ్లీ కదలని శిలలాగా మారిపోయింది. వేయి మంది తల్లుల గర్భశోకం చూస్తూ నోరు మెదపని రాతిబండగా అసెంబ్లీ తయారైంది. ఆంధ్రరాష్ట్రంలో హైద్రాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేసిన దగ్గర నుంచి తెలంగాణ నేల తన బాధను వ్యక్తం చేస్తూనే వున్నది. పెద్ద మనుషుల ఒప్పందాలు, 610 జీవో లు విఫలమైన ప్రతిసారి తెలంగాణ ప్రశ్నిస్తూనే ఉన్నది. ఒకే జాతి పేరున రెండవ శ్రేణి పౌరులుగా మిగిలిపోయామని తెలంగాణ ప్రాంతం అస్తిత్వ గొంతుకగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. రెండు ప్రాంతాల మధ్య విభజన రేఖను గీయమని తెలంగాణ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూనే ఉన్నది. తెలంగాణది తాత్కాలిక కోరిక కాదు. సమస్యకు శాశ్వత పరిష్కారం అడుగుతూ మిలియన్ మార్చ్‌గా మారింది.

సబ్బం డ వర్ణాలు కలిసి సకల జనుల సమ్మెగా మారింది. సాగరహారం జనసాగరంగా మారింది. జాతీయ రహాదారులపై సడక్ బంద్‌లతో ఉరుముల మెరుపుల ఉద్యమాలు ఎగసిపడ్డాయి. 12 ఏళ్లుగా నాల్గున్నర కోట్లమంది ప్రజలు కోరుతున్న ఆకాంక్షలు అసెంబ్లీకి వినిపించటం లేదా? ఇంత సుదీర్ఘకాల ఉద్యమం అసెంబ్లీకి కనిపించటం లేదా? ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, తెలంగాణలోని కళాశాలల ప్రాంగణాలలో పిల్లల ఒంటిపై విరుగుతున్న లాఠీలు, గాలిలోకి పేలుతున్న తూటాలు, దేహాలు గాయాలై కారుతున్న నెత్తుటి ప్రవాహం కనిపించటం లేదా?ఆ అసెంబ్లీలో వున్న శాసనసభ్యులు ఏం చేస్తున్నారు? ఒక ప్రాంతం ఆకాంక్షల ను వింటూ ఎలా ఆ చట్టసభలో కొయ్యగుపూరాలుగా కూర్చోగలుగుతున్నారు. ప్రజల కన్నీళ్లు పట్టకుండా, సమస్యకు పరిష్కారం చూపకుండా ఉలుకూ పలుకూ లేని మరబొమ్మలుగా మారిపోయారు. ప్రజలందరూ చలో అసెంబ్లీ అని కదిలిపోతుంటే, బైండోవర్ కేసులు, అక్రమ అరెస్టులు, వాహానాల తనిఖీలతో రోడ్లన్నీ నిఘాలకు గురౌతుంటే అసెంబ్లీ ఏం చేస్తున్నది? పార్లమెంటు పెదవి విప్పకుండా ఏం చోద్యం చూస్తున్నది? ఇది దుర్మార్గం.

ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడ్డాయనే భావించాల్సి వస్తున్నది. అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ ఏకమై తెలంగాణ గొంతు నులుముతున్నట్లుగా అనిపిస్తున్నది. అసెంబ్లీ అన్నది రాష్ర్ట ప్రజల విస్తృత వేదికగా కాకుండా ఒక ప్రాంత ఆక్రమిత ఆధిపత్యంగా మారింది. అసెంబ్లీ ఒక ప్రాంతం ఆకాంక్షలను అణిచివేసే ఒక నిర్బంధ రూపంగా మారింది. అందుకే తెలంగాణ ప్రజలు అసెంబ్లీ కళ్లు తెరిపించేందుకే ‘చలో అసెంబ్లీ’ అంటూ కదలిరావటానికి సిద్ధమయ్యారు. ముట్టడిస్తేనే తప్ప మాట్లాడే దశకు రాని స్థితికి అసెంబ్లీ రావటమే ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతం. తెలంగాణకు ఎవరు అనుకూలమో, ఎవరు వ్యతిరేకమో తేలిపోయే సమయం వచ్చింది. ఓ తరిమెల నాగిడ్డీ నీ మాటను మళ్ళొకసారి సమీక్షించుకోవాల్సి వచ్చింది. అసెం బ్లీ, పార్లమెంట్లు బాతాకానీ క్లబ్‌లన్నావు. కానీ, ఇప్పుడు అసెంబ్లీ మూగదయింది. ప్రజాస్వామ్యానికి ఇది విషమదశ. ప్రజాస్వామ్యమా వర్ధిల్లు...!

-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

country oven

Featured Articles