పచ్చని పల్లెటూరి పాట వెంకన్న


Mon,June 3, 2013 04:29 AM


నిబద్ధత ఉన్న సాహిత్యం కొండమప్లూల్లాగా, బతుకమ్మలో పేర్చిన జీవమున్న పూలలాగా, పచ్చని అడవిలాగా ఉంటుంది. ప్లాస్టిక్ పూలలాంటి కవులు, బతుకుకు సంజీవని మొక్కలను అందించే కవులు ఇద్దరూ ఉంటారు. ప్రస్తుత మార్కెట్ సమాజంలో సాహిత్యం, కళలుకూడా వ్యాపారాత్మకంగా మారా యి. సినిమా, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న తెరల మీద సాహిత్యం ఇప్పుడు ఒక కమర్షియల్ యాడ్‌లాగా మారిపోతున్నది. గ్లోబల్ సంతలో సరుకుగా మారిపోయింది. నిబద్ధతలేని కవులు, నిమగ్నతలేని ఛానళ్ల మధ్య అందమైన బొమ్మల్లాగా వేలాడటం సహజంగా మారింది. అందుకే కవిత్వం క్రమంగా కరిగిపోతున్నది.మీడియా తళుకుబెళుకుల కమర్షియల్ యాడ్‌ల మధ్యలో కవి త్వం,పదాలు కొట్టుకుంటున్నాయి. సామాజిక చింతన,వికాసం, సమాజ వ్యక్తిత్వం ఇప్పుడు అరిగిపోయిన పదాలుగా మారిపోయా యి. ఈమ్కాట్ సమాజాన్ని చీల్చుకుని రాగల సాహిత్య సూరీళ్ల కోసమే సమాజం ఎదురుచూస్తున్నది. ‘కొండలు పగలేసినాం/బండలను పిండినం/ మానెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం/ శ్రమ ఎవడిదిరో? సిరి ఎవనిదిరా?’ అన్న నిబద్ధత వున్న చెరబండరాజుల కోసం సమాజం ఎదురు చూస్తున్నదిపచారం లేని కవులు తెలంగాణలో వందల సంఖ్యలో వున్నారు. కొందరికి ప్రచారం లేకపోవటానికి సవాలక్ష కారణాలు ఉండవచ్చును. అసలు ప్రచారాన్నే కోరుకోని కవులు ఎంతమంది ఉంటారు? ఏరకమైన ప్రచారాన్ని కోరుకోని కవులు, పత్రికల్లో ఎక్కటానికి ఇష్టపడని కవులు ఇంకా ఈ నేల మీద ఉన్నారని ఇటీవల ఖమ్మం జిల్లాకు వెళితే తెలిసిం ది. ప్రచారాన్ని కోరుకోవటమే కాదు తాను రాసిన ఒక పాట విస్తృతంగా ప్రచారం కాబడింది. చివరకు ఆయన రాసిన పాట చోరీకి గురైంది. ఎవరో రాసిన పాటల్ని ఎవవరో పాడుకుని తమకు తాము పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్న కాలమిది.

అసలు రాసిన కవి పేరు చెప్పకుండా ఆ పాటల్ని గానం చేసి ప్రముఖ కవులు,గాయకులంటూ పత్రికల్లో తమపేర్లు రాయిం చుకుంటున్న మార్కెట్ కాలమిది. ఖమ్మం జిల్లాలో అడవి ముఖద్వా రం బయ్యారానికి దగ్గర వున్న కొమరారం గ్రామానికి చెందిన కవి ఏనుగుల వెంకన్న (అన్వేషి) మరణించాక గానీ ఆయన గురించి తెలియలేదు. ఇప్పటికీ సాహిత్యలోకానికి ఆయన కవిగా ఎవరికీ తెలియదు. కానీ, ఆయన రాసిన ‘ఆడపిల్ల నమ్మ’ అన్న పాట మాత్రం లక్షలాది మందికి తెలుసు. తాను కనిపించకుండా, వినిపించకుం డా, ఎవైతే జనం నాల్కలపై చిరస్థాయిగా నిలిచే నాలుగక్షరా లు రాస్తాడో వాడే కవి. తాను రాసిన నాలుగు పాదాలను జనం నాల్కలపై ప్రతిధ్వనించేలాగా ఏనుగుల వెంకన్న రాయగలిగాడు. కానీ తాను మాత్రం ఆ కొమరారం, బయ్యారం, ఇల్లందు అడవి చెట్ల మాటుననే ఉండిపోయాడు. ఆ అడవి పొత్తిళ్లలోనే తిరుగాడాడు. చెదపడుతున్న వ్యవస్థకు కొమరారం నుంచి సాహిత్య వైద్యుడిగా చికిత్స చేశాడు. చెట్ల తోపుల మధ్యలో పూలు నిలిచే తావిలాగా పాటలను అల్లినవాడు ఏనుగుల వెంకన్న. డిగ్రీ పూర్తి చేసుకుని, బి.ఇడి చదువును ముగించుకుని ఉద్యోగం వేటలో పడకుండా అడవి ముఖద్వారం కొమరారంలోనే గడిపాడు. వెంకన్న సమాజ మార్పు కోసం అలుపు లేకుండా డప్పుకొట్టాడు. విప్లవం విజయవంతం కావాలని యుద్ధ ఢమరుకం మోగించాడు. కొమరారం వూరును సాంస్కృతిక అరుణోదయంగా మార్చాడు. గడప గడపను ఒక ఉద్యమ కాలిగజ్జెగా మార్చేశాడు. తన కుటుంబాన్ని ఏకాకిగా వదిలేసి విప్లవోద్యమానికి సాహిత్య జెండాగా రెపపలాడుతూ ఆకాశ వీధిన ఎగిసాడు. ఏనుగుల వెంకన్న తను రోడ్డు ప్రమాదానికి గురై కన్నుమూస్తూ తన రెండు కళ్లను కొమరారం వూరి కళ్లుగా మార్చి అడవి వైపు చూస్తున్నాడు. తన సంపదలను కొల్లగొట్టుకుపోతున్న ఆధిపత్య వాదంపై ఏనుగుల వెంకన్న ఆగ్రహించాడు. చిన్ని చిన్ని పాదాలతో విప్లవ సాహిత్య ఉద్యమ అడుగులు వేయించాడు. అతనొక తెలంగాణ అస్తిత్వ ఉద్యమ పాట.

-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు
( నేడు కొమరారంలో వెంకన్న సంస్మరణ సభ)

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

country oven

Featured Articles