తెలంగాణ సాహిత్య యుద్ధభేరి


Sat,January 19, 2013 11:53 PM

కవులూ,రచయితలూ కాలంవెంట నడుచుకుంటూ పోరని, కాలాన్నే తమ వెంట నడిపించుకుంటూ పోతారని తెలంగాణ కవులూ, రచయితలూ మరోసారి నిరూపించారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు, బాధలగాథల గాయాలు, జనకాంక్షల ఆకాంక్షలు,ఆధిపత్యాల ఉక్కుపాదాల అహంకారాన్ని తిప్పికొడుతూ తెలంగాణ కవులూ, రచయితలూ సృష్టించిన సాహిత్యం అంతా ఇంతా కాదు. జన ఆకాంక్షల జెండాలుగా రచయితలు మారిన అపూర్వ సందర్భం తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో చూశాం. రాష్ట్ర సాధన అనే స్వాతంత్య్ర ఆకాంక్షల ఉద్యమతోటగా తెలంగాణ మారింది.దేశంలో వీచిన వసంత మేఘగర్జనలను, శ్రీకాకుళ సిక్కోళ్ల యుద్ధాలను, సుబ్బారావు పాణిక్షిగాహి, శ్రీశ్రీ, గరికపాటి రాజారావులు, మాభూమి నాటకాలు, నాజర్ బుర్రకథలు, జాషువా ధిక్కారాలన్నీ తెలంగాణ నేలలో వికసించాయి. ధిక్కార స్వరాల తిరుగుబాటు సంకేతాలన్నింటిని ఎప్పటికప్పుడు తెలంగాణ నేల తనలో ఇముడ్చుకున్నది. పోరాట బతుకు పాఠాల పంటకు తెలంగాణ క్షేత్రంగా మారింది. అందుకే ఇక్కడి సాహిత్య క్షేత్రం యుద్ధానికి శంఖం పూరించినట్లుగా మారింది. విభిన్న స్వరాల, విభిన్న అస్తిత్వాల ఆరాటాల ఆందోళనల దారులన్నీ తెలంగాణ సాహిత్య క్షేత్రంలో ఉన్నాయి.

మలిదశ తెలంగాణ పోరాటంలో కవులూ, రచయితలూ, కళాకారులు ఉసిళ్లపుట్టల్లా వచ్చారు. ఉద్యమానికి పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా నేతృత్వం వహించారు. తెలుగు సాహిత్యం లో ధూంధాంలుగా కొత్తతరం ఎగిసిపడింది. అసాధారణంగా కవులూ, రచయితలూ ఈ ఉద్యమం నుంచి వచ్చా రు. పేరెన్నికగన్న గద్దర్‌లు, గోరటి అంద్శై లు, రసమయి బాలకృష్ణలు, జయరాజులు, నాగన్నలు, అరుణోదయ రామారావులు, దేశపతి శ్రీనివాస్‌లు, విమలక్కలు, మిత్రలు, గూడ అంజన్నలే కాకుండా వందల సంఖ్యలో కొత్త కవులూ, రచయితలూ, కళాకారులు వచ్చారు. మిట్టపల్లి సురేందర్, దరువు ఎల్లన్న, అన్న సిధాడ్డి లాంటివారు వందల పాటలను సృష్టించారు. పాటల పూదోటలో తెలంగాణ తల్లి తన గుండెబరువును దించుకున్నది.

కోదాటి శ్రీను, దయా నర్సింగ్ కలంనుంచి జాలువారిన పాటలు తెలంగాణ యువతరానికి జెండాలై ఎగిసాయి. అభినయ శ్రీనివాస్ గుక్కపట్టిన పాట కళాశాల మైదానాల్లో కవాతు చేసింది. బుర్రా సతీష్ పాట డప్పుల మోతయింది. ఏపూరు సోమన్న పాట వూరూరా మార్మోగింది. పసునూరి రవీందర్ పాట తెలంగాణ పిడికిలైంది. వెన్నెల, మాట్ల తిరుపతి, వోరుగంటి శేఖర్, పైలం సంతోష్, బైరాగి ఇంకా ఎందరో పేరు తెలియని రచయితలు, కవులు ఇంకా ఎందందరో ఉన్నారు. మలివిడత పోరులో ప్రజలను చైతన్యం చేశారు. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులకు ఓదార్పు నిచ్చారు. పాతతరం కవులను గౌరవిస్తూనే ఈ కొత్త కలాలకు, గళాలకు విశేష ప్రాచుర్యం కల్పించి ధూంధాంలలో వెల్లివిరిసేట ట్లు చేసిన గాయకుడు రసమయి బాలకిషన్.

‘ఇది తెగతెంపుల సంగ్రామం, తెగిస్తేనే తెలంగాణ సాధ్యమంటూ’ కదిలిన కవు ల దండు తెలుగు సాహిత్యానికే తలమానికంగా నిలిచింది. దొరగడీల మీద తిరుగుబాటు జెండాగా నిలిచిన బండి యాదగిరి, సుద్దాల హన్మంతుల వారసత్వానికి కొనసాగింపుగా దండకారణ్య సాహిత్యంగా తెలంగాణ మెరిసింది. అన్ని అస్తిత్వ వాదాలకు తలుపులను తెరిచిన విశాల సాహిత్య సాంస్కృతిక మైదానం తెలంగాణం. కారంచేడు, చుండూరు, నీరుకొండ, రామకృష్ణాపురం, పదిరికుప్పాలలో జరిగిన అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కలబడి నిలబడి పోరాట సాహిత్య సృష్టిచేసింది తెలంగాణ సాహిత్య పాదమువూదలే. దళిత కవిత్వానికి, బహుజన కవిత్వానికి జెండాలనిచ్చి నిలిచింది తెలంగాణ. సమాజంలో సగభాగమైన స్త్రీవాద కవిత్వాన్ని కథను పండించింది తెలంగాణే. మైనార్టీ కవిత్వానికి ఖాదర్ పుట్టుమచ్చ నుంచి నల్గొండ నుంచి ఎగిసిన కవిత్వమే మైనార్టీ అస్తిత్వ ఉద్యమం బలం గా నిలిచేందుకు దోహదపడింది. తెలంగాణ సాహిత్య విశాలత వల్లనే ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలలోని రచయితలను, కవులను, మేధావులను కదిలించిం ది. తెలంగాణకు ‘కావడికుండలు’గా గొంతు కలిపారు. కావడిబద్దలా కలిసుం దాం, కుండల్లా విడిపోదామన్న పైడి తేరేష్‌లు, కత్తిపద్మారావులూ, కోయి కోటేశ్వరరావులు, సతీష్‌చందర్‌లు, రాచపావూంలు, రత్నాకర్‌లు, ఇంద్ర రమేష్‌లు, జుగాష్‌లు, బహుజన కెరటాల శ్రీరాముళ్లు, దుడ్డు ప్రభాకర్‌లు సాహిత్యలోకంలో నిజాయితీగా విభజన రేఖలను గీశారు.

ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల ఆధిపత్య సంస్కృతిని విప్పి చెప్పటంలో సాంస్కృతిక ఉద్యమ నిర్మాణంలో పన్నెండేళ్లుగా తెలంగాణ రచయితల వేదిక చేస్తున్న కృషి ఉద్యమ ఉధృతికి దోహదపడింది. తెలుగు సాహిత్యంలో జరిగిన అన్యాయాలను, ఆధిపత్యాలను తెరవే బయటపెట్టింది. ఆధిపత్య రాజకీయాల కొనసాగింపుకు భాషను ఎట్లా ఆయుధంగా మలచుకుని తెలంగాణ గొంతు కోసేందుకు ఎట్లా కుట్రలు పన్నారో చెప్పి, దుప్పట్ల, గొంగళ్ల, శాలువా, అవార్డు కవుల కుట్రలను తెరవే విప్పి చెప్పింది. హైద్రాబాద్‌లో ఏర్పాటైన వలస ఆధిపత్య సాహి త్య గుడారాల గుట్టు విప్పిచెప్పింది. గుంపులుగా గ్రూపులుగా ముఠాలుగా పెత్తనాలు చెలాయించే కొందరు సాహిత్య పెద్దల పటేల్‌గిరిని తెలంగాణ సాహిత్య అస్తి త్వ ఉద్యమం పగులగొట్టింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆట పాట మాట కలమూ, గళమూ కదిలాయి. కళ, రచన, మాట అన్నీ ప్రజల కోసమే పలకాలన్న అంతర్జాతీయ అభ్యుదయ భావాల వారసత్వంలో తెలంగాణ సాహిత్యం ముందుకు సాగింది. అందుకే ఇది ఒక్క తెలంగాణకే కాదు విశ్వవ్యాప్తంగా కవు లూ, రచయితలకూ దిశానిర్దేశం చేసింది. ప్రపంచ సాహిత్య సాంస్కృతిక వేదిక మీద తెలంగాణ ఆత్మగౌరవ పతాకగా ఎగిసింది.

ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకేనని తెరవే తేల్చి చెప్పింది. 1969 ఉద్యమాన్ని మరిపించేందుకే మొదటి మహాసభలు హైద్రాబాదులో జరిగాయి. మలేషియా, కౌలాలంపూర్‌లో రెండు, మూడు మహాసభలు జరిగాయి. మళ్లీ 2cc ఏళ్ల తర్వాత తెలుగుభాష, సంస్కృతిపై రాష్ట్ర ప్రభుత్వానికి కపట ప్రేమ పుట్టుకొచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు తిరుపతిలో 4వ ప్రపంచ తెలుగుసభలు నిర్వహించారని తెలంగాణ కవులూ, రచయితలూ నిరసించారు. హైద్రాబాదులో మొదటి తెలుగు మహాసభలను విరసం సభ్యులు శ్రీశ్రీ,చెరబండరాజు ఇత్యాదులు బహిష్కరిస్తే తిరుపతిలో జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలను విరసంతో పాటు వందల సంఖ్యలో తెలంగాణ కవులూ, రచయితలూ, కళాకారులూ బహిష్కరించి ధిక్కార సంప్రదాయాన్ని కొనసాగించారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రతి కీలకసందర్భంలో ఆచరణాత్మకంగా తెరవే నిలబడింది. 2013 జనవరి 2ccన ఏదో ఒక ప్రకటన వస్తుందని ఎదురుచూస్తున్న ఈ సందర్భంలో సృజనకారులుగా మనమేం చేద్దాం? సాహిత్యరంగం కర్తవ్యం చర్చించేందుకు ఈ నెల 20న హైద్రాబాద్ దోమలగూడలోని ఎ.వి. కాలేజీ ఆడిటోరియంలో తెరవే ఆధ్వర్యంలో ‘తెలంగాణ సాహిత్య యుద్ధభేరి’ నిర్వహిస్తున్నది. 10 జిల్లాల కవులూ, రచయితలు, కళాకారులు, చిత్రకారులు పాల్గొంటారు. ఇపుడు తెలంగాణ సాహిత్యకారులు యుద్ధకవులూ, రచయితలుగా మారారు. ఉద్యమ వ్యూహాలను అల్లే అక్షర శిల్పులయ్యారు.

యుద్ధసమయంలో ఇద్దరే కీలకం. గాయపడ్డ వారికి కట్టుకట్టే డాక్టర్, ధైర్యాన్ని నింపి ముందుకు నడిపించే సాహిత్య సాం స్కృతిక సైన్యం. తెలంగాణ ఉద్యమానికి సాహిత్యం యుద్ధకవచంగా మారింది.
యుద్ధవాతావరణం ఉన్నప్పుడు కవులూ, రచయితలూ ఎలా ఆయుధాలుగా మారి అక్షరాలు అందిస్తారో మలిదశ తెలంగాణ ఉద్యమంలో చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా మారి అది అంతర్యుద్ధంగా మారబోతున్న తరుణంలో ఉద్యమ సాహిత్య యుద్ధభేరిని మోగిస్తూ కవులూ, రచయితలూ తమ కలాల సమరాన్ని సాగించాలి. పాటతో ఎలా యుద్ధం చేయవచ్చునో, ఎలా ప్రజా ఉద్యమాలను నిర్మించవచ్చునో, ఎలా ఉద్యమాన్ని ముందుకు నడిపించవచ్చునో ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమే సాక్ష్యం.

కవుల, రచయితల ఆటపాట మాటే ఉద్యమ ధూంధాంగా మారింది. రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నిర్బంధంతో అణచివేయ వచ్చునేమోగాని ప్రజల రక్తంలోకి ఎక్కిన ఉద్యమపాటను తొలగించటం అసాధ్యం. ఇంకో వంద సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం ఆగకుండా ముందుకు సాగటానికి కావల్సిన సాహి త్య సంపదను తెలంగాణ కవులూ, రచయితలూ సృష్టించారు. క్యూబాను విముక్తి చేసి, ముందుకు సాగిన చేగువేరా నిబద్ధతతో తెలంగాణ కవి రాస్తున్నాడు. జ్యూలియస్ ఫ్యూజిక్ రక్తాక్షరాలతో ఎదిగిన తెలంగాణ కవి దోపిడీరాజకీయ వ్యవస్థలను కూల్చే అక్షరాలను అందిస్తున్నాడు. మాక్సిమ్ గోర్కి అమ్మ నవల చదివి ఎలా కోట్లమంది కమ్యూనిస్టులు తయారయ్యారో తెలంగాణ ఉద్యమ పాట నుంచి యువతరం ఉద్యమ అలలై ఎగిసిపడింది.రాష్ట్ర సాధన ఉద్యమంలో పుట్టుకొచ్చిన సాహిత్యం ఒక్క రాష్ట్ర సాధన లక్ష్యం కోసమే కాకుండా దోపిడీ సమాజ ముఖాన్ని చీల్చేసింది. ప్రపంచ అస్తిత్వ ఉద్యమాలకు ఒక ప్రతీకగా తెలంగాణ సాహిత్య జెండావిశ్వవీధుల్లోరెపపలాడుతున్నది.

‘తెలంగాణ సాహిత్య యుద్ధభేరి’ కార్యవూకమాన్ని ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్రారంభిస్తారు. తెరవే అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన జరిగే సభలో ప్రధాన కార్యదర్శి సూరేపల్లి సుజాత నివేదిక సమర్పిస్తారు. గోరటి వెంకన్న, అంద్శై, గూడ అంజయ్య, అల్లం నారాయణ, కె. శ్రీనివాస్, రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్, విమలక్క, అరుణోదయ రామారావు, అరుణోదయ నాగన్న, నల్గొండ కృష్ణ, సంతోష్, యశ్‌పాల్, మాభూమి సంధ్య, దర్శకుడు ఎన్. శంకర్, వేదకుమార్, మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొంటారు.
అతిథుల సందేశాలు : అంబటి వెంకన్న, బన్నా అయిలయ్య, ఎన్. తిర్మల్, ఉడారి నారాయణ, జలజం సత్యనారాయణ, ఎనిశెట్టి శంకర్, అన్నవరం దేవేందర్, ప్రసేన్, వంశీకృష్ణ, కాకి భాస్కర్, బెల్లి యాదయ్య, వేముల వెంక అనిశెట్టి రజిత, కొండు మల్లాడ్డి, ఎస్. రఘు, హనీఫ్, కోట్ల వెంక
పగటి పూట బువ్వ :1-30 గంటలకు
రెండవ సెషన్:
తెలంగాణ భాష- వక్త : నలిమెల భాస్కర్, అధ్యక్షత : పొట్లపల్లి శ్రీనివాసరావు
వచన కవిత్వం తెలంగాణ-వక్త: నాళేశ్వరం శంకరం, అధ్యక్షత: దామెర రాములు
ఉద్యమం పాట తెలంగాణ- వక్త : కాశీం, అధ్యక్షత: డాక్టర్ అప్పాల చక్రధర్
తెలంగాణ కథ- వక్త : పెద్దింటి అశోక్ కుమార్, అధ్యక్షత: గాజోజు నాగభూషణం
ముగింపు సమావేశం:
అధ్యక్షత : జూకంటి జగన్నాథం, తెరవే మాజీ అధ్యక్షుడు
ముఖ్య అతిథులు : డాక్టర్ సి. నారాయణడ్డి, చుక్కా రామయ్య, అంపశయ్య నవీన్,
డాక్టర్ ఎన్. గోపి, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, నందిని సిధాడ్డి, జూపాక సుభద్ర, గోగు శ్యామల.

-తెలంగాణ రచయితల వేదిక


-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Published: Fri,June 14, 2013 12:20 AM

ఆకాంక్ష పట్టని అసెంబ్లీ

ప్రజాస్వామ్యానికి ప్రతి రూపం, ప్రజలందరి సామూహిక ముక్తకంఠం అసెంబ్లీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనంకోసం కదిలిపోయి, మంది కోసం పనిచేస

Published: Mon,June 10, 2013 12:00 AM

అసెంబ్లీని ముట్టడించనున్న ప్రజాకాంక్ష

ఏ ఉద్యమ పిలుపుకైనా తరలివచ్చే ప్రజలున్నారు. ఎంతటి నిర్బంధాన్నైనా ఎదుర్కొనగల శక్తి సామర్ధ్యాలున్న ప్రజలున్నారు. రాజ్యం వికృత చేష్ట

Published: Mon,June 3, 2013 04:29 AM

పచ్చని పల్లెటూరి పాట వెంకన్న

నిబద్ధత ఉన్న సాహిత్యం కొండమప్లూల్లాగా, బతుకమ్మలో పేర్చిన జీవమున్న పూలలాగా, పచ్చని అడవిలాగా ఉంటుంది. ప్లాస్టిక్ పూలలాంటి కవులు, బ

Published: Sun,February 10, 2013 12:17 AM

పోరు అక్షరాభ్యాసం

చుక్కా రామయ్య లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. రామయ్యలాంటి వ్యక్తులను ఒక వ్యవస్థకే నమూనాగా చెప్పవచ్చును. కళ్లముందు అన్యాయం జరుగుత

Published: Wed,December 26, 2012 11:44 PM

ఎందుకు బహిష్కరిస్తున్నామంటే..

రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి అన్ని అధికారాలను ప్రయోగించి రాజమువూదలతో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించేందు

Published: Sat,November 24, 2012 11:37 PM

సమరాలను అల్లే సూర్యాపేట సమరభేరి

ఒక సమూహం ఎక్కడైనా జమైందంటే.. ఆ నేలే పరవశం కలిగిస్తుంది. చీమల దండ్లుగా జనం కదలాడటం లాగా ఆశయాలుంటాయి. ఆశయాల ఆకాంక్షలు ఎలా జమిలిగా క

Published: Fri,December 14, 2012 04:07 PM

సమాజ నిర్మాణాలు-విలువలు-కాళోజీలు

కాళోజీ అంటే విలువలతో జీవించి జీవితాంతం నిబద్ధతతో నిలబడ్డ వ్యక్తి. ఆ తరానికే కాదు ఈతరానికి కూడా కాళోజీ ప్రతీక. ఆయన ఆ కాలానికి, ఆ త

Published: Sat,December 1, 2012 04:45 PM

సమాజాన్ని నడిపేవి త్యాగాలు, భావజాలాలే

ఒక తరంలో ప్రగతిశీల భావజాలాల విత్తనాలను నాటడం అంతసులభమైన పనేమీ కాదు. ఆ విత్తనాలను నాటడానికి నేలను పదును చేసి, దుక్కిదున్ని, వాతావరణ

Published: Sat,October 27, 2012 05:31 PM

సిరా చుక్కల సమరం

కలం సృష్టించిన జ్ఞానమే కాలం. అక్షరమే కాలాన్ని కలకాలం నిలుపుతుంది. కలం సర్వకాలాలకు కన్నులుగా, సమాజాలకు కాళ్ల చేతులుగా, ఏ వ్యవస్థలకై

Published: Wed,October 10, 2012 06:50 PM

జీవ వైవిధ్యం- జీవన విధ్వంసం

అక్టోబర్ 1 నుంచి 19 వరకు జరుగుతున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుపై ఉన్న శ్రద్ధ, గత అరవై ఏళ్లుగా రాష్ట్రం కావాలని నాలుగున్నర కోట్ల

Published: Wed,October 10, 2012 07:06 PM

పాటను బంధించలేరు

ఆకంఠ స్వరం వింటుంటే చెట్ల సామూహిక తలలపైన పక్షుల గుంపులు ఎగు రు తున్నట్లుంది. దట్టమైన అడవి అందాలు కళ్ళ ముందు కదలాడుతుంటాయి. ఆమె గొం

Published: Thu,October 11, 2012 06:03 PM

కాళన్న దారిలో కదం తొక్కుదాం

భోగోళం మీద ఎప్పుడెనా, ఎక్కడెనా ఆధిపత్యాన్ని అడ్డంగా నరికేసే ధిక్కార స్వరా లు కలాల కంఠాలే. తిరుగుబాట్లన్నీ సృజనకారుల ఆలోచనల్లోనే పొ

Published: Sat,October 6, 2012 03:26 PM

సాహిత్య సాంస్కృతిక సైన్యం ‘తెరవే’

సంఘాలకు, వేదికలకు సాహిత్య సృష్టికి సంబంధం ఉందా? సాహిత్యం సృజనకు సంబంధించినది. సంఘం అన్నది నియమ నిబంధనలకు, లక్ష్యాలకు సంబంధించింది.

Published: Sat,October 6, 2012 03:27 PM

తొలుస్తున జ్ఞాపకాలు

ఒక కాలం ఎప్పుడూ మరో కాలానికి పాఠం చెబుతూనే ఉంటుంది. ఇలా కాలానికి కాలం పాఠం చెప్పటమే పరిణామక్షికమం అనుకుంటా. ఒక కాలం ఇచ్చిన స్ఫూర్త

Published: Sat,October 6, 2012 03:27 PM

వెలిదండ: తల్లి పేగు బంధం

పుట్టిన ఊర్లను ఎలా మరిచిపోలేమో అలాగే మనలో చైతన్యాన్ని రగిలించిన ఊర్లను కూడా మరిచిపోలేం.ఎప్పుడైనా పుస్తకా లు మనలోని సృజనను తట్టిలేప

Published: Sat,October 6, 2012 03:28 PM

ఈ గర్భశోకాలకు కారణమెవ్వరు తల్లీ..!

‘తెలంగాణ ’ ఒక శక్తి సూత్రం ‘తెలంగాణ ఒక చలనం, ఒక ప్రళయం ప్రజలంటే ఆత్మాభిమాన జెండాలు పోరుదారులు తెలంగాణను ఎవరూ కాలరాయలేరు ఈ పో

Published: Sat,October 6, 2012 03:37 PM

ఈ మహాకావ్యం పేరు తెలంగాణ

హద్దులు, లెక్కల పద్దులు లేని వాడే కవి కవిత్వం విప్పిన సద్దిమూట, తనను తాను ఆరేసుకున్న ప్రకృతి పైట కవిత్వం నదుల నోటి ను

Published: Sat,October 6, 2012 03:37 PM

నివురుగప్పిన నిప్పులు

ఒక భావజాలంతో కలిసి నడిచిన మిత్రులు ఏక కంఠమై నినదించిన మిత్రు లు, ఒకే లక్ష్యంతో ఏకమైన పిడికిళ్లు, కలిసి పనిచేసి అలసిపోయిన మిత్రులు,

Published: Sat,October 6, 2012 03:39 PM

ఓరుగల్లు పోరు క్షేత్రం

తెలంగాణలో నిత్య నిర్బంధం కొనసాగుతున్న దశలో నక్సలైట్లు సభలు జరిపితే ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. పోలీసుశాఖవారు ఆ సభలకు వెళ్లవద్దని

Published: Sat,October 6, 2012 03:39 PM

ఉద్యమ నిర్వచనం మారుతున్నవేళ.

ఉద్యమం అంటే రాజకీయంగా ఒకరికొకరు విమర్శలతో విరుచుకుపడటం కాదు. ఉద్యమమంటే ఉరితాళ్ళు తీసుకొని సవాళ్లు, ప్రతిసవాళ్లతో గన్‌పార్క్‌లోని

Published: Sat,October 6, 2012 03:40 PM

శ్రీ కృష్ణకు , సుదర్శనుడికి ఎంత తేడా!

డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందన్న హోంమంత్రి చిదంబరం నోటితోనే..,డిసెంబర్ 23 న ఇరు ప్రాంతాల అభివూపాయం తీసుకున్నాకే

Published: Sat,October 6, 2012 03:44 PM

విరామమెరుగని పోరు

మలిదశ తెలంగాణ పోరులో ప్రజలు అత్యంత చారివూతాత్మకమైన పాత్ర పోషిస్తున్నారు. ఏ పోరాటంలోనైనా ఇంతకంటే తెగించి పోరాడుతున్న ప్రజలుంటారా? త

Published: Sat,October 6, 2012 03:44 PM

సకల జనాగ్రహం

ప్రశ్నలు.. సంఘర్షణలు.. వాదోపవాదా లు.. ఒత్తిడులు.. ఒడిదొడుకులు..లాఠీలు.. తూ టాలు.. ఆత్మ బలిదానాలు.. రాజకీయాలు, రాజకీయక్రీడలు, ఎత్త

Published: Sat,October 6, 2012 03:43 PM

ఒకే మాట, ఒకే బాట

కేంద్రాన్ని, ఆంధ్రా ఆధిపత్య శక్తులను ఒక పక్క ఎదుర్కొంటూనే మరో పక్క తెలంగాణలో భిన్న రాజకీయ చైతన్యాల మధ్య తెలంగాణ రాష్ట్ర అంశంపై ఏక

Published: Sat,October 6, 2012 03:43 PM

ఉద్యమాలకు అన్నం పెట్టిన అవ్వ

-జూలూరు గౌరీశంకర్ తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి అడవి ఉద్యమానికి మైదాన ఉద్యమానికి సంబంధించిన కీలకమైన సమాచారానికి మధ్య

Published: Sat,October 6, 2012 03:42 PM

మన సాంస్కక్షుతిక ఉద్యమ తల్లిపేగు జయశంకర్

-ఆయన తెలంగాణ గుండె చప్పుడు. ఆయన తెలంగాణ సాంస్కృతిక పేగుబంధం. అయనను తెలంగాణ పదబంధాల నుంచి విడదీసి చూడలేం. ప్రొఫెసర్ కొత్తపల్లి

Published: Sat,October 6, 2012 03:41 PM

తెలంగాణ కలాల కోలాటం.. తెరవే

కడుపులో పిండం పెరిగి పెద్దయి, కడుపులో తండ్లాడి, మాతృగర్భం చీల్చుకుని శిశువు పెట్టిన కేక ఒక జననం. కాలం జీవించటానికి, కదలటానికి, ముం