ఎందుకు బహిష్కరిస్తున్నామంటే..


Wed,December 26, 2012 11:44 PM

రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి అన్ని అధికారాలను ప్రయోగించి రాజమువూదలతో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. అందుకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి అధికార భాషాసంఘం అధ్యక్షులు, సాంస్కృతిక వ్యవహారాల శాఖామంవూతులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అధికారులు, అన్నిజిల్లాల కలెక్టర్లు ముమ్మరంగా ఈ కార్యవూకమంలో పాలుపంచుకుంటున్నారు.

రాజ్యం తలుచుకుంటే చేయలేనిదేముంటుంది? ప్రపంచ తెలుగు మహాసభలకు స్వచ్ఛందంగా తరలిరావాల్సిన కవులు, రచయితలు, కళాకారులకు ఎరలు వేసి, బుజ్జగించి, బతిమిలాడి పిలిపించుకోవాల్సిరావటం తెలుగువాళ్లంతా విచారించవల్సిన విషాదం. ప్రభుత్వం అన్నిపార్టీల నేతలను పిలిపించుకుని వారిని రావల్సిందిగా కోరింది.తెలుగుభాషా సభలు నిర్వహిస్తుంటే అందునా ప్రపంచస్థాయిలో తెలుగు సభలు నిర్వహిస్తుంటే తెలంగాణ సమాజం, ఇక్కడి ప్రజా సంఘాలు కవులు, రచయితలు బహిష్కరిస్తున్నామన్న ప్రకటనలు ఎందుకు విన్పిస్తున్నాయన్నదే కీలకమైన ప్రశ్న.

తీవ్రరూపమైన బహిష్కరణ పిలుపును అందుకోవాల్సిన స్థితి ఎందుకు వచ్చిందో ఈ సందర్భంగా తెలుగు సమాజం ఆలోచించుకోవాల్సిన సందర్భమిది. భాషను భాష కోసం కాకుండా, భాషను అధికారం కోసం, ఆధిపత్యం చెలాయించటానికి అధికార పీఠానికి ఒక ఆయుధంగా మార్చుకోవటం వల్లనే తెలంగాణ సమాజం బహిష్కరించే దశ వచ్చింది. ఒకే జాతి మనది అని ఉపన్యాసాలు చెబితే అక్కడ చప్పట్లు కొట్టవచ్చును. ఇందులో ఏదో విస్తృత అర్థం ఉందని పలు కల్పితాలు అల్లవచ్చును.


బైటి సమాజానికి గొప్పగానూ ఉండవచ్చును. కానీ ‘ఒకే జాతి, ఒకేభాష, మనమంతా ఒక్కటే’ అన్న సూత్రంతో ఒక ప్రాంతాన్ని, ఒక ప్రాంత అస్థిత్వ ఉద్యమాన్ని, కోట్లాదిమంది ప్రజల ఆకాంక్షలను అణిచివేయటం కోసం ప్రయోగించినప్పుడే బహిష్కరణ అన్న ప్రతిఘటన వస్తుంది. తెలుగు భాషను కిందిస్థాయి నుంచి సెక్ర వరకూ అమలు చేయండి అనో, లేదా తెలుగుకు ప్రత్యేకమంవూతిత్వశాఖను పెట్టమనో, తెలుగుభాషను పాఠశాల స్థాయి నుంచి నిర్బంధంగా అమలు చేయాలనో డిమాండ్లు చాలా కాలం నుంచి ఉన్నా యి. అయినా పాలకులు ఇంగ్లిషు మీడియం చుట్టూ తిరుగుతూ ఇప్పుడు తెలుగు మహాసభలని ప్రగల్భాలు పలుకుతుందని అందుకే ఈ మహాసభలను బహిష్కరిస్తున్నామని పలు సంఘాలు ప్రకటించాయి.

వారి వారి కార్యాచరణలను రూపొందించుకుని బహిష్కరణ కార్యవూకమాలను చేపడుతున్నాయి. ఇంకొన్ని సంఘాలు రాజ్యం హింసను నిరసిస్తూ ఈ సభలను బహిష్కరిస్తున్నాయి. కొన్ని సంఘాలు పూర్తి తెలుగు భాష అమలుకోసం గొంతెత్తుతున్నాయి. తెలంగాణలోని ప్రజాసంఘాలు మాత్రం స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిస్తున్నాయి. ఏదేమైనా అన్ని ప్రాంతాల్లోని ఆలోచనాపరులుపగతిశీలవాదులు ఈ సభలను బహిష్కరిస్తున్నారు. ఇందులో పలు అంశాలు, భిన్న ఆలోచనలతో ఉన్నవారినందరినీ ఏకం చేస్తున్న సూత్రం ప్రపంచ తెలుగు మహాసభల బహిష్కరణ కార్యవూకమం. అందుకే ఎన్నడూ లేనంతగా అనేక ప్రజాస్వామిక సంఘాలు కూడా ఈసభలను బహిష్కరిస్తున్నామని ప్రకటించాయి.

తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ విద్యావంతుల వేదికలు సంయుక్తంగా ఈ మహాసభలను బహిష్కరించాలని అందుకు కార్యాచరణను కూడా ప్రకటించాయి. ఈ మూడు సంఘాలు స్పష్టంగా భాషకు సంబంధించిన అంశాలతోపాటుగా తెలంగాణ రాష్ట్రం కోసం వేయిమంది ఆత్మబలిదానాలు చేసుకున్నా కదలని ప్రభుత్వం, తెలుగు పేరున ఉత్సవాలు జరపటాన్ని నిరసిస్తూ బహిష్కరణకు పిలుపునిచ్చాయి.

మేమెందుకు బహిష్కరిస్తున్నామంటే? 1975లో తొలి ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో జరిగాయి. ఆ మహాసభల ఉద్దేశ్యం నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, నాటి విద్యాశాఖామంత్రి ఏమి చెప్పినప్పటికినీ, అది మాత్రం స్పష్టంగా 1969లో ఎగిసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తిరిగి పునరావృతం కాకుండా చేసేందుకేనని తెలంగాణ సమాజంలోని ఆలోచనాపరులు భావించారు. బహిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర నినాదం తిరిగి తలెత్తకుంటా ఏంచేయాలన్న ఆలోచనలో భాగంగానే ‘తెలుగుజాతి మనది. నిండుగ వెలుగు మనది’ అన్నపాటను ముందుకు తెచ్చారు. తెలుగుతలిన్లి రూపకల్పన చేశారు. దాని తర్వాత ట్యాంక్‌బండ్‌పై తెలుగుతేజోమూర్తుల విగ్రహాలను నెలకొల్పుతూ తెలంగాణ సాహిత్య సాంస్కృతిక ఆనవాళ్లను తొక్కేశారు. తమ ఆధిపత్య సంస్కృతికి దర్పణంగా ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను నెలకొల్పారు. తెలుగు తేజం, తెలుగు పౌరుషం, తెలుగువాడి ఆత్మగౌరవం పేరున రాజకీయపార్టీని నెలకొల్పి అధికారం హస్తగతం చేసుకున్నారు. భాషా సంస్కృతులకున్న గొప్పతనం, అది తేగలిగిన మహత్తరమైన కదలికలను ఆధిపత్యవాదులు పసిగట్టి భాషను ఆయుధంగా మలుచుకుని తెలంగాణ గుండెపై కొట్టారు.

తెలుగుభాషను దిక్కులేని దాన్నిచేశారు. అధికారం కోసం, ఆధిపత్యం కోసం, తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చైతన్యాన్ని తొక్కివేసేందుకు తెలుగుతల్లిని ప్రతిష్ఠించి తెలంగాణ భాషా సంస్కృతులను తొక్కేశారు.దీంతో నీళ్లల్లో, నిధుల్లో, ఉద్యోగాల్లో, తెలంగాణకు జరుగుతున్న దగాను ఎలుగెత్తుతూ తెలంగాణ సమాజం గొంతువిప్పింది. తెలంగాణకు న్యాయం జరగాలంటే రాష్ట్రం ఒక్కటే పరిష్కారమని తెలంగాణ సమాజం నినదించింది. దీంతో పాలనారంగం స్థంభించింది. నిరసనలతో, ఉద్యమాలతో, ఆత్మబలిదానాలతో, ఆమరణ నిరాహారదీక్షలతో తెలంగాణ సమాజం అట్టుడికింది. దీంతో ఆధిపత్యవాదులు వెనకడుగు వేయక తప్పలేదు. అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం 2009, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించామని ప్రకటన చేసింది.

ఆధిపత్యవాదులు లాబీయింగ్ ద్వారా చివరకు డిసెంబర్ 23న మరో ప్రకటన చేయించి తెలంగాణ బువ్వలో మట్టిపోశారు. తెలంగాణ ఉద్యమం మిలియన్ మార్చ్‌లుగా, సకలజనుల సమ్మెగా, తెలంగాణ మార్చ్‌గా కొనసాగుతున్నది. ఈ తెలంగాణ ఉద్యమాన్ని మరిపించటానికి మళ్లీ ‘మనమంతా ఒకేజాతి’ అన్న నినాదంతో ఆధిపత్యవాదులు, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందుకే మళ్లీ 1975 తర్వాత మళ్లీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అణిచేందుకు ప్రపంచ తెలుగు మహాసభలను తిరుపతిలో నిర్వహిస్తుంది. ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించటానికి ప్రధాన కారణం ఇదే. సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను అణిచివేసే ఉక్కుపాదాలుగా ఈ మహాసభలను ఉపయోగించుకుంటున్నారు. వేయిమంది విద్యార్థులు, యువత ఆత్మబలిదానాలు చేసుకుని తెలంగాణ సమాజం శోకసమువూదంలో ఉంటే తెలుగు మహాసభలు ఎట్లా నిర్వహిస్తారని తెలంగాణ రచయితల వేదిక ప్రశ్నిస్తున్నది.

దశాబ్దకాలంగా తెలంగాణ సమాజం తెలుగుతల్లి అన్న మాటను తిరస్కరించింది. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటను బహిష్కరించింది. మీరు మేమూ ఒకటికాదని తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంది. భాష ముసుగులో రాజకీయం చేస్తే అదెంత శక్తివంతంగా ఉంటుందోననటానికి ప్రత్యక్ష సాక్ష్యంగా సీమాంధ్ర రాజకీయ నాయకులు ప్రయోగిస్తున్న భాషాస్త్రాలను, ప్రపంచ తెలుగు మహాసభలే నిదర్శనంగా చెప్పవచ్చును. సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన రాజకీయ నేతలు, పలు పార్టీలు బైటకు ఏం చెప్పినా చెప్పకున్నా పరోక్షంగా ఈ ప్రపంచ తెలుగు మహాసభల విజయానికి దోహదపడుతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు పూనుకున్నది. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ మహాసభలను ముందుకు తీసుకువచ్చారు.

తెలుగువారంతా ఒక్కటే అని ప్రపంచానికి చూపించటానికి సాకుగా ఈతెలుగు మహాసభలను ఘనంగా 48 కోట్ల ఖర్చుతో జరుపుతున్నారు. దీన్ని తెలంగాణ అస్థిత్వ ఉద్యమతేజంతో, ఆ వేయిమంది అమరుల ఆత్మబలిదానాల త్యాగాల సాక్షిగా తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది. ఇది చారివూతకమైన పనిగా,బుద్ధిజీవుల పనిగా విధిగా తెలంగాణ సమాజం భావించి ఈ మహాసభల బహిష్కరణకు సిద్ధమైంది. తెలంగాణ భాష ఉర్దూ, తెలుగు, పార్సీ, కన్నడం, హిందీల కలయికలతో ఉన్న జీవభాష. ఇది దక్కనీయ భాష. ఇది దక్కన్ నేలమీద అవతరించిన తెలుగు భాష. హైద్రాబాద్ రాష్ట్రంగా తిరిగి మా రాష్ట్రం మాక్కావాలే అన్న నినాదంతో ఈ మహాసభలను తెలంగాణ తిరస్కరిస్తున్నది.

కవి ఎప్పుడూ రాజ్యానికి వ్యతిరేకి. ప్రజా పక్షపాతి. రచయితలు సృజనకారులుగా అధికారాన్ని ఎప్పుడూ తిరస్కరిస్తూనే వుంటారు. అందునా పాల్కురికి సోమనాధుడు, పోతనల వారసత్వంలో తెలంగాణలోని కవులు, రచయితలు ప్రజల పక్షాన నిలిచి తమ కలాలను ప్రజలకు అంకితం చేశారు. కవులు అనధికార శాసనకర్తలు అన్నది తెలంగాణ కవులకు స్పష్టంగా వర్తిస్తుంది. వేలాదిమందిపై అక్రమ కేసులు బనాయించి, పాటలపిట్టయి తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక సైన్యాన్ని కదిలించే నాయకుడుగా మారిన విమల కంఠాన్ని జైల్లో బంధించి ప్రపంచ తెలుగు మహాసభలను ఎలా నిర్వహిస్తారని తెలంగాణ సమాజం అడుగుతున్నది. విభజన రేఖల మధ్య ఉద్యమ యుద్ధం ఆరంభమయ్యాక తెలుగు మహాసభలను నిర్వహించడమంటే తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టడమే అవుతుంది. ఈ మహాసభల బహిష్కరణలో సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెందినవారే కాకుండా తెలంగాణ సమాజమంతా పాలుపంచుకోవాలి.

-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Featured Articles