సమాజ నిర్మాణాలు-విలువలు-కాళోజీలు


Fri,December 14, 2012 04:07 PM

కాళోజీ అంటే విలువలతో జీవించి జీవితాంతం నిబద్ధతతో నిలబడ్డ వ్యక్తి. ఆ తరానికే కాదు ఈతరానికి కూడా కాళోజీ ప్రతీక. ఆయన ఆ కాలానికి, ఆ తరానికి వన్నె తెచ్చిన మహామనిషిగా నిలిచాడు. కాలాన్నిబట్టి, తరాన్ని బట్టి విలువలు మారుతుంటాయి. ఒక కాలం విలువ ఇంకో కాలంలో అలాగే ఉండదు. ఒక కొత్తతరం తెచ్చిన విలువలు ప్రస్తుత సమాజానికి ఉపయోగపడాలి. కొత్త ఆశల సౌధం కొత్త సమాజ నిర్మాణం జరగాలి. రెండుతరాల మధ్య జరుగుతున్న సమాజ నిర్మాణంలో విలువలే పునాదులుగా ఉండాలి. సామాజిక విలువలు పునాదులుగా లేని సమాజాలు ఎక్కవకాలం నిలబడజాలవు. అందుకే ఏ సమాజానికైనా మానవీయ విలువలు దట్టంగా ఉండాలి. ఆయా కాలాలలో, ఆయా సమాజాలలో విలువలు నశించిపోతుంటే సమాజాల్ని బతికించటానికే కొందరు వ్యక్తుల్ని ఆయా సమాజాలే సృష్టించుకుంటాయనుకుంటా! ప్రపంచ పటంలో ఏ దేశంలోనైనా మారుతున్న సమాజ గమనాలను పరిశీలిస్తే మానవీయ విలువలను ప్రతిష్ఠించటానికి, సమాజంలో కొత్త భావజాలాల్ని వెదజల్లటానికి, సమాజాన్ని శాంతపరచటానికి, సమాజాన్ని విప్లవీకరించటానికి కొందరు మహానుభావులు జన్మించారు. వాళ్లు ప్రపంచ గమనాన్ని చదువుకుని, సమాజ పురోభివృద్ధులను ఆకాంక్షించి, సమాజంలోని మెజారిటీ ప్రజ ల బాగోగులను ఆకాంక్షించి, శ్రమజీవుల, కష్టజీవులత పక్షం నిలబడటం మహోన్నతమైన విలువ.

ప్రపంచంలో అంతకుమించిన విలువ ఇంకొకటి లేదు. అది ఏ సమాజంలోనైనా, ఏకాలంలోనైనా నోరులేనివాళ్లకు నోటిమాటగా, అండలేనివారికి కొండంత ధైర్యంగా, చూపులేని వారికి కంటిచూపుగా, భయంతో వణికిపోయే వారిని ఆయుధంగా మలచగలిగి సమస్త జనావళికి అండదండలుగా నిలబడగలగటం అందరివల్లా కాదు. జీవితాన్ని జనం కోసం, జీవితాన్ని అట్టడుగువర్గాల ప్రజల కోసం, తమ జీవితాల్ని సమాజ మార్పుకు అంకితం చేయగలవాళ్లే మొత్తం సమాజాన్ని మార్చగలరు. వాళ్ల ఆలోచనలే సమాజాల్ని ప్రభావితం చేస్తాయి. వాళ్లు లెప్టిస్టులు కావొచ్చు రైటిస్టులు కావొచ్చు. వీళ్ళిద్ద రూ కాకుండా హ్యూమనిస్టులు కావచ్చును. లేదా అది సమాజాన్ని మార్చే మార్క్సి జం కావొచ్చును. మావో ఆలోచన కావచ్చును. ఫూలే, అంబేద్కరిజాలు కావచ్చును. లెనిన్, ఎంగెల్స్‌ల ఆలోచనల ధారల్లో తలకిందులుగా వున్న హెగెల్‌ను సక్రమంగా నిలబెట్టిన మార్క్స్ కావచ్చును.

ఒక మానవీయ సామాజిక దృక్పథం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా అది మొత్తం భూగోళానికి ఎప్పటికీ శక్తిసూవూతంగా మారుతుంది. ఆ సూత్రాలే సమాజాలు నాలుగుకాళ్ళపై నాలుగు కాలాలు నిలబడటానికి కావల్సిన విలువలను ప్రసాదిస్తాయి.

అందుకే దేశమేదైనా, నేలేదైనా సంబంధం లేదు. అలా తెలంగాణ నేలలో ఎందందరో మహానుభావులు ప్రభవించారు. ప్రజల పక్షం వహించి సమాజాన్ని రక్షించే విలువలను నమ్ముకుని వేల సంఖ్యలో నేలకొరిగారు. తెలంగాణ నవ సమాజాన్ని కాంక్షించి వేలకొలదిమంది రక్తతర్పణలు చేసి ప్రపంచపటంలో నేల విశిష్టతను చాటిన మానవీయ మహోపాధ్యాయులు ఎందందరో ఉన్నారు. తెలంగాణ నేల లో అలా ప్రభవించిన వేలకొలది వీరుల రక్తతర్పణల సాక్షిగా తరతరాలు సగర్వంగా నిలుపుకోదగ్గ సామాజిక విలువల్ని ప్రతిష్ఠించారు. ఆ తరాలు వదిలి విలువలు నేటికి కూడా పరమ పూజనీయమైనవి మాత్రమే కావు. నేటి ఆచరణకు ధరించాల్సి న విలువల దుస్తువులవి. అలాంటి భావజాలాల్ని అంటిపట్టుకుని మనిషి మనుగ డ, మనిషి తనకు తానుగా శిరసెత్తుకుని నిలబడగలిగే స్వేచ్ఛ కావాలని, మానవహక్కుల రక్షణ కోసం గొంతెత్తి అరిచినవాడు, తను కన్నుమూసే వరకు అదే ప్రజలను కంటిపాపలుగా మార్చుకున్నవాడు కాళోజీ నారాయణరావు. కాళోజీ కోపానికి రూపం.

కాళోజీ ప్రేమకు రూపం. కాళోజీ ఏ ంసనైనా చూసి కరిగిపోయే కనీళ్లకళ్లవి. కాళోజీ ఆధిపత్యాన్ని ప్రశ్నించిన శక్తి, కాళోజీ ఎమ్జన్సీని ధిక్కరించిన సాపా సం, కాళోజీ రాజ్యాన్ని గల్లాపట్టుకుని నిలదీసిన ధైర్యరూపం, కాళోజీ తన వెంటనడిచిన కాలాన్నంతా పొల్లుపోకుండా కవిత్వీకరించిన కవిత్వ శిఖరం. తెలుగు సమాజమంతా ఎట్లా ఉందని అడిగితే అది కాళోజీ ‘నా గొడవ’ లాగా ఉందని ఠక్కున చెప్పేయవచ్చు.
ఎవరీ కాళోజీ తాత అని ఈ తరం పిల్లలు అడిగితే వారికి ఒక్కమాటలో ఏం చెప్పగలుగుతామని ఆలోచిస్తుంటే ఆయనే రాసిన ఒక్క కవిత్వపాదం గుర్తుకు వస్తుంది. ‘పుట్టుక నీది, చావునీది, బతుకంతా దేశానిది’ అ ని చెప్పేశాడు. ఇది లోక్‌నాయక్ జయవూపకాశ్‌నారాయణ్ కన్నుమూసినప్పుడు రాసిన కవిత. సమాజం అప్పుడు జెట్ విమాన వేగంతో ముందుకుపోతుంది. ప్రపంచమంతా ఇంటర్‌నెట్‌లోకి ఒదిగిపోయింది. ఈ తరానికి కాళోజీలను చెప్పటం, వాళ్లను ఒప్పించటం, ప్రశ్నించేతత్త్వాన్ని వారికి ఒంటనిండా రాయటం అంత సులభమైన పనికాదు.

అందుకే కాళోజీల ఆలోచనలను సమాజ కంటిపాపలుగా, మన సమాజానికి రక్షణ కవచాలుగా మార్చాలి. ఇంటర్‌నెట్‌ల తలుపులు తెరుచుకుంటున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానపు వనాల్లో కూడా కాళోజీ విలువల విత్తనాలు చల్లాలి. కాళోజీ నారాయణరావు జీవితమంతా తాను చెప్పింది చేసి చూపించాడు. విభిన వ్యక్తిత్వం ఆయనది ఆయన తన భావజాలాల్ని చాటుతూనే అందరితో స్నేహాలు చేసినవాడు. ఆయ న నిరంతరం ప్రజాస్వామిక హక్కుల గురించి రెక్కలు కట్టుకొని తిరిగి అరిచినవాడు. కోపగించుకునే వాడికే ప్రేమించేతత్త్వం కూడా ఉంటుందనటానికి కాళోజీనే గుర్తుగా చెప్పవచ్చును. రాజ్యం చేసే హింసకు, అందుకు విప్లవోద్యమాలు చేస్తున్న ప్రతిహింసలు రెంటిని ఆకళింపు చేసుకునే ధైర్యంగా మాట్లాడాడు. ఓటును బహిష్కరించండి అన పిలుపును అర్థం చేసుకున్నవాడు మాత్రమే ఓటుహక్కు వినియోగం గురించి సరైన అర్థం చెప్పగలుగుతాడనటానికి కాళోజీనే సాక్షిగా చెప్పవచ్చును.

చెట్లకు పూలెందుక పూస్తున్నాయి/బుప్లూట్లెందుకు కాయవని ప్రశ్నిస్తున్న కవులకు అడవిలోని వెన్నెల అంతఃపుర కవులకు/ఆస్థాన కవులకేం తెలుసునని ప్రశ్నించిన శివసాగరులకు మధ్య సాహిత్య రంగంలో పెద్ద అగా ధం ఉంది. కాళోజీ నారాయణరావు ఇప్పపూల సిగల మాటున దాచిన విల్లంబుల ను చూశాడు. ఇప్పపూల సుగంధాలను ఆస్వాదించి అడవిపొత్తిళ్ల దగ్గరకు వెళ్లి తిరగాడ గలిగాడు. కాళోజీలో విభిన్నత్వం ఉంది. విశాలాంవూధను సమర్థించి అది ఎంతమోసమో తెలుసుకున్నాక తీవ్రంగా ప్రతిఘటించిన వ్యక్తి కూడా కాళోజీనే. అందుకే కాళోజీకున్న నిబద్ధత తెలంగాణ ఆత్మగౌరవ జెండా సగర్వంగా రెపపలాడేందుకు దోహదం చేసింది.

కాళోజీ తరం అందించిన స్ఫూర్తి ఎంతకాలం ఉయోగపడుతుందంటే ఎల్లకాలాలకు ఉపయోగపడుతుంది. ఆధిపత్యాలు ఉన్నంతకాలం, అణిచివేతలు ఉన్నంతకాలం కాళోజీ ఆలోచనలు సజీవంగా ఉంటా యి. ఇలాంటి గొప్పవాళ్లను భావితరానికి అందించటమే ఈ తరం చేయాల్సిన పని. మార్కెట్ సమాజాన్ని మానవీయ సమాజంగా మార్చటానికి కాళోజీలు కావాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెట్టుబడీదారి మార్కెట్‌శక్తుల చేతులలోంచి సమాజ రథాన్ని నడిపించే శ్రమశక్తుల చేతుల్లోకి తీసుకరావాలంటే కాళోజీ తరాలు, ఆ కాలాలు అందించిన సామాజిక విలువలను ఈ తరం హృదయంలో నాటాలి. అలాంటి పని చేయకపోతే సమాజం మార్కెట్ చుట్టే తిరుగుతుంది. ఒక నిరంతరం చైతన్యం సమాజాన్ని పదునుపెట్టకపోతే అది నిలకడగల నీరుగా మారి దుర్గంధాన్ని ఇస్తుంది. కాళోజీ ఒక నిరంతర సజీవ ప్రవాహం. ఆజ్ఞాన ప్రవాహానికి రెండు దారులుగా ఈనాటితరం నిలవాలి. ఆ జ్ఞాన నీటిలోకి దూకాలి. ఆ లోతుల్లోకి వెళ్లి తిరిగి రాగలగాలి. విలువలను కాపాడగలగటమంటే సమాజాన్ని రక్షించుకునేందుకు పునాదులను బతికించుకోవటమేనని గుర్తించగలగాలి. ఈ విలువలే దేన్ని కూల్చాలో, దేన్ని నిలపాలో దారి చూపుతాయి.

వరంగల్ మిత్రులు కాళోజీ ఫౌండేషన్ పేరున ప్రతిష్ఠాతక అవార్డులవ్వటమంటే మళ్లొక్కసారి ఆయనను మననం చేసుకునేందుకే, ఆ భావధారను కొనసాగించటానికే కాబట్టి ఆ దారుల్లో నడుస్తున్నవారికి అవార్డు అందించటం విశేషం. అయితే కాళోజీ అవార్డు అందుకోవటమంటే మళ్లీ అంత విలువలున్న స్థాయిగల వ్యక్తులను ఎంచుకోవటం కూడ కష్టమే. అవార్డు కమిటీకి కూడ అది పెద్ద సవాలే. ఈ సారి అవార్డు ప్రదానానికి మాత్రం ఆ అవార్డు కమిటీకి అదృష్టం కొద్ది ప్రముఖ విద్యవేత్త చుక్కా రామయ్య దొరికాడు. చుక్కారామయ్య లాంటి వ్యక్తులు టార్చివేసి వెతికితే ఎక్కడో వేయిమందిలో ఒక్కడు కానరాడు. ‘మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడని అందెశ్రీ గుండెలు పగిలేలా అరుస్తున్న సందర్భంలో చుక్కా రామయ్యలాంటి వారు దప్పిక తీర్చే చెలిమల్లాగా ఉంటా రు. కాళోజీ, రామయ్యలు నిగర్వులు. వీళ్లు చిన్నపిల్లల దగ్గరికి వెళితే చిన్న పిల్లలుగా మారుతారు. పద్దల దగ్గర పద్దలుగా, పీడిత ప్రజల దగ్గర వారి ప్రతినిధులుగా, ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులుగా, కాలానికి కవచాలుగా నిలబడగల యోధులు కాళోజీ, చుక్కారామయ్యలు.


ఇద్దరూ సమాజం కోసం తపించిన వాళ్లే. ఇద్దరికీ ఉన్న సంబంధం ఏమిటంటే ఇద్దరూ అన్యాయాన్ని ప్రశ్నించినవాళ్లే. నక్సలైట్లను కాల్చిపారేస్తే కాళోజీ కన్నిళ్లు పెట్టుకుంటే, ఆర్ట్స్ కాలేజీలో పిల్లల వీపులపై లాఠీలు విరిగితే గుక్కపట్టి ఏడ్చినవాడు రామయ్య. మానవ హక్కుల విత్తనాలను కాళోజీ వెదజల్లితే, ఆ పంటకు తన వంతుగా కాపలాదారుగా మారినవాడు చుక్కా రామయ్య. రామయ్య ఉపాధ్యాయునిగా ఉండి అమెరికాలో సిలికాన్‌వాలీ సృష్టించగలిగాడు. సిలికాన్ వాలీలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండటానికి కారకడు రామయ్య. రామయ్య విద్యార్థులులేని దేశం ప్రపంచంలో లేదు. రామ య్య ఇప్పుడు వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులుగా కొనసాగుతున్నారు. కాళోజీ, రామయ్యలు శాసనమండలికి వెళ్లటం వలన వీరిద్దరికీ కొత్తగా ఒరిగిందేమీ లేదు. కాకపోతే ఆ శాసనమండలికి వన్నె పెరిగింది. ఆలాంటి వ్యక్తులు కూడ శాసనమండలి సభ్యులుగా ఉండటంవల్ల శాసన వ్యవస్థపై గౌరవమే కాకుండా దానిపై నమ్మకం పెరుగుతుంది. ‘ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం ఇది దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం’ అంటూ పిడికిళ్లు బిగిస్తున్న శక్తులు కూడ అలాంటి వ్యక్తులు శాసనమండలి సభ్యులైతే లోలోపల ఆనందిస్తారు. అసెంబ్లీ పార్లమెంటులు బాతాకానీ క్లబ్‌లని తరిమెల నాగిడ్డి స్పష్టంగా చెప్పాక కూడ నేనెందుకు శాసనమండలికి వెళ్లానని చాలాసార్లు మధనపడ్డ వ్యక్తి చుక్కా రామయ్య.

కాళోజీ, రామయ్యలు ప్రజాస్వామికవాదులు. అందుకే వీళ్ళిద్దరినీ తెలుగు సమాజం తమ గుండెల్లో దాచుకంటుంది. ఇప్పుడు కాళోజీ అవార్డు చుక్కా రామయ్యకు ఇచ్చి ఆ కమిటీ గాలిపీల్చుకుంది. కమిటీకి ప్రతి ఏడాది ఒక చుక్కా రామయ్య ఎక్కడ దొరుకతాడోననదే చూడల్సిందే. అర్హులు లేకపోతే ఆ అవార్డు ఉత్సవాన్నే వాయిదా వేసుకునే దశకు సమాజం ఎదగాలి.

-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు
(నేడు వరంగల్‌లో విద్యావేత్త చుక్కా రామయ్యకు కాళోజీ ఫౌండేషన్
అవార్డు అందజేస్తున్న సందర్భంగా)

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.