సమాజాన్ని నడిపేవి త్యాగాలు, భావజాలాలే


Sat,December 1, 2012 04:45 PM

ఒక తరంలో ప్రగతిశీల భావజాలాల విత్తనాలను నాటడం అంతసులభమైన పనేమీ కాదు. ఆ విత్తనాలను నాటడానికి నేలను పదును చేసి, దుక్కిదున్ని, వాతావరణానికి అనుకూలంగా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. ఈ విత్తనాలను బతికించడానికి పోరుసేద్యం చేస్తున్న వ్యక్తి అవసరమైతే ఆ నేలకు తన నెత్తురును చిందించి త్యాగాల మేడి ద్వారా విత్తనాలను ఆ తరంలోకి ఎక్కించాల్సి ఉంటుంది. ఇది అందరివల్లా అయ్యే పనికాదు. ఎవరో కొందరు తమను తాము త్యాగం చేసుకుని భవిష్యత్‌కు దారులు చూపుతారు. అలా ఒక తరాన్ని నడిపించి న వ్యక్తులు కొందరు సమాజంపై బలమైన భావజాల ముద్రలు వేసిపోయారు. ఆ కోవలోకి చెందినవారిలో ఉస్మానియా విద్యార్థి అరుణతార జార్జిడ్డి ఒకరు. ఆయన ఆలోచనల బాటలో ముందుకు సాగి ఆచరణాత్మక రూపం ధరించి విద్యార్థి ఉద్యమాల ద్వారా పొంగిపొర్లిన పోరాట తేజం ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల ఉద్యమ రూపం జంపాల చంద్రశేఖర్‌వూపసాద్. ఈయన జార్జి చూపిన దారిలో ముందుకుసాగిన యోధుడు. జార్జిడ్డి చిన్నవయసులో నే కన్నుమూశాడు. 1969లో తెలంగాణ ఉద్యమం సన్నగిల్లాక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1970 తర్వాత ఒక ఏడాదిన్నర కాలం విద్యార్థులను కూడగట్టడంలో, చైతన్యపుదారులు చూపడంలో జార్జిడ్డి ఎంతో కృషి చేశారు. ఉస్మానియాలో అతి తక్కువ కాలంలోనే ఆయన విప్లవభావజాలవ్యాప్తి విస్తృతంగా జరిపారు. ఒకరకంగా తెలుగు సమాజానికి జార్జిడ్డి చే గువేరా లాంటివాడు. ఆయన దారిలో విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తూ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ కదలివచ్చాడు. జంపాల కూడా అతి తక్కు వ కాలమే జీవించాడు.1975లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాన్ని నిర్మించి మొత్తం విద్యార్థి లోకాన్ని కదిలించాడు. పిడిఎస్‌యుకు జంపాల చంద్రశేఖరవూపసాద్ , శ్రీపాద శ్రీహరుల నెత్తుటి ధారల తో బిగిపిడికిలా రూపుదాల్చింది. జంపాల ప్రసాద్ ఎమ్జన్సీ చీకటిరోజుల్లో కాల్చివేయబడ్డాడు. ఆయన త్యాగంతో పిడిఎస్‌యు జెండా సమున్నతంగా ఎగిసింది. సరిగ్గా యిప్పటికి ఆయన మరణించి 37 సంవత్సరాలు కావస్తోంది. విద్యార్థి ఉద్యమంలో పడిన ప్రగతిశీల భావజాలమే క్రమంగా యువజన ఉద్యమంలోకి వెళ్ళేందుకు దారిచూపింది. చదువుకునే కళాశాల రోజులలో విద్యార్థుల మనోఫలకాలపై పడే ఆలోచనలు వారిని జీవితాంతం వదిలిపెట్టవు. ఎమ్జన్సీ తరువాత రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమం ఒక్కసారిగా ఎగిసిపడింది.

జంపాల చూపిన దారిలో శ్రీపాద శ్రీహరి రక్తతర్పణ దారుల్లో విద్యార్థిలోకం కదిలింది. కళాశాలల ప్రాంగణాలు ఉద్యమ కేంద్రాలుగా మారాయి. కళాశాలలకు సెలవులు వస్తే గ్రామాలకు తరలిరండి అన్న కార్యక్షికమాన్ని కొనసాగించారు. డిగ్రీ, జూనియర్ కళాశాలల నుంచి ఇంజనీరింగ్, మెడిసిన్, విశ్వవిద్యాలయాలలో ఉన్నతవిద్య చదువుతున్న విద్యార్థులు గ్రామాలకు కదలిపోయారు. ఊరూరు తిరిగి అక్కడి సమస్యలను ఆకళింపుచేసుకుని గ్రామచావళ్లలో సమావేశాలు జరిపి ఆ ఊరుకు సంబంధించిన అన్ని విషయాలను ఈ విద్యార్థులు విప్పిచెప్పేవారు. వ్యవసాయరంగంలో పనిచేస్తున్న కూలీల దగ్గరకు వెళ్లి వాళ్ల సమస్యలను తెలుసుకుని పనికితగ్గ వేతనం యివ్వాలని డిమాండ్ చేసేవారు. వృత్తిపనివార్ల దగ్గరకు వెళ్లి వాళ్ల సమస్యలను తెలుసుకుని కదిలించేవారు. ఆ ఊళ్లలో వున్న దొరగడీలకు వ్యతిరేకంగా యిచ్చిన పోరాట పిలుపులే గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాలుగా మలచబడ్డాయి. అవే దండకారణ్యాలుగా మారాయి. ఆ విద్యార్థుల చెతన్యమే అడవి ముఖద్వారం కొమరారం, బయ్యారం దాకా దండకారణ్యం దారుల్లోకి వెళ్లేటట్లు చేశాయి. ఆ విద్యార్థులే సమాజ విముక్తి సూత్రమైన మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానాల్ని ఈ మట్టిపై గీసి చూశారు. మట్టి మనుషుల దగ్గరకు వెళ్లగలిగిన ఈ చెతన్యమూర్తులే అడవిపొత్తిళ్లదాకా వెళ్లగలిగారు. అడవిలో పోడుచేసుకునే వ్యవసాయానికి అండగా నిలబడే యోధులయ్యారు. అడవి సంపదలను కాపాడే సంరక్షకులయ్యారు. కళాశాల ప్రాంగణాలలో ఏ చైతన్యంతో గొంతెత్తి అరిచారో అదే చైతన్యంతో బయటకు వచ్చి పిడికిలి బిగించారు. అసెంబ్లీ గేట్లముందు ప్రజాసమస్యలపై గొంతెత్తి ప్రతిధ్వనించారు. ఈ విద్యార్థులే కదిలిపోయి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చిరిగిపోయిన దుప్పట్ల మధ్య అవస్థలు పడుతున్న విద్యార్థులకు వెచ్చటి అండగా నిలిచారు. అసలు ఈ ప్రగతిశీల విద్యార్థులు ఉన్న ప్రదేశాలలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండేదని పోలీసు అధికారులే చెప్పిన సందర్భాలున్నాయి. మట్కా జూదాన్ని ఆడేవాళ్లకు, పోకిరిగాళ్లకు వడ్డీ వ్యాపారులకు పోలీసులంటే భయంలేదు కాని ఈ ప్రగతిశీల విద్యార్థులను చూస్తే పారిపోయేవారు. ఇలా తమ కళ్లముందు కన్పిస్తున్న అన్యాయాలను ఎదుర్కొని నిలవడంలో విద్యార్థులశక్తి ఎంత గొప్పదో చాటిన కాలమది.

అందుకు జంపాల చంద్రశేఖరవూపసాద్ చేసిన త్యాగం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తితో ఎదిగొచ్చిన విద్యార్థులు నేడు రాష్ట్రంలో ఎన్నో చైతన్య ఉద్యమాలకు ప్రాణం పోశారు. అస్తిత్వ ఉద్యమాలకు కూడా ఆచరణదారిని చూపి ధైర్యంగా నిలబడగలిగింది ఆ తరం. మార్క్సిజం వెలుగులో మావో ఆలోచనా దారుల్లో నల్లగొండ కొండలై, ఖమ్మం ఖిల్లలె, ఎత్తొండ వారసత్వంతో నిజామాబాద్ వెలుగులె, కాకతీయ విశ్వవిద్యాలయం ముఖద్వారాలె, ములుగు అడవుల్లో అడవి పాఠశాలలె, అదిలాబాద్ గోండన్నల గుండెదండె, వేములవాడ రాజన్నలె, సిరిసిల్ల జగిత్యాలల జాతరలె, సింగరేణి బొగ్గుగని కార్మికునికి వెలుగుదీపమై, అడవికి అన్నలై, అక్కలై, ఆదివాసీల ముద్దుబిడ్డలయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో దప్పిక తీర్చే పోరుకేంవూదాలయ్యారు. కరీంనగర్ కంటిపాపలై, హైద్రాబాద్, రంగాడ్డి జిల్లాల మైదాన పోరా ట కేంద్రాలై, రాళ్లసీమ రత్నాలై, కర్నూలు, అనంతపురాల్లో రాగిముద్దలూ, శ్రీకాకుళం పోరాట సిక్కోళ్ళె, కోస్తా తీరవూపాంతంలో మత్స్యకారులు సమువూదంలో విసిరిన వలలై, మొత్తం రాష్ట్రంలో చెతన్య దివిటీలను ఈ ప్రగతిశీల విద్యార్థులు వెలిగించారు. ఆ జంపాల దారిలో, శ్రీహరి వెలుగుల్లో, వెంపటాపు సత్యం అడుగుల్లో, కాంచనపల్లి వీరుల రక్తతర్పణ దారు ల్లో, బత్తుల వెంక అమరత్వం నుంచి అడుగులు వేస్తూ ఆ ప్రగతిశీల ఉద్యమం ముందుకు సాగింది.

ఆ ప్రగతిశీల విద్యార్థి ఉద్యమంలోంచే అడుగులు వేస్తూ ముందుకు వచ్చిన వీర న్న కులసమాజాన్ని ఎత్తిచూపాడు. దళిత, బహుజన, గిరిజన ఆదివాసీ, మైనార్టీ ఉద్యమాలకు నేతృత్వం వహిస్తున్న వ్యక్తులంతా విప్లవోద్యమం నుంచి ఈ ప్రగతిశీల విద్యార్థి ఉద్యమంలోంచి వచ్చినవారేనన్నది నిజం. రాష్ట్రంలో సకల కుల వృత్తుల సంఘాలకు నేతృత్వం వహిస్తున్న యోధులంతా ఈ ధారల్లోంచే ఎగిసొచ్చా రు. మార్క్సిజం నుంచి అంబేద్కరిజం, ఫూలే ఆలోచనలకు బహుజన ఉద్యమానికి పాదులు వేశారు. ఈనాడు రాష్ట్రంలో అస్తిత్వ ఉద్యమాలు ఇంత బలంగా ఉండటానికి కారణం ఆ ప్రగతిశీల ఉద్యమం నుంచి ఎదిగి రావటం కూడా ఒక కారణం. వాళ్లెవ్వరో తెలియకుండా లక్షలాదిమంది యువతను కదిలించగలిగారు. వారు త్యాగాలు చేసి వేసిన భావజాలబాట అజరామమైంది. జంపాలచంవూదశేఖర ప్రసాద్‌తో కలిసి మేం అడుగులు వేయలేదు. జంపాల ధెర్యసాహసాలు రాజ్యంపై ఆయన తిరగుబడ్డ తీరు, ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థిలోకాన్ని కదిలించటం, ఎమ్జన్సీ చీకటి పాలనలో భావిభారత విప్లవ ఉద్యమ నిర్మాణానికి రూపకల్పనలు చేయటం, ఆయన నిబద్ధత, నిమగ్నతలు ఆనాటి తరాన్ని కదిలించింది. భావజాలబాటలు వేయటం చాలాకష్టమైనది. త్యాగాలతో కూడుకున్నది. నాలాంటి వేలాదిమంది అలా ఆ బాటలో సునాయసంగా నడిచిపోవటానికి దోహదపడిరది. అందుకే వాళ్లు ఉపాధ్యాయుడు చెబుతున్న పాఠాన్ని తరగతి గది నుంచి ఆచరణల ఆకురాయిల మీదకు తీసుకురావటం కోసం సాహస ప్రయత్నం చేశారు. అదే ఉద్యమమంటే, అదే విప్లవమంటే, అదే మార్పు అంటే. తాను నమ్మిన భావజాలం దారిలో నడుచుకుంటూ అంతిమ పరిష్కారం దాకా పోరాడగలగటం ఎలా ఉంటుందంటే జంపాల చంద్రశేఖర ప్రసాద్ చేసిన త్యాగం లాగా ఉంటుంది. ఈ తరం వారి కి కొల పాటో, ఇంకేదో మాస్ ఐటమ్ సాంగో అందరికీ తెలుసుకానీ. ఉయ్యా లో... జంపాల...ఈ దోపిడీ కూలదోయా ల...... పాట ఎక్కువ మందికి తెలియదు. ఆ పాట నిజంగా ఇపుడు అవసరమా? ఆ త్యాగాల నెత్తుటిధారల్లో ఇంకా యువతం నడిచిపోవాలా? ఈ సమాజం అంతా సజావుగా ఉందా? పీడిత ప్రజలు అన్న పదం అర్థాలు మారుతున్న ఈ సందర్భంలో, మార్కెటీకరణ, ప్రపంచీకరణ, ఆదాయ సంపాదనీకరణ, వ్యక్తిత్వ వికా స కేంద్రీకరణలు జోరుగా జరుగుతున్న ఈ సందర్భంలో జంపాల చంద్రశేఖర ప్రసాద్ అన్న వ్యక్తి స్ఫూర్తి, ఆ త్యాగం అవసరమా? తప్పక అవసరమే అవుతుంది. ఎడారిలో నీటి చెలిమ లాంటి వాడు జంపాల చంద్రశేఖర ప్రసాద్ దుఃఖిస్తున్న లోకానికి జంపాల సాహసవీరుల గాథల భావజాల దారులే కొండంత అండగా ఉంటాయి. అందుకే ఆ విద్యార్థి వీరుల త్యాగాలను కొత్తతరానికి చెప్పటమంటే అన్యాయం మీద యుద్ధం ఆగిపోలేదని చాటిచెప్పటమే అవుతుంది. ఆ పోరుదారి జ్యోతులను మనందరం తలా ఒక చేయివేసి ఆరిపోకుండా చూద్దాం.

విప్లవోద్యమాలకు సమాజ విముక్తి సూత్రంగా మారిన జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ లాంటి వారసత్వం అన్నది సమసమాజాల నిర్మాణాలు జరిగే వరకూ కొనసాగుతూనే ఉంటుంది. జంపాల వారసులం మేమే అని ఆయన చైతన్యాన్ని కొన్ని పార్టీ ఆఫీసుల్లో బంధించి వేసే పని ఎవరు చేసినా తప్పే. జంపాల చూపిన త్యాగాల దారిలో ఎవరైనా నడిచి నాడు తెలంగాణ రాష్ట్ర సాధన అన్న డిమాండ్ ఉధృత ఉద్యమంగా లేదు. కానీ జంపాల విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని శక్తివంతంగా నిర్మించాడు. ఇపుడు తెలంగాణ కోసం జరుగుతున్న సమరంలో జంపాల స్ఫూర్తిని తీసుకుని ముందుకు సాగవచ్చును. రాజ్యంపై చేయబోయే సమరంలో జంపాల సాహసాలు ఎంతో ఉపయోగపడతాయి. నిరాశతో వెనకడుగు వేయాల్సిన పనిలేదని, ముందుకు సాగవచ్చునన్న దృఢ సంకల్పానికి జంపాల ప్రసాద్ నిదర్శనం. ఆత్మబలిదానాల నుంచి ఆత్మరక్షణ పోరాట ఉద్యమ జెండాలుగా మరింత సమున్నతంగా ఎగరవేయటానికి ఓ చే గువేరా...ఓ జూలియస్ ఫ్యూజిక్... ఓ జార్జిడ్డి.... లాగా ఓ జంపాల త్యాగం ఈ తరం ఒంటినిండా నింపవచ్చును. జంపాల స్ఫూర్తి నుంచి ఓ వీరన్న ఉద్భవించినట్లుగా, ఓ మధుసూధనరాజ్ యాదవ్ ప్రభవించినట్లుగా లక్షల మంది తెలంగాణ యువత అస్తిత్వ కోణం నుంచి ముందుకు సాగుతుం ది. వేయిమంది ఆత్మబలిదానాలతో తల్లుల గర్భశోకంతో తల్లడిల్లుతున్న తెలంగాణ గుండెఘోష పోరు రూపంగా మారక తప్పదు. ఆ ఉద్యమ మహావూపస్థానంలో అమరుల త్యాగాల స్ఫూర్తితో ముందుకు సాగాలి. ఫ్యూడల్ సమాజంలోంచి బైటపడి ఆధిపత్య సంస్కృతిపై యుద్ధం చేయటానికి ఆనాడు ఒక జార్జిడ్డి, ఒక జంపాల ఒక జనార్థన్ ఓ శ్రీపాద శ్రీహరులు స్ఫూర్తినిచ్చారు. ఇది మార్కెట్ సమాజం. దీని నుంచి సమాజ పరివర్తన చేయటానికి ఒక జంపాల సరిపోడు. వందలాదిమంది జంపాల ప్రసాద్‌లు కావాలి. ఈ సమాజానికి ఆనాటి కంటే ఈనాటి మార్కెట్ సమాజాన్ని కూల్చడానికి ప్రజలకు అండగా నిలవటానికి తిరిగి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్‌లాంటి యోధుల స్ఫూర్తి ఎంతో అవసరం ఉంది.

-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు
(ఖమ్మంలో నవంబర్ 4వ తేదీన జంపాల చంద్రశేఖరవూపసాద్ స్ఫూర్తి సభ సందర్భంగా)

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

country oven

Featured Articles