సిరా చుక్కల సమరం


Sat,October 27, 2012 05:31 PM

కలం సృష్టించిన జ్ఞానమే కాలం. అక్షరమే కాలాన్ని కలకాలం నిలుపుతుంది. కలం సర్వకాలాలకు కన్నులుగా, సమాజాలకు కాళ్ల చేతులుగా, ఏ వ్యవస్థలకైనా గుండెకాయలుగా కలాలు నిలుచుంటాయి. కలమం కలకాదు. కలలను నిజంచేసే మహత్తర సాధనం. కలం ఎంచుకునే దారిని బట్టే లక్ష్యాలూ ఉంటాయి. కలం ఏ సిరాను నింపుకుంటే ఆ రంగులోనే రాసినట్లుగా కాదు. సిరా ఏ రంగుతో ఉన్నా తాను ఆ సిరాతో ఏ అక్షరాలు పంచిపెడుతున్నాడన్నది ముఖ్యం. సమాజంలో ఉన్న అంతరాల దొంతరలను అర్థం చేసుకోగలిగింది కలమే, ఆ అంతరాలను అంతర్థానం చేయగలిగిన శక్తి దానికుంది. అలాగే ఆ అంతరాల లోయలను మరింతగా పంచేశక్తి కూడా కలానికే ఉంది. కన్నీళ్లకు, కంటిపాపలకు సంబంధమున్నట్లుగా కలం ఎప్పు డూ కష్టాలను, కన్నీళ్ల కడలుల్లో ఈదుకుంటూపోతుంది.

పరవశ ఆనందాల మధ్య, పరమోన్నత ఉత్కృష్ఠాల మధ్య, గిలిగింతలు కల్గించే సందర్భాల మధ్య కలం వీక్షణం చూస్తూనే వచ్చాం. కలాలు ఒక వ్యవస్థను కూల్చగలవు. లేదా కూలిపోయే వ్యవస్థను నిలుపగలదన్నది చరివూతలో చూస్తూనే వస్తున్నాం. కలాలు ఎప్పుడూ కావ్యాలకు జడలు మాత్రమే వేయవు. కలాలు ఎప్పుడూ కావ్యకన్యకలై నృత్యాలు మాత్రమే చేయవు. కష్టాల నదుల్లో ఎవ్వరూ ముగిపోకుండా కాపాడే గంగమ్మ తల్లిలాగా కలం నిలబడింది. రాజ్యం వికృతత్త్వా న్ని చెప్పి ప్రజల పక్షం నిలిచే జన కవాతుగా కలం పోరు పర్వాలకు తెర తీయగలదు. ఉన్నది ఉన్నట్లు, చూసింది చూసినట్లు, జరిగింది జరిగినట్లు, జరగబోయేది, జరుగుతున్నది, కళ ్లముందు మరుగుతున్నది.

అన్నీ మనం కలం కంటి ద్వారా చూడవచ్చును. సమస్త లోకాలలో సమస్తాన్ని కలం చూపుతో కాంచవచ్చును. కలమేరా ఈ ప్రపంచం. జగత్తు కలం లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేదు. కలాలకు కాలాలు సలాములు చేస్తాయి. కలరాతల్లోనే కలతలన్నీ తెలుస్తాయి. రాజ్యం సమస్త లక్షణాలను కలం విప్పిచూపుతుంది. కలం కథలు కథనాలు ఒక సమాజంలో నిత్యం కనిపించే దృశ్యాలే. కలాలు ఎందుకంటే? సమాధానాలు భిన్నంగా విభిన్నంగా విస్తృతంగా విశృంఖలంగా ఉంటాయి.

కలం శోధనలో శోకించి పరిశోధిస్తుంది. కలం కష్టాల లోతుల్లోకి వెళ్లి వాటి మూలాలను తెలుసుకు ని పరిష్కారాలను చూపుతుంది. కలం అంటే జ్ఞానబోధి. కలం అంటే అ కాలాలను నడిపించే ఒక మహత్తరశక్తి. కలం శాంతించి శాంతి పర్వాలను ఆవిష్కరించగలదు. కలం ఆగ్రహిస్తే కడలి కడుపున కల్లోలాలు మాదిరిగా అక్షర సునామీలతో అల్లకల్లోలం సృష్టించగలదు. కలానికి ఒక ప్రళయం తెలుసు. ఒక ప్రణయం తెలుసు. ఒక ప్రచండ త్వం తెలుసు. పరిమళత్వం, పరవశత్వం తెలుసు. ఆకాశంలా వర్షించటం తెలుసు. కలానికి తెలియంది లోకంలో ఏముంటుంది? కలం ఒంటి నిండా కళ్లే. అందుకే ప్రపంచం చూడలేనిదేదైనా ఉండవచ్చు ను. కలం చూడలేది మాత్రం ఏదీ ఉండదు. సమాజాన్ని మోస్తున్న శక్తులన్నింటికీ కలమంటే ఇష్టం.

సమాజాన్ని దగా చేస్తున్న వారికి కలమంటే కసి, ద్వేషం ఉంటుంది. కలాల మధ్య స్నేహమే సమాజాన్ని కలకాలం ఉంచుతుంది. కలం స్నేహం చేస్తుంది. ప్రజలందరి తరపున బాధ్యత తీసుకున్న కలం జనావళికి కొండంత అండనిచ్చి నిలబడుతుంది. సమాజాన్నే సిరాగా మార్చుకున్న కలమే కలము కదా!!
నిత్యం రాజ్యంతో ఉంటూ రాజ్య విభాగాల విభిన్నత్వంలో విస్తృతంగా సంచరిస్తూ, రాజ్యం చెప్పే విషయాలన్నింటిని చెప్పినట్లుగా రాస్తూనే, రాజ్యం చేసే సకల తప్పులను నిరంతరం ఎత్తిచూపే శక్తివంతమైన రూపం కలం. ఆ రాజ్యం చెప్పుకునే దాన్ని చెప్పుకోనిచ్చి, ఆ రాజ్యం సకల లక్షణాలను వెల్లడిస్తూ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంటూ రాజ్యం అసలు రంగును విప్పి చూపగలిగిన శక్తి కలానికే ఉంది. అందుకే రాజ్యానికి కలమం ప్రేమకంటే కోపమే ఎక్కువ.

కలమంటే రాజ్యం చెప్పింది చెప్పినట్లు వొప్ప చెప్పే రికార్డరో, సెల్‌ఫోన్‌లో రింగుటోనో కాదు. అందుకే కలం యోధులను చూస్తే రాజ్యానికి వణుకు. లక్షమంది సైన్యానికైనా జడవను కానీ ఒక్క కలాన్ని చూస్తే మాత్రం వణుకుతానని నెపోలియన్ లాంటి నియంత వ్యాఖ్యాంచి కలం ప్రశస్తి ఆధునిక కాలంలో మళ్లొక్కసారి ప్రతిష్ఠించారు.

ఆధునిక కాలాల్లో జర్నలిజం సమాజానికి ఒక దిక్కుగా మారింది. ఒక దిశానిర్ధేశంగా మారింది. సమాజంలో ఉన్న అన్ని రంగాలను ప్రక్షాళనం చేసే శక్తిమంతమైన ఆయుధంగా మారింది. అక్షరాయుధాలు ఎక్కుపెడితే ఒక రాజ్యాన్ని అతి సునాయాసంగా కూల్చవచ్చును. అక్షరాల యుద్ధంతో తాము అనుకున్న దాన్ని తేల్చివేయవచ్చును. అందుకే అక్షరాలను ఒంటినిండా ధరించిన యోధుడు చేసే యుద్ధం ముందు ఎవరూ నిలువలేరు. అక్షరాలు అంత శక్తివంతమైనవని ఆధునిక కాలంలో జర్నలిజం తేల్చి చెప్పింది. వార్తయందు జగము వర్ధిల్లుతున్నది జనమే. వార్తలతో వారధులు కట్టడుతున్నాయి. ఆ వంతెనల వారధులను కూల్చగలశక్తి కూడా వార్తలకే ఉన్నాయి.

అందుకే ఒక మనిషిపై మరోమనిషి, ఒక వ్యవస్థపై మరో వ్యవస్థ ఆధిపత్యం ఇంకానా? ఇక చెల్లదని తేల్చి చెప్పగలిగినా అంటరాని అక్షరాల సాక్షిగా ఇపుడు వ్యవస్థ అంతా అక్షరాల వంతెనల మీదే నడుస్తుంది. అది ఇప్పుడు నడుస్తున్న అక్షరాల చరిత్ర. ఆధిపత్యాలపై యుద్ధం చేస్తున్న వర్తమాన అక్షరాల చరిత్ర. అక్షరాలా....కాదు అక్షరమే వర్తమానం. అక్షరమే భూత, భవిష్యత్ కాలం. అందుకే ఆ అక్షరాలు ఇపుడు నేలలో తమ అస్తిత్వానికి పాట పాడుతున్నా యి. తన నేలను ఆక్రమించుకుని తనకాళ్ల కింద భూమే తనకు పరాయిదై పోయినప్పుడు పరాధీనంగా పడివున్న అక్షరాలు ఎదురుతిరిగితే జరిగే సంగ్రామాలనే అక్షరాలు తొడుక్కుని ఆగ్రహిస్తున్నాయి.

అణచివేతను చూసీ చూసీ అలసిపోయి సొలసిపోయి ఉగ్రరూపం ధరించిన ఉగ్రనరుల్లాగా మారిన అక్షరాల జల పాతాల శబ్దమిది. ఒక అణచివేతపై ప్రశ్నల వర్షం కురిపించిన అక్షరాలే చీమలదండ్లుగా కదిలి అక్షర మహావూపస్థానాలుగా, మరో అక్షర ప్రస్థానాలుగా కదంతొక్కుతున్నాయి. వార్తలు రాసే చేతి వేళ్ల రూపం పిడికిలిగా మారి న సందర్భమిది. కలమే వేదికపై నిలబడి కలబడుతూ జనపక్షం వహించిన మహత్తర సాంస్కృతిక సందర్భమిది.

తెలంగాణ మట్టికి విప్లవమొక్కటే కాదు వినయం అనే గొప్ప సుగుణం కూడా ఉంది. సుగుణవంతమైనదే జ్ఞానమన్న సోక్రటీస్ మాటకు తెలంగాణ కలాలు అద్దాలుగా కనిపిస్తాయి. ఉత్తజ్ఞానం ఎప్పుడూ జ్ఞానం కాదు. అది జనం నోటి కాడ బువ్వగా మారినప్పుడు మాత్రమే, అది సమాజ భాండాగారంగా మారినప్పుడే అది ఉత్తమ జ్ఞానం. ఉన్నత జ్ఞానం అవుతుంది. తెలంగాణ జర్నలిజం ఉన్నత విలువలతో పురుడుపోసుకుంది. జర్నలిజానికి తెలంగాణము, ఆంధ్రము, తమిళము, కన్నడమూ, ఒక ప్రాంతం, ఒక హద్దు, ఒక దేశ సరిహద్దుల గీతలు ఉంటాయా? ఉండవు కాక ఉండవు. అక్షరాలకు హద్దులను చూపెట్టగలవారు ఎవరూ లేరు.

కానీ అక్షరాలు ఆ నేలపై ఆ జనం పడుతున్న బాధలను చూసినప్పుడు మాత్రమే జనపక్షం వహించి అస్తిత్వాన్ని, ధరించి, ఆ ప్రాంత విముక్తి కోసం నిలబడతాయి. అది భూగోళంపై ప్రతి సమయంలో సందర్భంలో చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ నేలలో ఆ సంద ర్భం వచ్చింది. తెలంగాణ కలాలు అస్తిత్వ ఉద్యమ రెక్కలు ధరించి ఎగుస్తున్నాయి. కలం రాతగాడు యోధుడుగా ఎందుకు మారుతాడో గులాం రసూల్‌ను చూశాక తెలిసింది. కలం పట్టుకురాసే వాళ్లు నేల విముక్తి కోసం షోయుల్లాఖాన్‌లుగా ఎందుకు మారుతారో కాలమే చూసింది కలాలకు రాతల పరుగుంటుంది కానీ, కలాలే ఆయుధాలుగా మారి కలం సిపాయిలుగా మారటం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చూసింది.

మట్టి గుళ్లు కట్టుకున్న మట్టి చేతుల ముద్దు ముద్దు గుర్తుల సుతిమెత్త అక్షరాలు తమ నేలగోడు విని ఉద్య మ గుళ్లుగా అక్షరాలను అల్లటం రాష్ట్ర సాధన ఉద్యమంలో అడుగడుగునా చూడటం జరిగింది. కలాలు సంగ్రామాలకు దిగి కదన రంగ పాటలు రాయ టం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో జర్నలిస్టులంతా ఒక దండుగా కదలి రావటం అన్నది రాజ్యం ఎప్పుడూ ఊహించనిది. రాజ్యమే కాదు మొత్తం జర్నలిజం చరివూతలో తమ నేల కోసం తమ ప్రాంత విముక్తి కోసం ఇంత పెద్ద ఎత్తున కదలి రావటం, వేల కలాలు ఒక్కసారిగా గొంతు తెరిచి ప్రతిధ్వనించటం భూగోళం మీద ఒక్క తెలంగాణలోనే జరిగింది.


దున్నేవాదే భూమి అన్న గొప్ప సూత్రాన్ని ప్రపంచానికి అందించింది తెలంగాణ. ఈ పాంత విముక్తి కోసం వేల కలాలు కదిలిపోయి ప్రాంతీయ విముక్తి పోరాటాలలో జర్నలిస్టుల పాత్రను ప్రపంచానికి చాటి చెప్పిన ఖ్యాతి కూడా నేల మీద కలాలకే దక్కుతుంది. ఇది ఆంధ్రకు, రాయలసీమకు వ్యతిరేక పోరాటం కాదు. మొత్తం ప్రపంచ అస్తిత్వ ఉద్యమ జాబితాలో కలం పాత్రను చెప్పిన కలం సమర సిపాయిల కదనరంగ గాథది. తెలంగాణ జర్నలిస్టులు మౌనంగానే ఉన్నారు. తెలంగాణ జర్నలిస్టులు అహంకారంగా, దుందుడుకుగా ఎక్కడా వ్యవహరించలేదు. తెలంగాణ జర్నలిస్టులు ఉన్నత పదవులలో ఉన్న వారిపైకి, రాష్ట్ర స్థాయి, దేశస్థాయి నేతలపైకి చెప్పులు, బూట్లు, తమ చేతిలో కలాలను ఏనాడు విసిరికొట్టలేదు.

ఆంధ్ర, రాయలసీమ ప్రాంత నాయకులపై దురహంకారపూరితంగా ఆగ్రహంగా ఏనాడు ప్రకటనలు చేయలేదు. కాకపోతే నేలమీద వేయిమంది విద్యార్థుల ఆత్మబలిదానాల త్యాగాలను చూసిన తెలంగాణ జర్నలిస్టులు ఆ త్యాగాల పక్షాన నిలబడ్డారు. నాలుగున్నర కోట్ల మంది చేస్తున్న ప్రజా ఉద్యమం పక్కన నిలబడట మే ప్రజల పక్షం వహించే జర్నలిస్టులు చేయాల్సిన పని అని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రజాస్వామిక హక్కులను కాపాడేదే పరమ ఉన్నత కార్యమై తే ఆ పనిని తెలంగాణ జర్నలిస్టులు చేశారు. అందుకు మొత్తం గర్వించాల్సిన తెలుగు సమాజం అందుకు భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే కలాలు ఆగ్రహిస్తాయి. ఆలోచనల కుంపట్లు రాజుకుంటాయి.

ఆకాంక్షల కొలముల్లో కలా ల కర్రులు నిప్పుకణికల్లా మరుగుతుంటాయి. ప్రజల ఆకాంక్షలకు అండగా నిలబడి వినయంగా వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ జర్నలిజం ప్రమాణాలకే మెరుగులు దిద్దినవాళ్ల తెలంగాణ జర్నలిస్టులు. అక్షరాల్తో చేసే ఆందోళనను అర్థం చేసుకోని రాజ్యాన్ని ఏమనాలి? ప్రజల తరుపున అక్షరాలే ప్రాతినిధ్యం వహించటం అన్నది ఒక ప్రజాస్వామిక పోరాట రూపం. అది పోరాట రూప మే కాదు ఒక ప్రాథమిక హక్కు. తెలంగాణ రాష్ట్రం ప్రజల జన్మ హక్కు అ తెలంగాణ జర్నలిస్టులు కదిలి రావటం రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల రూపంగానే చూడాలి.

ప్రపంచీకరణ మనుషుల్ని ఒక దగ్గర జమ కాకుండా చేసేదిలా మారింది ప్రపంచీకరణ మనుషుల మధ్య విభేదాల పంచాయితీలు పెట్టేది. ఒక పది మంది కలిసి ఉండలేని దశను ప్రపంచీకరణ మన ముందు పెట్టింది. ఒక సమస్య పరిష్కారం కోసం కోట్లమంది కలిసి నిలవటం, ఉద్యమించటం విశే షం. ఆ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కదలి పోవటమే కాదు, వేల కలాల కంఠాలు ఐక్యంగా కదిలి ఒకే నాదంగా మారటం ప్రపంచీకరణ కాలంలో ఇదొక మహత్తర ఆవిష్కరణ. పత్రికా రచనా రంగంలో నే ఇది మరిచిపోలేని ఘట్టం. తెలంగాణ జర్నలిస్టులు ఇక్కడి ప్రజల హక్కుల సాధన కోసం ప్రతిజ్ఞ చేస్తున్న కలం సైనికులుగా మారారు.

ఇపుడు సబ్బండ వర్ణాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి తెలంగాణ రాష్ట్రం కావాలంటే ఈ నేలమీద అన్ని శక్తలతో కలిసి పోయామన్న మేధావివర్గం తెలంగాణ జర్నలిస్టులు కదలి రావటం విశేషం. దీన్ని చూస్తే ఓ ముప్ఫైయేళ్ళ కితం గోడల మీద రాతలు ఆకర్షణీయంగా ఆలోచనాత్మకంగా ఉండేవి. ‘కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావుల ఐక్యత వర్ధిల్లాలి’ అని నినాదం చూస్తే మొత్తంగా ఒక చైతన్యవంతమైన సమాజం లాగా అనిపించేది. ఆ పనిని ఇపుడు తెలంగాణ జర్నలిస్టులు చేశారు.
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సమాజంలో అవసరాలను కలుపుకుపోయే ఐక్యతలాగా అది గోడమీద రాత రూపంలాగా అనిపిస్తుంది. కలం పట్టి రాసుకుంటూ, జరిగిన సంఘటనలను చూసుకుంటూ పోయే జర్నలిస్టులకు ఇదేం పని అన్న ప్రశ్న వచ్చింది.

నిరసనలు తెలుపుతున్న వారి నిరసన గళాన్ని రాయాల్సిన కలాలే నిరసన కలాలుగా ఎందుకు మారాయి? వ్యవస్థలో భిన్న స్వరాలను చెప్పగలిగిన కలాలు తామే ఒక సామూహిక స్వరంగా ఎలా మారా రు? జర్నలిస్టులు తెలంగాణ లైట్స్‌గా ఎందుకు వెలుగుతున్నారు? జర్నలిస్టులు తెలంగాణ జ్ఞాన సూచికలుగా ఎందుకుయ్యాయి? అస్తి త్వ ఉద్యమాలకు అక్షరమాలగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం మారింది. కలాలు పట్టుకున్న వాళ్లంతా సృజనశీలురు కారు. ప్రజల పక్షం వహించి జన పక్షంగా కదిలిన కలాలే కలాలు. జనం కోసం నిలబడి రాసిందే జర్నలిజం కానీ పత్రికల కోసం రాసే వాక్యాలనీ జర్నలిజం కాదు. జర్నలిజం ఒక రియలిజం. కలత నిద్రలో ఉలిక్కిపడి లేచి జన జీవితాలను కలగనే కలల సౌధం జర్నలిజం. తెలంగాణ జర్నలిస్టులు మాననీయులు.

తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా, అసెంబ్లీ కంటి చూపు సాక్షిగా, జూబ్లీహాల్ సైగల సాక్షిగా కలాలు తరలిపోయి, నడిచిపోయి నారాయణగూడ ఫ్లైఓవర్‌ను చీమల దండుగా తీర్చి దిద్దటమే జర్నలిజం నేర్పిన ఆచరణాత్మక పాఠం. తెలంగాణ పది జిల్లాల నుంచి కలాల్ని పట్టుకుని ఆర్‌టీసీ కళ్యాణమండపాన్ని సిరాచుక్కలతో ముంచెత్తటం జర్నలిజం చరివూతక పోటెత్తిన పాఠం. అన్ని రాజకీయ పార్టీలను ఒక దగ్గరకు చేర్చి కలంతో గీసిన ఆకాంక్ష ల అక్షర చిత్రాల రూపం తెలంగాణ జర్నలిజం. ఆధిపత్య సంస్కృతిపై ఎగిసి న అక్షరాల గుంపు తెలంగాణ జర్నలిస్టులు.

వీళ్లు ఒక్క తెలంగాణ విముక్తి కోసమే అరిచే కలం కంఠాలు కావివి. మొత్తం ప్రపంచ విముక్తి ఉద్యమాల లో జర్నలిస్టుల క్రియాశీలక పాత్రను తెలియచేసే చారివూతక సందర్భం ఇది. మార్కెట్ సమాజ ముఖ చిత్రాన్ని చీల్చేసి మానవత్వపు చిత్ర పటాన్ని ఆవిష్కరిస్తున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం. అక్షరాలంటే జ్ఞాన పొగరుబోతులు మాత్రమే కాదని అవి నిరంతర అవిక్షిశాంత ఉద్యమ జ్యోతులని చెప్పిన జర్నలిస్టుల కలాలకు, తెలంగాణ జర్నలిస్టుల కలాల సిపాయిలకు దండాలు.


-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు
(ఈనెల 30న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో జరిగే
కలాల కవాతు సందర్భంగా)

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.

Published: Sun,June 23, 2013 12:27 AM

పోరాట ప్రతీకలు..

వాళ్లు యోధులు. తిరుగుబాటుకు మానసపువూతులు. చిమ్మచీకట్లు కమ్మినప్పుడు వెలుగులు విరజిమ్మే కాంతి వాళ్లు. నియంతృత్వాన్ని మెడలు వంచగల

Published: Fri,June 14, 2013 12:20 AM

ఆకాంక్ష పట్టని అసెంబ్లీ

ప్రజాస్వామ్యానికి ప్రతి రూపం, ప్రజలందరి సామూహిక ముక్తకంఠం అసెంబ్లీ. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనంకోసం కదిలిపోయి, మంది కోసం పనిచేస

Published: Mon,June 10, 2013 12:00 AM

అసెంబ్లీని ముట్టడించనున్న ప్రజాకాంక్ష

ఏ ఉద్యమ పిలుపుకైనా తరలివచ్చే ప్రజలున్నారు. ఎంతటి నిర్బంధాన్నైనా ఎదుర్కొనగల శక్తి సామర్ధ్యాలున్న ప్రజలున్నారు. రాజ్యం వికృత చేష్ట

Published: Mon,June 3, 2013 04:29 AM

పచ్చని పల్లెటూరి పాట వెంకన్న

నిబద్ధత ఉన్న సాహిత్యం కొండమప్లూల్లాగా, బతుకమ్మలో పేర్చిన జీవమున్న పూలలాగా, పచ్చని అడవిలాగా ఉంటుంది. ప్లాస్టిక్ పూలలాంటి కవులు, బ

Published: Sun,February 10, 2013 12:17 AM

పోరు అక్షరాభ్యాసం

చుక్కా రామయ్య లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. రామయ్యలాంటి వ్యక్తులను ఒక వ్యవస్థకే నమూనాగా చెప్పవచ్చును. కళ్లముందు అన్యాయం జరుగుత

Published: Sat,January 19, 2013 11:53 PM

తెలంగాణ సాహిత్య యుద్ధభేరి

కవులూ,రచయితలూ కాలంవెంట నడుచుకుంటూ పోరని, కాలాన్నే తమ వెంట నడిపించుకుంటూ పోతారని తెలంగాణ కవులూ, రచయితలూ మరోసారి నిరూపించారు. ప్రజల

Published: Wed,December 26, 2012 11:44 PM

ఎందుకు బహిష్కరిస్తున్నామంటే..

రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి అన్ని అధికారాలను ప్రయోగించి రాజమువూదలతో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించేందు

Published: Sat,November 24, 2012 11:37 PM

సమరాలను అల్లే సూర్యాపేట సమరభేరి

ఒక సమూహం ఎక్కడైనా జమైందంటే.. ఆ నేలే పరవశం కలిగిస్తుంది. చీమల దండ్లుగా జనం కదలాడటం లాగా ఆశయాలుంటాయి. ఆశయాల ఆకాంక్షలు ఎలా జమిలిగా క

Published: Fri,December 14, 2012 04:07 PM

సమాజ నిర్మాణాలు-విలువలు-కాళోజీలు

కాళోజీ అంటే విలువలతో జీవించి జీవితాంతం నిబద్ధతతో నిలబడ్డ వ్యక్తి. ఆ తరానికే కాదు ఈతరానికి కూడా కాళోజీ ప్రతీక. ఆయన ఆ కాలానికి, ఆ త

Published: Sat,December 1, 2012 04:45 PM

సమాజాన్ని నడిపేవి త్యాగాలు, భావజాలాలే

ఒక తరంలో ప్రగతిశీల భావజాలాల విత్తనాలను నాటడం అంతసులభమైన పనేమీ కాదు. ఆ విత్తనాలను నాటడానికి నేలను పదును చేసి, దుక్కిదున్ని, వాతావరణ

Published: Wed,October 10, 2012 06:50 PM

జీవ వైవిధ్యం- జీవన విధ్వంసం

అక్టోబర్ 1 నుంచి 19 వరకు జరుగుతున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుపై ఉన్న శ్రద్ధ, గత అరవై ఏళ్లుగా రాష్ట్రం కావాలని నాలుగున్నర కోట్ల

Published: Wed,October 10, 2012 07:06 PM

పాటను బంధించలేరు

ఆకంఠ స్వరం వింటుంటే చెట్ల సామూహిక తలలపైన పక్షుల గుంపులు ఎగు రు తున్నట్లుంది. దట్టమైన అడవి అందాలు కళ్ళ ముందు కదలాడుతుంటాయి. ఆమె గొం

Published: Thu,October 11, 2012 06:03 PM

కాళన్న దారిలో కదం తొక్కుదాం

భోగోళం మీద ఎప్పుడెనా, ఎక్కడెనా ఆధిపత్యాన్ని అడ్డంగా నరికేసే ధిక్కార స్వరా లు కలాల కంఠాలే. తిరుగుబాట్లన్నీ సృజనకారుల ఆలోచనల్లోనే పొ

Published: Sat,October 6, 2012 03:26 PM

సాహిత్య సాంస్కృతిక సైన్యం ‘తెరవే’

సంఘాలకు, వేదికలకు సాహిత్య సృష్టికి సంబంధం ఉందా? సాహిత్యం సృజనకు సంబంధించినది. సంఘం అన్నది నియమ నిబంధనలకు, లక్ష్యాలకు సంబంధించింది.

Published: Sat,October 6, 2012 03:27 PM

తొలుస్తున జ్ఞాపకాలు

ఒక కాలం ఎప్పుడూ మరో కాలానికి పాఠం చెబుతూనే ఉంటుంది. ఇలా కాలానికి కాలం పాఠం చెప్పటమే పరిణామక్షికమం అనుకుంటా. ఒక కాలం ఇచ్చిన స్ఫూర్త

Published: Sat,October 6, 2012 03:27 PM

వెలిదండ: తల్లి పేగు బంధం

పుట్టిన ఊర్లను ఎలా మరిచిపోలేమో అలాగే మనలో చైతన్యాన్ని రగిలించిన ఊర్లను కూడా మరిచిపోలేం.ఎప్పుడైనా పుస్తకా లు మనలోని సృజనను తట్టిలేప

Published: Sat,October 6, 2012 03:28 PM

ఈ గర్భశోకాలకు కారణమెవ్వరు తల్లీ..!

‘తెలంగాణ ’ ఒక శక్తి సూత్రం ‘తెలంగాణ ఒక చలనం, ఒక ప్రళయం ప్రజలంటే ఆత్మాభిమాన జెండాలు పోరుదారులు తెలంగాణను ఎవరూ కాలరాయలేరు ఈ పో

Published: Sat,October 6, 2012 03:37 PM

ఈ మహాకావ్యం పేరు తెలంగాణ

హద్దులు, లెక్కల పద్దులు లేని వాడే కవి కవిత్వం విప్పిన సద్దిమూట, తనను తాను ఆరేసుకున్న ప్రకృతి పైట కవిత్వం నదుల నోటి ను

Published: Sat,October 6, 2012 03:37 PM

నివురుగప్పిన నిప్పులు

ఒక భావజాలంతో కలిసి నడిచిన మిత్రులు ఏక కంఠమై నినదించిన మిత్రు లు, ఒకే లక్ష్యంతో ఏకమైన పిడికిళ్లు, కలిసి పనిచేసి అలసిపోయిన మిత్రులు,

Published: Sat,October 6, 2012 03:39 PM

ఓరుగల్లు పోరు క్షేత్రం

తెలంగాణలో నిత్య నిర్బంధం కొనసాగుతున్న దశలో నక్సలైట్లు సభలు జరిపితే ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. పోలీసుశాఖవారు ఆ సభలకు వెళ్లవద్దని

Published: Sat,October 6, 2012 03:39 PM

ఉద్యమ నిర్వచనం మారుతున్నవేళ.

ఉద్యమం అంటే రాజకీయంగా ఒకరికొకరు విమర్శలతో విరుచుకుపడటం కాదు. ఉద్యమమంటే ఉరితాళ్ళు తీసుకొని సవాళ్లు, ప్రతిసవాళ్లతో గన్‌పార్క్‌లోని

Published: Sat,October 6, 2012 03:40 PM

శ్రీ కృష్ణకు , సుదర్శనుడికి ఎంత తేడా!

డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమైందన్న హోంమంత్రి చిదంబరం నోటితోనే..,డిసెంబర్ 23 న ఇరు ప్రాంతాల అభివూపాయం తీసుకున్నాకే

Published: Sat,October 6, 2012 03:44 PM

విరామమెరుగని పోరు

మలిదశ తెలంగాణ పోరులో ప్రజలు అత్యంత చారివూతాత్మకమైన పాత్ర పోషిస్తున్నారు. ఏ పోరాటంలోనైనా ఇంతకంటే తెగించి పోరాడుతున్న ప్రజలుంటారా? త

Published: Sat,October 6, 2012 03:44 PM

సకల జనాగ్రహం

ప్రశ్నలు.. సంఘర్షణలు.. వాదోపవాదా లు.. ఒత్తిడులు.. ఒడిదొడుకులు..లాఠీలు.. తూ టాలు.. ఆత్మ బలిదానాలు.. రాజకీయాలు, రాజకీయక్రీడలు, ఎత్త

Published: Sat,October 6, 2012 03:43 PM

ఒకే మాట, ఒకే బాట

కేంద్రాన్ని, ఆంధ్రా ఆధిపత్య శక్తులను ఒక పక్క ఎదుర్కొంటూనే మరో పక్క తెలంగాణలో భిన్న రాజకీయ చైతన్యాల మధ్య తెలంగాణ రాష్ట్ర అంశంపై ఏక

Published: Sat,October 6, 2012 03:43 PM

ఉద్యమాలకు అన్నం పెట్టిన అవ్వ

-జూలూరు గౌరీశంకర్ తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి అడవి ఉద్యమానికి మైదాన ఉద్యమానికి సంబంధించిన కీలకమైన సమాచారానికి మధ్య

Published: Sat,October 6, 2012 03:42 PM

మన సాంస్కక్షుతిక ఉద్యమ తల్లిపేగు జయశంకర్

-ఆయన తెలంగాణ గుండె చప్పుడు. ఆయన తెలంగాణ సాంస్కృతిక పేగుబంధం. అయనను తెలంగాణ పదబంధాల నుంచి విడదీసి చూడలేం. ప్రొఫెసర్ కొత్తపల్లి

Published: Sat,October 6, 2012 03:41 PM

తెలంగాణ కలాల కోలాటం.. తెరవే

కడుపులో పిండం పెరిగి పెద్దయి, కడుపులో తండ్లాడి, మాతృగర్భం చీల్చుకుని శిశువు పెట్టిన కేక ఒక జననం. కాలం జీవించటానికి, కదలటానికి, ముం