పాటను బంధించలేరు


Wed,October 10, 2012 07:06 PM

ఆకంఠ స్వరం వింటుంటే చెట్ల సామూహిక తలలపైన పక్షుల గుంపులు ఎగు రు తున్నట్లుంది. దట్టమైన అడవి అందాలు కళ్ళ ముందు కదలాడుతుంటాయి. ఆమె గొంతెత్తి గానం చేస్తుంటే ప్రకృతి అంతా పరవశించిపోయి పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తున్నట్లుంటది. ఆమె పాదాల సవ్వడికి మనసు కవాటపు తలుపులు తెరచుకొని ఉద్యమ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆమె పాటలకు పర్వతాలు కన్నీళ్లు పెడతాయి. నదులు పొంగుతున్నట్లు ఉంటాయి. ఆమె పదాల అందెల సవ్వళ్లకు ఒక ప్రళయం పొంగుకొచ్చినట్లు ఉంటుంది. ఆమె రాగం తీస్తే పసిపిల్ల బోసి నవ్వులాగా, పసితనపు గుక్కపట్టులాగా, బాల్యమంతా ఒక్కసారిగా గెంతులేసి ఎగిరినట్లు కన్పిస్తుంది. ఆమె పాటలు పాడుతుంటే సమూహాల సవ్వడి లా జనసంద్రం పొంగినట్లు ఉంటది. నేల తనను తాను చూసి పరశించి పోతది. సమస్త బాధలకు విరుగుడులు, జీవితాన్ని అల్లుకున్న కన్నీటి పట్టిల్లాగా పలవరిస్తుంటాయి. మట్టి విముక్తి కోసం పోరాటాలు పొర్లుతున్నట్లు అగుపిస్తాయి. ఆమె గొంతెత్తితే ఒక జంగ్‌సైరన్ మోత లాగా ఉంటది. గుక్కపట్టి ఏడ్చిన బిడ్డకు తల్లి స్తన్యాన్ని అందించినట్లు ఉంటది. నోటి దగ్గర బుక్కెడు బువ్వలాగా ఉంటది. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ఉద్యమానికి బండ్రు విమల నిత్య విరగకాసే ఉద్యమాల పూదోటలాగా ఉంటుంది. విమల పాట వింటుంటే వినయంగా విన్నపాలు చేసే జోడించిన రెండు చేతుల్లాగా ఉంటాయి.

విన్నపాలు చేస్తూనే, విజ్ఞప్తులు అడుగుతూనే ఒక విప్లవ డమరుకం మోగిస్తున్నట్లు ఉంటుంది. ఆధిపత్యం గల్లా పట్టుకొని నిలదీస్తున్న చాకలి ఐలమ్మ గొంతులాగా, రాజ్య అహంకారాన్ని ధిక్కరించిన స్వర్ణక్క పాటలాగా, బెల్లి లలిత పగిలిన కంఠంలాగా, పంచాద్రి నిర్మళ పదఘట్టనలాగా, సుబ్బారావు పాణిక్షిగహి జముకుల కథలాగా, గోదావరిలోయ ప్రతిఘటన పోరాటపు పెద్దన్న అడుగుల మారిదిగా, శ్రీకాకుళం గిరిజన రైతాంగపు పోరాటపు పొలికేకలాగా, వెంపటాపు సత్యం పాఠంలాగా, విముక్తి ధార్లల్లో ఒక నీటి చెలిమలాగా విమల పాటలుంటాయి. విమల చూస్తున్న చూపులు సారిస్తున్నా సుదీర్ఘ స్వప్నాల్లాగా ఉంటాయి. అడుగులు వేస్తూ చేతుల్ని చాస్తే ఎక్కుపెట్టిన తుపాకుల్లా ఉంటా యి. అది లోకాన్ని మురిపిస్తున్న పాట కాదు.... మనందరిని మేల్కొలిపి అదో కొత్త సమాజం వైపు మళ్లిస్తున్న పాట అది. విమల పాట ఎంత రమణీయమైనదంటే.. అది అమరవీరుల త్యాగాలను తన గొంతుతడి చేసుకున్నది. అందుకే విమల పాట సమాజానికి సొంత బిడ్డయ్యింది. అది తెలంగాణ తల్లి మెడలో పాటల హారమైంది. మలిదశ తెలంగాణ ఉద్యమానికి గొంతునిచ్చి ఉద్యమాన్ని తన ఆట, పాటల మాటలతో ఉర్రూతలూగించింది. ‘భూగోళం తిరుగుతోంది... సిరిచుట్టూ’ అని పాట పాడే చిన్న పిల్లలాగా చూసుకునే విమల తెలంగాణ ఉద్యమానికి విమలక్క అయ్యింది.

ఒక పాట ఉద్యమానికి వేల బిగిపిడికిళ్లను ఎగిసేవిధంగా చేయగలదన్న సత్యా న్ని ఈ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చూడటం జరిగింది. ‘ఎపూరజెండెపూరజెండినియ్యల్లో... ఎర్రెపూరనిదీజెండెన్నియ్యలో’ అన్న పాట జగిత్యాల జాతరకు ఊపిరైతే, మిత్ర పాటల్ని సగం జీవితం చేసుకున్న విమల పాట, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఒక కదలికగా, ఒక ప్రవాహంగా మారింది. అటు విప్లవోద్యమానికి, ఇటు తెలంగాణ ఉద్యమానికి విమల పాట వారధిగా మారింది. పాట ఎప్పుడూ రాజ్యం కంట్లో నలుసే. ప్రజా యుద్ధనౌక గద్దర్ తీసుకొచ్చిన కదలిక సలసలమండే పాటల సమువూదమైంది. జీవితాన్ని పాటకు అంకితం చేసుకున్నవాళ్లు మాత్రమే సకల చరాచరా న్ని కదలించగలరు.తెలంగాణ మట్టి లో పాటకు ప్రాణం పోస్తూ అనేక మంది తమ జీవితాలను అర్పించా రు. అందుకే పాట ప్రజల చేతిలో ఆయుధంగా మారింది. బండి యాదగిరి, సుద్దాల హన్మంతు వీర తెలంగాణ సాయుధ పోరాటంలో పాటల జెండాలు పట్టుకొని సాంస్కృతిక విప్లవానికి బీజాలు వేశారు. కలం సిపాయిలుగా ప్రజల ను కదిలించారు. ప్రజా పోరాటాల ను పొంగిపొర్లేటట్లు చేశారు. పాణిక్షిగాహి జముకుల కథను తెలంగాణ సొంతం చేసుకున్నది. నాజర్‌ను తెలంగాణ తన పోరు మట్టిలో కలిపేసుకున్నది. అడవులను మండించింది. ఎడారి నేలల్లో తమ శరీరాలను చీల్చుకున్న ఒంటెల దాహం తీర్చినట్లుగా పాటలు తెలంగాణ దప్పికను తీర్చాయి.

ఎందందరో చెరబండరాజులు ఇక్కడి మట్టికి కవిత్వం తాగించి వీరయోధత్వం నేర్పారు. అలా తెలంగాణ నాటి, నేటి పోరాటాల్లో, ఉద్యమాల్లో ఎగిసిన పాట వారసత్వం మహోన్నతమైనది. అందుకే పాట తూటాగా మారింది. పాట మహాజనం కంఠస్వరమైనది. గద్దర్, గోరేటి వెంకన్న, అంద్శై, గూడ అంజన్న, అల్లం వీరయ్య, మిత్ర, నందిని సిధాడ్డి, రసమయి బాలకిషన్, దేశపతి లాంటి ఎందందరో కలాల కంఠాలు గర్జించాయి. తెలంగాణ పాట కవిత్వాన్ని తమ దేహాలుగా మార్చుకొన్న పాల్కురికి సోమనాథుల్లాగా, పోతన్నల్లాగా ఎప్పుడూ రాజ్యాన్ని ధిక్కరిస్తూనే వచ్చారు. రాజ్య ధిక్కారంతో సమస్త ప్రజానీకానికి పాట కంచమయ్యింది. అందుకే పాటపైన రాజ్యం నిఘా కళ్ళను తెరిచింది. ఆ పాట వారసత్వపు దారిలో తెలంగాణలో అనేక దండ్లు కదిలాయి. అవి సిరిసిల్లా, జగిత్యాల జాతరులు అయ్యాయి. కలాల పైన నిర్బంధం తెలంగాణకు కొత్త కాదు. నిత్య నిర్బంధపు సంకెళ్లనుంచే పాట పదునెక్కి ప్రజా ఉద్యమమైంది.

దక్షిణావూఫికా విముక్తి గీతంగా మారిన ‘ట్రేసీ చాప్‌మన్’లాగా తెలంగాణలో విమ ల కంఠం పోరుపాటగా సాగింది. తెలంగాణ ఉద్యమంలో పాట ఎంత పరిణితి చెందిందో.. ప్రజా పాటలను పాడేవాళ్లను అరెస్ట్ చేయడంతో తేటతెల్లమైంది. ప్రధా న రాజకీయ పార్టీలను పాట అతలాకుతలం చేసింది. అప్పటికప్పుడు పాటలను అల్లగలిగిన వారు తెలంగాణలో వందలు, వేలమంది ఉన్నారు. విప్లవ ప్రజా ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని తన చేతిలో ఎగరేసిన ఎర్రజెండాలా పాటలను ఎగురవేసినవాడు గద్దర్. ప్రకృతి వరవూపసాదంగా గోరటి వెంకన్న ప్రభవించాడు. గరుకురాళ్ళ మధ్యన మహావృక్షంగా అంద్శై అవతరించాడు. విప్లవ ఉద్యమం ధారనుంచి తెలంగాణ ఉద్యమానికి ఒక జలపాతంగా హోరెత్తినవాడు మిత్ర. మిత్ర శరీరంలోని సగంగా, పాటలో సగంగా, మొత్తం తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి కంఠంగా మారింది విమల. తెలంగాణలో భావజాల వ్యాప్తిని తన బిగిపిడికిలి కంఠం ద్వారా వ్యాపింపచేసింది. తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ చూపి న దారిలో, భావజాల ప్రచారంలో పాటదే కీలకమైన పాత్ర. ఆ భావజాల ప్రచారంలో అగ్రగామి స్థానంలోకి వెళ్లడం వల్లనే విమల విమలక్కగా మారింది. సాంస్కృతిక ఉద్యమ నాయకురాలిగా ఎదిగింది. తన పాట, మాట ద్వారా విమల ప్రజల గుండెల్లో నిలిచింది. రాజ్యం దృష్టిలో నేరం చేసినట్లుగా నమోదై అరెస్ట్ అయ్యింది. ఇంతకంటే ఏం కావాలి...? తన పాటతో మొత్తం సమాజాన్ని మంత్రముగ్ధులుగా మార్చి ప్రజల తరుఫున అరెస్ట్ కావడం కంటే మించినది ఈ లోకమున మరొకటికలదా..! అందుకే విమల పాట రుచి కలది. విమల కంఠం అమోఘమైనది. విమల మాట నిర్మలమైనది. అందుకే విమల పాట తెలంగాణ జెండాగా రెపపలాడుతోం ది. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక సందుకగా మారింది.

పాటలను చూస్తే ప్రభుత్వాలకు భయం. అందుకే అది గద్దర్‌ను మట్టు పెట్టేందుకు ప్రయత్నించింది. విమలక్కను అరెస్ట్ చేసింది. కాశీం, భూమయ్యలపై కుట్ర కేసులు పెట్టింది. పాలకులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పాటను బంధించలేరు. న్యూటన్ మూడవ గమన సూత్రంలాగా పాటను ఎంతగా అణచివేస్తే అంత రెట్టింపు వేగంతో ప్రజల్లోకి ప్రయాణం చేస్తుంది. పాట ఎంతో గొప్పది. ప్రభుత్వ పోషణలో ఉండి ప్రభుత్వంతో సంచరించే కవి సైతం పాటను బలి చేయాలని ప్రయత్నించినప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది పాటకున్న బలం.

‘ మాకొద్దీ తెల్ల దొరతనం’ అన్న పాట బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చి వేసింది.
‘మాకొద్దీ ఆంధ్ర దొరతనం’ అన్న పాట రేపు తెలంగాణ దారిలో వేగుచుక్క అవుతుంది.

-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.