కాళన్న దారిలో కదం తొక్కుదాం


Thu,October 11, 2012 06:03 PM

భోగోళం మీద ఎప్పుడెనా, ఎక్కడెనా ఆధిపత్యాన్ని అడ్డంగా నరికేసే ధిక్కార స్వరా లు కలాల కంఠాలే. తిరుగుబాట్లన్నీ సృజనకారుల ఆలోచనల్లోనే పొదిగి ఉంటాయి. ఏ పోరాటం ఎక్కడ ఎగిసిపడ్డా అది సాహిత్యకారుల సృష్టి నుంచే జనిస్తుం ది. కవి రాజ్యం కంట్లో నలుసుగా ఉంటాడు. ప్రజలకు కంటిపాపలాగా ఉంటాడు. జనపక్షం వహించలేవాడు జీవ కవిత్వాన్ని రాయలేడు. అస్తిత్వ ఉద్యమాలన్నీ సాహిత్య సాంస్కృతిక రంగాల నుంచే మొదలయ్యాయి. అంటే జీవిత మూలాల దగ్గర రణగొణులను అర్థం చేసుకున్నవాడే అసిత్వ ఉద్యమాలకు ప్రాణం పోయగలుగుతాడు. సాహిత్యకారుడు ఆ దశ లోంచే ఆచరణకు వెళితే ఉద్యమకారుడుగా, పౌరహక్కుల గొంతుక గా, ప్రజాభివూపాయ వేదికగా మారతాడు. ఇలాంటి వాళ్లు తెలంగాణ నేలలో పోతన్న, పాల్కురికి సోమనాథుడి దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఎందందరో ఉన్నారు. తెలంగా ణ మట్టికే ఏదో మహత్తు ఉంది. అందుకే ననుకుంటా చిత్రకారులు, చరివూతకారులు, సాహితేవేత్తలు ఎందందరో ఈ నేలలో సామాజిక స్పృహతో ముందుకు సాగారు. ఆ సమున్నతమైన కోవకు చెందిన నిలు తెలంగాణ సాహితీ రూపం కాళోజీ నారాయణరావు . కాళోజీ జీవితమంతా తిరుగుబాటునే వేదాంతం చేసుకుని జీవించారు. కాళోజీ మార్గమంతా ప్రజాసాహిత్య ఉద్యమాల మార్గంగా మారిపోయింది. తెలంగాణ అన్న పదమే మహా కవిత్వ పాదం. అట్లాంటి తెలంగాణ పదాన్ని తన ఒంటికి తొడుక్కుని వూరూరా తిరుగాడిన వాడు కాళోజీ. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక ఉద్యమంగా ఆయన మారిపోయారు. అచ్చ తెలుగులో, వ్యవహారిక భాషలో, తెలంగాణ భాషలో కవిత్వం అల్లుకుంటూ పోయి తెలంగాణ వాకిళ్ల ముందు సాహిత్య ముగ్గులు వేసినవాడు కాళోజీ. ఆయనను స్మరించుకోవటమంటే పోరాట సాహిత్య మంటను రాజేయటమే. 2012 సెప్టెంబర్ 9వ తేదీన కాళోజీ 99వ జయంతి తెలంగాణ అంతటా జరుపుకోబోతున్నారు.


ఆ రెండున్నర జిల్లాల ఆధిపత్య భాషమీద కాళోజీ యుద్ధం ప్రకటించినవాడు. భాష తో ఆధిపత్యాన్ని చెలాయించిన వాడే ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలపై కూడా సహజంగా అధికారాన్ని చెలాయిస్తాడు. ఆంధ్రవూపదేశ్ ఏర్పడగానే కళ్లు తెరిచిన వాడు కాళోజీ నారాయణరావు. ఆంధ్రోళ్ల దోపిడీ ఇంకెంత కాలమూ అంటూ అక్షరాక్షిగహం వ్యక్తం చేశాడు. అన్ని రంగాల్లో ఏ విధంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారో కాళోజీ తెలియజేశాడు. ఒక ప్రాంతంపై మరోవూపాంతం, ఒకరి భాషపై మరొకరు ఆధిపత్యం చెలాయించవద్దని జీవితాంతం పోరాడిన వ్యక్తి కాళోజీ. మలిదశ తెలంగాణ ఉద్యమం రాజుకుంటున్న సందర్భంలోనే వరంగల్‌లో జరిగిన తొలి తెలంగాణ రచయితల వేదిక సభ ల్లో కాళోజీ భాష గురించి పలురకాల విశ్లేషణలతో ఆయన ప్రసంగించారు. ఆయన ఆ రోజు చేసిన ప్రసంగం కొత్తతరం కవులకు రచయితలకు కొత్తబాట చూపించినట్లయ్యింది.గిడుగు రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాష కావాలని గొంతెత్తి అరిచాడు. ఆయన వ్యవహారిక భాషయని ఉద్యమిస్తే ఆ రెండున్నర జిల్లాల భాషను వ్యవహారిక భాషే అని ఆధిపత్యవాదులు తమ ఆధిపత్య సంస్కృతిని ప్రకటించుకున్నారు. అక్షర జ్ఞానం వుంటే దస్తూరు అర్ధమవుతుంది. ఎవ్వరు ఎక్కడ ఎట్లా మాట్లాడతారో దాన్నే అలవాటు చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. కానీ ఒక ప్రాంతం భాష అర్థం కాదని తమ రెండున్నర జిల్లాల భాషే వ్యవహారిక భాషయని, ప్రామాణిక భాషయని ఆధిపత్యం చెలాయించటం వల్లనే అస్తిత్వ ఉద్యమం సాహిత్య రంగంలో ప్రాణం పోసుకుంది. 1967 ప్రాంతంలో పోరంకి దకిణామూర్తి రాసిన ముత్యాలపందిరిని అన్ని ప్రాంతాలు వాళ్లు చదివి అర్థం చేసుకున్నారు. నామిని భాషను తెలంగాణ అర్థం చేసుకుంది. అందుకే ఎవరి భాషలో వారు రాసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల భాషే పత్రిక భాష అయ్యింది. రెండున్నర జిల్లాల భాష రాష్ట్రం మొత్తానికి అర్థమయినప్పుడు తెలంగాణ భాష ఇతర కోస్తాంధ్ర, రాయలసీమ, కళింగ ఆంధ్రా జిల్లాలకు ఎందుకు అర్థం కాదని కాళోజీ నారాయణరావు, రామశాస్త్రి ఎప్పటి నుంచో వాదనలు చేస్తున్నారు. భాష పేరు తో అహంకారాన్ని ప్రదర్శించడం అజ్ఞానం కాదని, అది బద్మాష్ గిరి అని కాళోజీ అనేవాడు. ఆయన పేరున తెలంగాణ మాండలిక భాషాదినోత్సవం జరపాలని మలయశ్రీ కాళోజీ బతికున్నప్పుడే అన్నాడు. కానీ తెలంగాణ మాండలికం అనకుండా తెలుగు మాండలిక భాష వాదాన్ని ముందుకు తేవాలని కాళోజీ చెప్పాడు. అనిశెట్టి రజిత, పొట్లపల్లి శ్రీనివాసరావు, రామశాస్త్రి కూడ తెలుగు భాషా దినోత్సవం కాళోజీ జయంతి రోజున జరపాలని ఆ సందర్భంగానే నిర్ణయించారు.

మనం ఎట్లా మాట్లాడతామో అట్లాగే రాయగలగాలి. దాన్ని అర్థం చేసుకోవటానికి ఎదుటి వారికి సహృదయత వుండాలి. ఒక ప్రాంత భాషలో చదువుకుంటే తక్కువవారవుతారని, తాము పెట్టిన ప్రామాణిక భాషలో యిమిడితేనే గొప్పవారవుతారనే వాదన సరైనదికాదు. జయశంకర్, చుక్కా రామయ్యలాంటి వారు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. యింటి భాషలో నేర్చుకున్నారు. జయశంకర్ లాగే చుక్కా రామయ్య చక్క టి తెలంగాణ తెలుగు భాషను మాట్లాడతారు, రాస్తారు. ఈ యిద్దరు రెండు రంగాలలో సమున్నతస్థానానికి ఎదిగారు. చుక్కా రామయ్య సిలికాన్‌వాలీ సృష్టికర్త. జయశంకర్ విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్ దగ్గర నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమానికి సిద్ధంతకర్తగా ఎదిగాడు. విద్యా ప్రమాణాల్ని కొలిచేటప్పుడు ఆ దృష్టితో ఆలోచించాలి. ఆధిపత్యవాదులకు అనుయాయులుగా ఉండటమే కావాలి. గిడుగు వ్యవహారిక భాషను వారు కొత్త ప్రామాణిక భాషగా మార్చేశారు. ఒకే భాష పేరుతో కలిసి ఉందాం అని చెప్పి తెలంగాణ భాషను, యాసను ఎట్లా గేలి చేస్తారు. ఇక్కడే తెలంగాణ ఉద్యమం అంకురించింది. అదే సాహిత్య, సాంస్కృతిక రంగంలోంచి ఎగిసి మలిదశ ఉద్యమానికి బీజాలు వేసింది. భావజాల ఉద్యమం విస్ఫోటమై నలుదిక్కులా పాకింది. తానెప్పుడూ ఆంధ్ర భాషకు, యాసకు వ్యతిరేకం కాదని, భాషాధిపత్య అహంకారం మీదనే తన ఆగ్రహమని కాళోజీ చెప్పేవాడు. మనిషి అవసరాలను బట్టి భాష వుంటుంది. కానీ భాష కోసం అవసరాలు వుండవు. తెలంగాణ మాండలిక భాష కాదని తెలంగాణ భాషే ప్రత్యేకమైనదని నలిమెల భాస్కర్ శాస్త్రీయ ఆధారాలు చూపుతున్నాడు. ఆయన తెలంగాణ పదకోశాన్ని తయారు చేశారు. ఎవరి యాసను, ఎవరి భాషను వారు గౌరవించుకోవాలి. ఆ కోణం నుంచే మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమానికి సాహిత్య జెండాగా ఎంతో ఎత్తుకు ఎదిగిన కాళోజీ నారాయణరావు జయంతి రోజైన సెప్టెంబర్ 9న తెలుగు మాండలిక భాషా దినోత్సవం జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రచయితల వేదిక డిమాండు చేసింది. కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కవులు, రచయితలు కలాల కవాతు చేస్తున్నారు. కాళోజీ ఈ నేల విముక్తి కోసం పరితపించాడు. ఈ నేలపై ఎన్‌కౌంటర్ల నెత్తురు ముద్దలు చూసి కంటనీరు పెట్టుకున్నాడు. పొక్కిలైన తెలంగాణ నేలలో పౌరహక్కుల గురించి పరితపించాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన తనువంతా తపించాడు. ఆయనను స్మరించుకోవటమంటే తెలంగాణ మట్టి గొప్పతనాన్ని ఈ నేలకున్న త్యాగాన్ని గుండెలనిండా నింపుకోవటమే. సెప్టెంబర్ 9న ఆయన జయంతి రోజు తెలంగాణ నేలంతా సభలు, సమావేశాలు జరుపుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ముందుకు సాగడానికి కాళోజీ జయంతిని స్ఫూర్తిగా తీసుకోవాలి. వచ్చే ఏడాది కాళోజీ శతజయంతి సంవత్సరం. కాళోజీ శతజయంతి సంవత్సరాన్ని తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే దిశగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి.

-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు
(సెప్టెంబర్ 9న కాళోజీ నారాయణరావు 99వ జయంతి సందర్భంగా)

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.