సాహిత్య సాంస్కృతిక సైన్యం ‘తెరవే’


Sat,October 6, 2012 03:26 PM

సంఘాలకు, వేదికలకు సాహిత్య సృష్టికి సంబంధం ఉందా? సాహిత్యం సృజనకు సంబంధించినది. సంఘం అన్నది నియమ నిబంధనలకు, లక్ష్యాలకు సంబంధించింది. సంఘ నిర్మాణాలకు సాహిత్య సృష్టికి మధ్య దగ్గరితనం ఎంత ఉందో దూరం కూడ అంతే ఉంది. దీనిపై వాదనలు ‘అరసం’ పుట్టిన దగ్గర నుంచి జరుగుతూనే ఉన్నాయి. కవి కి రచయితకు నిబద్ధత, నిమగ్నత అవసరమా? లేదా? అన్న దాని నుంచే సాహిత్య సంఘాలకు,రచయితలకు మధ్య చర్చల మంటలు లేశాయి. కవి ఎక్కడికైనా వెళ్లవచ్చు, తెలియని దారుల్లోంచి తెలిసిన దారుల్లోకి అధోలోక కొత్త ప్రపంచాలకు పోవచ్చును. గరికపూలను పాన్పులు చేసుకోవటం దగ్గర నుంచి గోదావరిలోయ పోరాటాల వరకు పోవచ్చును. దండకారణ్యంలో దట్టమైన సాహిత్యంగా కావచ్చును. కవి పోరాటం కావచ్చును, త్యాగానికి సిద్ధపడవచ్చును.

వ్యక్తిగత అశ్రీత పక్షపాతి కావచ్చును. కవి ఏదైనా కావచ్చును. కవిత్వం ఆవేశంతో పొంగవచ్చును. జీవితం లోతుల్లోకి పోయి వొదిగి ఉండవచ్చును. సమయ సందర్భ కాలమానానికి ప్రతీక కదా కవిత్వం. నడుస్తున్న చరివూతకు దర్పణం కదా సాహిత్యం. ప్రజల నుంచి ప్రజల ఆకాంక్షల ఆశయాలనే నది నుంచి బైటపడి కవిత్వ ం,సాహిత్యం జీవించజాలదు. సరిగ్గా సందర్భాలకు అనుగుణంగానే అనేక ఉద్యమాలు ఎగిశాయి. పోరాటాలు పొంగి పొర్లాయి. అందుకు అనుగుణం గా కవిత్వ సాహిత్య సమరాంగణమూ మొదలయినది. అట్లా వచ్చిన అరసం, విరసం, మరసంల లాగే తెలంగాణ రచయితల వేదిక ఉద్భవించింది. అది మట్టి నుంచి పుట్టింది. మట్టిపాటల నుంచి జన్మించింది. మెదక్‌జిల్లా నాగేటిచాళ్లలో నుంచి నడిచిన పాటయ్యింది. తెలంగాణ నేల పాలస్తీనా లాగా నిరంతరం పోరాటం చేస్తున్న ఉద్యమ ప్రయోగశాల. ఆ ప్రవాహం నుంచి 1969 నుంచి నేటి వరకు జరిగిన ఉద్యమాలకు అక్షరాలు తమవంతు పాత్రను నిర్వహించాయి. ఆ క్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రచయితల వేదిక కీలక భూమికగా నిలిచింది. తన నేలవిముక్తి అన్న నిబద్ధత, నిమగ్నత ప్రతి తెలంగాణ సృజనకారున్ని కదిలించింది. పట్టెడన్నం పెట్టిన ఈనేల తల్లి విముక్తికి మొత్తం తెలంగాణ ఒక విముక్తి కావ్యంగా మారింది. ఆ క్రమంలో కవులు, రచయితలు, బుద్ధిజీవులంతా కలిసి తెలంగాణ రచయితల వేదికగా ఏర్పడ్డారు. ఇప్పుడు తెరవే పది వసంతాలు జరుపుకుంటున్నది.తెలంగాణలోని ప్రతి సాహిత్యకారుడూ, కవి, రచయిత అక్షరాలను ఆయుధాలుగా మార్చుకుని విముక్తి విల్లంబులు ఎక్కుపెట్టారు.

పదేళ్ల తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెరవే తనదైన పాత్రను పోషించింది. తెలంగాణ నేలపై సాహిత్యోద్యమ పంటను పండించింది. ఉద్యమంలో కొత్త తరం రచయితలు ఉసిళ్ల పుట్టల్లా పుట్టుకొచ్చారు. ఈ సమయంలోనే శత్రువుపూవరో? తెలంగాణ ఉద్యమానికి ద్రోహుపూవరో వెంటనే కనిపెట్టగలిగింది కవులు, రచయితలు, సృజనశీలురే. తెలంగాణ ఉద్యమంలో పెడధోరణులను ఎప్పటికప్పుడు చెబుతూ తెరవే తన కలం పాత్రను నిర్వహిస్తూ వచ్చింది. తెలంగాణ పాట, కవిత్వం నేటి ఉద్యమంలో అగ్రగామిగా నిలిచాయి. రాజకీయ పార్టీలకు విన్నపాలు చేయటంతోపాటు హెచ్చరికలను కూడ చేస్తూ తెలంగాణ కవిత్వం గోదావరి నదిలాగా కదిలిపోయింది. రాజకీయ గందరగోళాలు జరిగినప్పుడు రాజకీయాలు అస్పష్ట చిత్రంగా మారిపోయినప్పుడు అందుకు కావాల్సిన స్పష్టతను ఇవ్వవలసింది కవులు, రచయితలు, విద్యావంతులేనన్నది స్పష్టం.

తెలంగాణలో సాహిత్య సాంస్కృతిక రంగం, మేధావివర్గం సరిగ్గా ఈ పాత్రను పోషిస్తూ వస్తోంది. ఆ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలకంటే ముందువరుసలో సాహిత్య సాంస్కృతిక రంగం నిలడింది. ప్రజలే ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఉద్యమాలకు నేతృత్వం వహించేవాళ్లు ఎంత చిత్తశుద్ధితో ఉంటే ఆ ఉద్యమాలు అంత తొందరగా సఫలీకృతమవుతాయి. ఈవిషయంలోతెలంగాణలో రాజకీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి. అంత ఉన్నతమైన పాత్రను ప్రజల పక్షం వహించి నిలిచింది తెలంగాణ కవులు, రచయితలు, విద్యావంతులు. అందుకే ఎక్కడలేని విధంగా సాహిత్యసాంస్కృతిక రంగం వెంట రాజకీయపార్టీలు కదలివచ్చే స్థితి తెలంగాణ సమాజంలో కనిపిస్తున్నది. 850మందికి పైగా విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాలు చేసుకుని మలిదశ ఉద్యమానికి ఊపిరి పోశారు.

సమస్త ప్రజానీకం తెలంగాణ కోసం బోనం ఎత్తుకుంది. కులాలకు, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం చీమలదండులా కదిలింది. అంతటి మహత్తరమైన బాధ్యతను సాహిత్యరంగం నిర్వహించటం తెలంగాణ సాహిత్యం సాధించిన ఘనవిజయం. ఏకతను తేవటంలో తెలంగాణ పాట, మాట, ఆట, కథలు ఎంతో కీలకపాత్ర పోషించాయి. రాజకీయపార్టీల జెండాలు పక్కన పడిపోయి తెలంగాణ సాంస్కృతిక కళారూపం ధూంధాం జెండాలు, తెలంగాణ రచయితల వేదిక జెండాలు రెపపలాడాయి. ఊరుఊరునంతా ఒక దగ్గరకు తెచ్చింది పాట, కవిత్వం. కవులు, రచయితలు చెప్పిన మాట ను తెలంగాణ సమాజం విన్నది. ఆటపాటల రూపాలకు తెలంగాణ సమాజం పరవశించింది. యుద్ధానికి సైరన్ మోగించింది.

ఇప్పటి వరకు వచ్చిన అన్ని సాహిత్య ధోరణులన్నింటికంటే తెలుగు సమాజంలోనే తెలంగాణ అస్తిత్వ సాహిత్యం మహోన్నతంగా నిలబడింది. సాంస్కృతిక రంగమే ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలను తూర్పారపట్టింది. ఆ భావజాల ధారను అందించటంలో తెలంగాణ రచయితల వేదిక కీలకభూమిక పోషించింది. కార్మిక, కర్షక, విద్యార్థి,మేధావి, ఉద్యోగి సమస్త వృత్తుల సమస్త శ్రమ చిహ్నాలతో కలిసిపోయింది ఒక్క తెలంగాణ సాహిత్యసాంస్కృతిక రంగమే. మనకున్న సమస్త కళలు, సాహిత్యం అది ప్రజల కోసం సృష్టించబడి ప్రజల కోసం ఉపయోగపడాలనే తాత్త్విక ఆలోచనకు నిలు రూపంగా తెలంగాణ సాహి త్య రంగం నిలిచింది. ఇందులో తెరవే పాత్ర మరిచిపోలేనిది. అన్నివాదాలకు పురుడుపోసిన తెలంగాణ నేల తన కడుపులో అస్తిత్వ ఉద్యమం పేగును కూడ దాచిపెట్టింది.

నేలపొరల్లో సురవరం ప్రతాపడ్డి దాచిన గొలకొండ సంకలనం, 1969 నాటి కవిత లు, భాష పేరున తెలుగు రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ పడ్డ అవమానాలు, సినిమాలు, పాఠ్యపుస్తకాల సిలబస్‌లు, రెండున్నర జిల్లాల ఆధిపత్య భాషా అహంకారం బైటకు రావటాని కి కొంత సమయం పట్టింది. కాలమే అందుకు ఎదురు చూసింది. మలిదశ తెలంగాణ ఉద్య మం మొదలుపెట్టడానికి భావజాల రంగం కీలకమైన భూమిక పోషించింది. ఆ నేపథ్యంలోనే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రచయితల వేదిక (తెరవే)సాహిత్యరంగంలో ముందుకు సాగింది. తెలంగాణ పది జిల్లాల్లో తె.ర.వే ఆధ్వర్యంలో కవులు, రచయితలు అనేక సభలను, సదస్సులను పెట్టారు. తెలంగాణ ప్రతి పల్లెలో ఒక్కొక్కసారి రాజకీయ పార్టీ ఆనవాళ్ల లేకపోవచ్చును. కానీ ఒక తెలంగాణ సాంస్కృతిక దళం మాత్రం తప్పక ఉండి తీరుతుంది. ధూంధాం రూపాలు నేల మొత్తంలో మార్మోగుతున్నాయి. ఒక పక్క భావజాల వ్యాప్తి ఎలా విస్తృతపరుస్తూ వచ్చిందో అదేవిధంగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన సృజనశీలురైన కవులు, రచయితలను కూడా తె.ర.వే ప్రశ్నించింది. ఆనాడు శ్రీశ్రీ షష్ఠిపూర్తి సభలలో విశాఖ విద్యార్థులు కరపత్రం వేసినట్లుగానే తె.ర.వే తరుపున ఆంధ్ర, రాయలసీమ కవులను ప్రశ్నించటం జరిగింది.

సీమ, ఆంధ్ర వూపాంతానికి చెందిన సృజనశీలురు కూడ కదిలిపోయారు. బహుజన కెరటాలు, దళిత బహుజన కవులు స్పందించటమేగాకుండా కావడికుండలు అన్న కవిత్వ సంకలనం తీసుకవచ్చి తెలంగాణ అమరవీరుల స్తూపం పాదాల దగ్గరపెట్టి తమ సృజన శీలతలను చాటుకున్నారు. తె.ర.వే వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా హైద్రాబాద్‌లోతప్పించుకు తిరుగుతున్న సీమ, ఆంధ్ర కవులు కొందరున్నారు. మేము తెలంగాణక వ్యతిరేకం కాము అంటూ హెరి కంపెనీ దగ్గర బోర్డు పెట్టినట్లుగా మేం తెలంగాణకు అనుకూలమే అంటూ కొందరు సీమాంధ్ర కవులు గోడమీద పిల్లుల్లాగా ఉన్నవారూ లేకపోలేదు. అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే వాళ్లంతా తెలంగాణలో సహజవనరుల దోపిడీని వ్యతిరేకించాలి. 850 మందికి పైగా ఆత్మ బలిదానాలు చేసుకున్న సంఘటనలను కళ్లతో చూశాక కూడ కదలని వాడు కవికాదు. వాళ్లు సాహితీవేత్తలు కాదు.

వాళ్లు సృజనకారులు అంతకన్నా కాదు. ప్రజల ఆగ్రహం కట్టలు తెగి సహనం కోల్పోయి, నిగ్రహాలు ఆగ్రహాలై ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు కూలిపోయాయి. కూలిన తెలుగు తేజోమూర్తుల విగ్రహాల కంటే ఆత్మబలిదానాలు చేసుకున్న విద్యార్థి యువకుల త్యాగాలు గొప్పవి. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు కూలిన నేపథ్యంలో విరుగుడు అన్న పుస్తకాన్ని తె.ర.వే తీసుకువచ్చింది. పోతన కడప జిల్లా ఒంటిమిట్టకు చెందినవాడనే అసత్యవాదాలు ముందుకు తెస్తే తె.ర.వే తీవ్రంగా ఖండించింది. సినారే ట్యాంక్‌బండ్ మీదికి కదిలివచ్చాడు. పోతన బమ్మెరవాడని సినారె తేల్చిచెప్పాడు. కేంద్ర సాహిత్య అకాడమీ కథ సదస్సును తెరవే బహిష్కరించింది. తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ కవులు రచయితలు తమ కలాలను పదును పెట్టుకున్నారు. ప్రపంచ తెలుగు మహసభలను బహిష్కరించండని పిలుపునిస్తూ అఖిల భారత తెలంగాణ రచయితల మహాసభలను తె.ర.వే నిర్వహించింది. తెలంగాణ రచయితల వేదిక ఏ రాజకీయ పార్టీ దొడ్లల్లోనో, గడీల్లోనో కాకుండా స్వతంవూతంగా వ్యవహరిస్తూ సాహిత్య ఆత్మగౌరవ జెండాగా రెపపలాడుతూ వచ్చింది.జెండాను పట్టుకున్న వందలాదిమంది కవులు, రచయితలు కూడా అదే నిబద్ధతతో పనిచేస్తూ వస్తున్నారు.

తెలంగాణలో రాజకీయ పార్టీలు చేస్తున్న వికృత చేష్టలను, ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో తెరవే తన వంతు పాత్రను పోషిస్తూనే ఉన్నది. తెరవే అన్నది తెలంగాణ సాహిత్య సాంస్కృతిక మట్టి పిడికిలిగా మారింది. మనకున్న సమస్త కళలు, సాహిత్యం తెలంగాణ నేల కోసం పరితపిస్తున్నాయి. అవి తెలంగాణ ప్రజల కోసం పుట్టి ఆ ప్రజల కోసమే పల్లవిస్తున్నాయి. ఇప్పుడు తెరవే అన్నది ఒక విముక్తి కవితగా, ఒక విముక్తి గీతంగా మారింది. తె.ర.వే పదేళ్ల ప్రస్థానంలో ఎన్నో మలుపులు తిరిగి గోదావరిలాగా ప్రవహిస్తున్నది. ఒక ప్రాణహితలాగా పరవళ్లు తొక్కుతూ ఉన్నది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెరవే తెలంగాణ పటంలో చెరిగిపోని ముద్ర.

-జూలూరు గౌరీశంకర్, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.