వెలిదండ: తల్లి పేగు బంధం


Sat,October 6, 2012 03:27 PM

పుట్టిన ఊర్లను ఎలా మరిచిపోలేమో అలాగే మనలో చైతన్యాన్ని రగిలించిన ఊర్లను కూడా మరిచిపోలేం.ఎప్పుడైనా పుస్తకా లు మనలోని సృజనను తట్టిలేపుతాయి. కానీ ఊర్లే చైతన్యరూపాలై కదిలిస్తాయా అంటే.. తెలంగాణలో అనేక ఊర్లు అనేక చైతన్యాలకు కదలికలయ్యాయి. ఊర్లకు గడీలకు పెనుగులాట జరిగిన ప్రతి సంద ర్భమూ ఒక చారివూతక కదలికే. అందుకే తెలంగాణ సాయుధ రైతాంగ పోరా టం వెల్లివిరిసింది. పుస్తకాల నుంచి కాకుండా ఊర్ల మెదళ్ల నుంచి మట్టిమనుషుల గుండెల నుంచి అది పెల్లుబికింది. దొడ్డి కొమురయ్య, బండి యాదగిరి, నల్లా నర్సింహులు, ఉప్పల మలునూరు, చాకలి ఐలమ్మల మట్టిపాదాల నుంచి దున్నే వానికే భూమి అన్న పోరాట రూపం పుట్టుకొచ్చింది. ఈ మట్టి మనుషులను కౌగిలించుకున్న నేతలంతా కమ్యూనిస్టు నాయకులై దేశపటంలో నిలిచిపోయారు.

రావినారాయణడ్డి, ఆరుట్ల రాంచంవూదాడ్డి, భీంరెడ్డి నర్సింహాడ్డి, దేవులపల్లి వెంక ధర్మభిక్షం, తరిమెల నాగిడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర పుల్లాడ్డి, కొండపల్లి సీతారామయ్య, చండ్ర రాజేశ్వరరావులు అచరణల రూపాలై నిలవడానికి, మూడువేల గ్రామాలలో ఎర్రజెండాలు రెపపలాడడానికి పునాదులయ్యారు. ఈ చైతన్య పొదుగులన్నీ తెలంగాణలోని మారుమూల ఊర్ల నుంచే వచ్చాయి. అందుకే తెలంగాణలో ఊరు నేరుగా వాడ దగ్గరికి పోయింది. తెలంగాణలో అసలు మాదిగ, మాలవాడలే ఊర్లను మేల్కొలిపి తిరగబడ్డ తెలంగాణ చరివూతకు ఊపిరిపోశాయి. అందుకే ఈ మట్టిలోని కొన్ని ఊళ్లను మర్చిపోలేం. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం అన్న అతి పెద్ద ప్రపంచ సూత్రీకరణలు మాకు తెలియదు. మట్టివాసనలు మా ఊరు నడిగూడెం అందిస్తే, నాలాంటి ఎందందరికో ఆలోచనల ధారలను వెలిదండ గ్రామం (నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ పాత తాలూకాలోని ఒక గ్రామం) అందించింది. అందుకే వెలిదండను చూస్తే మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనల పుస్తకాలు చూసినట్లనిపిస్తుంది. ఆ ఊరు గోర్కి రాసి న ‘అమ్మ’ నవల లాగా అనిపిస్తుంది. ఎంత మంది వచ్చినా, ఏ సమయాన వచ్చినా పొయ్యి రాజేసి అన్నం వండిపెట్టిన పోటు సూర్యం తల్లే మాకు అమ్మ నవలలో పావెల్ అమ్మలాగా కనిపించేది.

చదువుకున్న పిల్లగాళ్లు కాలేజీల నుంచి ఆ వెలిదండకు రాగానే ఎంతో ప్రేమగా ఆదరిం చి, ఆప్యాయంగా దగ్గరకు తీసుకునే రైతు కూలీలను ఏకం చేసిన గోవిందు ఉండేవాడు. ఒక్క గోవిందేకాదు ఆ గోవిందు రూపంలో ఉన్న అనేకమంది మేకల నాగేశ్వరరావులు, వక్కంతుల కోటేశ్వర్‌రావులు,సూర్యాలు లు ఎందందరో ఉండేవారు.‘వెలిదండ’ ఒక చారివూతక గ్రామం. వెలిదండ చైతన్యాన్నిచ్చి న గ్రామం. వెలిదండ ఊరులో ఉన్న మట్టి మనుషులంతా ప్రఖ్యాతి చెందినవారుగా చరివూతలో లిఖించబడలేదు. వెలిదండలో ఉన్న గోవిందు రాష్ట్రంలో ఎంతో ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తి కాదు. కానీ వాళ్లిచ్చిన చైతన్యంతో, వాళ్లు ఇచ్చిన ఆదరణతో, ఆ వెలిదండ నీళ్లుతాగి, ఆ ఊరులో సేదతీరిన వాళ్లంతా జాతీయ నాయకులయ్యారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకులుగా చరివూతలో కీర్తించబడ్డారు. తెలుగు సమాజంలో వెలిదండ పేరున అనేక గ్రామాలున్నాయి. అందుకే ఎక్కడ వెలిదండ పేరువిన్నా ఒక సంతోషం కలుగుతుంది. మా చుక్కారామయ్యను కదిలిస్తే ఆయన వరంగల్ జిల్లాలో వెలిదండను గుర్తు చేసుకుంటాడు. ఆంధ్ర మహాసభ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు నిజాం పోలీసులు తనను అరెస్టు చేసింది వెలిదండ గ్రామంలోనే అని ఆయన ఆత్మకథ అక్షరాభ్యాసంలో చెప్పాడు.

నక్సల్బరీ అనే ఒక ఊరు, ఒక కానూ సన్యాల్ నేతృత్వంలో అక్కడ జరిగిన భూమి పోరాటం దేశాన్ని కదలించింది. ఆ నక్సల్బరీ అనే గ్రామం ఒక విప్లవ వసంత మేఘ గర్జనగా మారింది. ఆ వసంత మేఘ గర్జనల నుంచి కురిసిన వర్షంతో పులకించి తెలంగాణ నేలలో అనేక పోరాటాలను కన్న విషయం తెలిసిందే. కానీ ఆ నక్సల్బరీ కంటే ముందే 1940లకు ముందే వెలిదండలో ఎర్ర చైతన్యం వెల్లివిరిసింది. నైజాం వ్యతిరేక పోరాటంలో ఆ ఊరుది కీలకపాత్ర. ఆ పోరాటంలోనే పోటు సూర్యం అమరుడయ్యాడు. వెలిదండ పోతే మనకు పోటు సూర్యం స్థూపం కనిపిస్తుంది. ఇంకా అక్కడ అనేక కమ్యూనిస్టు యోధుల స్థూపాలు కనిపిస్తాయి. ఆ ఊరు ఎంత చైతన్యవంతమైనదంటే రెండు భావధారల ఎర్రజెండాల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉండేది. ఒక ఎర్రజెండా నక్సల్బరీ పోరు దారుల్లో ఎగిసిందైతే, మరో ఎర్రజెండా సిపిఎం ఆలోచన ధారల్లోంచి వచ్చింది. సిపిఎంకు మెదరమెట్ల సీతారామయ్యలాంటి నాటి పోరు వారసత్వంలో ఉన్న వ్యక్తి నేతృ త్వం వహించేవారు. మాదంతా చండ్ర పుల్లాడ్డి ఆలోచనా వెలుగుధారల్లో వెలిదండకు దగ్గరైనోళ్లం.

రాజన్న, మధుసూదనరాజ్ యాదవ్, వీరన్నల ఆలోచనల ధారల్లో మునిగితేలినోళ్లం. కోదాడ కె.ఆర్.ఆర్ డిగ్రీ కాలేజీలో చదువుకుంటూ పిడిఎస్‌యు భావ ధారల్లో వికసించినోళ్లం. అప్పుడు మాకు వెలిదండ విప్లవోద్యమ భావజాలాలను మా వొంటినిండా నింపిం ది. వెలిదండ మాకొక చైతన్యం. వెలిదండ మాకు మార్క్సిజాన్ని, మానవీ య కోణాల్ని నేర్పిన పాఠశాల. మాకు మాటలు అల్లడం, పాటలు కట్టడం, కవిత్వాన్ని అల్లడం నేర్పిన ఊరు.ఒక విద్యా సంవత్సరానికి కావల్సిన ప్రణాళిక ఎలా ఉంటుందో అట్లా, మాకు ఆచరణాత్మకంగా అడుగులు వేయడానికి ఉద్యమ ప్రణాళికలన్నీ వెలిదండ నుంచే అందేవి. వెలిదండ ఇచ్చిన సిలబస్ ముందు మా యూనివర్సిటీ డిగ్రీ సిలబస్ చాలా చిన్నదిగా కనిపించేది. డిగ్నీ చదువు, పరీక్షలు ఒక్క నెలలో ముగిసేవి. కానీ వెలిదండ ఇచ్చిన సిలబస్ మాత్రం దీర్ఘకాలికమైనది. ఇప్పటికీ డిగ్రీ అయిపోయి 25 ఏళ్లు గడిచిపోయినా ‘వెలిదండ’ సిలబస్ మాత్రం పూర్తికాలేదు. వెలిదండ పెట్టిన పరీక్షల్లో ఈ సమాజం ఇంకా పాస్‌కాలేదు. వెలిదండ చూపిన దారిలో పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి.

మాకు వెలిదండతో సంబం ధం ఈ జన్మకు మరిచిపోయేది కాదు. ఇలాంటి వెలిదండలు తెలంగాణ మట్టికి పోరు పాఠాలు చెబుతూనే ఉంటాయి. ఒకసారి ఆ ఊర్లో సభ జరుగుతుంటే విప్లవకవి వై. కాశీపతి వెలిదండను చూసి తన్మయత్వం చెంది ‘ఇది వెలిదండ కాదు విప్లవాల పూదండ’ అని కీర్తించాడు.
కాలచక్షికంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా ఊర్లకు ఊర్లు పోతున్నాయి. ఊర్లు గ్లోబలీకరణ చెందుతున్నాయి. కానీ వెలిదండ ఊర్లో మాత్రం ఇప్పటికీ ఆ చైతన్యధార ఉంది. పోటెత్తిన విప్లవాలు , పోరాట కుటుంబాలు ప్రత్యక్షంగా ఉండి రగిలించే మంటలు ఇప్పుడంతగా కనిపించకపోవచ్చు. ఇప్పటికీ ఆ కూలిన మట్టిగోడలు, కూలిన వక్కంతుల కోటేశ్వరరావు ఇల్లు, మా పాటలుపాడే జానయ్య, కృష్ణ, పయిలం సంతోష్, గోవిందుల ఇళ్లు మాకు నిలు విప్లవోద్యమ నినాదాలుగానే స్ఫురిస్తాయి. ఇటీవలే మా అందర్నీ ఆదరించి అన్నంపెట్టి షెల్టరిచ్చిన గోవిందు మరణించాడు.ఆ చుట్టుపక్క ల ఎక్కడ ఏ సంఘటన జరిగినా కేసులన్నీ దం డల్లాగ అల్లి మా గోవిందుల పైననే పెట్టేవారు.

వెలిదండ మాకు గొప్ప భావజాలాన్ని అం దించింది. అందుకే చదువులు పూర్తి చేసుకుని జర్నలిస్టు చొక్కా తొడుక్కుని ఊరూరు తిరుగుతుంటే ఆ భావధార నుంచి వచ్చిన జర్నలిస్టు లు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నేతలు దాటవేస్తుంటే ఆ ప్రశ్నల పుట్టుకకు బీజం వేసిన వెలిదండ గుర్తుకు వచ్చేది. అసెం బ్లీ గ్యాలరీలో రిపోర్టింగ్ చేస్తుంటే, శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు ‘ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం ఇది దోపిడీ రాజ్యం, ఇది దొంగల రాజ్యం’ అని పోడియం దగ్గరికి పోయి అరుస్తుంటే నేను నవ్వేవాణ్ణి. నా పక్కన కూర్చున్న జర్నలిస్టు మిత్రు లు పోడియం దగ్గర వాళ్లు అరుస్తుంటే నువ్వెందుకు నవ్వుతున్నావంటే నా కళ్ల నీళ్లొచ్చాయి. 30 ఏళ్ల కిందట ‘వెలిదండ’ ఇదే నినాదం చేస్తే రాజ్యం చిత్రహింసలకు గురిచేసింది.కుట్ర కేసులు పెట్టింది. ఈ మాటను గోడలపై రాసినందుకు లాఠీదెబ్బలు బహుమతులుగా ఇచ్చారు. అందుకే ప్రతిపక్ష సభ్యులు ఈ నినాదం చేస్తుంటే నవ్వొచ్చింది.

మాకు చైతన్యాన్ని అందించిన వెలిదండ గుర్తుకు వచ్చింది. వెలిదండలు చైతన్యం లేకుండా నిస్సత్తువగా ఉంటే సమాజం చలనం లేనిదిగా మారిపోతుంది. తెలంగాణలో ఊర్లన్నీ చైతన్యంతో వెల్లివిరియడం వల్లనే ఇక్కడ పోరాట పొద్దులు పొడుస్తున్నాయి. ఈ మొగలిచర్లలు, వెలిదండలు, పాలకుర్తులు, కడి ల ధారల్లోనే ఇప్పటికీ తెలంగాణ దేదీప్యమాన్యంగా వెలుగొందుతున్నది. ఇలాంటి వెలిదండల వల్లనే దండకారణ్యాలు విప్లవోద్యమ ఖిల్లాలుగా మారాయి. మలిదశ తెలంగాణ ఉద్యమానికి గుండెకాయలు వెలిదండలు లాంటి గ్రామాలే. ఈ ఉద్యమానికి ఏ పేరు ప్రఖ్యాతులకు నోచుకోని లక్షలాదిమంది గోవిందులే ప్రాణం. వెలిదండలు బతకాలి. పోరాటాలు వెల్లివిరియాలి.

-జూలూరు గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి

35

GOURI SHANKAR JULUR

Published: Sun,March 11, 2018 01:49 AM

విశ్వకర్మల జీవితాల్లో వెలుగు!

కోట్ల రూపాయల విలువైన యంత్రాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో చెక్కలపై విభిన్నరకాల డిజైన్ల వస్తువులు వస్తున్నాయి. జర్మనీ, జపాన్, థాయ

Published: Fri,March 2, 2018 01:12 AM

గురుకుల విద్యతో వెలుగులు

చేసే ప్రతిపనిని విమర్శించే విమర్శాస్త్రాలు కూడా ఎప్పుడూ ఉంటాయి. సద్విమర్శలు వ్యవస్థకు మేలు చేస్తాయి. కానీ ప్రతిదాన్నీ విమర్శించాలన

Published: Sun,January 21, 2018 01:10 AM

పునర్నిర్మాణమే సమాధానం

ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా పొందే అన్నిరకాల హక్కులను బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ పొందాల

Published: Sat,December 2, 2017 11:21 PM

సంచార కులాల్లో వెలుగు

సం చారజాతులను ప్రత్యేక కేటగిరి కింద వేస్తే విద్య, ఉద్యోగ విషయాల్లో వారికి మరింత మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న ఏబీసీడీఈలతో ప

Published: Tue,November 21, 2017 11:19 PM

సాహిత్యమూ.. జనహితమూ..

తెలంగాణ భాషను ఏకరూపక భాషగా పెట్టాలి. ఈ యుగానికి సంబంధించిన ఈ యుగలక్షణాలతో కొత్తసిలబస్ తయారుకావాలి. కావ్యాల నుంచి వాటిని తిరిగి పున

Published: Wed,October 18, 2017 01:25 AM

బీసీల భవిష్యత్తు కోసం

తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి సమగ్ర అధ్యయనంలో భాగంగా తొంభైకి పైగా ప్రభుత్వశాఖల నుంచి ఉద్యోగుల వివరాలను సేకరించే

Published: Fri,September 29, 2017 01:31 AM

నేను ఏ జాతి.. మాది ఏ కులం?

ఈ దేశంలో కులం కొందరికి సాంఘిక హోదా అయితే ఇంకొందరికి శాపం. గతమంతా కులాల ఆధిపత్య హోరుల మధ్య బలవంతుల పదఘట్టనల కింద నలిగిపోయింది. తక్క

Published: Tue,August 29, 2017 11:30 PM

బీసీలపై సమగ్ర అధ్యయనం

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత బహుజన జీవితాలను తీర్చిదిద్దేపనికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. బహుజనులకు అన్నిరంగాల్లో దక్కాల్సి

Published: Wed,April 13, 2016 01:22 AM

సంక్షేమంలో కేసీయారే ఆదర్శం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగాని కి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని ఇతర రాష్ర్టాల బడ్జెట్‌లతో పోల్చి చూసినప్పు డు మరింత స్పష్టంగా తెలిస

Published: Wed,April 13, 2016 01:20 AM

భావ విప్లవానికి నాంది

కుల పీడనను, అణచివేతలను, ఆధిక్యతలను నిర్మూలించటం కోసం కృషిచేసిన మహాత్మా జ్యోతిభా ఫూలే ఆలోచనను ఆకళింపు చేసుకున్నవాడు డాక్ట ర్ బాబా స

Published: Thu,March 24, 2016 12:44 AM

ప్రభుత్వ విద్య పతాక ఎన్జీ కాలేజీ

స్వాతంత్య్రం వచ్చాక మూడుతరాల దళిత, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఇప్పుడు ఎన్జీ కాలేజీలోకి అడుగుపెడుతున్నారు. ఇక్కడ చదివే విద్యార్థ

Published: Sat,February 13, 2016 10:30 AM

జనామోదానికి ప్రతీక బల్దియా తీర్పు

కేసీఆర్ ఎన్నికల ఫలితాల తర్వాత చెప్పినట్లుగా లంచం అడగని కార్పొరేషన్‌గా బల్దియాను తీర్చిదిద్దాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని ఊడ్చి

Published: Sun,January 17, 2016 12:57 AM

బడులకు కొత్త కళ

బడిలో చదువుకున్న వారంతా ప్రయోజకులైతే ఆ ఊరే కాదు రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. ప్రతి ఊరులో ఎండాకాలం సెలవుల్లో పూర్వ విద్యార్థులంతా

Published: Tue,August 11, 2015 12:04 AM

గ్రామస్వరాజ్యం వర్ధిల్లాలి

గ్రామానికి సంబంధించిన ప్రతి విషయాన్ని గ్రామ పంచాయతీ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ ప్రజలు అందులో భాగస్వాములైనప్పుడు మాత్రమే గ్రామం స

Published: Tue,June 9, 2015 01:35 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Tue,June 9, 2015 01:33 AM

నెరవేరనున్న నిరుద్యోగుల కల

ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంకేతిక అంశాలు ఎన్నో అడ్డుపడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబడి రెండవ వసంతంలోకి అ

Published: Thu,May 28, 2015 01:47 AM

పిల్లల చేతికి మన చరిత్ర

1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగు, పాఠ్యపుస్తకాలు ఈ ఏడాది నుంచి కొత్తవి విడుదలయ్యాయి. తెలంగాణ అంటే 10 జిల్లాల సాహిత్యమే గాకుండా

Published: Sun,December 1, 2013 12:52 AM

కుల భోజనాలు- జన భోజనాలు

ధనమేరా అన్నిటికి మూలం.. ఆ ధనం విలువ తెలుసుకొనుట మాన వ ధర్మం’ అని ఆత్రేయ పలవరించి కలవరించాడు. సమాజం ధనం మీద ఆధారపడి ఉందన్నాడు. సమాజ

Published: Wed,August 7, 2013 02:40 AM

నేలంటే.. ఉత ్తమట్టి కాదు!

మంటల్ని ముద్దుపెట్టుకుని మండిన గుండెలు తెగిపడ్తున్న తల్లుల గర్భశోకాలు సబ్బండ వర్ణాల సమూహ కంఠాల జేగంటల సాక్షిగా తెలంగాణ రాష్ట్

Published: Thu,July 18, 2013 12:39 AM

గ్రామాన్ని బతికిద్దాం!!

ఊరెక్కడుంది? అదెప్పుడో గతించిపోయినట్లుగా వుంది! వూరుకు ఉండాల్సి న వూరు లక్షణాలు ఎప్పుడోపోయాయి. వూరు ఒకప్పుడు మట్టి వాసనలతో ఉండేది.