అక్రమ మైనింగ్ ఆగేదెన్నడు?


Sat,October 6, 2012 03:21 PM

అక్రమ మైనింగ్ రాష్ట్రాలనే కాదు, కేంద్రాన్నీ కుదిపేస్తోంది. అక్రమ మైనింగ్ వార్తలు జాతీయ వార్తా పత్రికలలో సైతం పతాక శీర్షికలవుతున్నాయి.కర్ణాటకలో ఏకంగా ముఖ్యమంవూతిపైనే చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. గోవాలో జరిగిన మైనింగ్ కుంభకోణం దెబ్బకు అక్క డి ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అక్రమ మైనింగ్‌కు సహకరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చిత్తుగా ఓడించారు. ఈ తతంగం నడుస్తుండగానే.. మధ్యవూపదేశ్‌లో ఓ యువ ఐపీఎస్ అధికారి మైనింగ్ మాఫియా చేతిలో హత్య కు గురికావడంతో..అక్రమ మైనింగ్‌పై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మైనింగ్ విషయంలో జరుగుతున్న అక్రమాల నివారణకు చర్య లు ప్రారంభించింది.

ఇవాళ గనుల తవ్వకం అనేది అనేక సమస్యలకు హేతువుగా మారిపోయింది. పర్యావరణం, భూ సేకరణ, పునరావాసం తదితర సమస్యలు మైనింగ్‌ను చుట్టుముట్టుతున్నాయి. అభివృద్ధికి కేంద్రంగా ఉండాల్సిన మైనింగ్ సమస్యలకు కారణమవుతోంది. జాతీయంగా, అంతర్జాతీయంగా గనుల తవ్వకాలు తీవ్రంగా చర్చనీయం అవుతున్నాయి. ఎక్కడ మైనింగ్ జరిగి నా.. అక్కడ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. స్థానిక ప్రజ లు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మైనింగ్ అంటేనే కుంభకోణం అయిపోయితున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గనుల తవ్వకంపై ప్రత్యేక చట్టాలను రూపొందిస్తోంది. ఇప్పటి దాకా ఉన్న గనుల తవ్వకాల చట్టాలను సవరించి సరికొత్త సవరణలతో చట్టాలను రూపొందిస్తున్నది. అక్రమాల నివారణకు మైన్స్ అండ్ మినరల్స్(డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్‌తో మైనింగ్‌ను సక్రమ మార్గంలో పెట్టడానికి పూనుకుంది. కేంద్ర కేబినేట్ కూడా మైనింగ్ యాక్ట్‌లన్నీ మానవీయత కలిగినవిగా ఉండాలని అభివూపాయపడుతూ.., స్థానిక ప్రజల అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలని సూచించింది. మైనింగ్ జరిగే ప్రాంతాల్లో విధిగా అక్కడి గ్రామ సభల ఆమో దం తీసుకున్న తరువాతనే మైనింగ్ జరపాలని తెలిపింది. ఇప్పటి దాకా ఉన్న చట్టాల అమలు సంతృప్తికరంగా లేని కారణంగానే సమస్యలు వస్తున్నాయని అభివూపాయపడింది.

ఏది ఏమైనా తాజాగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం అక్రమ మైనింగ్‌పై కొరడా ఝులిపించడానికేనని చెప్పుకొస్తున్నారు. ఈ బిల్లులోని 30(4పకారం గనుల తవ్వకంలో అక్రమాలు జరిగితే గనుల లీజును రద్దుచేస్తారు. అలాగే దానికి సంబంధించిన వారిపై పదిట్ల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించవచ్చని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో కూడా కఠినంగా ఉండాలని నిర్ణయించారు. పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ నాయకత్వంలోని ‘వెస్ట్రన్ ఘాట్స్ ఎకాలజీ’ ఎక్స్‌పర్ట్ పానెల్ మైనింగ్ విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి నివేదికను ఇచ్చింది. ఈ నివేదికలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. పర్యావరణపరంగా తీవ్ర ప్రభావం చూపుతున్న మైనింగ్ ప్రాంతాలను ‘ఎకాలజికల్లీ సెన్సిటివ్ జోన్ (ఇఎన్‌జెడ్)’గా గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇలా పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలుగా మహారాష్ట్ర, గోవాల్లోని, రత్నగిరి, సింధూ దుర్గ్ జిల్లాలను పేర్కొంది. ఇప్పుడు మైనింగ్ జరుగుతున్న మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, గోవా రాష్ట్రాల్లోని 0 రెవెన్యూ మండలాల్లో మైనింగ్‌ను పూర్తిగా నిషేధించాలని సూచించింది. అలాగే మరో 75 రెవెన్యూ ప్రాంతాల్లో గనుల తవ్వకాన్ని సమీక్షించాలని తెలిపింది. ‘వెస్ట్రన్ ఘాట్ ఎకాలజీ అథారిటీ’ పర్యావరణ సున్నిత ప్రాంతలలో పాటించాల్సిన పర్యావరణ పరిరక్షణ సూత్రాలను సూచించింది. భౌగోళిక, పర్యావరణ సమస్యల పరిష్కారానికి మైనింగ్ సంస్థ లు కట్టుబడి ఉండాలని తెలిపింది. అలాగే గనుల తవ్వాకాలు జరుగుతున్న ప్రాంతాల్లోని ప్రజలు ముఖ్యంగా ఆదివాసులు, వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధిని పట్టించుకోవాలని పేర్కొన్నది. అభివృద్ధికి మూలమైన గనులు, అవి ఉత్పత్తి అవుతున్న ప్రాంతంలోని ప్రజలకు ఉపయోగ పడక పోగా వారిని నిర్వాసితులను చేస్తున్నాయి. వనరుల పరంగా చాలా ధనవంతమైన ప్రాంతం జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ మాత్రం జాతీయ అభివృద్ధి సూచికలో వెనకబడి ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర గనుల మంత్రిత్వశాఖ కూడా మైనింగ్‌కు కొన్ని మార్గదర్శకాలను సిద్ధం చేసింది. గనుల తవ్వకం అనేది సమక్షిగాభివృద్ధికి తోడ్పడాలని తెలిపింది. మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల అభివృద్ధిపట్ల ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని తెలుపుతూ.., మైనింగ్‌లో భూములు కోల్పోయిన ప్రజలకు తగిన లబ్ధి, పునరావాసం తదితరాలను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పింది. మైనింగ్ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే కోబా ల్ట్, నికెల్ లాంటి భార లోహాల విడుదలను అరికట్టాలి. సహజవనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు మైనింగ్‌తో సహజంగానే అభివృద్ధి చెందాలి. కానీ ఈ ప్రాంతాలు విద్యా ,ఉద్యోగ పరంగా చాలా వెనకబడి ఉన్నాయి. మైనింగ్ రంగం నుంచి దేశాభివృద్ధికి ప్రతి ఏడా ది 55-70 వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే కోల్‌కత్తాలో జరిగిన నాలుగవ, ఆసియన్ మైనింగ్ కాంగ్రెస్ కూడా మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చర్య లు తీసుకోవాలని సూచించింది. మైనింగ్‌ను ప్రజలు, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా జరిపితే.., దేశం సత్వర అభివృద్ధి సాధ్యపడటమే కాదు, కోటి యాభై లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. కానీ ప్రజలకు అందకుండా వనరులను తరలించుకుపోయే విధానాల ఫలితంగా ప్రజలు బాధితులుగా మిగులుతున్నారు.

ఇదిలా ఉంటే..మైనింగ్‌కు వ్యతిరేకంగా ప్రజలు, స్వచ్ఛం ద సంస్థలు ఉద్యమాలు చేయడంతో బొగ్గు ఉత్పత్తిలో పెరుగుదల ఉండటం లేదని కోల్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్మన్ ఎన్‌సీ ఝా అన్నారు. ఇది దేశాభివృద్ధిపై తీవ్ర ప్రభా వం చూపుతుందని తెలిపారు. సమక్షిగాభివృద్ధికి మైనింగ్ తోడ్పడినప్పుడే మైనింగ్‌కు ప్రజలు సహకరిస్తారు. అలాగే ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. యాంత్రీకరణతో ఉత్పత్తిని పెంచి భూగర్భ గనుల తవ్వకాల ద్వారా పర్యావరణాన్ని కపాడాలి. బొగ్గు ఉత్పత్తిని పెంచి అందరికీ అందుబాటులో విద్యుత్తును సాధ్యం చేయాలి. అభివృద్ధికి ఇరుసుగా ఉన్న ‘మైనింగ్’ను ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజల భాగస్వామ్యంతో చేసినప్పుడే గనుల తవ్వకంతో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ దిశగా ప్రభుత్వాలు ఎప్పుడు అడుగులు వేస్తాయో అప్పటిదాకా అభివృద్ధి ఆమడదూరంలోనే ఉంటుంది. మైనింగ్ మాఫియాలు, అక్రమార్కుల చేతుల్లో బందీగా ఉన్నంత కాలం అభివృద్ధి అలా ఉంచి, విధ్వంసం మాత్రమే మిగులుతుంది.

-ధూర్జి ముఖర్జీ
ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయన్స్ (INFA )

35

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత