పోలియో చెబుతున్న పాఠాలు


Sat,October 6, 2012 03:22 PM

భారత దేశం ఆరోగ్యరంగంలో ఓ మైలురాయిని దాటింది. పోలియో రహి త దేశంగా అవతరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది. రాబోయే రెండేళ్లలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాకపోతే.. పోలియో రహిత దేశంగా సర్టిఫికేట్ ఇస్తామని డబ్ల్యూ హెచ్‌ఓ ప్రకటించింది. దీంతో మనం మురిసిపోవలసిన పని ఏం లేదు. పోలియో లాంటి అనేక రోగాలు దేశం నుంచి పారదోలాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. పోలి యో గుణపాఠాలు తీసుకుని అయినా.. ప్రజారోగ్యం గురించి పట్టించుకుంటే.. ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆ దిశగా పాలకులు ఆలోచించాలి.
కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా దేశంలో అంటురోగాలు, ఇతర వ్యాధుల వ్యాప్తి చాలా తగ్గింది. ఈ విషయంలో మెరుగైన ఫలితాలనే సాధించాము. అయితే.. మనం ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇప్పటికీ దేశంలో రోగాల నివారణే ప్రధా న సమస్యగా ప్రజలను పీడిస్తున్నది. మెజారిటీ ప్రజలకు ఆరోగ్యమే ప్రధాన సమస్య అయింది.

ప్రస్తుతం 1.2 శాతం మాత్రమే ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఇది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ప్లానింగ్ కమిషన్ నియమించిన నిపుణుల కమిటీ చెప్పిన విధంగా.. అయితే.. ప్రజారోగ్యానికి 2.5 కేటాయించాలి. 12వ పంచవర్ష ప్రణాళికాంతానికి దాన్ని మూడు శాతాని కి పెంచాలని ఆ కమిటీ సూచించింది. దాని ప్రకారం ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ప్రతి ఒక్కరిపై 670 కేటాయించాలనీ, 2021 నాటికి దానిని 3432 రూపాయలకు పెంచాలని చెప్పింది. ఒకవైపు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీలు ప్రజారోగ్యంపై ఖర్చును పెంచాలని సూచిస్తుం ప్రభుత్వాలేమో..రోజు రోజుకూ ఆరోగ్య ఖర్చును తగ్గిస్తున్నాయి. ప్రజారోగ్యం గురించి ఎన్నో గొప్పలు చెబుతాయి మన ప్రభుత్వాలు. కానీ ప్రపంచంలోనే ప్రజారోగ్యంపై అతి తక్కువ ఖర్చు చేస్తున్న దేశం మనదే కావడం ఆశ్చర్యకరం. చైనాలో ప్రజారోగ్యంపై చైనా 2.3 శాతం, థాయిలాండ్ 3.3శాతం, చివరికి శ్రీలంక కూడా మనదేశం కంటే ఎక్కువ ఆరోగ్య రంగానికి నిధులు కేటాయిస్తున్నాయి. అదే ప్రైవేటుగా ఆరోగ్యం కోసం చేస్తున్న ఖర్చు విషయంలో మాత్రం మన దేశం అగ్రభాగాన ఉన్నది. 2009 లెక్కల ప్రకారం మన దేశంలో 67 శాతం ఖర్చు చేస్తున్నారు. అదే చైనాలో50, థాయిలాండ్‌లో 24, శ్రీలంకలో 56 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. ఇలా ప్రజారోగ్యాన్ని ప్రభుత్వాలు గాలికి వదిలేయడం కారణంగా ప్రైవేటుగా వ్యక్తులు చేసే ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీనికంతటికి కారణం ప్రభుత్వ విధానాలే!

ప్రభుత్వం ప్రజారోగ్యంపై ఖర్చును తగ్గిస్తూ పోతుంటే.., ఇదే అదనుగా ప్రైవేటు దోపిడీ పెరిగిపోతోంది. దీంతో తక్కువ ఆదాయవర్గాలు, పేదలు తమ ఆరోగ్యం గురించి ప్రైవేటు హాస్పిటల్‌కుపోయి వైద్యం చేయించుకునే స్థితిలో లేక రాగాలతోచావుకు దగ్గరవుతున్నారు. ప్రభుత్వ విధానాలు ఇలా ఉంటే.. ఈ మధ్యకాలంలో మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 1996-2006 మధ్యన ఔషధాల ధరలు 40 శాతం పెరిగాయి. బహిరంగ మార్కెట్లో లభ్యమవుతున్న మందులలో 10 శాతం అక్కరకు రానివేనని తేలింది. విటమిన్‌లు, దగ్గు సిరప్‌ల పేర, రకరకాల బలవర్థక మందుల పేర మార్కెట్‌లో చెలామణి అవుతున్న మందు ల్లో సగానికి సగం కనీస నాణ్యత లేని అక్కరకు రాని అవసరం లేనివే. ఆరోగ్యమనేది దేశంలో అందరికి అందని ఖరీదైన వస్తువుగా మారిపోయింది. దేశంలోని ప్రజలు ఆరోగ్యంపై చేస్తున్న ఖర్చుల మూలంగానే దారివూద్యరేఖకు దిగువకు పడిపోతున్నారు. ఇలా నిరుపేదలుగా మారుతున్న వారిలో 3.2 శాతం మంది వైద్య ఖర్చుల ఫలితంగానే దారివూద్యంలో కూరుకుపోతున్నారు. 70 శాతం మంది తాము సంపాదించినదంతా తమ ఆరోగ్యం కోసం, మందుల కోసం ఖర్చు చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం దశాబ్దం క్రితం ప్రజారోగ్యంపై 11.3 శాతం ఖర్చు చేస్తే, నేడు అది 5.2 శాతానికి పడిపోయింది. రాజస్థాన్, మధ్యవూపదేశ్, హర్యానా తదితర రాష్ట్రాలు కూడా ఇదే బాటలో ప్రయా ణిస్తున్నాయి.
తమిళనాడు 2001లో 15.3 శాతం ఖర్చు చేస్తే ఇప్పుడు 12.2 శాతం ఖర్చు చేస్తున్నది.

ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలలో ప్రపంచంలో అన్ని దేశాల కంటే వెనుకబడి ఉన్నాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం వెయ్యి మంది ప్రజలకు హాస్పిటల్ సౌకర్యం కల్పించడంలో అట్టడుగున ఉన్నాము. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వెయ్యి మందికి మూడు పడకలు ఉంటే.., భారత దేశంలో ఉన్న 12,760 ప్రభుత్వ హాస్పిటళ్లలో 2012 మందికి ఒక బెడ్ అందుబాటులో ఉన్నది. అదే చైనాలో ప్రతి వేయి మందికి మూడు పడకలు, బ్రెజిల్‌లో 2, శ్రీలంకలో మూడు బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి. అంటే.. భారతదేశంలో ప్రభుత్వాలు ప్రజారోగ్యం పట్ల చూపెడుతున్న శ్రద్ధ ఏపాటిదో అర్థం అవుతోంది.
1946లోనే భోర్ కమిటీ ప్రతి వేయిమందికి ఒక హాస్పిటల్ బెడ్ అందుబాటులో ఉండాలని సూచించింది. ప్లానింగ్ కమిషన్ అంచనా ప్రకారం 2022 నాటి కి 27 లక్షల బెడ్‌లు అవసరమని తేల్చింది. ఇలా ఏర్పాటు చేసినట్లైతే.. ప్రతి వెయ్యి మందికి రెండు పడకలు అందుబాటులోకి వస్తాయి. ఇలా చేసినప్పుడే ప్రజల్లో వ్యాప్తి చెందుతున్న అంటురోగాలను నివారించగలుగుతామని తెలిపింది. కానీ మన పాలకులు దీని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. గ్రామీణ ఆరోగ్యాన్ని గురించి అయితే అసలే పట్టించుకోలేదు. ఉన్న అరకొర వసతులతో గ్రామీణ ప్రాం తాలలో పని చేయాల్సిన వైద్యులు కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో గ్రామీణ ప్రజలు రోగాల బారిన పడి మరణిస్తున్నారు. వైద్యులు తమ ప్రైవేటు ప్రాక్టీస్‌పై పెట్టిన శ్రద్ధ ప్రజారోగ్యం పై పెట్టడం లేదు.

ఈ పరిస్థితుల్లో ప్రజలకు వైద్యం అందాలంటే చాలినన్ని వైద్యకళాశాలలు ఉండాలిపజారోగ్య ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్. కె.శ్రీనాథ్ రెడ్డి చెప్పిన ప్రకారం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సరియైన వైద్యం అందాలంటే.. ప్రజలందరికీ అందుబాటులో వైద్యశాలలు ఉండాలన్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా 17 వైద్యశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. కనీ సం 15లక్షల మందికి ఒక వైద్యశాల అందుబాటులో ఉండాలన్నారు. ఈ లెక్కల ప్రకారం చూసినా దేశంలో ఇంకా చాలా వైద్యశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నట్లు కనిపించినా.. చాలినన్ని వైద్యశాలలు ఏర్పాటు చేయలేదు. అయితే వైద్యశాలల అవసరాన్ని దృష్టిలో పెట్టుకున్న పాలకులు ప్రైవేటు వారికి వైద్యశాలలు ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు. తక్కువ ధరలకు భూములు కేటాయించి, మౌలిక సదుపాయాలు, వనరుల కల్పించి ప్రోత్సహిస్తే.. వారు మాత్రం ప్రజారోగ్యాన్ని గురించి మరిచిపోయారు. పేదలకు, అందుబాటులో ఉండి గ్రామీణులకు వైద్యసాయం అందించాల్సిన ప్రైవేటు వైద్యశాలలు ఆరోగ్యంతో ఆటలాడుకుంటూ వైద్యం పేర వ్యాపారం చేస్తున్నాయి. రోగుల కనీస రక్షణ, భద్రతను మరిచి హాస్పిటళ్ల నిర్వాహణ అధ్వాన్నంగా ఉంటోం ది. దానికి ఉదాహరణ కోల్‌కత్తాలో ఓ హాస్పిటల్‌లో 90 మంది రోగులు అగ్నివూపమాదంలో ఆహుతి అయ్యారు.

ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యం గురించి శ్రధ్ధ తీసుకోవా లి. గ్రామీణ ప్రాంతాలలో వైద్యశాలలను ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లా, బ్లాక్ కేంద్రాలలో కనీసం పది పడకలతో ఆస్పత్రులను ఏర్పాటు చేయాలి. బ్లాక్ ఆస్ప త్రులను జిల్లా, కేంద్ర ఆస్పత్రులతో అనుసంధానం చేసి ప్రజలకు మెరుగైన, అవసరమైన వైద్యం అందించాలి. పాలకులు నగరాలకు అందాలు అద్దడానికి పెడుతున్న శ్రద్ధ, ప్రజారోగ్యంపై పెడితే ఎంతో మంచిది.

-ధూర్జటి ముఖర్జీ
ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయన్స్ (INFA)

35

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన

Published: Sat,October 6, 2012 03:21 PM

అక్రమ మైనింగ్ ఆగేదెన్నడు?

అక్రమ మైనింగ్ రాష్ట్రాలనే కాదు, కేంద్రాన్నీ కుదిపేస్తోంది. అక్రమ మైనింగ్ వార్తలు జాతీయ వార్తా పత్రికలలో సైతం పతాక శీర్షికలవుతున్నా

Published: Sat,October 6, 2012 03:22 PM

ఆహార స్వచ్ఛత అంతా మిథ్యే!

చిట్ట చివరికి ప్రభుత్వం కదిలింది. ఆరోగ్య భద్రతకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. మానవుని ఆరోగ్యానికి మొదటి షరతుగా ఉన్న ఆహారమే కలుషి

Published: Sat,October 6, 2012 03:22 PM

మద్యం మత్తులో యువత..

ఒకప్పుడు అనైతికమనుకున్నది ఇప్పుడు నాగరికతకు చిహ్నమైపోయిం ది. చాటు మాటుగా ‘తాగే’ వ్యవహారం ఇప్పుడు బహిరంగ వేడుక అయ్యింది. కొన్నేళ్లు