ఆహార స్వచ్ఛత అంతా మిథ్యే!


Sat,October 6, 2012 03:22 PM

చిట్ట చివరికి ప్రభుత్వం కదిలింది. ఆరోగ్య భద్రతకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. మానవుని ఆరోగ్యానికి మొదటి షరతుగా ఉన్న ఆహారమే కలుషితమైతే.. వచ్చే ముప్పును ఇన్నాళ్లకు ప్రభుత్వం గుర్తించి నివారణ చర్యలు చేపట్టింది.ఆహార పదార్థాల కల్తీని నివారించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. దీనికోసం దేశవ్యాప్తంగా 4,5 జిల్లాలకు ఒకటి చొప్పున ఆహార పదార్థాల కల్తీని పరీక్షించే ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని ప్రణాళికా సంఘం సంకల్పించింది. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా పది జిల్లాలను కలిపి జోన్‌గా ఏర్పాటు చేసి దానికి ఓ జోనల్ ల్యాబోరేటరీని ఏర్పాటు చేస్తోంది. దీంతో ఆహార పదార్థాల్లో ఉన్న ప్రమాదకరమైన మలినాలు, భార లోహాలను గుర్తిస్తారు. వీటికితోడు ఆహార పదార్థాల కల్తీని గుర్తించేందుకు మరో పది సహాయక ప్రయోగశాలలను కూడా ఏర్పాటు చేయాలని సర్కారు సంకల్పించిం ది. ఇప్పటికే ముంబాయి, కలకత్తా లో ఉన్న ల్యాబ్‌లను ఉన్నతీకరించి వాటిని ఆహారపదార్థాల కల్తీని నిరో ధించేందుకు ఉపయోగిస్తారు. అలా గే సంచార ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తారు.

జనం ఎక్కువగా రోడ్డుపక్కన ఉండే తినుబండారాలను ఉపయోగిస్తున్న ప్రాంతాల్లోని ఆహారపదార్థాలను పరీక్షిస్తారు. ఈ నేపథ్యంలో ఆహారపదార్థాల కల్తీగురించి చేసిన నమూనా పరీక్షలు భయంకరమైన వాస్తవాలను తెలిపా యి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చేసిన సర్వే ప్రకారం 1,791 ఆవు, బర్రె పాల నమూనాల్లో 6 శాతం కలుషితమైనవేనని తేలింది. పాలల్లో ప్రమాదకర స్థాయిలో రసాయనపదార్థాలు, హానికరమైన భార లోహ పదార్థాలు కరిగి ఉన్నాయని తేలింది. కొన్ని పాలల్లో అయితే.. సబ్బు పదార్థాలు, బ్లీచింగ్ ఏజెంట్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్, యూరియా లాంటి ఎరువులు కూడా ప్రమాదకరస్థాయిలో పాలల్లో కరిగి ఉన్నాయి. ఒడి షా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో ఈ ఆహార పదార్థాల కాలు ష్యం ప్రమాదకరస్థాయిలో ఉన్నది. ఈ రాష్ట్రాల్లో చేసిన 250 నమూనా పరీక్షల్లో ఒకటి కూడా ఉపయోగించే స్థితిలో లేదు. ఈ పరిస్థితిని గమనించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కూడా పాల ఉత్పత్తిదారులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పాలల్లో ఈ-కోలీ, స్టాఫరూస్, లిస్టేరియా లాంటి సూక్ష్మక్రిము లు లేకుండా.. పరీక్షించి వినియోగదారులకు అందజేయాలని ఆదేశించింది. పాలను పరిశువూభంగా ఉంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని పాల ఉత్పత్తి దారులకు సూచించింది.
ఈ విధంగా దేశవ్యాప్తంగా ఆహార పదార్థాల కల్తీ, కాలుష్యం కావడాన్ని నివారించేందుకు ప్రభుత్వం 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.

దీనికోసం 6,54 కోట్లను కేటాయించింది. అలాగే ‘నేషనల్ ఫుడ్ సైన్స్ అండ్ రిస్క్ అసెస్‌మెంట్ సెంటర్’ ఏర్పాటుకు కూడా 155 కోట్లను కేటాయించడానికి సిద్ధపడింది. ఈ సెంటర్ పర్యవేక్షణలో రోగ నివారణ కేంద్రం, ఆహార భద్రతా కేంద్రం, పోషక పదార్థాల నిర్ధారణ కేంద్రం లాంటివి పనిచేస్తాయి. ఈ క్రమంలోనే ‘ఫుడ్ సేఫీ’్ట కార్యాలయాలు ప్రతిజిల్లాలో పనిచేసే విధంగా కార్యాచరణను రూపొందించి, దీనికి 2200 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే.. ఆహార పదార్థాల రక్షణ, పరిశుద్ధత గురించి ఎంబీబీఎస్ సిలబస్‌లోనే కొన్ని ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు.

ఆహార స్వచ్ఛత, రక్షణ, కాలుష్యం విషయాలను దేశవ్యాప్తంగా నమూనాలను సేకరించేందుకు ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. దీనికోసం 50 కోట్ల రూపాయలను కేటాయించింది. అలాగే సువిశాల భారతదేశంలో ఆహార భద్రత, తదితర విషయాలను ప్రజలకు తెలియజేయడానికి ఎదురవుతున్న సమస్యలను చర్చించింది. దీనికోసం ప్రజలను చైతన్యం చేయడానికి 669 కోట్ల రూపాయలు కేటాయించి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించింది. ఆహార స్వచ్ఛత గురించి గ్రామీణ భారతంలో ప్రజల్లో అవ గాహన పెంపొందించడానికి ఎన్జీవోల సహాయం తీసుకోవాలని భావిస్తోంది. అలాగే సీబీవో (కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్) ద్వారా కూడా మారు మూల ప్రాంతాల్లో కూడా ఆహార స్వచ్ఛత, రక్షణ విషయాలను ప్రచారం చేయాలని నిర్ణయించింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం ప్రకారం చాలా రాష్ట్రాల్లో ఆహార కల్తీ తీవ్రంగా ఉన్నది. ఛత్తీస్‌గఢ్‌లో40 శాతం, ఉత్తరాఖండ్‌లో 34, ఉత్తరప్రదేశ్‌లో 29, రాజస్థాన్‌లో 23, పశ్చిమబెంగాల్‌లో 20 శాతం ఆహార పదార్థాలు కల్తీగా ఉన్నాయి. ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా ఆహార కల్తీ తీవ్రత ఎక్కువగానే ఉన్నది. ఇది కొన్ని సంవత్సరాలుగా పెరిగిపోతోంది. ఈ ఆహార కల్తీ నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. రోడ్డు పక్కన హోటళ్ళు, రోడ్ల పై పెట్టే తినుబండారాలను అమ్మే వారితో ఆహార స్వచ్ఛతకు తూట్లు పడుతున్నాయి. వీటిపై ఆహార స్వచ్ఛతకు సంబంధించి ఎలాంటి నియంవూతణా లేదు. వీరు ఎలాంటి శుభ్రతా పాటించరు. ఇలాంటి వాటితోనే ఎక్కువ ప్రమాదం జరుగుతున్నదని తేలింది.
ఇదిలా ఉంటే.. పోషకాహార లోపం, ఆహార కల్తీ,కాలుష్యం పేదల పాలిట శాపంగా మారింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు, తక్కువ ఆదాయ వర్గాలు అనేక సమస్యల ను ఎదుర్కొంటున్నారు. రోగాల పాలవుతున్నారు. ఈ సమస్యలనుంచి గ్రామీణ పేదలను రక్షించేందుకు పథకాలు ఎన్ని ఉన్నా ఆచరణలో అన్నీ విఫలమవుతున్నాయి.

దీని కారణంగానే.. పేదలు రోగాల తో సతమతమవుతున్నారు. ఆహార రక్షణ గురించి ఎన్ని చట్టాలున్నా అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. వాటితో ఏ ప్రయోజనమూ ఒనగూడటం లేదు. రోడ్డు పక్కన ఉండే తినుబండారాల సంగతి అటుంచితే.., పెద్ద పెద్ద హోటళ్లలోకూడా బిర్యానీలలో రంగుకోసం వాడుతున్న రసాయన పదార్థాలు కూడా ప్రమాదకర స్థాయి లో ఉన్నాయి. వీటి నియంవూతణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఈ విధమైన ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పు డే.. శుభ్రమైన, భద్రత కలిగిన ఆహార పదార్థాలు ప్రజల కు అందుబాటులో ఉంటాయి. పరిశువూభమైన, రక్షణ కలిగిన ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నప్పుడే, పిల్ల లు, యువతలో ఆహార సంబంధిత రోగాలు తగ్గుతాయి. దీనికోసం ప్రభు త్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే రక్షణ కలిగిన ఆహారం అందుబాటులో ఉంటుంది. మంచి ఆహారం కోసం ప్రభుత్వంలోని సంబం ధిత శాఖలతో పాటు పౌరసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. కలుషిత ఆహారం, పౌష్టికాహార లోపం తో రోగాల పాలవుతున్న పేదలు సుభిక్షంగా ఉంటారు. మంచి ఆహారంతోనే మనుషులు ఆరోగ్యకరంగా ఉంటారు. మనిషి ఆరోగ్యమే దేశాభివృద్ధికి సోపానం. ఆ దిశగా మన అడుగులు ఉండాలి. అప్పుడే దేశం ఆరోగ్యంగా ఉంటుంది.

-దూర్జటి ముఖర్జీ
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయన్స్)

35

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన

Published: Sat,October 6, 2012 03:21 PM

అక్రమ మైనింగ్ ఆగేదెన్నడు?

అక్రమ మైనింగ్ రాష్ట్రాలనే కాదు, కేంద్రాన్నీ కుదిపేస్తోంది. అక్రమ మైనింగ్ వార్తలు జాతీయ వార్తా పత్రికలలో సైతం పతాక శీర్షికలవుతున్నా

Published: Sat,October 6, 2012 03:22 PM

పోలియో చెబుతున్న పాఠాలు

భారత దేశం ఆరోగ్యరంగంలో ఓ మైలురాయిని దాటింది. పోలియో రహి త దేశంగా అవతరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా

Published: Sat,October 6, 2012 03:22 PM

మద్యం మత్తులో యువత..

ఒకప్పుడు అనైతికమనుకున్నది ఇప్పుడు నాగరికతకు చిహ్నమైపోయిం ది. చాటు మాటుగా ‘తాగే’ వ్యవహారం ఇప్పుడు బహిరంగ వేడుక అయ్యింది. కొన్నేళ్లు