మద్యం మత్తులో యువత..


Sat,October 6, 2012 03:22 PM

ఒకప్పుడు అనైతికమనుకున్నది ఇప్పుడు నాగరికతకు చిహ్నమైపోయిం ది. చాటు మాటుగా ‘తాగే’ వ్యవహారం ఇప్పుడు బహిరంగ వేడుక అయ్యింది. కొన్నేళ్లుగా.. యువతలో పెరుగుతున్న మద్యం వాడకం పై సమాజమంతా బెంబేపూత్తుతోంది. పెరుగుతున్న అశాంతి, నేరాలు, ఘోరాల కు మద్యమే ప్రధాన కారణమని మనస్తత్వ శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు అంటున్నా పట్టించుకున్న నాథుడు లేడు. మద్యం కారణంగా యువత తప్పు దోవపడుతున్నది. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాల కు కారణమవుతున్న తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. ‘మద్యం తాగి వాహ నం నడిపి మరణానికి కారణమైతే.. శిక్షార్హమైన హత్యానేరం’గా పరిగణించాల ని ఈ మధ్యనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అలాగే తాగి వాహనం నడిపితే.. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడమే గాకుండా.. గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించవచ్చని హెచ్చరించిం ది. ఈ తీర్పు దేశంలో పెరిగిపోతున్న మద్యం వాడకం, దాని దుష్ఫరిణామాల తీవ్రతను, చెప్పకనే చెబుతోంది.
‘మద్యం’ వాడకం ఇవాళ దేశంలో తీవ్ర సమస్యగా మారింది. పదేళ్లుగా సమాజంలో, ప్రధానంగా యువతలో మద్యం వాడకం పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. యువత మద్యానికి బానిసలు కావడానికి అనేక కారణాలున్నాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ మధ్య ఇంటర్ మీడియట్‌స్థాయి విద్యార్థుల్లో మద్యం తాగేవారి సంఖ్య 45 శాతానికి పెరిగింది. ఈ విధంగా ప్రతినెల అయిదారు రెట్లుగా పెరుగుతూ సమాజాన్ని కృంగదీస్తోంది. యువతలో ఈ విధంగా మద్యం వాడకం పెరగడానికి ప్రధాన కారణం.. వారిపై నానాటికీ పెరిగిపోతున్న ఒత్తిడి, విచ్చలవిడిగా పాకెట్‌మని రూపంలో అందుబాటులో ఉన్న డబ్బు, కుటుంబ పర్యవేక్షణ, ఆలనా పాలనా లేకపోవడమే కారణమని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.

ఇటీవల ‘అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (అసోచామ్) రెండువేల మంది యువతపై అధ్యయనం చేసింది. 15- 19 ఏళ్ల విద్యార్థుల్లో చేసిన ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతలో 32 శాతం మంది తాము నిరాశ, నిస్పృహకు గురైనప్పుడు మద్యం సేవిస్తామని చెప్పారు. 1 శాతం ఒంటరితనంతో, 15 శాతం మంది ఎటూ తోచక బోర్ కొట్టినప్పుడు తాగుతున్నామన్నారు. 46 శాతం మంది సంబరాలు జరుపుకునేందుకు తాగుతామంటున్నారు. ఈ విధంగా మద్యం వాడకం ఢిల్లీ, ముంబాయి, చండీగఢ్, హైదరాబాద్ నగరాల్లో ఎక్కువ గా ఉంది. పుస్తకాలకు , ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్న దానికంటే ఎక్కువ గా ప్రతినెలా 3500- 4500 రూపాయల దాకా మద్యానికి ఖర్చు చేస్తున్నామ ని విద్యార్థులు చెప్పుకొచ్చారు. ఈ విధంగా 20 ఏళ్లలోపున్న యువత మద్యానికి బానిసలుగా మారిన ఘటనలు పెరిగిపోతున్నాయి. ఒక్క ఢిల్లీలోనే రెండువేల మంది యువత మద్యం తాగి వాహనం నడిపిన కేసుల్లో వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయబడ్డాయి. ఈ ప్రమాదాన్ని మొగ్గలోనే తుంచేయకపోతే.. ఇదే పెను ముప్పుగా మారే ప్రమాదం పొంచి ఉన్నది.

రోజు రోజుకూ పెరిగిపోతున్న పాశ్చాత్య జీవన విధానం, ఆధునిక పోకడల పేర సాగుతున్న తంతులే మద్యం వాడకానికి కారణమని నిపుణులు అంటున్నా రు. అలాగే చదువుల పేరిట పెరుగుతున్న ఒత్తిడి, మానవ సంబంధాలలో వస్తు న్న మార్పులు, ప్రేమ వైఫల్యాలు మద్యానికి బానిసను చేస్తూ, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. ఈ అవాంఛనీయ పోకడలు పెరిగి యువత ప్రవర్తనలో తీవ్ర మార్పులు సంభవించిన తరువాతనే కాలేజీ యాజమాన్యాలు గానీ, కుటుంబా లు గానీ గుర్తించగలుగుతున్నాయి. అయితే ఈపాటికే జరగవలసిన నష్టం జరిగిపోతున్నది. దురదృష్టవశాత్తు మద్యం తాగడం ఈమధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా పబ్బుల్లో, క్లబ్బుల్లో మద్యం తాగడం సర్వసాధారణమైంది. మద్యంతో పాటు, పొగతాగడం అలవా టుగా మారింది. ఈ రెండూ యువతను నిండా ముంచుతున్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలకే గాక మానసిక సమస్యలకు హేతువులవుతున్నాయి.
నానాటికీ పెరిగిపోతున్న మద్యం వాడకానికి కుటుంబ కలహాలు కూడా ప్రధా న కారణమని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. లేత వయసులో మద్యం తాగడం వల్ల పసి మనసులు వాడిపోతున్నాయని, దీనిలోంచే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అంటున్నారు. అలాగే వస్తు వ్యామోహం, డబ్బు సంపాదన పట్ల పరుగు పందెం అనేక అనర్థాలకు దారితీస్తోంది. డబ్బు సంపాదన అనేది కుటుంబం, కుటుంబం నుంచి పిల్లలకు పాకి ఇది ఓ విష వలయంగా మారింది. సంపాదనలో పడ్డ కుటుంబ పెద్దలు, పిల్లల గురించి పట్టించుకోక, వారిని తీర్చి దిద్దడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే చిన్న కుటుంబాలు కూడా ఈ చెడుకు ఓ ప్రధాన కారణం. ఈ పరిణామాలన్నింటినీ చక్కదిద్దడానికి ఇప్పటికైనా సమా జం కదలాలి. ప్రతి ఒక్కరూ మద్యం వాడకంపై సమర భేరి మోగించాలి. కుటుం బ ప్రేమ, పర్యవేక్షణతో పిల్లల్లో ఎక్కువ శాతం మద్యం వాడకాన్ని దూరం చేయవచ్చు.

విద్యార్థి, యువకుల్లో మద్యం తాగడాన్ని దూరం చేయడం కోసం విద్యా సంస్థలు, యూనివర్సిటీలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్జన కేవలం ఉద్యోగ లక్ష్యం కోసమే గాకుండా.. సామాజిక బాధ్యత నెరవేర్చడానికి కూడా బోధించాలి. అలాగే.. సమాజంలో రాజ్యమేలుతున్న వస్తు వ్యామోహం స్థానే నైతిక విలువల ప్రాధాన్యాన్ని పెంపొందించాలి. ‘జీవితానందం’ పేరిట జరుగుతున్న ‘జల్సా’లన్నీ పతనానికి మెట్లుగా యువతకు అర్థం చేయించగలగాలి.

నిజమైన సంతోషం, ఆనందం సామాజిక కార్యాచరణ నుంచి, సేవా తత్పరత నుంచి పొందాలని యువతను కార్యోన్ముఖులను చేయాలి. విద్యార్థి యువకుల్లో ఉన్న సాంఘిక, ఆర్థిక అంతరాలు వ్యక్తీకరించబడకుండా యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలి. ధనవంతుల పిల్లల జీవన విధానం, వస్తు వాడకం పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులను తీవ్ర మానసిక సంఘర్షణకు, ఆత్మన్యూనతకు గురిచేస్తున్నాయి. దీంతో..విద్యార్థుల్లో అవాంఛనీయ ధోరణులు, మద్యం వాడకం పెరుగుతోంది. వీటిని తగ్గించేందుకు యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలి. ధనవంతుల పిల్లలు సేవా దృక్పథాన్ని అలవర్చుకొని పేదలకు సహాయపడే విధంగా ప్రోత్సహించాలి. ఉన్నత వర్గాల పిల్లల ‘పాకెట్ మనీ’ నుంచి పేద విద్యార్థుల ఎన్నో అవసరాలను తీర్చవచ్చని తెలియజెప్పాలి. చేసి చూపించాలి. సామాజిక సేవ చేసేందుకు యవతను ప్రేరేపించడం ద్వారా.. ఉన్నత వర్గాల పిల్లల్లో డబ్బు దుబారా తగ్గడ మే గాక, వారిని చెడు అలవాట్లకు దూరం చేసిన వారవుతారు. ఈ విధమైన కార్యచరణ ద్వారానే.. యువతలో పెరిగిపోతు న్న మద్యం వాడకం, అసాంఘిక పోకడలను దూరం చేయవచ్చు. దీనికి కుటుంబం మొదలు కాలేజీ, యూనివర్సిటీల దాకా.. యువతను తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టాలి. భారతీయ నాగరికతా సంస్కృతులను యువతలో పెంపొందించి, భవిష్యత్ తరాలుగా తీర్చిదిద్దాలి. సామాజిక నడతకు, ఆలోచనలకు, ఆచరణకు వ్యక్తీకరణగా ఉండే యువత ఆదర్శంగా రూపొందాలి. తద్వారానే.. భారతీయ యువత నిర్మాణాత్మక పాత్ర పోషించి జాతి భవిష్యత్‌ను ఉజ్వలంగా వెలుగొందిస్తారు.

-ధూర్జటి ముఖర్జీ
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)

35

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన

Published: Sat,October 6, 2012 03:21 PM

అక్రమ మైనింగ్ ఆగేదెన్నడు?

అక్రమ మైనింగ్ రాష్ట్రాలనే కాదు, కేంద్రాన్నీ కుదిపేస్తోంది. అక్రమ మైనింగ్ వార్తలు జాతీయ వార్తా పత్రికలలో సైతం పతాక శీర్షికలవుతున్నా

Published: Sat,October 6, 2012 03:22 PM

పోలియో చెబుతున్న పాఠాలు

భారత దేశం ఆరోగ్యరంగంలో ఓ మైలురాయిని దాటింది. పోలియో రహి త దేశంగా అవతరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా

Published: Sat,October 6, 2012 03:22 PM

ఆహార స్వచ్ఛత అంతా మిథ్యే!

చిట్ట చివరికి ప్రభుత్వం కదిలింది. ఆరోగ్య భద్రతకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. మానవుని ఆరోగ్యానికి మొదటి షరతుగా ఉన్న ఆహారమే కలుషి

Featured Articles