పచ్చదనమే జగతికి ప్రాణం


Thu,July 14, 2016 01:32 AM

nature
అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చు. దీనికి గాను చాలినంత భూమి కూడా అందుబాటులో ఉండాలి. ప్రత్యామ్నాయ అడవి పెంపకానికి నిజాయితీ, చిత్తశుద్ధి కూడా అత్యవసరం. దీన్ని గ్రీన్ ఇండియా మిషన్ ద్వారా అమలుచేసి దేశవ్యాప్తంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించిన వారమవుతాం.

చెట్లు లేకపోతే పాట్లు తప్పవని అనుభవంలోకి వస్తున్నది. ఆధునికాభివృద్ధి పేరిట విచక్షణారహితంగా అడవులను నరి కి, పచ్చదనాన్ని మాయం చేస్తే ఎదురవుతున్న పరిస్థితులు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, క్రమం తప్ప కుండా పీడిస్తున్న కరువు కాటకాలు పచ్చదనం ప్రాధాన్యాన్ని గుర్తించేట్లు చేస్తున్నాయి. దీంతో అంతటా పచ్చదనాన్ని పెంచేందుకు పాట్లు పడుతున్నారు. సరిగ్గా ఈ క్రమంలోనే.. హరితహారం లాంటి కార్యక్రమాల ప్రాముఖ్యాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉన్నది.

ఈ నేపథ్యంలోనే.. కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా అటవీ సంపద ను పెంచి పోషించేందుకు గ్రీన్ టాక్స్‌పేరిట పన్నును విధించేందుకు సమాయత్తమవుతున్నది. దీనికోసం నేషనల్ ఫారెస్ట్ పాలసీ (ఎన్‌ఎఫ్‌పీ)ని రూపొందించి అడవుల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నది. ఈ క్రమంలోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (ఐఐఎఫ్‌ఎం) కూడా తన అధ్యయనంలో దేశ భూ భాగంలో మూడింట ఒకటో వంతులో అడవులు ఉండేట్లు చూడాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేసింది. ఇలా చేసినప్పుడే వాతావరణ సమతుల్యం, వన్యప్రాణులు సంరక్షణ, పరిరక్షణ సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అటవీ పరిరక్షణ చట్టం 1988 స్థానంలో మరో చట్టం అవసరమున్నదని ఐఐఎఫ్‌ఎం భావిస్తున్నది.

ప్రస్తుత చట్టం అటవీ సంపదను పరిరక్షించడం లో విఫలమవుతున్నదని, అడవుల నరికివేతను, అటవీ భూములను ఇతర అవసరాల పేరిట ఉపయోగించడాన్ని నిరోధించలేకపోతున్నదని అంటున్నది. ఒకానొక అధ్యయనం ప్రకారం దేశ భూభాగం మొత్తంలో నాలిగింట ఒకటో వంతు అటవీ సంపద ఉన్నది. దీన్ని సంరక్షించుకోవటమే కాదు, మరింత విస్తరించుకోకపో తే.. ముప్పుతప్పదని చెబుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లోనే.. అడవుల దహనాలు కూడా పెద్ద సమస్య అయిపోయింది. ఈ మధ్యనే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో రెండు వేల హెక్టార్ల అడవి మంటల్లో కాలి బూడిదైంది. దేశంలో ఎనభై మిలియన్ల హెక్టార్లలో అడవి విస్తరించి ఉన్నది. ఈ అడవి సంరక్షణకు, దహనకాండనుంచి సంరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలి. దానికి సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి ఉన్నది.

అయి తే అడవుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏటా.. 42 వేల కోట్లు కేటాయిస్తున్నది. అడవుల పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నది. గత ప్రభుత్వా లు అనుసరించిన విధానాల కారణంగా.. 36 వేల హెక్టార్ల అడవి ఏటా క్షీణించిపోయింది. దాన్ని ఇప్పుడు 17 వేలకు తగ్గించి అడవుల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. ప్రభుత్వం అడవుల బయట చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టి వృక్ష సంపద శాతాన్ని 33 శాతం ఉండేట్లు చర్యలు చేపడుతున్నారు. చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ తన మన్ కీ బాత్‌కార్యక్రమంలో కూడా చెట్ల పెంపక ప్రాముఖ్యాన్ని గూర్చి దేశ ప్రజలకు ఉద్బోధించారు. దేశ వ్యాప్తంగా అడవులు మంటల్లో కాలిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అడవుల్లో రాలిన ఆకులు పేరుకుపోవడం, తదితర కారణాలు, మనుషుల బాధ్యతారహిత చర్యల మూలంగా అడవులు కాలి బూడిదవుతున్న తీరుకు అడ్డుకట్ట వేయడానికి చర్యలు చేపడుతున్నది.

మరో వైపు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా ఏటా అడవులు తరిగిపోతూనే ఉన్నాయి. అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట, సహజ వనరుల వెలికితీత పేరిట అటవీ భూములను చెరబట్టడం జరుగుతున్నది. ఒక్క మహారాష్ట్రలోనే 530 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని అడవి నాశనం అయ్యింది. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్ కార్యక్రమాల మూలంగా 175 చదరపు కి.మీ. అడవి 2005 నుంచి 2015 మధ్యకాలంలో కనిపించకుండాపోయింది.

ఈ క్రమంలో అడవుల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన అవసరం ఉన్నది. అయితే అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా రహదారులు, పవర్ ప్రాజెక్టులు, మైనింగ్ ప్రాజెక్టులతో ఏటా అడవులు తరిగిపోతూనే ఉన్నాయి. కాబట్టి అటవీ పరిరక్షణ చట్టం 1980ను మరింత పటిష్ఠంగా రూపొందించాల్సిన అవసరమున్నది. కానీ మన పాలకుల విధానాలు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు కారణంగా అట వీ పరిరక్షణ చట్టం అక్కరకు రానిదైపోయింది. విషాదమేమంటే.. 2014లో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు రోడ్ల నిర్మా ణం, ప్రాజెక్టుల కోసం గ్రామ సభల సమ్మతి తీర్మానంతో అటవీ భూములను వినియోగించవచ్చునని చెప్పుకొచ్చింది. ఇది 1930నాటి అటవీ పరిరక్షణ చట్టం, నోటిఫైడ్ ఏరియాల చట్టానికి తూట్లు పొడిచినట్లయ్యింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో అడవుల పరిరక్షణ కోసమని ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. అడవులు నరికివేతకు గురైనప్పుడు దానికి బదులుగా మరోచోట అటవీ పెంపకం కోసం సదరు కంపెనీలు కృషి చేయాలని చెప్పింది. దీనికోసం ప్రత్యేకంగా.. కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ( సీఏఎంపీఏ) అనే సంస్థను రూపొందించి అడవుల తరుగుదలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీని ప్రకారం అభివృద్ధి, ప్రాజెక్టు పేరుమీద ఎవరైనా, ఎక్కడైనా అడవిని నరికి వినియోగించుకుంటే.., ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని పెంచి పోషించాలి. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే 40 వేల కోట్ల రూపాయలను వివిధ ప్రాజెక్టు కంపెనీ ల నుంచి సేకరించింది. ఇదింకా ఏటా ఆరువేల కోట్లు సేకరించాలని సీఏఎంపీఏ సంకల్పించింది. ఇది చట్టరూపం దాల్చకున్నా ఆ దిశ గా అడవుల పెంపకం కోసం కృషి ప్రారంభించిం ది. ఇదే క్రమంలో ప్రతి రాష్ట్రంలో కూడా జాతీ య కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ (సీఏఎఫ్)పేరిట నిధిని ఏర్పాటు చేయాలని సంకల్పించడం ఓ మంచి పరిణామం.

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చు. దీనికి గాను చాలినంత భూమి కూడా అందుబాటులో ఉండాలి. ప్రత్యామ్నాయ అడవి పెంపకానికి నిజాయితీ, చిత్తశుద్ధి కూడా అత్యవసరం. దీన్ని గ్రీన్ ఇండియా మిషన్ ద్వారా అమలు చేసి దేశ వ్యాప్తంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించిన వారమవుతాం. ఈ నేపథ్యంలోనే.. దేశంలో 3775 చదరపు కిలోమీటర్ల అడవిని పెరిగేలా చేశారు. మొత్తంగా చూస్తే.. 7,01,673 చదరపు కిలోమీటర్ల పరిధిలో 21.34 శాతం విస్తీర్ణంలో అడవిని పెంపొందించాల్సిన అవసరమున్నది. ఈ విధమైన కృషి ప్రణాళికాబద్ధంగా కొనసాగినప్పుడే ఇప్పటి దాకా సాగిన విధ్వంసానికి తగిన విధంగా ప్రత్యామ్నాయం చేసినట్లు అవుతుంది.

934

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన

Published: Sat,October 6, 2012 03:21 PM

అక్రమ మైనింగ్ ఆగేదెన్నడు?

అక్రమ మైనింగ్ రాష్ట్రాలనే కాదు, కేంద్రాన్నీ కుదిపేస్తోంది. అక్రమ మైనింగ్ వార్తలు జాతీయ వార్తా పత్రికలలో సైతం పతాక శీర్షికలవుతున్నా

Published: Sat,October 6, 2012 03:22 PM

పోలియో చెబుతున్న పాఠాలు

భారత దేశం ఆరోగ్యరంగంలో ఓ మైలురాయిని దాటింది. పోలియో రహి త దేశంగా అవతరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా

Published: Sat,October 6, 2012 03:22 PM

ఆహార స్వచ్ఛత అంతా మిథ్యే!

చిట్ట చివరికి ప్రభుత్వం కదిలింది. ఆరోగ్య భద్రతకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. మానవుని ఆరోగ్యానికి మొదటి షరతుగా ఉన్న ఆహారమే కలుషి

Published: Sat,October 6, 2012 03:22 PM

మద్యం మత్తులో యువత..

ఒకప్పుడు అనైతికమనుకున్నది ఇప్పుడు నాగరికతకు చిహ్నమైపోయిం ది. చాటు మాటుగా ‘తాగే’ వ్యవహారం ఇప్పుడు బహిరంగ వేడుక అయ్యింది. కొన్నేళ్లు