కార్యాచరణలేని స్వచ్ఛభారత్


Sat,January 3, 2015 01:44 AM

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడాలి. దీనికోసం పౌరసంఘాలు, పౌరసమాజంతో పాటు, స్వచ్ఛంద సంస్థలు, పాలనాయంత్రాంగ విభాగాలన్నీ కలిసి ఉమ్మడిగా పనిచేయాలి. గ్రామస్థాయి నుంచి పంచాయతీ ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేసి స్వచ్ఛ భారత్ కోసం కదలాలి. అప్పుడే స్వచ్ఛ భారత్ కల సాకారమవుతుంది.

బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పాల నా విధానపరమైన అనేక నిర్ణయా లు తీసుకుంటూ గత ప్రభుత్వాలకు భిన్నమైనదిగా చెప్పుకునేందుకు అనేక కసరత్తు లు చేస్తున్నది. మిగతా నిర్ణయాలు, విధానాలు ఎలా ఉన్నా మోదీ మానస పుత్రికగా వెలుగులోకి వచ్చిన స్వచ్ఛభారత్ అభియాన్‌కు కేంద్ర ప్రభుత్వం ఎనలేని ప్రచారం ఇస్తున్నది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రజలందరినీ భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అయితే.. గతంలో వచ్చిన అనేకానేక కార్యక్రమాల్లాగే ఇదికూడా ఒక ప్రచార కార్యక్రమంగా మిగిలిపోకుండా ఉండాలంటే నిర్మాణాత్మకంగా పనిచేయాలి.

కేవలం ప్రచారం కోసమో, ఫోటోల కోసమో చేస్తున్న తూతూ మంత్రం కార్యక్రమంగా ఇప్పటికే అనేక దుష్టాంతా లు జరిగాయి. అధికారపా ర్టీ నేతలు కొందరు ఫోటో ల కోసం రోడ్డు మీద చెత్తను పారబోసి దాన్ని తొలగిస్తున్నట్లు నటించిన ఘటనలూ వెలుగు చూశాయి.

నిజానికి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కొత్తదేమీ కాదు. గతంలో రాజీవ్‌గాంధీ హయాంలో ప్రవేశపెట్టిన సెంట్రల్ రూరల్ సానిటేషన్ ప్రోగ్రాంకు మరో రూపంగానే చెప్పవచ్చు. అలాగే అటల్ బిహారీ వాజపేయి కాలంలో కూడా సంపూర్ణ సానిటేషన్ ప్రచార కార్యక్రమం ఉండేది. ఈ కార్యక్రమాలకే నరేంద్రమో దీ పేరు మార్చి స్వచ్ఛభారత్ అభియాన్ గా తెరమీదికి తెచ్చారు. అయితే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతం కావాలంటే ఎవరో కొందరు పార్టీ కా ర్యకర్తలు, ప్రభుత్వ అధికారులు ఏదో ఒకరోజు నామ మాత్రంగా చెత్తను ఎత్తివేసే కార్యక్రమాన్ని చేస్తే సరిపోదు. దీంట్లో ప్రభుత్వం, ప్రజలు, సమాజంలోని సమస్త వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి. అప్పుడే స్వచ్ఛ భారత్ ఆవిష్కారమవుతుంది.

అయితే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలంటే కావలసిన మౌలిక వనరులు, వసతులు తప్పనిసరిగా కావలసినవి ఉన్నా యి. దీనికి ముఖ్యంగా నీరు, డ్రైనేజీ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. మంచి నిర్వహణ స్థితిలో ఉండా లి. కానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అత్యావశ్యకమైన ఈ రెండూ దేశంలో చాలా ప్రాంతాల్లో కనీస స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులో లేవు. ఒకానొక అధ్యయనం ప్రకారం దేశంలోని మెజారిటీ గ్రామీణ పాఠశాలల్లో టాయిలెట్స్ లేనే లేవు.

ఉన్నవి కూడా నీరు అందుబాటులో లేక వాడుకలో లేవు. అంతేగాక వాటి నిర్వాహణా లోపం కారణంగా కూడా అవి ఉపయోగంలో లేకుండా ఉన్నాయి. ఇక గ్రామాలు, చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా మెజారిటీ ప్రాంతాలను నీటి కోరత వేధిస్తున్నది. ఈ కారణంగానే అనేక రోగాలు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణా సంస్థ కూడా నీటి కొరత కారణంగానే కాలుష్యం పెరుగుతున్నదని తెలిపింది. ఈ పరిస్థితు ల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతం కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ర్టాల్లోని జిల్లాను, గ్రామాన్ని ఎంచుకుని నమూనాగా సంపూర్ణ స్వచ్ఛతను ఎలా సాధించవచ్చో చేసి చూపించాలి. అప్పుడే ఆచరణాత్మక కార్యక్రమంగా దేశంలోని అన్ని ప్రాం తాలు ఆచరణలో విజయవంతమవుతాయి.

గ్రామాలు, నగరాలు అటుంచి రైల్వే స్టేషన్లలో కూ డా నీటి కొరత కారణంగా టాయిలెట్స్ దుర్గంధపూరితంగా తయారైన సందర్భాలున్నాయి. ఇక నగరాల్లోని మురికి వాడలు, వివిధ కారణాలచేత నిర్వాసితులైన ప్రజలకు నిర్మించిన కాలనీలు కనీస సదుపాయాలు, నీటి వసతి లేక తీవ్ర కాలుష్య బెడదను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లోంచే.. చాలా మంది గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరు బయట కాలకృత్యాలు తీర్చుకునే దుస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతం కా వా లంటే కనీస వసతులు, నీరు సమృద్ధిగా అందుబాటులో ఉండటంతో పాటు ప్రజల్లో చైతన్యం కూ డా అవసరం. ఆరుబయట కాలకృత్యాలతో ఆత్మగౌరవంతో పాటు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయ న్న చైతన్యాన్ని కలగజేయాలి.

ఈ కార్యక్రమం కోసం కేంద్రం కేవలం జీడీపీలో రెండు శాతం కేటాయిస్తే అవి ఏమూలకు సరిపోవ డం లేదు. కాలుష్య సమస్య అలాగే ఉండిపోతున్నది. అలాగే అనేక పథకాలకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుతున్న ప్రభుత్వాలు కాలుష్య నివారణకు తగినన్ని నిధులు కేటాయించకపోవడం కూడా ఒక సమస్యగా ఉన్నది.
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయలు ప్రాంతాల్లో కాలకృత్యాలు తీర్చుకుంటున్న ప్రజానీకంలో చైతన్యాన్ని కలగజేసేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థల సాయం కూడా తీసుకోవాలి. అప్పుడే మారు మూల ప్రాంతాల్లోకూడా ప్రజలకు కాలుష్యం, స్వచ్ఛత గురించి అవగాహన పెరుగుతుంది. అలాగే స్వచ్ఛ భారత్ అభియాన్ విజయవంతానికి ప్రజారోగ్య వ్యవస్థ కూడా పనిచేయాలి. ఇలా ప్రజలు, ప్రభుత్వ సంస్థలు, ప్రజారోగ్య సంస్థలు, ఎన్‌జీవోలు కలిసికట్టుగా పనిచేసినప్పుడే స్వచ్ఛభారత్ విజయవంతమవుతుంది.

ఇవ్వాళ.. దేశంలో నగరాలు మొదలు గ్రామాల దాకా పారిశ్రామిక కాలుష్యంతో తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలతో భూ ఉపరితలంతో పాటు, భూగర్భ జలాలు కూడా కాలుష్యమైపోతున్నాయి. కంపెనీల వ్యర్థాలతో చెరువులు, కుంటలు కూడా కాలుష్య కాసారాలుగా మారాయి. ఇలా కాలుష్యం కాటుకు గురైన భూగర్భ జలాలు దేనికీ పనికి రాకుండా పోతున్నాయి. తాగడానికి ఏమో కానీ, పంటలకు పనికిరాకుండా అవుతున్నా యి. ఇలాంటి పారిశ్రామిక కాలుష్యంతో రాష్ట్రంలో ఏడు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అలా గే నివాస గృహాల నుంచి వస్తున్న 70శాతం వ్యర్థాలన్నీ భూ ఉపరితల నీటి వనరుల్లో చేరి కాలుష్యం చేస్తున్నాయి. దీంతో కూడా గ్రామీణ, పట్టణ ప్రాంతా లు కూడా నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి.

పారిశ్రామిక కాలుష్యం, నివాస ప్రాంతాల వ్యర్థాలతో జలవనరులన్నీ కాలుష్యమయమై పోతుండటంతో తాగు నీటికి కూడా తీవ్ర కటకట ఏర్పడుతున్నది. అలాగే 90 శాతం మంది గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటి కోసం భూ గర్భ జలాలపై ఆధారపడతారు. ఈ భూ గర్భజలాల్లో మొతాదుకు మించి హానికరమైన పారిశ్రామిక కాలుష్య పదార్థాలు, లోహాలు కరిగి ఉంటున్నాయి. ఈ నీటిని తాగిన ప్రజలకు చర్మ సంబంధమైన రోగాలతో పాటు ప్రాణాంతకమైన రోగాలు కూడా వస్తున్నాయి.

ముఖ్యంగా హానికరమైన సీసం, పాదరసం, అర్సెనిక్, ఫ్లోరైడ్ లాంటి భార లోహాలు నీటిలో కరిగి ఉండి తాగు నీటి ని విషతుల్యం చేస్తున్నాయి. ప్రాణాపాయాన్ని కలిగించే ఆర్సెనిక్ లోహం కరిగి ఉన్న నీరు కారణం గా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. భూగర్భ జలంలో కరిగి ఉండే ఆర్సెనిక్ ట్రై ఆక్సైడ్ 0.05కన్నా ఎక్కు వ మోతాదులో ఉంటే ప్రాణ హాని తప్పదు. అలాంటిది బెంగాల్, యూపీ రాష్ర్టాల్లో 0.96- 3.2 మిల్లీ గ్రాములుగా ఉంటున్నది. దీంతో గ్రామీ ణ ప్రజానీ కం తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడ మే కాదు, అకాల మరణాలకు గురవుతున్నారు. దేశంలో నలభై వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎనభై లక్షలమంది అర్సెనిక్ లోహ కాలుష్య కాటుకు బలవుతున్నారు.

పారిశ్రామిక కాలుష్యం, భూగర్భ లోహాలు, ఆధునిక జీవనంలో మనిషి ఉపయోగించి వదులుతున్న వ్యర్థాలతో భూ ఉపరితలం తీవ్రమైన కాలుష్యం బారిన పడుతున్నది. నిత్య జీవితంలో ఉపయోగిస్తు న్న ప్లాస్టిక్ వస్తువులు, బాటిల్స్ ఇంకా ఇతర ప్లాస్టిక్ వస్తువులతో తీవ్రమైన పర్యావరణ కాలుష్యం ఏర్పడుతున్నది. అలాగే వ్యవసాయంలో అధికోత్పత్తి పేర విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు, పురుగు మందుల కారణంగా కూడా కాలుష్యం పెరిగిపోతున్నది. తినే ఆహార పదార్థాలతో పాటు, గాలి, నీరు, చివరికి కూర గాయలు, పాలు కూడా కాలుష్యమైపోతున్నాయి.

తినే ఆహారపదార్థాల్లో మోతాదుకు మించి హానికరమైన రసాయనాలు ఉంటున్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవై పు భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నా యి. యేటా 33 సెంటీమీటర్ల లోతుకు పడిపోతున్నా యి. ఇలా పాతాళంలోకి పడిపోతున్న నీటి నిల్వల కారణంగా నీటిలో లవణాలు, లోహాలు ఎక్కువగా ఉంటూ అనారోగ్యానికి కారణమవుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ సభ్యుడు అయి న ప్రొఫెసర్ కేజే నాథ్ చాలినంతస్థాయిలో నీటి లభ్యత, అవసరాలు తీర్చకుండా స్వచ్ఛ భారత్ లక్ష్యం నెరవేరదని తేల్చిచెప్పారు. కాబట్టి కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడాలి. దీనికోసం పౌరసంఘాలు, పౌరసమాజంతో పాటు, స్వచ్ఛంద సంస్థలు, పాలనాయంత్రాంగ విభాగాలన్నీ కలిసి ఉమ్మడిగా పనిచేయాలి. గ్రామస్థాయి నుంచి పంచాయతీ ప్రతినిధులను కూ డా భాగస్వామ్యం చేసి స్వచ్ఛ భారత్ కోసం కదలా లి. అప్పుడే స్వచ్ఛ భారత్ కల సాకారమవుతుంది.

658

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Thu,November 21, 2013 02:17 AM

అంతరాల అభివృద్ధి ఎందుకు?

దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన

Published: Sat,October 6, 2012 03:21 PM

అక్రమ మైనింగ్ ఆగేదెన్నడు?

అక్రమ మైనింగ్ రాష్ట్రాలనే కాదు, కేంద్రాన్నీ కుదిపేస్తోంది. అక్రమ మైనింగ్ వార్తలు జాతీయ వార్తా పత్రికలలో సైతం పతాక శీర్షికలవుతున్నా

Published: Sat,October 6, 2012 03:22 PM

పోలియో చెబుతున్న పాఠాలు

భారత దేశం ఆరోగ్యరంగంలో ఓ మైలురాయిని దాటింది. పోలియో రహి త దేశంగా అవతరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా

Published: Sat,October 6, 2012 03:22 PM

ఆహార స్వచ్ఛత అంతా మిథ్యే!

చిట్ట చివరికి ప్రభుత్వం కదిలింది. ఆరోగ్య భద్రతకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. మానవుని ఆరోగ్యానికి మొదటి షరతుగా ఉన్న ఆహారమే కలుషి

Published: Sat,October 6, 2012 03:22 PM

మద్యం మత్తులో యువత..

ఒకప్పుడు అనైతికమనుకున్నది ఇప్పుడు నాగరికతకు చిహ్నమైపోయిం ది. చాటు మాటుగా ‘తాగే’ వ్యవహారం ఇప్పుడు బహిరంగ వేడుక అయ్యింది. కొన్నేళ్లు

Featured Articles