అంతరాల అభివృద్ధి ఎందుకు?


Thu,November 21, 2013 02:17 AM


దేశంలో ప్రజాస్వామ్యం పల్లకి మీద ఊరేగుతున్నది. రాబోయే సాధారణ ఎన్నికలకు రిహార్సల్‌గా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పార్టీలు, నేతలు తమను ఎన్నుకుని ప్రజాస్వామ్యానికి పట్టంగట్టాలని ప్రజలను కోరుతున్నారు. పేదలకోసం పనిచేస్తున్నది తామంటే,తామని పోటీపడుతున్నారు. పేదరికాన్ని రూపుమాపడంకోసమే పుట్టామన్నట్లుగా హామీల జాతర జోరుగా సాగుతున్నది.అయితే..అందరూ మరిచిపోయిన విషయం ఒకటుంది.యగామీణ భారతంలో పెరిగిపోతున్న ఆర్థిక అంతరాలు, పట్టణ ప్రాంతాల్లోనూ పేద, ధనిక వర్గాల మధ్య అగాథం రోజురోజుకూ పెరిగిపోతున్న తీరును ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈ వ్యత్యాసాలు సమాజానికి హానిచేస్తాయని గుర్తించడానికి నిరాకరిస్తున్నారు.మరోవైపు అభివృద్ధి గురించి అందరూ నెత్తిమీద నోరుపెట్టుకుని చెప్పుకొస్తున్నారు. ఏక కాలం లో అభివృద్ధి,ఆర్థిక అంతరాలు పెరగడం అనేది ఆరోగ్యకర సమాజానికి సూచిక ఎంతమావూతమూ కాదని అంటున్నారు. ఈ మధ్యనే ‘గ్లోబల్ వెల్త్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్’ రిపోర్టు ప్రపంచంలో వేగంగా కుబేరులైన వారి జాబితా ప్రకటించింది. ఈ రిపోర్టులో ప్రపంచంలో అతిఎక్కువగా అత్యంత సంపన్నులుగా మారినవారి సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ద్వితీయ స్థానంలో నిలిచింది.

వందకోట్ల సంపాదన ఉన్న కుబేరుల జాబితాలో భారతీయులు శరవేగంగా చేరిపోతున్నారు.సంప్రదాయక ఉత్పత్తి విధానంలో పెట్టుబడులు పెరగకుండా సంప్రదాయేతర రంగాల్లోపెట్టుబడులు పెరిగిపోతున్నాయని వివరించింది. స్విస్ బ్యాంకు విడుదల చేసిన ప్రపంచ ధనవంతుల జాబితా ప్రకారం కూడా దేశానికి అగ్రస్థానం దక్కింది. ప్రపంచంలోని మూడింట రెండొంతుల యువత నిరుద్యోగంలో మగ్గి కనీస జీవనోపాధికి కూడా నోచుకోవడం లేదు. కానీ 0.7 శాతంగా ఉన్న కొద్దిమంది ధనవంతుల చేతుల్లో ప్రపంచంలోని సంపద 41శాతం ఉన్నది.

ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగానూ, దేశంలోనూ ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. పేదలు మరింత నిరుపేదలుగా మారి ఆకలిచావులకు, బలవన్మరణాలకు బలవుతున్నా రు. అంతర్జాతీయ ఫుడ్‌పాలసీ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం దేశంలో 21కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. మొత్తం ప్రపంచంలో ఆకలితో నకనకలాడుతున్న వారి లో పావువంతు భారత్‌లోనే ఉన్నారు. పేదరికానికి, ఆకలి దారివూద్యానికి మూడింటిని సూచికలు తీసుకుంటారు. 1) పౌష్టికాహారం తీసుకుంటున్న వారి శాతం. 2) అయిదేళ్లలోపు పసి బాలలు తక్కువ బరువుతో ఉండటం. 3) అయిదేళ్లలోపు పిల్లలు చనిపోతున్న వారి సం ఖ్య. ఈ మూడింటిని పరిగణనలోకి తీసుకుని చూస్తే.. వీటన్నింటిలో ప్రపచంలో వెనకబడ్డ దేశాలుగా చెప్పుకుంటున్న దేశాల కన్నా చాలా వెనకబడి ఉన్నది. కటిక దారివూద్యంలో ఉన్నది.

ఈ పరిస్థితులన్నింటినీ చూస్తుంటే.. దేశంలో ఒక వైపు ధనవంతులు సకల సౌకర్యాలతో భోగాలు అనుభవిస్తుంటే, మరోవైపు మెజారిటీ ప్రజలు కనీసం కడుపు నింపుకోవడానికి చాలినంత లేక ఆకలితో నకనకలాడుతున్నారు. ఈ పరిస్థితి ప్రజల సామాజి క జీవన విధానంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. వ్యవసా యం, ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం లాంటి మౌలిక విషయాల్లో తీవ్రమైన అంతరం ఉంటున్నది. దీంతో మెజారిటీ ప్రజలు రోగాలు, అప్పులు, ఆకలి మంటల్లో నలిగిపోతున్నారు. దీంతో సంఘంలో తీవ్రమైన అశాంతి చోటుచేసుకుంటున్నది. నిజమైన అభివృద్ధి ఎలా ఉండాలనేది మహాత్మాగాంధీతో సహా ఎంతో సామాజిక శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. దీనికి ఐదు ప్రమాణాలు చెప్పారు. అభివృద్ధి అనేది ఎప్పుడైనా స్థానికతపై ఆధారపడాలి. స్వయం సమృద్ధి వైపు నడవాలి. అవసరాలను పునాదిగా చేసుకోవాలి. పర్యావరణానికి,పరిసరాలకు హాని తలపెట్టనిదై ఉండాలి.

అలాగే సమక్షిగాభివృద్ధి దిశలో అడుగులు వేస్తూ సమూలమార్పుకు తలుపులు తెరవాలి. ఈ ఐదు లక్షణాలతో సాగేదే నిజమైన అభివృద్ధి. ఈ దిశలో దేశం పురోగమించాలం ప్రజలు అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రభుత్వ యంత్రాంగంతోపాటు పౌరసమాజం పాత్ర కూడా ముఖ్యమైనది. దేశంలో సమృద్ధి గా ఉన్న మానవ వనరులను ఉపయోగించుకు ని సమక్షిగాభివృద్ధి సాధించవచ్చు. ప్రఖ్యాత న్యాయశాస్త్ర కోవిదుడు వీఆర్ కృష్ణయ్యర్ చెప్పినట్లు..‘ఒకవేళ నీవు నిజంగా గాంధీని విశ్వసిస్తే.. గ్రామం యూనిట్‌గా అభివృద్ధి కార్యక్షికమాలు చేపట్టాలి. గ్రామీణ పేదల వికాసమే నిజమైన భారతీయ వికాసం. 23 మంది కుబేరులు వెలిగిపోవడమే అభివృది ్ధకాదు. అక్రమమైన పారిక్షిశామికీకరణతో అవసరం లేని ఉత్పత్తులను పెంచి ప్రజలను నిరుపేదలుగా మార్చడం అభివృద్ధి కాదు.

-ధూర్జటి ముఖర్జీ
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్ )

483

DHURJATI MUKHARJI

Published: Sun,June 11, 2017 01:38 AM

ట్రంప్ తప్పుడు నిర్ణయం

కాలం గడిచే కొద్దీ కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నది. వాతావరణంలో కార్బన్ పెరిగే కొద్దీ భూగోళ ఉష్ణోగ్రత కూడా పెరుగుతూనే ఉంటుంది. దీని వల్

Published: Thu,May 11, 2017 11:45 PM

గ్రామీణ వికాసంతోనే సమగ్రాభివృద్ధి

ఇటీవలే ఐక్య రాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక-2016ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న భారతదేశం 131వ స్థానంలో

Published: Thu,November 3, 2016 01:19 AM

రోడ్డు మార్గాల అనుసంధానం

ఒక దేశం అభివృద్ధి చెందింది అనడానికి ఆ దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థే సంకేతం. రోడ్డు రవాణా వ్యవస్థ ఆధారంగానే నిర్మాణరంగం, రవాణా, పారి

Published: Fri,September 23, 2016 01:33 AM

ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలె

ప్రపంచబ్యాంకు ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సెరాగెల్డిన్ .. రాబోయే కాలంలో భూభాగాల కోసమో, చమురు కోసమో యుద్ధాలు జరుగవు, నీటి కోసమే యుద్ధా

Published: Wed,August 10, 2016 01:42 AM

అన్నిస్థాయిల్లోనూ కేంద్రీకృత పోకడలే

గాంధీజీ బోధించిన వికేంద్రీకరణను కాంగ్రెస్ పార్టీయే పట్టించుకోలేదు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టించుకుంటుందని ఆశించలేము. విక

Published: Thu,July 14, 2016 01:32 AM

పచ్చదనమే జగతికి ప్రాణం

అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న అడవికి ప్రత్యామ్నాయంగా మరోచోట అడవిని అభివృద్ధి చేసే విధానంతో ప్రస్తుత వాతావరణ అసమతుల్యత ప్

Published: Thu,April 28, 2016 12:57 AM

అభివృద్ధి మంత్రమే మతం

కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మతాల పట్ల తటస్థంగా వ్యవహరిస్తూ, అందరిని కలుపుకోవాలె. మతం పేరుతో అల్పమైన వివాదాలు సృష్టించడా

Published: Wed,August 26, 2015 01:46 AM

మాటలు చాలు చేతలు కావాలి

సరైన దిశలో సంక్షేమ కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోతే అనుకున్న ఫలితాలేవీ సాధించలేవు. సరిగ్గా మోదీ ఈ విషయాలపైనే ఆలోచించాలి. సరైన కార

Published: Sat,March 7, 2015 06:11 PM

నీటి సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి

రానున్న కాలాల్లో నీటి అవసరాలు ఇంకా తీవ్రం కానున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి నీటి లభ్యత ఎంతో అత్యవసరమైనది. దీనిపైనే ఆధారపడి పరిశ్ర

Published: Sat,January 3, 2015 01:44 AM

కార్యాచరణలేని స్వచ్ఛభారత్

కాలుష్య నివారణకు, నియంత్రణకు ప్రభుత్వ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య కారకాలను నిర్మూలించాలి. తద్వారా వాతావరణాన్ని, పర్యావ

Published: Wed,November 26, 2014 02:54 AM

ప్రైవేటీకరణ ప్రజాసంక్షేమానికి చేటు

ఈ మధ్య పరిణామాలు చూస్తే అవినీతి కుంభకోణాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ అవినీతిలో కూరుకుపోయాయ

Published: Thu,June 12, 2014 11:43 PM

హరిత విప్లవం-ఆహార భద్రత

ఆహారోత్పత్తులను పెంచడానికి దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. దీంతో దేశీయ ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయ ఉత్పత్తుల

Published: Fri,July 5, 2013 12:45 AM

నీటి సమస్య: ప్రభుత్వాల నిర్లక్ష్యం

నీటి వినియోగం, సంరక్షణ నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. అభివృద్ధి చెందుతున్న మనదేశంలో నైతే వాటర్ ‘మేనేజ్‌మెంట్’ అనేది అతి

Published: Sun,May 12, 2013 11:54 PM

లక్ష్యాన్ని సాధించని విద్యాహక్కు చట్టం

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ఈ మూడేళ్ల కాలంలో విద్యాహక్కు చట్టం అమలు, అది సాధించిన ఫలితాలు సంతృప్తికరం

Published: Sun,April 28, 2013 11:44 PM

నరకవూపాయమవుతున్న నగరీకరణ

అ భివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాలను ముంచెత్తుతున్న నగరీకరణ సమస్య భారత్‌ను కూడా పట్టి పీడిస్తున్నది. దేశంలో ఈ నగరీకరణ సమస్య మ

Published: Thu,April 11, 2013 11:33 PM

వృద్ధిబాటలో వెనుకబడిన రాష్ట్రాలు

ఈమధ్య ప్రధాని మొదలు ఆర్థికమంత్రి దాకా అందరూ అభివృద్ధి మం త్రం పఠించారు. తాము తీసుకున్న చర్యల కారణంగానే రెండంకెల వృద్ధిరేటు సాధిస

Published: Fri,April 5, 2013 12:22 AM

అభివృద్ధి అంకెలు-నిరుద్యోగ సూచికలు

ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనే

Published: Sat,February 16, 2013 05:40 PM

పన్నులు సమస్యలను తీరుస్తాయా?

కేం ద్ర ఆర్థిక మంత్రి చిట్ట చివరకు పిల్లి మెడలో గంట కట్టారు. తన మనసులో ని మాటను బయట పెట్టారు. దేశంలో నానాటికీ బడ్జెట్ వనరులు తగ్గు

Published: Thu,October 11, 2012 05:56 PM

ఆర్థిక అంతరాలకు అంతమెప్పుడు?

రాజకీయ పార్టీలు, నేతలు ప్రజలను మరిచి వాదోపవాదాల్లో తీరిక లేకుండా ఉన్నారు. కుంభకోణాల కోలాహలంలో మునిగిపోయారు. ఆరోపణలు, ప్రత్యారోపణలత

Published: Sat,October 6, 2012 03:19 PM

ఆర్సెనిక్ కాలుష్యం కాటు

ప్రపంచానికి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రకృతిలో సహజంగా ఉండే ‘ఆ్సనిక్’ మోతాదుకు మించి వాతావరణంలోకి, నీటిలోకి, ఆహారంలోకి చేరి మాన

Published: Sat,October 6, 2012 03:21 PM

అక్రమ మైనింగ్ ఆగేదెన్నడు?

అక్రమ మైనింగ్ రాష్ట్రాలనే కాదు, కేంద్రాన్నీ కుదిపేస్తోంది. అక్రమ మైనింగ్ వార్తలు జాతీయ వార్తా పత్రికలలో సైతం పతాక శీర్షికలవుతున్నా

Published: Sat,October 6, 2012 03:22 PM

పోలియో చెబుతున్న పాఠాలు

భారత దేశం ఆరోగ్యరంగంలో ఓ మైలురాయిని దాటింది. పోలియో రహి త దేశంగా అవతరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా

Published: Sat,October 6, 2012 03:22 PM

ఆహార స్వచ్ఛత అంతా మిథ్యే!

చిట్ట చివరికి ప్రభుత్వం కదిలింది. ఆరోగ్య భద్రతకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. మానవుని ఆరోగ్యానికి మొదటి షరతుగా ఉన్న ఆహారమే కలుషి

Published: Sat,October 6, 2012 03:22 PM

మద్యం మత్తులో యువత..

ఒకప్పుడు అనైతికమనుకున్నది ఇప్పుడు నాగరికతకు చిహ్నమైపోయిం ది. చాటు మాటుగా ‘తాగే’ వ్యవహారం ఇప్పుడు బహిరంగ వేడుక అయ్యింది. కొన్నేళ్లు