ఆర్థికాభివృద్ధి అధ్యయనాలన్నీ దేశాభివృద్ధి తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక.. ప్రకటించుకున్న లక్ష్యాల పట్ల అనేక అనుమానాలను వెలిబుచ్చుతున్నాయి. పాలకులు చెబుతున్న దాంట్లో ఏదీ పొంతనలేకుండా ఉన్న తీరును ప్రశ్నిస్తున్నాయి. అభివృద్ధి ప్రమాణాన్ని ఉద్యోగ కల్పనతో సరిపోల్చి చూసినప్పుడు పూర్తిగా భిన్నమైన ఫలితాలు కనిపిస్తున్నాయని పెదవి విరుస్తున్నాయి. ఉద్యోగ కల్పనల్నీ ఐటీ, సేవారంగాలు, ఇంకా ఇతర అనుత్పాదక రంగాల్లో ఉంటున్నాయి. వీటిని నిజమైన అభివృద్ధిలో భాగస్వామ్యంగా పరిగణించవచ్చునా?అన్నది ప్రశ్నార్ధకమేనని అంటున్నాయి. నిజమైన అర్థంలో మంచి ఉద్యోగం అంటే.. జరుగుతున్న అభివృద్ధిలో సంలీనం కావాలి. కానీ.. నేడు జరుగుతున్న ఉద్యోగ నియామకాలన్నీ..అనుత్పాదక, సేవారంగాల్లో ఉంటున్నాయి.అంతేగాక.. ప్రైవేటు, అసంఘటిత, చిన్న ఉత్పత్తి రంగాల్లో ఎలాంటి ఉద్యోగ భద్రతలేని, అతి తక్కువ వేతనాలతో ఉంటున్నాయి. ఇలాంటి ఉద్యోగ కల్పన కారణంగా జరుగుతున్న అభివృద్ధిని స్థిర అభివృద్ధిగా చెప్పడానికి వీలులేదని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే..గత కొంత కాలంగా వ్యవసాయ రంగం నుంచి గ్రామాలను వదిలి లక్షలాదిమంది వ్యవసాయ కూలీలు పట్టణాలకు వలసపోతున్నారు. గ్రామీ ణ ప్రాంతంలో వ్యవసాయరంగంలో 2004-05లో 57 శాతం మందికి ఉపాధి కల్పిస్తే, 2009-10 నాటికి 53 శాతానికి పడిపోయింది. కోటి యాభై లక్షలమంది వ్యవసాయ కూలీలు, గ్రామీణులు పట్టణాలకు తరలిపోయారు. మరోవైపు పట్టణాల్లో చిన్నా చితకా ఉత్పాదక సంస్థలు, ఫ్యాక్టరీలు 50 లక్షల మందికి మాత్రమే పనిని కల్పించగలిగాయి. ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్న సేవారంగం కూడా 35 లక్షలమందికి మించి ఉద్యోగాలను కల్పించలేక పోయిం ది. ఈవిధంగా గ్రామాల నుంచి పట్టణాలకు జనాభా తరలి వస్తున్నా.. నగరాల్లో ఉపాధి కల్పన లేకపోతే.. ఇది పెద్ద సమస్యగా మారే ప్రమాదమున్నది.ఇప్పటికే నగరాల్లో నిరుద్యోగులుగా కోటి డ్బ్భైలక్షల మంది ఉన్నారు. వీరందరికీ 2020 నాటికి ఉపాధి కల్పన లేకపో తే.. నగరాలు అనేక సమస్యలకు, అశాంతికి, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నెలవు అవుతాయి.
ఇదిలా ఉంటే దేశంలో చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. ఇదే ఇప్పుడు దేశంలో ప్రధాన సమస్య అయి కూర్చున్నది. ప్రభుత్వ అధ్యయనం ప్రకారమే.. అభివృద్ధిరేటు ఆరుశాతం కంటే తక్కువగా నమోదు అవుతున్నప్పుడు ఉద్యోగ కల్పన ఎండమావిగా మారే పరిస్థితి ఉన్నది. మిగతా అన్నిదేశాల్లో లాగే భారత్‌లోనూ అభివృద్ధి కుంటు పడి ఉద్యోగ కల్పనలో చాలా వెనుకబడి ఉన్నది. ఈ పరిస్థితి ఇలా గే ఉంటే..రానున్న రోజుల్లో నిరుద్యోగమే ప్రధాన సమస్య కానున్నది. గత ఏడాది ఐటీ సెక్టార్, ఆరోగ్య పరిరక్షణ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) రంగాల్లో 6-7 లక్షల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. ఇంకా మిగతా రంగాలైన యంత్రాలతో సంబంధం లేని ఉత్పత్తి, మీడియా, ఎంటర్టెన్మెంట్ రంగాల్లో కొన్ని ఉద్యోగాలు వచ్చినా.. నిరుద్యోగ శాతాన్ని తగ్గించలేకపోయాయి. ఐటీ రంగం సుమారు రెండు లక్షలు, విద్యారంగం 34,500 ఉద్యోగాలను కల్పించింది. ఇన్స్యూన్స్, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, హాస్పిటాలి టీ, ఐటీ-హార్డ్‌వేర్ రంగాలు 20 నుంచి 30 వేల ఉద్యోగాలు కల్పించాయి. ఏది ఏమైనా.పస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలు నిజ మై అయితే.. ఉద్యోగ కల్పనలో కొంత వృద్ధి ఉంటుందన్న ఆశలున్నాయి. ఐటీ, ఫార్మా రంగాలు ఇప్పుడున్న రీతిలో అభివృద్ధిబాటలో పయనిస్తే.. కొంతలో కొంత నిరుద్యోగ సమస్యను తీర్చవచ్చు. కానీ.. గత అనుభవాలు, అంతర్జాతీయ పరిస్థితులు పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆశలు ఆవిరయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం చాలా మందగమనంలో ఉన్న తరుణంలో ఈ రంగం నుంచి ఉద్యోగ కల్పనకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.
ఐటీ రంగంలోనూ నిపుణులను ఇదివరకు లాగా ఒకే రంగంలో గాకుండా అనేక రంగాల్లో ఐటీ కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయి. ఐటీ రంగ నిపుణులను సేల్స్రంగంలోనూ, వ్యాపారాభివృద్ధిలోనూ, హెచ్ఆర్ రంగంలోనూ సేవలను పొందుతున్నాయి. ఇదిలా ఉంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో కూడా.. రియల్ ఎస్టేట్ రంగంలో కదలికవచ్చి ఉద్యోగ కల్పనకు కొన్ని కొత్త దారులు పడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్‌డీఐలతో కనీసం 10 లక్షల ఉద్యోగాలైన వస్తాయని ఆశిస్తున్నారు. ఎఫ్ఎంసీజీ, రిటేల్, ఐటీ రంగాలు కొంత వృద్ధిబాటన పట్టి ఉద్యోగ కల్పనలో కొంత ఆశావహ ఫలితాలు ఉంటాయని అనుకుంటున్నా రు. ‘మై హైరింగ్ క్లబ్. కామ్’ చేసిన ఓ అధ్యయనం ప్రకారం ఎఫ్ఎంసీజీ రంగం లో లక్షా డ్బ్భై ఆరువేల ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. దీంతో పాటు ఆ అధ్యయనంలో హెల్త్ కేర్‌లో లక్షా 72వేల ఉద్యోగాలు, ఐటీ సెక్టార్లో లక్షా 69వేల ఉద్యోగాలు, హాస్పిటాలిటీ రంగంలో లక్షా ఆరువేల ఉద్యోగాలు, రిటేల్ రంగంలో లక్షా రెండువేల ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. అలాగే విద్యారంగంలో 84వేలు, ఫైనాన్షియల్ రంగంలో 73 వేలు, ఎంటర్టైన్మెంట్ రంగంలో 67వేలు, రియల్ ఎస్టేట్ రంగంలో 52వేల ఉద్యోగాలు రావడానికి అవకాశాలున్నాయని ఆ అధ్యయనం తెలిపింది. అలాగే పారిక్షిశామిక రంగాలు తమ లక్ష్యాలకనుగుణంగా ఉత్పత్తిని సాధించినప్పుడు ఉద్యోగుల జీత భత్యాల్లో 10-15 శాతం పెంచడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలిపింది. ఇవన్నీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు ఇంకా దిగజారకుండా మెరుగైన స్థితిలో ఉన్నప్పుడే సాధ్యమని కూడా తెలిపింది.
ఇదిలా ఉంటే.. వార్షిక పారిక్షిశామిక సర్వే ప్రకారం దేశంలో తమిళనాడు ఉద్యో గ కల్పనలో ప్రథమస్థానంలో నిలిచింది. తమిళనాడులో 15.4 శాతం ఉద్యోగాలను కల్పించింది. తరువాత స్థానాల్లో 13.4 శాతంతో మహారాష్ట్ర,10.3 శాతం తో ఆంధ్రవూపదేశ్, 10.1 శాతంతో గుజరాత్ ఉన్నాయి. అలాగే ఉద్యోగస్థులకు పరిహారం చెల్లించే విషయంలో మౌలిక లోహ సంబంధిత కంపెనీలు 11.2 శాతం చెల్లింపులు చేసి ప్రథమ స్థానంలో ఉన్నాయి. తరువాతి స్థానాల్లో మిషినరీ ఇక్విప్మెంట్ రంగం 8.3, మోటార్ వాహనాల ఫ్యాక్టరీల రంగం ఎనిమిది శాతం చెల్లిస్తున్నాయి. గమనించాల్సిన విషయమేమంటే.. చదువుకున్న వృత్తి నిపుణులకు డిమాండ్ బెంగళూరు, ముంబాయి, ఢిల్లీలో ఎక్కువగా ఉన్నది.తరువాతి స్థానాల్లో చెన్నై, పూనే ఉన్నా యి. ఈ స్థితి ఈ ఆర్థిక సంవత్సరమంతా ఇలాగే ఉండే అవకాశాలున్నాయి. ఉన్న ఉద్యోగ అవకాశాలన్నీ చిన్న, మధ్యతరహా కంపెనీల్లోనే ఉన్నా యి. భారతదేశానికి ముందున్న సవాలు ఏమంటే రానున్న రోజుల్లో వ్యవసాయరంగంలో ఉద్యోగ కల్పన (పని కల్పన) ఇంకా తక్కువ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గ్రామీణ ప్రాం తంలో 52 శాతానికి వ్యవసాయం ఉపాధి కల్పిస్తున్నది. ఇదింకా దిగజారి 42శాతానికి పడిపో యే పరిస్థితులు కనిపిస్తున్నాయియగామాలు, వ్యవసాయంలో ఉపాధి కల్పన క్రమంగా క్షీణించిపోతున్న తరుణంలో వ్యవసాయానికి బయట పారిక్షిశామిక రంగంలో ఉపాధి కల్పన అవకాశాలు మెరుగ్గా ఉండాలి. కానీ పారిక్షిశామిక రం గం పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉన్నది. దీంతో నిరుద్యోగం పెరిగి దారిద్య్రం ఆవరిస్తుం ది. గత కొంతకాలంగా పాలకులు అనుస రిస్తు న్న విధానాల్లో భాగంగా అనేక అంతర్జాతీయ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు వేలకోట్ల రూపాయల పెట్టుబడితో దేశంలో ప్రవేశించా యి. వీటికి కావలసిన మౌలిక వనరులను సమకూర్చే పేరిట ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలను మరిచి వాటికి సకలం సమకూర్చాయి. కంపెనీలు ఏర్పాటుకు కావలసిన భూమి, నీరు, విద్యుచ్చక్తి వంటి వనరులన్నింటినీ ఉచితంగా ఇచ్చి వాటికి ఊతం ఇస్తే.., వాటి వల్ల ఇక్కడి ప్రజలకు ప్రయోజనం అటుంచి కనీస ఉద్యోగాలను కడూ కల్పించలేక పోయాయి. ఎక్కడైనా.., ఏదేశంలో అయినా.. ఉత్పాదక తయారీరంగం, సేవారంగాలు సమపాళ్లలో పురోగతి సాధించినప్పుడే దేశం అభివృద్ధిబాటలో నడుస్తుంది. దీని కోసం పెద్దఎత్తున ప్రజల్లో, నిరుద్యోగుల్లో వృత్తి నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలి. విస్తారం గా ఉన్న మానవ వనరులను ఉపయోగించుకుని అవసరమైన వస్తూత్పత్తిని పెం చి, ప్రజల అవసరాలను తీర్చి ప్రజలను నిరుద్యోగంనుంచి దూరం చేయాలి. అప్పుడే దేశం నిజమైన అర్థంలో అభివృద్ధి బాటలో పయనిస్తుంది. సామాజిక శాంతి నెలకొంటుంది. ఆకలితో అలమటించే నిరుద్యోగ భారతం అభివృద్ధి బాట లో పయనిస్తున్నదని చెప్పడం అసంబద్ధం.
-ధూర్జటి ముఖర్జీ
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయెన్స్)