ఉద్యమ తీవ్రత కోసమే రాజీనామాలు


Sat,October 6, 2012 02:57 PM

తెలంగాణ ఉద్యమం ఎన్నో మలుపులు తీసుకుంటున్నది. జయశంకర్ మరణం స్ఫూర్తితో ఈ ఉద్యమానికి కొత్త దారి దొరికింది. ప్రజలు ఉవ్వెత్తున అలల్లాగా ఉద్యమ ఉధృతిలో ఎగుస్తున్నారు. కానీ ఉద్యమం వల్ల సమస్యలు పరిష్కారం కాకపోవటం, కేంద్రం దానిని సీరియస్‌గా తీసుకోకపోవటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఈ అసహనం వల్ల కొందరు ప్రజానాయకులకు ఇబ్బంది కలుగవచ్చును. కానీ నాయకులు ఈ అసహనానికి కారణమేమిటన్న దీర్ఘాలోచనలో పడ్డారు. అప్యాయతతో ఆదరించే ప్రజలు అసహనం వ్యక్తం చేయడం అసాధారణమైనది. అది కూడా జయశంకర్ మరణం సందర్భంలో జరిగింది. ఇందుకు కారణం పార్టీలకు ప్రజలకు మధ్య అగాధం ఏర్పడింది. ప్రజల ఆశయాలకనుగుణంగా నాయకత్వం మార్గదర్శకత్వం వహించటం లేదని ప్రజలు తబ్బిబ్బమవుతున్నారు.

దీన్ని ప్రజానాయకులు అర్థం చేసుకుని ఇంకా ఆలస్యం చేస్తే ఉద్యమం కొత్త స్వరూపం తీసుకోవచ్చుననే భయంతో తామే ముందుకు వచ్చి రాజీనామాలు చేస్తామన్నారు. ఉద్యమాల్లో ఏ చర్య తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. వారి బాటలోనే రాజీనామాలు చేస్తూ మిగతా ప్రజావూపతినిధులు నడిచారు. ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వచ్చింది. అన్ని పార్టీల వారు కూడా ఈ పరిస్థితుల్లో రాజీనామా చేయటమే సముచితమనుకున్నారు. ఇలా ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజా ఉద్యమాలకు స్పందించటం అపూర్వమైన విషయం. ఇన్ని రోజుల నుంచి ప్రజల ఆవేదనను ప్రజావూపతినిధులు ఎన్నో వేదికల మీది నుంచి చెబుతున్నారు. ప్రజల మొర వినండని విజ్ఞప్తి చేస్తున్నారు.

కానీ పాలకులు దీనిని ఒక సామాజిక సమస్యగా పరిష్కరించటానికి బదులుగా శాంతిభవూదతల సమస్యగా పరిగణించి కొత్తకొత్త ప్లాన్‌లు వేస్తున్నారు. హైదరాబాద్‌ను ఒక మిలటరీ క్యాంప్‌గా మార్చారు. విశ్వవిద్యాలయంలో ఒక్కొక్క విద్యార్థికి నలుగురైదుగురు పోలీసులను పెట్టారు. ఇది మొదటిసారి కాదు, గత సంవత్సరమున్నర కాలం నుంచి జరుగుతున్న పని. విశ్వవిద్యాలయం పోలీసు క్యాంప్‌గా మారిపోతున్నది. ప్రజాసమస్యలపైన విద్యార్థులు ఆందోళన చేస్తుంటే, ప్రజావూపతినిధులను కూడా రానివ్వకపోవటం అప్రజాస్వామికం. ప్రజావూపతినిధులను ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి రానివ్వకుండా చేశారు. విశ్వవిద్యాలయ గేట్ల ముందు ఇనుపకంచెల దగ్గర ప్రజావూపతినిధులను అరెస్టు చేశారు. అయినా పదేళ్లుగా తెలంగాణ ప్రజలు చేస్తున్న విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదు. సమస్యకు పరిష్కార మార్గం చూపకుండా కేంద్రం కప్పదాట్లు వేస్తూ వచ్చింది.

రకరకాల సాకులు చెప్పటం కేంద్రానికి ఒక సంప్రదాయంగా మారిం ది. ఢిల్లీకి వెళ్లి విన్నపాలు వినవపూనన్న కూడా అక్కడా తెలంగాణ నాయకులని ఈసడించుకుంటున్నారు. మొర ఆలకించని సమయంలో ప్రజావూపతినిధులు ఏం చేయాలి? తమ అశక్తతను వెళ్ళబుచ్చటం చేస్తున్నారు. ఆ అశక్తతను వెళ్ళబుచ్చటమే రాజీనామాలు. 100 మంది రాజీనామాలు చేసి సామూహిక నిరసన తెలపటమే కాదు, 48 గంటలు దీక్షకు కూడా దిగారు. కేంద్రం మాత్రం మౌనం వీడలేదు. ఇవాళ రాజీనామాలతో ఏమొస్తుందనుకోవటం అంటే పరిస్థితులు గమనించటానికి కూడా నిరాకరించటమే అవుతుంది. ఏ ఊరికి పోయినా రాజీనామా చేసిన వారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అది వారి వ్యక్తిత్వాన్ని చూసి కాదు. వారి నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజావూపతినిధి ఏం చేయలేకపోతే తన యజమాని అయిన ఓటరుకు రిపోర్టు చేస్తారు. దీని వెనుక ఎంత ప్రజాస్వామిక స్పిరిట్ ఉన్నదో తెలుస్తుంది.

రాజీనామాలతో సమస్య పరిష్కారమవుతుందని చేయలేదు. ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమానికి దీక్ష వహించటం కోసం రాజీనామాలు చేశారు. అనుకున్న ప్రకారం అందరూ ఒక వేదిక మీదికి రాకపోవచ్చును. కానీ వారి పరిధిలో వారు ప్రతివారొక కార్యక్షికమం తీసుకుంటున్నారు. ప్రతి కార్యక్షికమం ఉద్యమానికి కొంత ఊపునిస్తున్నది. రాజీనామాలు చేస్తే ఏమొస్తుందని చర్చించేందుకు ఇది సరైన సమయం కాదు. రాజీనామాలు చేసే దశ ఎందుకు వచ్చిందన్నదే ప్రశ్న? ఇక్కడ నుంచి వెనక్కా ముందుకా? ఎటువైపుకు అడుగులు వేయాలి? ప్రజల మనస్సులను గాయపరచకుండా కేంద్రం దిగి వచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలి.

ప్రజల మనోభావాలకు అండగా నిలబడటమే ప్రజా ప్రతినిధులు చేయవలసిన కర్తవ్యం.
ప్రతి కార్యక్షికమంతో లక్ష్యం ఊడిపడుతుందని అనుకోవటం సరికాదు. అది మాంత్రికులు మాత్రమే చేయగలుగుతారు. ప్రజా ఉద్యమంలో నాయకులు ఉద్యమాన్ని తీవ్రతరం చేయటానికై రకరకాల ఎత్తుగడలు వేస్తారు. ఏ ఎత్తుగడ కూడా వృథా కాదు. రాజీనామాలు ఆశించినది ఉద్యమ తీవ్రత మాత్రమే. అది సాధించబడింది. అందుకు అన్ని పార్టీలు కూడా అంకితమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం వచ్చిన పరిణామాన్ని గుర్తించి పరిష్కరిస్తుందని ఎదురుచూస్తున్నారు. కేంద్రం ఇకనైనా ఈ దాగుడు మూతల ఆట ఆపేస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. అది జరగకపోతే ప్రజావూపతినిధులు దీనికంటే పదునైన కార్యక్షికమం ఆలోచిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిన సమయాన్ని ఇస్తున్నారు. వెంటనే లక్ష్యసిద్ధి జరుగనంత వరకు భుజాలు దాయవల్సిన అవసరం లేదు. ఉద్యమంలో ప్రతి అడుగు మన సంకల్పంగా మారుతుంది. కార్యకర్తకు లక్ష్యసాధన ఎంత ప్రధానమో, ఉద్యమ పటిష్టత కూడా అంతే ప్రధానం. రాజీనామా ప్రజల ఆగ్రహానికి మరొక సంకేతం. దీనిని ప్రజాస్వామికంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం తన మిలటరీ పద్ధతులను వదలిపెట్టి నేరుగా సమస్యకు పరిష్కారం ఆలోచించటమే సరైన జవాబు.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

42

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Featured Articles