ఉపాధ్యాయ ఉద్యమ దివిటీ


Sat,October 6, 2012 02:51 PM

కొన్ని సంఘాలు, సంస్థలు కాల ప్రవాహంలో ఏటవాలుగా ప్రవహిస్తున్న నీళ్లలాగా వచ్చేవి కావు. ఏదో అవసరం కోసం ఏర్పడి ఆ పనుల అవసరం తీరాక అంతార్థానమయ్యేవి అంతకన్నా కాదు. కొన్ని సంఘాలను కాలమే తనివి తీరా కోరుకుని, అలాంటి సంఘాల ఆవిర్భావం కోసం ఎదురుచూస్తుంది. ఎస్టీయూ లాంటి ఉపాధ్యాయ సంఘం కోసం కాలం కోరుకుని, కాలమే ఎదురుచూసింది.
సంఘాలంటే నేడు అర్థం మారి ఉండవచ్చును. ప్రపంచీకరణలో ఈ వ్యాపారీకరణలో సంఘం కూడా తన రూపాల్ని, స్వరూప స్వభావాల్ని మార్చుకుంటున్నట్టు కనపడుతుంది. సంఘమంటే ఎంతో ఉన్నతమైంది. సంఘమంటే మనిషి ని సంస్కరించేది. సంఘం అంటే పైరవీలు చేసేది కాదు. అందునా ఉపాధ్యాయ సంఘమంటే మరీ విలువల కలబోతగా ఉండాలి. అటు తరగతి గదిని, ఇటు సమాజాన్ని ఈ రెంటిని సక్రమంగా నడిపించాల్సిన గురుతర బాధ్య త ఉపాధ్యాయ సంఘానికున్నది. అలాంటి చారివూతక కర్తవ్యా న్ని ఎస్టీయూ తన భుజం మీద వేసుకుంది. అందుకే ఎస్టీయూ ఆవిర్భావమే ఉన్నత విలువల పునాదిగా ఏర్పడింది. అలాంటి ఎస్టీయూకు నేతృత్వం వహించి ముందుకు నడిపించిన రథసారధులు కూడా ఎంతో ఉన్నత విలువలతో కూడినవారు. అందుకే నాడు ఎస్టీయూ ఉపాధ్యా య సంఘమంటే అన్ని రాజకీయపార్టీలు గౌరవించేవి. అసెంబ్లీ నుంచి సెక్ర వరకు అధికార పాలనా యంత్రాంగమంతా నాటి ఎస్టీయూకు గౌరవమిచ్చి, ఆ సంఘం ఇస్తున్న సలహాలను స్వీకరించేది. అదేవిధంగా నాటి సంబంధిత విద్యాశాఖామంవూతులు, విద్యాశాఖాధికారులు ఎస్టీయూ చేసే సూచనలను, సలహాలను స్వీకరించేవారు. ఉపాధ్యాయ సంఘం నేతలు వచ్చారంటే ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు.

తెలంగాణలోని పాత హైదరాబాద్ రాష్ట్రంలో స్కూళ్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. స్కూళ్ల వ్యవస్థ అంతా ఒకే యాజమాన్యం కింద ఉండడం వల్ల ఒక ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ ఆవిర్భవించేందుకు పునాది ఏర్పడింది. అప్పటికే స్వాతంత్య్ర ఉద్యమంలో కార్యకర్తలుగా పనిచేసిన అనేకమంది దేశభక్తులు 194లో ఉపాధ్యాయులుగా స్కూళ్లకు వచ్చారు. వీరందరి నేపథ్యం ప్రజా ఉద్యమం నుంచి వచ్చినవారే. అదేవిధంగా సామాజికమైన ఆలోచన, రాజకీయ నిబద్ధత కలిగినవారు. వీరందరికి ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేయడం ఎంతో ముఖ్యమైనదో సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావడం కూడా అంతే ముఖ్యంగా భావించారు. అలాంటి కార్యకర్తలతో రూపొందించబడిన సంఘం ఎస్టీయూ. పోలీస్ యాక్షన్ తర్వాత విద్యారంగంపై దాడి ఎక్కువైంది. ఇతర రాష్ట్రాల కన్నా హైదరాబాద్ రాష్ట్రంలో సర్వీస్ నిబంధనలు ఆకర్షణీయం గా ఉండడం వల్ల చాలామంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. నాడు వచ్చిన ఉపాధ్యాయుని లక్ష్యం వేరు. వారి ఆదర్శాలు వేరు. వారి ఆచరణ నేటికీ ఆచరణీయమైనది. నాటి ఉపాధ్యాయ నిబద్ధత ఉన్నతమైనది. అందుకే ఆ ఉపాధ్యాయుడు తరగతిగదిలో, సమాజంలో గౌరవింపబడేవారు. వీరు విద్యార్థుల అభిమానం పొందారు. అలాగే ప్రజా ఉద్యమం నుంచి వచ్చినవారు కావడంవల్ల పోరాట పటిమ కూడా అదేస్థాయిలో ఉండేది. అతను ఎంత గొప్పవాడైనా క్లాస్‌రూం దగ్గరికి వచ్చేవరకు ఉపాధ్యాయుడుగా బాధ్యతలను నిర్వర్తించేవారు. నాటి ఉపాధ్యాయ సంఘ నాయకులు ఏనాడు కూడా ప్రభుత్వాన్ని ప్రాధేయపడలేదు. ప్రభుత్వంతో లాలూచి అసలే పడలేదు. తమ డిమాండ్ల కోసం నిలిచిపోరాడారు. పైరవీలు అన్న పదం నాటి ఉపాధ్యాయ ఉద్యమంలో మచ్చుకైనా కనిపించేది కాదు. అలాగే రాజకీయ ఎత్తుగడలతో ఎప్పుడు వ్యవహరించలేదు. అలాంటి సంఘానికి శ్యాంసుందర్ అధ్యక్షులయ్యారంటే ఆయనెంత నిజాయితీ, నిబద్ధత కల వ్యక్తో అర్థమవుతుంది.

శ్యాంసుందర్ ఎస్టీయూ ఉద్యమంలో ఒక కార్యకర్త దశ నుంచి నాయకునిగా ఎదిగినవాడు. ఆయన అకస్మాత్తుగా రాత్రికి రాత్రి నాయకుడు కాలేదు. మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ తాలూకాలలో పనిచేశారు. జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించి కేంద్ర సంఘానికి అధ్యక్షులయ్యారు. అతను కార్యకర్త దశనుంచి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేది. అందుకే ఆయన ఉపాధ్యాయులకు ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడిగా నిలిచాడు. ఒక మంచి విద్యావేత్తగా రూపొందించబడ్డాడు. ప్రజల తరఫున మాట్లాడే ప్రజా ప్రతినిధిగా ఎదిగాడు. పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిడ్డి, ఉప్పల మలునూరు, భీంరెడ్డి నర్సింహాడ్డి లాంటి నేతలు తిరుగాడిన అసెంబ్లీలో శాసనమండలి సభ్యులుగా శ్యాంసుందర్ నిలిచారు. ఇలాంటి ఆ తరం నేతల వల్లనే అసెంబ్లీ, శాసనమండలికి కూడా వన్నె వచ్చింది. అందుకే నాడు శ్యాంసుందర్, కాళోజీ నారాయణరావు లాంటి సభ్యులు మాట్లాడుతుంటే శాసనమండలి ఆలోచించేది. ఇలాంటి వాళ్లు మాట్లాడుతుంటే అధికార పార్టీ, ప్రభుత్వం ఆలోచనలో పడేది. వారు చెప్పిన విషయాలను అమలు జరుపుతామనే పరిస్థితికి ప్రభు త్వం వచ్చేది. అంటే ఆ నాయకుల్లో ఉన్న నిజాయితీ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చుపభుత్వం సంఘాల ఐక్యతను కాపాడే బదులు తాను అనుకున్న పాలసీలను బలవంతంగా అమలు పరుస్తున్నది. ఉపాధ్యాయుల మధ్య అనైక్యత విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.
శ్యాంసుందర్ ఉపాధ్యాయుల హక్కులు కాపాడిన వ్యక్తి. చనిపోయిన వారి స్మృతులు, జ్ఞాపకాలు, అనుభవాలను బతికించుకోవాలి. వారు ఏ ఆశయం కోసం జీవించారో వాటిని నెరవేర్చే పని చేపట్టినప్పుడు మాత్రమే వారికి నిజమైన శ్రద్ధాంజలి.

వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలో పుట్టిన శ్యాంసుందర్ ఎంత యూనియనిస్టో, ఆయన అంత గొప్ప సోషలిస్టు. ఆయనకు ఎంత సామాజిక దృక్పథం ఉందో.. ఆయన అంతగా తన నేలను ప్రేమించాడు. ప్రపంచాన్ని ప్రేమించే ముందు తన నేలను ప్రేమించాలని చెప్పాడు. ఆయన చివరికి తన ప్రాంతాన్ని కూడా అంతే ప్రేమించాడు. తన ప్రాంతానికి జరిగిన అన్యాయా న్ని ఎదిరించాడు. అన్ని మీటింగ్‌లలో యువతరానికి కొత్త స్ఫూర్తి ఇచ్చేవారు. ఉపాధ్యాయ ఉద్యమం, ‘పే’ కమిషన్ అన్యాయాలను ఎంతో ఉద్రేకం, ఉద్వేగంగా మాట్లాడేవారు. ప్రపంచ విద్యా వేదిక మీద గంభీరంగా గర్జించారు. ప్రపంచ ఉపాధ్యాయ సమాఖ్య కు అధ్యక్షుడు అయ్యాడు. పుట్టిం ది మహబూబ్‌నగరే అయినా ప్రపంచ ఉపాధ్యాయ ఉద్యమ వేదికపై గర్జించారు. ఆయన చనిపోయే వరకు ఉపాధ్యాయుడుగా జీవించారు. ఒక ఆత్మీయుని స్మరించుకున్నప్పుడు ఎన్నెన్నో జీవకణాలు తెరుచుకుంటాయి. సంతోషం, జీవితం, పోరా టం అవమానాలు అన్ని చుక్కలు చుక్కలుగా ఆకుపై పడినట్టు అవన్నీ నా మనోఫలకంపై తిరుగుతున్నాయి. నాకు శ్యాంసుందర్‌కు ఉన్న బాంధవ్యం విడదీయరానిది. చాలా కాలం కలిసి పనిచేశాం కాబట్టి మేము ఒక సంస్థగా మారాం. కొందరు పుట్టుకతో అన్నదమ్ములు ఈ నేలమీద ఎగిసిన పోరాటాలల్లోనే మేము ఇద్దరం ఆత్మీయ అన్నదమ్ములమయ్యాం. అందుకే ఒక సోదరుని కోల్పోయిన బాధ నన్ను కలచివేస్తున్నది. ఆయన స్ఫూర్తితో ఉపాధ్యాయ ఉద్యమాన్ని బలోపేతం చేయడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర