ఆ మెట్లు ఆలోచనల ఆకురాళ్లు


Sat,October 6, 2012 02:53 PM

ఆర్ట్స్ కళాశాల మెట్లకు గొప్ప చరిత్ర ఉంది. ఆ మెట్లపై నడుచుకుంటూ ప్రగతిశీల భావాలతో పిడికిళ్లు బిగించిన విద్యార్థులు ఏ రంగంలోనైనా తమ ప్రతిభ ను చాటారు. ఆ మెట్లపై నుంచి వచ్చిన విద్యార్థులు గొప్ప పరిశోధకులయ్యారు. ఉన్నతాధికారులయ్యారు. సామాజిక మార్పు కోసం తెగువ చూపించి దండకారణ్యంగా మారారు.

C.RAMAIAH-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaవిద్యార్థులు నవ చైతన్యమూర్తులు. వీళ్ల చేతులమీంచే కొత్త సమాజాలు ఆవిష్కృతమవుతాయి. వీళ్ల ఆలోచనలు పొదిగి కొత్తభావజాలా ల సృష్టికి నిర్మాతలౌతారు. వీళ్లు కళ్లముందు జరిగే అన్యాయాల్ని క్షమించలేనివాళ్ల్లు. వెనకా ముందు చూసుకోకుండా అన్యాయాన్ని ప్రతిఘటించటానికి ముందుకు దూకే జలపాతాలు వీళ్లు. ఏ పదవులు ఆశిం చో, ఏ ఎత్తుగడలతోనో వీళ్లు ఉద్యమాలను నిర్మించరు. వాళ్లు స్వచ్ఛందంగా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ముందుకు సాగే మహా ప్రస్థానాలు. వాళ్ల ఉరవళ్లు పరవళ్లు తొక్కే అడుగులతోనే ఏ ఉద్యమాలైనా ఫలిస్తాయి.

స్వేచ్ఛకు తమ గొంతునిచ్చి నిలబెడతాయి. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో విద్యార్థుల పగిలిన కంఠాలే ఉద్యమానికి ప్రాణం పోస్తున్నాయి. అలాంటి మహత్తర శక్తి సామర్థ్యాలున్న, తెగువ చూపే ధైర్యమున్న, ఆలోచనల దివిటీలైన వాళ్లు ఏ రాజకీయపార్టీల నేతలో, మరెవరో చెపితే వినరు. తమ తెలంగాణ అస్తిత్వ ఉద్యమం విజయం సాధించాలని ముందుకు సాగుతున్న నేటి హీరోలు వాళ్లు. విద్యార్థులు అక్షరాలా చరిత్ర నిర్మాతలు. వాళ్లు లేకుండా ఏ చరిత్ర పురుడుపోసుకోదు.
విద్యార్థులను ఉద్యమంలోకి లాగుతున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు. ‘లాగటం’ అన్న పదం ఉపయోగించటం అంటే అది విద్యార్థులను అవమానించటమే అవుతుంది.

లాగుతున్నారంటే లాగబడే వాడంటే ఆలోచనలేనివాడని, లాగేవాడు బలవంతుడని అర్థం వస్తుంది. ఈ రెండూ సత్యం కాదు. విశ్వవిద్యాలయ విద్యార్థులు 19 సంవత్సరాలు చదివి డిగ్రీ పూర్తిచేసివచ్చి పోస్టుక్షిగాడ్యూయేషన్, పీహెచ్‌డీ లు చదువుతున్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్వేగాలతో కాకుండా సామాజిక సమస్యలపైన స్పందించటం ప్రతి దేశంలో, ప్రతి విశ్వవిద్యాలయంలో జరిగే పనే. మనం విద్యార్థికి ఒక పాఠం చెబితే అది రాయోరప్పకో చెప్పేది కాదు. మన మాదిరిగానే ఆలోచనా శక్తి వున్న వాళ్లు విద్యార్థులు. తమ ఆలోచనలను నిరంతరం సమాజం కోసం అంకితం చేసే సజీవ నదిలాంటి వారు. పుస్తకాల్లో విషయాన్ని కానీ, ఉపాధ్యాయుడు చెప్పే ఉపన్యాసాన్ని కానీ లేదా పత్రికల్లో వస్తున్న వార్తలను కానీ విద్యార్థులు వాస్తవ పరిస్థితులతో పోల్చుకుంటారు. దానిపైన ఆ విద్యార్థిలో చర్య జరుగుతుంది. ఆ సృజనశీలత వారిలో కదలిక తెస్తుంది.

నేడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న నిరసన వ్రతాలు ఎవరో చెప్పటం వల్ల కాదు. విద్యార్థుల సామాజిక స్పృహ చిహ్నాలవి. పేద దేశాల్లో విద్యార్థులకు రెండు బాధ్యతలుంటాయి. ఒకటి తన కెరియర్‌ను అభివృద్ధి చేసుకోవటం, రాబోయే సమాజానికి కావల్సినటువంటి నైపుణ్యాన్ని సంపాదించుకోవటం చేస్తారు. ప్రస్తుతం తను ఉన్న సమాజంపైన జరుగుతున్న దాడిని, అన్యాయాన్ని అక్రమాలను అర్థం చేసుకుని ఆ ఉద్యమంలో భాగస్వామి అవుతారు. ఇది తమ బాధ్యతగా విద్యార్థి ప్రవర్తిస్తాడు. తన కర్తవ్యంగా కదనరంగంలోకి దూకుతాడు. ఇలాంటి దృశ్యాలను మనదేశంలోనే కాదు ప్రపంచంలోని ఏ విశ్వవిద్యాలయంలోనైనా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నది. విశ్వవిద్యాలయాల విద్యార్థుల సృజనశీల చరిత్ర ఆయా సామాజిక కాలాలను నిర్దేశిస్తుంది.

ఎన్నో సామాజిక ఉద్యమాలకు బీజాలు పడింది విశ్వవిద్యాలయాల్లోనే. ఆ వయసులో నిష్కల్మషమైనటువంటి అంకిత స్వభావం ఉంటుంది. కాబట్టి తను నమ్మిన విషయాన్ని ఆచరిస్తారు. ఈ పనిని ఏదో ఆశించి మాత్రం కాదు. తనకు చదువువల్ల వచ్చిన చైతన్యాన్ని కార్యరూపంలో చూపిస్తారు. ఆ విద్యార్థులే నిజమైన జీవితంలో కూడా ఎక్కువ రాణిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన రాజ్యాంగవేత్తలు 19 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించారు.

ఆ వయస్సులోనే విద్యార్థులను ప్రజాస్వామిక వ్యవస్థలో భాగస్వాముల్ని చేశారు. ఓటు హక్కు అంటే కేవలం ఎన్నుకునే అధికారమే కాదు. ప్రజా సమస్యలపైన స్పష్టమైన అభివూపాయాల్ని కలిగించుకోవటం, ఆ అభివూపాయాలను కార్యరూపంలో తీర్చుకోవటానికై సమీక్షించుకోవటం, సమీకృతం చేసుకోవటం చేస్తారు. తాను ఒప్పుకోవాలి. సమాజాల్ని ఒప్పించాలి. దానికి అనుగుణంగా పోరాడాలి. ఆ పోరాటంలో ప్రజా పోరాటానికి ప్రాంగణంగా మారుతుంది. అది ప్రజాపోరాటాల పాయగా మారుతుంది. అందుకే విశ్వవిద్యాలయాలు జడత్వం గల సంస్థలు కావు. ఒక ప్రో యాక్టివ్ సంస్థలు. అదే మాదిరిగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నిరసన పత్రాలతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థి ఉద్యమాలకు, రాజకీయ పార్టీ ఉద్యమాలకు తేడా ఉంది. రాజకీయ ఉద్యమాలలో అధికార ప్రాబల్యం సంపాదించుకోవటానికైనా లేదా అధికారం చేజిక్కించుకునే ప్రయత్నం ఉంటుంది. విద్యార్థికి మాత్రం ఈ రాజకీయ లాభాలను ఆశించకుండా సామాజిక విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చుతాడు. ఎవరో చెప్పితే ఎవరి భ్రమలకో లోబడి ఉద్యమాలు చేస్తారని అనుకోవడం సరైన అవగాహన కాదు. కెరియర్ నిర్మించుకోవటం అవసరమే, కెరియర్ అంటే కేవలం పుస్తకాల సమాచారం కంఠస్థం చేయటం కాదు. పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవటమే కాదు, రాబోయే బాధ్యతలకు సిద్ధం కావటం. విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థుల్లో సామాజిక చింతన ఉంటుంది. ప్రతి సమాజం యువత నుంచి సామాజిక బాధ్యతను ఆశిస్తుంది. అది ముందు జీవితానికి ప్రిపరేటరీ గ్రౌండ్‌గా పనికి వస్తుంది.

ఇలాంటి సామాజిక బాధ్యతలు తెలిసిన వ్యక్తి సామాజిక సమస్యలపై రీసెర్చ్ చేస్తాడు. సమాజాన్ని విశ్వవిద్యాలయాన్ని ఈ రెండింటిని సమన్వయం చేసేవాడే సామాజిక స్పృహ ఉన్న విద్యార్థి. వాళ్లే నేటి సమాజపు హీరోలు. అన్యాయాన్ని తెగనరికే ఆయుధాలు వాళ్లే. అక్రమాలపై తిరగబడే సివంగులు వాళ్లే. అందుకే నాటి వందేమాతరం ఉద్యమం నుంచి నేటి తెలంగాణ అస్తిత్వ ఉద్యమం వరకు విద్యార్థులు ఎన్నో త్యాగాలు చేశారు. తమ తెగువను చూపారు. ఆర్ట్స్ కళాశాల మెట్లకు గొప్ప చరిత్ర ఉంది. ఆ మెట్లపై నడుచుకుంటూ ప్రగతిశీల భావాలతో పిడికిళ్లు బిగించిన విద్యార్థులు ఏ రంగంలోనైనా తమ ప్రతిభ ను చాటారు. ఆ మెట్లపై నుంచి వచ్చి న విద్యార్థులు గొప్ప పరిశోధకులయ్యారు. ఉన్నతాధికారులయ్యారు. సామాజిక మార్పు కోసం తెగువ చూపించి దండకారణ్యంగా మారా రు. ఎందరో విద్యార్థులు ఎన్‌కౌంటర్ల ను గేలిచేస్తే తమ ప్రాణాలను బలి ఇచ్చారు. ఎందరో విద్యార్థులు ఈ మెట్లపై నుంచే కొత్త సమాజ నిర్మాణాలకు పునాదులు వేశారు. అలాంటి విద్యార్థి శక్తిని ఎవరూ ఆపలేరు.

కాలేజీ విద్యార్థుల నేపథ్యం ఒకసారి పరిశీలిస్తే వాళ్లు సంపన్నవర్గాల నుంచి మాత్రమే వచ్చిన వాళ్లు కాదు. ఆకలి, పేదరికం, కన్నీళ్లు, కష్టాల కోనల మీంచి నడిచి వచ్చిన దళిత, గిరిజన, బహుజన మైనార్టీ సబ్బండ వర్ణాల నుంచి వచ్చిన మోదుగుపూల లాంటి పిల్లలు వాళ్లు. కష్టాలు అనుభవించిన వాళ్లకే అన్యాయాలను ప్రశ్నించే ధైర్యం ఉంటుంది. తెలంగాణ పల్లెల్లో ఎన్నో బానిస బంధనాలను తెంచుకుని వచ్చిన విద్యార్థులు ఎంతో శక్తిమంతులున్నారు. నిత్య నిర్బంధంలో వెన్నెల చూడని తెలంగాణ పల్లెల నుంచి వచ్చిన విద్యార్థులు వాళ్లు. అందువల్లనే వాళ్లు కండగల గుండె ధైర్యంతో ఏటికి ఎదరీదుతున్నారు. విద్యార్థి ఉద్యమాలే ప్రజా ఉద్యమాలకు కొత్తనీరును తీసుకువస్తుంది. తేటతెల్లంగా విశ్వవిద్యాలయాలు ఉంటాయి. విశ్వవిద్యాలయాలను సమాజం నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తే అవి ద్వీపాలుగా మారిపోతాయి.
అవి సమాజంలో లీనమైపోతేనే ప్రజలు వాటిని తమ సొంతం చేసుకుంటారు.

అప్పుడే కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది. విద్య అంటే ఎక్స్‌వూపెస్ రైలు కాదు. అది ప్రతి స్టేషన్‌లో ఆగే జ్ఞాన బండి అది. అప్పు డే చదువు ప్రజాస్వామికీకరణ చెందుతుంది. నేడు ఉన్నత విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఒక సవాల్ ప్రజాస్వామికీకరణ.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ

Published: Wed,January 1, 2014 12:52 AM

అన్నివర్గాలు శిరసెత్తుకోవాలంటే...

ఇతర దేశాల పాలకులకు, మన పాలకులకు ఉన్న తేడా ఏమిటి? మన వాళ్లు ఎన్నికలకు ముందే సంక్షేమ కార్యవూకమాల ప్రకటనలు చేస్తారు. పాలకులు సంక్షేమ

Published: Thu,October 17, 2013 12:29 AM

ఇది శ్రమజీవుల సంస్కృతి

దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏడాది బం డారు దత్తావూతేయ నిర్వహించే ‘అలయ్ బలయ్’కి వెళ్లాను. ఈ అలయ్ బలయ్ అన్న పదం నేటి కొత్త తరానికి చాల

Published: Fri,September 27, 2013 12:27 AM

మనకు తెలియని మన సంస్కృతి

కొత్తగూడెం వెళ్లినప్పుడు సింగరేణి కార్మికుడు నన్ను బొగ్గుబావిలోకి తీసికెళ్లాడు.అప్పుడు నాకు ఆ బొగ్గుగని కార్మికుల జీవితం అర్థమైంది

Published: Thu,September 12, 2013 01:03 AM

కాళోజీ స్ఫూర్తిని పంచుదాం

వరంగల్‌లో 9వ తేదీన 5 గంటలకు కాళోజీ శతజయంతి సభ ప్రారంభమైంది. ఉపన్యాసకుల మాటలు, సభికుల చప్పట్లతో రెండు గంటలు కాళోజీకి నివాళులు అర్పి

Published: Wed,September 4, 2013 11:01 PM

యూటీ వాదన వెనుక..

హైద్రాబాద్‌ను యూనియన్ టెరిటరీ చేయాలని అడగటానికి కారణం ఏమిటి? విద్యా, వైద్య అవకాశాలు హైద్రాబాద్‌లోనే ఉన్నాయని, అవి అందరికీ అందుబా

Published: Mon,August 26, 2013 12:02 AM

ఆలోచనల కూడలి

జనంలో ఉంటేనే, వాకింగ్ చేస్తేనే ఆలోచనలు పుడతాయి. వాకింగ్ చేయని రోజు ఏదో కోల్పోయినట్లుంటుంది.అమెరికా,చైనా, సింగపూర్, నార్వే ఎక్కడకు

Published: Sat,August 17, 2013 02:05 AM

అభివృద్ధికి ముగ్గులు పోద్దాంరండి

సాయుధ పోరాట కాలంలో భూస్వాములు తెలంగాణలో ఉండే ప్రజలను రకరకాలుగా హింసించారు. అందుకే భూములు దున్నిన వారు ఇక్కడ భూమికి యజమాని కాలేకపోయ

Published: Fri,August 2, 2013 01:11 AM

అక్షరాల పొదుగు

చరివూతకు మొదటి ముసాయిదా పత్రికలే. ‘జర్నలిజం యీ జ్ ఫస్ట్ డ్రాప్ట్ ఆఫ్ ది హిస్టరీ’ అన్నారు. పత్రికలకున్న గొప్పతనమది. పత్రికలు కేవల

Published: Fri,June 7, 2013 11:58 PM

పెరిగిన పని గంటలు

కాలిఫోర్నియాలో సిలికానాంవూధవాసులు నన్ను ఒక సమావేశానికి పిలిచారు. ఆ సభకు నేను, మంత్రులు పితాని సత్యనారాయ ణ, పొన్నాల లక్షయ్య హాజరయ

Published: Fri,May 31, 2013 09:57 PM

గ్లోబల్ కల్చర్ అంటే?

ఒక సమాజంలో వున్నప్పుడు ఆ సమాజం గొప్పతనం కనిపించదు. ఆ సమాజం నుంచి బైటకు వచ్చి ఇతర సమాజాలను చూసినప్పుడు మన సమాజం విశిష్టత తెలిసి వ

Published: Thu,May 9, 2013 11:59 PM

పీవీ విగ్రహం మాటేమిటి?

పీవీ నరసింహారావు చరివూతలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించిన విశిష్ట వ్యక్తి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజావూపతినిధి

Published: Wed,May 8, 2013 10:04 AM

నిలు పోరాట రూపం

ప్రతిమనిషికి ఒకేతల్లి. కానీ తీర్చిదిద్దేది ఆ మనిషిని వేయిమంది కాదు. మా బి.ఎన్. తీర్చిదిద్దింది లక్షలాదిమందిని. భీమిడ్డి నర్సింహాడ్

Published: Tue,April 23, 2013 12:01 AM

స్థానిక వనరులపై స్థానికత ముద్రలు

స్థానిక వనరులపై స్థానికులే హక్కుండాలి. బొగ్గు, ఇను ము జాతీయ సంపదలైనప్పటికీ ఆ సంపదను తరతరాలుగా కాపాడుతున్న ఆ మట్టిమీద మనుషులకు కూ

Published: Thu,April 18, 2013 12:17 AM

‘ఆర్థిక’తోపాటు ‘సాంస్కృతిక’ పోరు

ఒక వయసులో పిల్లలు తల్లిదంవూడులు చెప్పినట్లుగా చదువు కోసం చదువుతారు. ఒక వయసులో ఉద్యోగం కోసం చదువుతారు. కొందరు సమకాలీన సమా జం కోసం చ

Published: Sat,April 13, 2013 01:47 AM

తెగని జ్ఞాపకాల సంకెళ్లు

కాలచక్రం చాలా వేగంగా తిరుగుతున్నది. నా శరీరంలో సగం, నా జీవిత భాగస్వామి లక్ష్మీభాయి చనిపోయి ఇప్పటికి రెండేళ్లు గడిచిపోయింది. మూడవ

Published: Thu,March 14, 2013 01:33 AM

ఇదీ భావి తెలంగాణ!

ప్రతి సంవత్సరం స్కూల్స్ వార్షికోత్సవాలు చేసుకుంటాయి. అది మార్కెట్ కోసమా? వినోదం కోసమా? లేక విద్యా ప్రమాణాలు పెంచటానికా? పిల్లల్లో

Published: Wed,December 12, 2012 10:37 PM

ఏదీ నా తెలంగాణ చరిత్ర

నా దేశంలో సివిరామన్, బోస్, రామానుజమ్ లాంటి పరిశోధకులు జనించినా ఎందుకు ఇక్కడ పరిశోధన ఇంత అందఃపాతాళంలోకి వెళ్లిందనే ఆలోచన ఉండ టం తప్

Published: Thu,November 15, 2012 12:19 AM

అనితర సాధ్యం కాళోజీ మార్గం

‘ఒక ప్రధానిగా ఎన్నో ఒడిదొడుకుల్ని సునాయసంగా ఎదుర్కొన్నాను. ఎన్ని సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాను. ప్రపంచాధినేతలను చూసి కూడా కించ

Published: Sun,October 21, 2012 03:10 AM

విలువల సంపద విఠల్‌డ్డి

తరాలు గడిచిపోతున్నాయి. తరాలతోపాటుగా విలువలు కూడా కనుమరుగవుతున్నాయి. గత తరం అందించిన త్యాగాలు, విలువలతో కొత్త తరాలు వికసిస్తాయి. గత

Published: Wed,October 10, 2012 05:26 PM

ఉద్యమం: ముందడుగు, వెనుకడుగు

ఈ మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాకింగ్ చేస్తుంటే కొం దరు విద్యార్థులు నన్ను కలిసి ‘తెలంగాణ ఇంకెప్పుడొస్తుంది సార్. మంది బలిదానా

Published: Sat,October 6, 2012 02:48 PM

చరిత్రగతి మార్చిన అధ్యాపకులు

మనదేశం భినత్వంలో ఏకత్వానికి ఎంత ప్రతీకనో, వైవిధ్యాలకు కూడ అంతే ప్రతీక. ఒక్కొక్క ప్రదేశం ప్రజల త్యాగాలతో పునీతమైన ప్రాంతాలుగా వాసిక

Published: Sat,October 6, 2012 02:49 PM

నడక నాకు పాఠం

ఏవూరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వాకింగ్ చేయటం దినచర్యలో భాగం. ఏది మరిచినా వాకింగ్‌ను విడవను. ఇది శరీరం ఆరోగ్యం కోసమే కాదు. నా ఆలోచనల

Published: Sat,October 6, 2012 02:50 PM

సామాజిక దృక్పథం లోపిస్తే ప్రమాదమే?

అందరూ ఆలోచిస్తారు. కొందరు ఏ విషయమైనా ఆలోచిస్తారు. కొందరికి ఆలోచన రాకపోతే ఇతరులు చేసిన సలహాలను, పనులను స్వీకరిస్తారు. కొద్దిమంది మ

Published: Sat,October 6, 2012 02:50 PM

ఎంసెట్ లక్ష్యం ఏమిటీ?

ఇంటర్మీడియట్ ఇంఫ్రూవ్‌మెంట్ ఎగ్జామ్స్ గురించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ‘ఇంప్రూవ్‌మెంట్’ ఫలితాలు ఎప్పుడు వెలువడతాయి

Published: Sat,October 6, 2012 02:51 PM

ఉపాధ్యాయ ఉద్యమ దివిటీ

కొన్ని సంఘాలు, సంస్థలు కాల ప్రవాహంలో ఏటవాలుగా ప్రవహిస్తున్న నీళ్లలాగా వచ్చేవి కావు. ఏదో అవసరం కోసం ఏర్పడి ఆ పనుల అవసరం తీరాక అంతార

Published: Sat,October 6, 2012 02:51 PM

ఏదీ ఆ దేవరుప్పల చైతన్యం..?

ఈ మధ్య వారం రోజులు వాకింగ్‌కు పోలేదు. ఉస్మానియా క్యాంపస్‌లో వాకింగ్‌లో రోజు కలిసే మిత్రులు పలకరించారు. వారం రోజులుగా మీరు కన్పించక

Published: Sat,October 6, 2012 02:52 PM

ఆదివాసీల సందుక మేడారం మ్యూజియం

మేడారంలో జరుగుతున్నది ఒక జాతర కాదు. ఒక వినోద కార్యక్షికమం అంతకన్నా కాదు. సాహసానికి ప్రతీకగా నిలిచిన నేల అది. ఆధిపత్యంపై ఆదివాసీల

Published: Sat,October 6, 2012 02:52 PM

ముమ్మాటికీ సామాజిక ఉద్యమమే

ఉద్యమం పదునెక్కుతున్నప్పుడల్లా ఆ నేల దద్దరిల్లుతుంది. చివరకు ఆ వృక్షం వేర్లు కూడా బయటకొస్తాయి. అదే తెలంగాణలో జరుగుతున్నది. ఇది ఒ

Published: Sat,October 6, 2012 02:53 PM

మార్కెట్ వ్యవస్థ తెచ్చిన మార్పు

వరంగల్ రోడ్లపైన మట్టిలో నా కాళ్లు పునీతమయ్యాయి. చదువుకునే రోజుల్లో 65 ఏళ్ల క్రితం వరంగల్ నుంచి హన్మకొండ వరకు నడిచి పోయేవాణ్ణి. ఈన

Published: Sat,October 6, 2012 03:08 PM

పల్లెను పార్లమెంటును కలిపిన రైలు

నేను మా మిత్రుడు జూలూరి గౌరీశంకర్ ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి హన్మకొండ దాకా వెళ్ళాం. దారిపొడుగుతా జనం ఉన్నార

Published: Sat,October 6, 2012 03:08 PM

ప్రజాస్వామ్యమే పరిశోధన

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంలో ఇటీవల నల్గొండ జిల్లాలో జనం తో కలిసి తిరిగాను. ఉద్యమాలు ఏదో ఒక నేపథ్యంలో సామాజిక కోణం నుంచి పు

Published: Sat,October 6, 2012 03:07 PM

ఐక్యదేమన ఆయుధం

మా తెలంగాణ సాయుధ పోరాటానికి నేడు నడుస్తున్న మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారూప్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఆ పోరాట కాలంలో మా ఊరి దొర ద

Published: Sat,October 6, 2012 03:07 PM

బోరుమంటున్న భాగ్యనగరం

బెంగుళూరుకు వెళ్తుంటే నా పక్క సీట్లో ఉన్న ఒక ప్రయాణికునితో సంభాషణ మొదలైంది. తాను బెంగుళూరులో ఉంటానని, కానీ ‘మాది పాత హైదరాబాద్ రాష

Published: Sat,October 6, 2012 03:07 PM

ప్రశ్నలకు బహుమానం చిత్రహింసలా?

ఈనాటి చదువు స్వరూప స్వభావమే రాబోయే 30 ఏళ్ల కాలాన్ని, భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తెలంగాణలో చాలా కాలం వరకు పాఠశాలలు లేవు. స్కూళ్లు

Published: Sat,October 6, 2012 03:06 PM

మీది మాది ఒకటే చరిత్ర

నేను చదువుకునే కాలంలో ఆఫ్రికా చీకటి ఖండమని పాఠం చెప్పేవారు. నాకర్థంకాక అక్కడ సూర్యుడు ఉదయించడేమో, కాంతి అక్కడ ఉండదేమో అనుకునేవాణ్ణ

Published: Sat,October 6, 2012 03:06 PM

ఉద్యమానికి ప్రేరకుడు ఉపాధ్యాయుడే

1956-60 మధ్య జరిగిన పరిణామాలే ఉపాధ్యాయుల అసంతృప్తికి కారణమయ్యాయి. ఆ అసంతృప్తి అగ్గే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పాదులు వేస

Published: Sat,October 6, 2012 02:58 PM

స్పూర్తి శిఖరం

-డాక్టర్ చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ (ఇవ్వాళ ప్రొఫెసర్ జయశంకర్ జయంతి) తెలంగాణ ఉద్యమ చరివూతలో డిసెంబర్9 ఒక చారివూతక దినం. దశా

Published: Sat,October 6, 2012 02:57 PM

మాట మారిస్తే దోషిగా నిలబెడతరు

ప్రణబ్ ముఖర్జీ తనను కలిసిన సీమాంధ్ర బృందాన్ని సంతృప్తి పరచ డానికి అలాంటి వ్యాఖ్యలు చేశారా?లేక ప్రస్తుత కాంగ్రెస్ స్వరం ప్రకారమే ఆయ

Published: Sat,October 6, 2012 02:57 PM

ఉద్యమ తీవ్రత కోసమే రాజీనామాలు

తెలంగాణ ఉద్యమం ఎన్నో మలుపులు తీసుకుంటున్నది. జయశంకర్ మరణం స్ఫూర్తితో ఈ ఉద్యమానికి కొత్త దారి దొరికింది. ప్రజలు ఉవ్వెత్తున అలల్లాగా