ఏదీ ఆ దేవరుప్పల చైతన్యం..?


Sat,October 6, 2012 02:51 PM

ఈ మధ్య వారం రోజులు వాకింగ్‌కు పోలేదు. ఉస్మానియా క్యాంపస్‌లో వాకింగ్‌లో రోజు కలిసే మిత్రులు పలకరించారు. వారం రోజులుగా మీరు కన్పించకపోతే భయమేసింది. మీరు నాలుగు రోజులుంటే మాకు పాత విషయాలు చెప్పే మనిషి దొరుకుతాడని మిత్రులు నాతో అన్నారు. నేను మా వరంగల్ జిల్లా గూడూరుకుపోయాను. అక్కడే రెండుమూడు రోజులు ఉన్నాను. అంటే నీకు ఆస్తులున్నాయా? భూములున్నా యా? ఇళ్లున్నాయా? ఆదాయ వనరులు ఏమి ఉన్నాయని నన్నడిగారు. నాకు ఆస్తిపాస్తులేమి లేవు అని వారికి చెబుతూ, నా పాత స్మృతులను గుర్తు చేసుకున్నాను. అవే నాకు వెంటిలేటర్‌గా పనికి వస్తాయి. దేవరుప్పల పాత అనుభవాల నిలయమది. ఈమధ్య ఆ ఊళ్లో స్వా తంత్య్ర సమరయోధులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మధిర పాపిడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించారు. మా వాకింగ్ మిత్రులు మధిర పాపిడ్డి ఎవరని అడిగారు. నాటి స్వాతంత్య్ర పోరాటంలో వీర తెలంగాణ సాయుధ పోరాటంలో దేవరుప్పల ఉద్యమ కేంద్రం. ఆ మధిర పాపిడ్డి ఇంట్లో ఒక నగారా ఉండేది. ఆ నగారా మోగిస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పరుగెత్తుకొని వచ్చేవారు. ఆ రోజుల్లో ఉద్యమానికి ఒక గ్రామానికి మరొక గ్రామానికి మధ్య లింకు ఉండేది. అదే గ్రామాల మధ్య బాంధవ్యాన్ని పెంచింది. గ్రామాల మధ్య ఐక్యతను సాధించింది. పాపిడ్డి యింట్లో నగారా మోగిందంటే చుట్టుపక్కల గ్రామాలైన కామాడ్డి గూడెం, ధర్మాపు రం, కడి నుంచి ప్రజలు పరుగెత్తుకొని దేవరుప్పల వచ్చేవా రు.

ఆ సంకేతమే గ్రామాలన్నింటిని కదిలించే శక్తిగా మారింది. ఆ నగారా మోగించిన వ్యక్తి పాపిడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహాన్ని ఆయన ఇంట్లో నే ప్రతిష్టించారు. విగ్రహం రోడ్డు మీద నాలుగురోడ్ల కూడలిలో పెట్టాలి. కానీ ఇంట్లో పెట్టడమేమిటని అడిగారు. రోడ్లు వెడ ల్పు చేస్తున్నప్పుడు ఈ మధ్య విగ్రహాలను కొట్టేస్తున్నారు. ఇప్పుడు నడుస్తున్న కాలం ఉద్యమాల కాలం కాదు మార్కెట్ యుగం. ఈ సమాజానికి రోడ్లు ముఖ్యం కానీ, ప్రజల కోసం త్యాగాలు చేసిన వారి మూర్తులు ప్రధానం కాదు.
ఇటీవల జాతీయ రహదారి 9 ఫోర్వే లైన్, వన్ వే రోడ్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ జాతీయ రహదారి పొడవునా రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వా త నల్గొండ జిల్లా సరిహద్దు నల్లబండగూడెం దాకా గతంలో రోడ్డుపై నాలుగురోడ్ల కూడళ్లపై ఉన్న పోరాటయోధుల విగ్రహాలన్నింటిని తొలగింపజేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెజవాడ వరకు నాడు నిజాం రోడ్డు వేశాడు. ఆ రోడ్డు పొడుగునా నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుల విగ్రహాలు కన్పించేవి. ఆ దారిగుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి ఊరు మధ్యలో, ఊరు బయట, ఆ ఊరు పొలిమేరల్లో ఈ నేల విముక్తి కోసం పోరాడిన యోధుల విగ్రహాలు, స్థూపాలు, ఆ స్థూపాల మీద శ్రమశక్తికి సంకేతంగా మెరుస్తున్న సుత్తికొడవళ్లు కనిపించేవి. ఇప్పుడు రోడ్డు పొడుగూతా వంతెనలు, టోల్‌గేట్లు కనిపిస్తున్నాయి. అసలు ఊరును గుర్తుపట్టే ఆనవాళ్లు లేకుండాపోయింది.

ఏదో ఆ ఊరు ముందు ఒక బోర్డు పెటి,్ట ఆ బోర్డుకు ఒక యారో మార్క్ ఇచ్చి చూపిస్తే తప్ప, ఊరును గుర్తుపట్టలేకుండా అయిపోయింది. ఇటీవల గుండ్రాంపల్లిలో ఒక చరివూతాత్మకమైన స్మారక చిహ్నాన్ని ఎన్‌హెచ్ 9 రోడ్డు విస్తరణ కార్యక్షికమలో తొలగించేశారు. గుండ్రాంపల్లి ఒక చరివూతాత్మకమైన గ్రామం. ఆ వీరుల స్మారకంగా ఆ ఊళ్లో 30 ఏళ్లుగా ఆ స్థూపముంది. దాన్ని తొలగింపచేశారు. మునపటి మాదిరిగా ఊరు మధ్య నుంచి రోడ్లు పోవడం లేదు. ఊరునే తొలగించి ఓ ఎత్తైన ప్రదేశం నుంచి బ్రిడ్జీల మీదుగా ఊర్లను మింగుకుంటూ రోడ్లు పోతున్నాయి. రోడ్డుకు ఊరు ముఖ్యం కాదు, మార్కెటే ముఖ్యం. అందుకే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కాబోలు దేవరుప్పలలో మా పాపిడ్డి విగ్రహాన్ని ఎవరూ పడగొట్టకుండా ఉంచడం కోసం ఇంటి ఆవరణలోనే ఆయన విగ్రహాన్ని పెట్టారు. విగ్రహాలను నలుగురి మధ్య, జనం మధ్య ఉంటే కదా! ఈ విగ్రహా మూర్తి ఎవరని అడుగుతారు. ఆయన గురించి తెలుసుకుంటారని మా మార్నిం గ్ వాక్ మిత్రులన్నారు. దేవరుప్పల ఊరు ప్రాధాన్యం ఏమిటని నన్నడిగారు.

దేవరుప్పల గ్రామంపై 1946 నవంబర్ 17న మిలటరీ దాడి జరిగింది. మిలటరీ గ్రామ ప్రవేశం చేయగానే పాపిడ్డి నగారా మోగించాడు. మొదట కామాడ్డి గూడెం వాళ్లు కదిలారు. పోలీసులపై బయట నుంచిరాళ్ల వర్షం కురిసింది. అయినా ఊరు బయట రాళ్ల దాడి నుంచి తప్పించుకుని దేవరుప్పలలోకి ప్రవేశించారు. ఇంతలో ధర్మాపురం గిరిజన మహిళలు కారం ముద్దలు తీసుకుని పోగయ్యారు. వెనకకుపోతే గిరిజనుల దాడి. ముందుకు పోదామంటే కామాడ్డిగూడెం వాళ్లు రాళ్ల వర్షాలు కురిపిస్తున్నారు. పోలీసులు దిక్కతోచక వెనక్కు తిరిగారు. ఇంతలో కడి వాళ్లు కర్రలతో, ఒడిసెలతో, వసిగొయ్యలతో ప్రవాహంలాగా పరిగెత్తుకొచ్చారు. అప్పుడు సందర్భం చూస్తే విచిత్రం. పోలీసులు పరుగెత్తుతున్నారు. ప్రజలు వారిని తరుముతున్నారు. ఇది పాలకుల అధికార పీఠానికి మంటబెట్టినట్టయింది. అదీ నాటి ప్రజల పోరాట చైతన్యం. పాలకుల కు చైతన్యమంటే పడదు. ప్రజా ఉద్యమమంటే గిట్టదు. కాలమేదైనా అధికారం రూపురేఖలు మాత్రం మారలేదు. రాళ్లదెబ్బలు తిన్న పోలీసులు, మహిళల కారంముద్దల రుచి చూసిన పోలీసులు వారం రోజుల తర్వాత ఆ దేవరుప్పల గ్రామంపై విరుచుకుపడ్డారు. దాదాపుగా ఊళ్లోని మగవాళ్లందరిని అరెస్టు చేశా రు. ప్రజలను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అయినా ఆ పోరు చైతన్యం మాత్రం ఆ ఊరిలో రగులుతూనే ఉంది. అందుకే దేవరుప్పలంటే సాయుధ పోరాట వీరులను అందించిన కేంద్రంగా మారింది. ఆ ఊరి నుంచి 0 మందికి మించి స్వాతంత్య్ర సమరయోధులున్నారు. దేవరుప్పల అనగానే నా ఒళ్లు పులకరిస్తుంది. నాటి తెలంగాణ సాయుధ పోరాటం మా బతుకులకు మహాపలవరింతగా మారింది.
అది నాటి తెలంగాణ పల్లెల్లోని పరిస్థితి. నాడు ఏ ఊరు చూసిన పచ్చగా కళకళలాడుతూ ఉండేది.

ఇప్పుడు కొత్త రోడ్లు వచ్చాయి. ఊర్లు వొట్టిపోతున్నా యి. రోడ్లు నిగనిగలాడుతున్నాయి. నాడు ఊరు ఊరంతా చెట్టు కల్లు తాగేది. నేడు బహుళజాతి కంపెనీల బెల్టుషాపుల మత్తులో ఊరు ఊగిపోతుంది. ఎప్పుడో రాత్రిపూట కల్లుబొట్టు తాగే దశ మారిపోయి ఇప్పుడు పొద్దున్నే బుడ్డీలతోనే కడుక్కునే దశకు గ్రామాన్ని తీసుకొచ్చారు. ముఖాలు కూడా మారిపోతున్నాయి. 25 ఏళ్ల యువకుడు నాటు సారాకు బానిసై 50 ఏళ్ల మనిషిలా కన్పిస్తున్నాడు. నాటి దేవరుప్పల లాగా ఊళ్లన్నీ చైతన్యంతో ఉంటే పాలకుల ఆటలు సాగవు. మార్కెట్ వ్యవస్థ కుప్పకూలుతుంది. అందుకే ఊరును చైతన్యం నుంచి మత్తులో ముంచేందుకు మార్కెట్ చేస్తున్న పనులకు పాలకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకే ఊళ్లు ఇప్పుడు బెల్టుషాపుల మయంగా, ఊళ్లోని రాజకీయ పార్టీలు డీలర్లుగా, ఏజెంట్లుగా గ్రామ రాజకీయ వ్యవస్థను మార్చేశారు. అందుకే ఊరు రూపం, నడత మారింది. ఊరు విలువలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. గ్రామంలో కూడా మనిషి మాయమైపోయే దశకు వచ్చిం ది. మా గూడూరు నుంచి వలసలు బాగా పెరిగాయి. మూడు రోజులు గ్రామం లో ఉండి పడిపోయిన ఇళ్లను, బూజుపట్టిన బజార్లను చూసి వచ్చాను. వలసలకు మహబూబ్‌నగరే కేంద్రమంటారు. కానీ ఇప్పుడు తెలంగాణలోని పల్లెలన్నీ పాలమూరు గ్రామాలుగా మారిపోయాయి. మా ఊర్లో చేతివృత్తులన్నీ చేతులిరిగినట్టు అయ్యాయి. చేతివృత్తులు వదిలి మా ఊళ్లో ఔసులోళ్ల పిల్లగాడు ఆటోడ్రైవరయ్యాడు. ఊరంతా చితికిపోయింది. కానీ ఊరుకు సీసీ రోడ్డు వచ్చింది. ఇది అభివృద్ధి కాదా అంటున్నారు. ఇవన్నీ చూశాక మార్కెట్ చైతన్యం కన్పిస్తుంది. కానీ నాటి దేవరుప్పల చైతన్యం మటుమాయమైపోయింది.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Featured Articles