టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం


Sun,May 29, 2016 01:17 AM

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడిచేసి కొత్త సమాజాన్నినిర్మించుకోగలుగుతాం. కేజీ టు పీజీ వ్యవస్థ నిర్మాణానికి ఈ ఉపాధ్యాయ నియామకాలు తొలి అడుగులు. కేజీ టు పీజీని సంపూర్ణంగా అమలు చేయగలిగితే దేశమే కాదు ప్రపంచమే తెలంగాణ వైపు చూస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నామో అన్న దానికి సమాధానంగా విద్యారంగ ప్రక్షాళనలు జరుగుతున్నాయి. ఇది రేపటి భవిష్యత్ సమాజానికి పాఠ్యాంశం.

chukka
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కష్టమైన విద్యారంగ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని భుజం మీద వేసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే పనికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యారంగ పునర్నిర్మా ణం అన్నది భారీ ప్రాజెక్టుల నిర్మాణం కంటే కఠినమైనది, కష్టమైనది. విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ ఏ ప్రభుత్వం చేయని సాహసానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు మొత్తం సమాజం అభినందనలు తెలియజేస్తుం ది. అదే విధంగా కేజీ టు పిజీ అంటే ఎంతో మంది అగమ్యగోచరంగా ఆలోచిస్తున్న స్థితిలో, ఈ అంశంపై తికమకపడుతున్న కాలంలో తమ వ్యూహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయట పెడుతూ వస్తుంది.

అన్ని వ్యవస్థలకంటే విద్యా వ్యవస్థే వ్యవస్థకు ప్రాణం. అదే సమాజ రథచక్రాలను నడిపించేది. విద్యార్థి ఉపాధ్యాయుడే ఈ రంగానికి ప్రాణం. ఉపాధ్యాయుల నియామకమే వారి వ్యూహారచన కు మొదటి మొట్టు. ఈ నియామకాలు ఎవరు చేస్తే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి? వాటిని ఏ విధంగా నిర్వహించాలి? ఈ నియామకాలను రిక్రూట్‌మెంట్ అనాలా? సెలక్షన్ అనాలా? అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం భారీగానే కసరత్తు చేసినట్లుంది. ఒకనాడు తెలంగాణలో చదువుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండేది. గత 50 సంవత్సరాలలో తెలంగాణ విద్యార్థులు అపూర్వమైన ప్రతిభను చూపారు. క్లింటన్‌లాంటి వాళ్లు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో హైదరాబా ద్ పాత్ర ఉందన్నాడు. క్లింటన్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన నేరుగా హైదరాబాద్‌కు వచ్చా రు. కుతుబ్‌మినార్‌ను చూసినదానికంటే నేను హైదరాబాద్‌ను చూడాలని వచ్చాను. ఎందుకంటే మీ కృషి వలన మాదేశ ఆర్థిక వ్యవస్థ బలపడిందని చెప్పేందుకై ఇక్కడకు వచ్చాను. క్లింటన్ మాటలతో మన తెలుగు విద్యార్థులు సాధించిన ఘనత తేటతెల్లమైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను నడిపించటంలో మన తెలంగాణ విద్యార్థుల పాత్ర ఎంతో గణనీయమైనది.

ఇటీవల నేను కాలిఫోర్నియాకు వెళ్లినప్పుడు సిలికాన్ వ్యాలీ చూశాను. వేలాదిమంది తెలంగాణ విద్యార్థులు ఐటి రంగంలో పనిచేస్తున్నారు. అదే మాదిరిగా స్యాటివిక్ సముద్రంలో బయోటెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మన తెలుగువారు ఆ కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తున్నారు. ఇందులో మా విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. తెలంగాణ విద్యార్థులు అక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా, కంపెనీల నిర్వాహకులుగా మారారు. ఈ పరిస్థితిని గమనించి , అవలోకనం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలను రిక్రూట్‌మెంట్‌గా చూడటం లేదు. విద్యార్థుల అధ్యయనం చూసి మారిన పరిస్థితులను బట్టి ఉపాధ్యాయ పోస్టులకు సెలక్షన్ జరగాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రిక్రూట్‌మెంటుకు సెలక్షన్‌కు తేడా ఉంది.

ఉపాధ్యాయులను ఎంపిక చేసేటప్పుడు ఉపాధ్యాయుల జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని చూడటం ఒక భాగమైతే టాలెంట్‌ను చూడటం రెండవ భాగం. అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. బీఈడీ కాలేజీలు విద్యార్థులకు స్కిల్స్‌ను నేర్పిస్తాయి. కానీ టాలెంటును గుర్తించాలనే అవసరం ఉం ది. అది అంతర్గతమైనది. దీన్ని ఉపాధ్యాయుడైన వాడే గుర్తించగలుగుతాడు. ఉపాధ్యాయుల నియామకాలలో డీఎస్‌సీల నియామకాలన్నీ కలెక్టర్లు నిర్వహిస్తారు. ఉన్న వ్యవస్థను యథాతథంగా రూల్స్‌పరంగా నిర్వహించటమే అధికారుల పని. వారికి అధికార నిబంధనల పుస్తకమే ప్రధానం. అక్కడ టాలెంట్ ముఖ్యం కాదు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో కీలకమైనది. సమాజం భవిష్యత్తుపైన కమిట్‌మెంట్ ఉన్నవాళ్లు మాత్రమే ఈ నియామకాలను చేయగలుగుతారు.

రేపటి సమాజానికి ఎలాంటి ఉపాధ్యాయుడు కావా లి? బోధనలో ఏ రకమైన టాలెంట్ ఉం డాలి? అన్న ఆలోచనలకు ప్రతిరూపంగా ఉపాధ్యాయులను నియమించాలి. ఇది చాలా ముఖ్యమైన పని. ఈ పనికి ప్రభు త్వం ఆలోచించి ఈ నియామకాలను పబ్లి క్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపా ణి చేతిలో పెట్టింది. చక్రపాణి సోషల్ కమిట్‌మెంటు ఉన్న మనిషి. ప్రొఫిషనల్ కమిట్‌మెంటు ఉన్న మనిషి. అదీ గాక స్వతహాగా ఉపాధ్యాయుడిగా పనిచేసిన మని షి. నిన్నటి కన్నా రేపటి సమాజంపైన అవగాహన వున్న మనిషి. ఈ ఘంటా చక్రపాణిని కమిషన్ చైర్మన్‌గా నియమించి ముఖ్యమంత్రి సఫలీకృతుడయ్యాడు.

రాబోయే 30 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయ నియామకాలు చేయాలనే గురుతర బాధ్యతను పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇవ్వటం జరిగింది. ఇది తెలంగాణ ప్రభు త్వం వ్యూహారచన. బృహత్తరమైన కార్యక్రమం ఇది. ప్రభుత్వ సంకల్పం బాగా తెలిసిన వ్యక్తి కాబ ట్టి ఘంటాకు ఈ పనిని అప్పగించారు. ఉపాధ్యాయుడి గౌరవాన్ని పెంచాలి. గ్రూప్‌వన్ ఆఫీసరును ఎన్నుకునే వ్యవస్థకే ఉపాధ్యాయ నియామకాల్ని అప్పగించటం వల్ల కూడా టీచర్‌కు సమాజంలో గౌరవం పెరుగుతుంది. సమర్థుడైన టీచర్ అయితేనే రాబోయే సమాజానికి సరైన పునాదులు వేయగలుగుతారు. విద్యారంగంలో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. సమాజ నిర్మాణంలో నిర్ణయాలు దూరదృష్టితో చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించి సరైనోడికి బాధ్యతను అప్పగించింది. విద్యారంగ ప్రక్షాళనలో భాగంగా ఉపాధ్యాయ నియామకాలను చేసేందుకు ఘంటా చక్రపాణే సరైనోడు.

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడిచేసి కొత్త సమాజాన్ని నిర్మించుకోగలుగుతాం. కేజీ టు పిజీవ్యవస్థ నిర్మాణానికి ఈ ఉపాధ్యాయ నియామకాలు తొలి అడుగులు. కేజీ టు పీజీని సంపూర్ణంగా అమలు చేయగలిగితే దేశమే కాదు ప్రపంచమే తెలంగాణ వైపు చూస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నామో అన్న దానికి సమాధానంగా విద్యారంగ ప్రక్షాళనలు జరుగుతున్నాయి. ఇది రేపటి భవిష్యత్ సమాజానికి పాఠ్యాంశం.

1058

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ