నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చిన మార్పుల వల్ల సమష్టి కుటుంబాలు విచ్ఛిన్నం కావటం వల్ల 3 -6 సంవత్సరాల మధ్యన శిశువులో ఏర్పడిన మానసిక,శారీరక మార్పులను ఆధారం చేసుకుని సుస్థిరమైన సమాజ నిర్మాణానికి విద్యారంగం ప్రాధాన్యాలను నిర్ణయించటంలో కేజీ చదువు పాత్ర ఎంతో ఉన్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీర్ఘాలోచనలు చేసి చర్చలు జరిపి విద్యా పాలసీని ప్రకటించారు. దాంతో సహా ఆ పాలసీని అమలు చేయడానికి ఒక కమిటీ కూడా వేశారు. దానిలో పాల్గొనే అవకాశం దొరికింది. ఆ ఎడ్యుకేషన్ పాలసీ కేజీ టు పీజీ విద్యారంగంలో ఇలాంటి నినాదం దేశంలో ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకూ లేదు. ఇది అందరూ ఆహ్వానించవలసింది. కేజీ విద్య పేరుతో ప్రైవేట్ సంస్థలు భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే కేజీ విద్యను చేపట్టబోతుందని ప్రకటించటంతో విద్యారంగ కార్యకర్తగా సంతోషపడిన మాట వాస్తవ మే.
నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చిన మార్పుల వల్ల సమష్టి కుటుంబాలు విచ్ఛిన్నం కావటం వల్ల 3 -6 సంవత్సరాల మధ్యన శిశువులో ఏర్పడిన మానసిక, శారీరక మార్పులను ఆధారం చేసుకుని సుస్థిరమైన సమాజ నిర్మాణానికి విద్యారంగం ప్రాధాన్యాలను నిర్ణయించటంలో కేజీ చదువు పాత్ర ఎంతో ఉన్నది. విదేశాల్లో ఏ విధమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వెళ్లాను. చాలా మంది విద్యావేత్తలతో కలసి మాట్లాడాను. ముఖ్యంగా చికాగో నగరంలో ఒక సంస్థ ఏర్పడింది. అర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ టు ఏ సస్టైనబుల్ సొసైటీ అనేది ఏర్పడింది. ఆ సంస్థ నిర్వాహకులతో మాట్లాడాను. సాంకేతికమైన మార్పుల వల్ల విద్యారంగంలో తీవ్రమైన కదలికలు తీసుకువచ్చింది.
దీంతో అందరికీ చదువు అనే భావన కూడా కలిగింది. చదువు వల్ల ఆధిక్యత వస్తున్నది కాబట్టి ఆ చదువును అందరికీ అందించగలిగితే కొన్నివర్గాలలో విముక్తి కలుగుతుంది. సమాజ పరివర్తన జరుగుతుంది. సామాజిక పరిణామాల నుంచి చదువును విడదీయలేరు.21వ శతాబ్దంలో సమాచార రంగంలో వచ్చిన మార్పులు చిన్నవి కావు. దీనివల్ల ఉద్యోగభృతి అవకాశాలు పెరగటమే గాకుండా ఆర్థిక వ్యవస్థకు విద్య ఒక ప్రధాన అంగంగా మారింది. నేడు అక్షరం కన్నా భావన చాలా ప్రధా నం. ఆ ఆలోచనలు బాల్యంలో ఉత్పత్తయ్యేది ఇంద్రియాల చైతన్యం వల్లే. శిశువు దేహంలో ప్రధానమైన మార్పు ఇంద్రియాల వల్లనే ఏర్పడుతూ వచ్చింది. శిశువు తనంతట తాను ఆలోచించడు. ఇంద్రియాల ప్రేరణే శిశువు ఆలోచనలకు మూలం.
దాన్నే బుద్ధి అంటారు. ఇంద్రియాలు ఈ బుద్ధికి పునాది. 3-6 సంవత్సరాల మధ్యన ఇంద్రియాలకిచ్చే శిక్షణే బిడ్డల ఆలోచనలకు పునాది. ఆలోచనా విధానాన్ని నియమబద్ధంగా ఉంచాలంటే సామాజిక అవసరాలకు అనుగుణంగా మార్చాలన్నా, వ్యక్తిగత అవసరాలకు మార్చాలన్నా శిశువుకు ఈ దశే చాలా ప్రధానం. ఈ దశలో విద్యార్థిని ఎంత జాగ్రత్తగా మనం తీర్చిదిద్దగలిగితే అదే స్థాయిలో ఉత్తమమైన పౌరుడుగా ఉత్తమ పౌరురాలుగా రూపొందుతారు. కానీ శిశువులో ఏ అవగాహన కలిగించదలుచుకున్నా తల్లికి ఉండే క్షణాలు ఆ ఉపాధ్యాయునికి ఉంటేనే ఆ లక్ష్యసాధన జరుగుతుంది. ఆర్థికరంగంలో వచ్చిన మార్పుల వలన శిశువుపై ఎంతో శ్రద్ధ వహించాలి. అది జరగకపోతే శిశువు పెరిగాక పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది.
తల్లీ తండ్రీ చేయవలసిన పనిని సమాజమే చేయవలసిన బాధ్యత ఏర్పడింది. కాబట్టి ఒక పౌర సమాజం కోసమై వ్యవస్థ ఏర్పడింది. ఇది కొందరి కే కాదు అందరికీ అన్నది అర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ టు ఏ సస్టైనబుల్ సొసైటీ లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ పని మాత్రం ఆచరణలో అంత సులభమైనది కాదు. తల్లి మాదిరిగా శిశువుతో సాన్నిహిత్యం పెంచుకునే వ్యక్తి ఎడ్యుకేటర్ కావాలి. తల్లి చేసే పని పవిత్రమైనది. శిశువుకు శారీరక అవసరాలుంటాయి. పిల్లలకు పౌష్ఠిక ఆహారాన్ని ఇవ్వటం జరగాలి. పిల్లలకు పెట్టే ఆహారంలో ప్రేమను కలిపి తినిపిస్తే అది పిల్లలకు శక్తినిస్తుం ది.శిశువు ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వటానికి వనరులు కూడా ఎంతో అవస రం. శిశువు రంగులను గుర్తించటం, రంగులలో తేడాలను గుర్తించటం.
ఉపాధ్యాయుడు పిల్లల భాషలో మాట్లాడాలి. ఉపాధ్యాయుని దగ్గరకు శిశువు తల్లి దగ్గరకు వచ్చినట్లుగా పరుగెత్తుక రావాలి. ఇందుకు ఎలాంటి భాష కావాలో ఆలోచించాలి. ఆ శిశువు కల్చర్ తెలియాలి. అమెరికాలో వున్న ఆఫ్రో అమెరికన్స్ శిశువులకు శిక్షణనిచ్చేందుకు అక్కడ ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. సామాజిక సుస్థిరత కోసం ఆ శోధనలు జరుగుతున్నాయి. కేజీ చదువు వెనుక ఇంత పెద్ద పరిశ్రమ ఉన్నది. భాష, మాటలు ఎదుటివారిని గౌరవించే విధంగా ఉండాలి. భాష ఎదుటివారిని నొప్పించకూడదు. కేజీ చదువు బెంచీలతో రాదు ఉపాధ్యాయుల ప్రవర్తనతో వస్తుం ది. అబద్ధం ఆడకూడదని చిన్నప్పుడే రావాలి.అమెరికాలో ఆ కేజీ స్కూలుకు పోతే నేను చంటిబిడ్డనయ్యాను.
-(రచయిత: ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు)