గ్రామ రాజ్యానికి బడులే పునాదులు


Tue,August 18, 2015 01:52 AM

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వెల్లివిరుస్తున్న కాలమిది. మారుతున్న సమాజానికి అనుగుణంగా ఏ దేశమైతే, ఏ పాలనావ్యవస్థ అయితే ప్రజలను చైతన్యవంతులను చేస్తుం దో ఆ సమాజమే ముందడుగు వేస్తుంది. ఆ వ్యవస్థకు తగినటువంటి జ్ఞానాన్ని ఇవ్వలేకపోతే అది నిలకడగా ఉండిపోతుంది. లేదా వెనకకైనా పడిపోవచ్చును. ఒక సమాజం సక్సెస్ అన్నది మారుతున్న కాలంతోపాటు సమాజాన్ని ముందుకు నడిపించేందుకు పాలనా వ్యవస్థ పకడ్బందీగా నిర్వహించవలసి ఉన్నది. మనిషికి రాత అవసరం అన్నది అక్షర జ్ఞానం అవసరం అన్నది పారిశ్రామిక విప్లవం వల్ల వచ్చింది. అదే ప్రజా బాహుళ్యానికి సంబంధించిన సమానత్వం అన్న భావనకు నాందీ పలికింది. ప్రజాస్వామిక వ్యవస్థలోనే దారిద్య్రాన్ని నిర్మూలించి సమానత్వం సాధించవచ్చుననే భావన వచ్చింది.

ChukkaRamaiah

మనం సమాచారయుగంలో ఉన్నాం. ఈ కాలానికి సంబంధించిన దాంట్లో భాగంగా మన విద్యా విధానం తీర్చిదిద్దుకోవాలి. మూడేళ్ల బిడ్డ ఇంద్రియ జ్ఞానంతో గుర్తించగలుగుతుంది. ఈ వయసులో అక్షరజ్ఞానం కన్నా ఇంద్రియజ్ఞానంతో అన్నింటిని గుర్తించగలిగిన దశలో అందించే విద్యనే కేజీ చదువు అంటున్నాం.
గ్రామాలను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభు త్వం గ్రామజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందు లో విద్యారంగం కీలకమైనది. చదువంటే పాఠశాల మాత్రమే కాదు. పాఠశాల అంటే వ్యక్తులు, కుటుం బం, సమాజం, ప్రధానంగా వూరు. బిడ్డకు కుటుంబంతో సంబంధం లేకపోతే భాష రాదు. కుటుం బం నుంచి బాహ్య ప్రపంచానికి సంబంధం ఏర్పా టు చేసేందుకు సమాజం విలువలు నేర్పుతుంది. ఆ విలువలు నైతికతను నేర్పుతాయి. విలువలను, నైతికతను నేర్పేదే గ్రామం. ఆ గ్రామం లేదా ఆ సమాజం నేర్పే విలువలతో కొత్త సమాజ నిర్మాణం జరుగుతుంది. బాహ్య ప్రపంచాన్ని కంట్రోల్ చేసేది రాజ్యం. ఇపుడు తెలంగాణ రాష్ట్రం పంచాయతీ రాజ్ శాఖాపరంగా పాలనను మరింతగా ప్రజలకు చేరువగా అందించేందుకు గ్రామజ్యోతి పథకం పెట్టింది. జ్యోతి వెలిగించటమంటే మనిషిలో అవగాహనను పెంచటమని అర్థం.

ఆ జ్యోతిని వెలిగించటం కోసం సమాజంలో ఉన్నటువంటి వివిధ శక్తుల ను, వివిధ రంగాలను సమన్వయపర్చాలి. అప్పుడే అది సంపూర్ణమైన జ్ఞానం అవుతుంది. మన సమాజం విభిన్న చైతన్యాల సమూహం, మన సమాజం అవకతవకల ఎత్తుపల్లాల సమాజం. వివిధ కులాలు, మతాలు ఉన్నాయి. వీటన్నిటిని సమన్వయపరచగలిగినప్పుడే మనిషి పరిపూర్ణుడవుతాడు.
గ్రామజ్యోతి వెలుగులో విద్యాజ్యోతులు వెలుగొందే విధంగా చేయాలి. ఇందు లో ఉపాధ్యాయులు సర్పంచ్, మొత్తం గ్రామ పాలనారంగం కీలకపాత్ర వహించాలి. బడీడు పిల్లల్ని విధిగా బడికి తీసుకురావాలి. బడికి వచ్చిన పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలి. గ్రామాన్ని వివిధ యూనిట్లుగా చేసి, ఆ యూనిట్ల ద్వారా బడికి రాని పిల్లలను బడికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి.

ప్రజాప్రతినిధులను బడిలో భాగస్వాములను చేయాలి. పాఠశాల నిర్వహణలో, దాని అభివృద్ధిలో ప్రజా ప్రతినిధులు పాలుపంచుకోవాలి. కేజీ స్కూల్ నిర్వహణలో అంగన్‌వాడీతోపాటుగా సర్పంచ్ కీలక బాధ్యత వహించాలి. ఏ ఇం ట్లో ఎందరు పిల్లలున్నారు? పుట్టిన బిడ్డకు మూడు సంవత్సరాలు వచ్చాక వారిని కేజీ చదువుకు తీసుకువచ్చేందుకు గ్రామ పంచాయతీ బాధ్యత వహించాలి. సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామంలోని విద్యా కమిటీలు, ప్రజా సంఘాలలోని సభ్యులు ఇందుకోసం కమిటీగా ఏర్పడాలి. పిల్లలకు 6 సంవత్సరాల వయస్సు వచ్చాక వారిని ప్రాథమిక పాఠశాలలో విధిగా చేర్పించాలి. ఈ పని చిన్నదేమి కాదు. ఇందుకోసం గ్రామ పంచాయతీ ఎంతో కృషి చేయవలసి ఉన్నది. దీంతోపాటుగా ప్రాథమిక విద్యను శక్తివంతం చేయాలి. ఉపాధ్యాయ విద్యను సంపూర్ణంగా సంస్కరించుకోవాలి. ఇందుకోసం సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయ విద్య కూడా మారాలి. ప్రాథమిక స్కూల్‌ను శక్తివం తం చేస్తే అది విద్యాజ్యోతిగా వెలుగొందుతుంది. కేజీ స్కూలు, ప్రాథమిక పాఠశాలలో పిల్లలందరికీ విధిగా ఆరోగ్య చెకప్‌లు చేయించాలి.

ఇందుకోసం డాక్టర్ల బృందాల్ని గ్రామాలకు తీసుకురావాలి. మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు జరపాలి. ప్రతీ స్కూలులో వంటశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలి. ప్రతి స్కూలును సెమీ రెసిడెన్షియల్‌గా మార్చాలి. అవసరమైతే ఉదయం పిల్లలకు అల్పాహారం కూడా పెట్టాలి. మధ్యాహ్న భోజనం అందించాలి. మరుగుదొడ్లు నిత్యం శుభ్రపరచాలి. పాఠశాలకు మంచినీటి సౌకర్యం కల్పించాలి. పిల్లలు మలమూత్రాలకు బయటకు పోకుండా చూడాలి. పరిశుభ్రత గురించి పాఠశాలల్లో బోధన జరగాలి. తరగతి గదిలో పిల్లలను తీర్చిదిద్దగలిగితే దాని ప్రభావం ఊరిపై పడుతుంది. ప్రతి గ్రామం సమర్థవంతంగా నిలబడాలంటే పాఠశాల నిర్వహణ పకడ్బందీగా జరగాలి. స్కూలుపై గ్రామ సర్పంచ్‌కు అధికారాలుండాలి. స్కూలు నిర్వహణకు సర్పంచ్ జవాబుదారీగా ఉండాలి. ఇందుకు గ్రామపంచాయితీ సంపూర్ణ బాధ్యత తీసుకుంటే ప్రభుత్వ స్కూలు శక్తివంతం అవుతుంది. ప్రభుత్వ స్కూలు శక్తివంతం కావటమంటే అది పేద వర్గాలకు ఎంతో దోహదపడుతుంది. ప్రతి స్కూల్లో నాణ్యమైన విద్య ఉండాలి. సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధుల పిల్లలు, ఉపాధ్యాయుల పిల్లలు, విధిగా ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించాలి. దాని ప్రభావం ఊరిపై పడుతుంది. స్కూల్‌లో జ్యోతి వెలిగితేనే అది గ్రామానికి జ్యోతిగా మారుతుంది. ప్రతి వూరు కు ఒక గ్రంథాలయం ఉండాలి. ఆ గ్రంథాలయం ద్వారా అనేక పుస్తకాలను ప్రజలకు అందించాలి.

ఊరులో యువత వయోజన విద్యకు దోహదపడే విధంగా కృషి చేయాలి. పాఠశాలలో పిల్లలకు విలువలను నేర్పాలి. గ్రామ నిర్మాణానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి పిల్లలకు ప్రత్యేకంగా బోధనలు చేయాలి. గ్రామంపై ప్రేమ పెరిగే విధంగా కొత్తతరాన్ని తీర్చిదిద్దాలి. పగలతో, కక్షలతో, ముఠాలతో అభివృద్ధి సాధ్యం కాదని, మనిషిని మనిషి గౌరవించుకోగలిగినప్పుడే వూరు సస్యశ్యామలంగా వుంటుందన్న భావనలను కొత్తతరంలో నాటాలి. గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రతిష్ఠించాలంటే పాఠశాలే అందుకు పునాది కావాలి. ప్రతి ఇంటిని తీర్చిదిద్దుకునేందుకు ఏ రకంగా కుటుంబ సభ్యులు శ్రమిస్తారో అదే విధంగా గ్రామమంతా కలిసి పాఠశాల సమృద్ధిగా నడిచేందుకు కృషి చేయాలి. అప్పుడు ప్రతి వూరు ఒక గంగదేవిపల్లి అవుతుంది. తెలంగాణలో ప్రతి పల్లె అంకాపూర్‌గా మారాలంటే ప్రతి గ్రామంలో విద్యాజ్యోతి దేదీప్యమానంగా వెలగాలి. గ్రామ పంచాయతీ పాఠశాల పరిరక్షణ కమిటీగా మారాలి.

1322

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ