గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం


Wed,July 15, 2015 12:17 AM

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్నాయి. స్టేట్స్ అంటే మన రాష్ర్టాలలాగా కాదు. ఇక్కడ ఫెడరల్ వ్యవస్థలో రాష్ర్టాలు శక్తివంతమైనది. ప్రతి స్టేట్‌కు ఒక ప్రత్యేక చరిత్ర ఉంటుంది. అమెరికా వైమానిక వ్యవస్థకు కేంద్రమది.

c-ramaiah


విమానాలు కనుక్కున్న రైట్‌బ్రదర్స్ యిక్కడనే ఉన్నారు. అందుకే ఈ పట్టణానికి రైటర్ అని పేరు పెట్టారు. ప్రతి రాష్ర్టానికి ఒక చరిత్ర ఉంది. సిటీ పాలనను నిర్వహించటాన్ని ఇక్కడ కౌంటీ అంటారు. గత రెండేళ్లలో ఈ సిటీలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. యింత వేగంగా ఈ మార్పులు జరగడానికి కారణం పట్టణాలను అభివృద్ధి చేయాలన్న పాలకుల తలంపు వల్లనే యిది జరుగుతుంది. ప్రధానంగా ఈ అభివృద్ధి వెనుక సిటీ పాలన నిర్వహణాధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక పట్టణానికి అభివృద్ధి చేయటానికి కావల్సిన మౌలిక వసతులన్నింటినీ కల్పిస్తున్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు వస్తే వారికి ఏ రకమైన సదుపాయాలు కావాలో వాటినన్నింటిని ముందుగానే సమకూర్చిపెడుతున్నారు.

ఇక్కడొక ప్రైవేట్ ఎయిర్ పోర్టు ఉన్నది. ప్రైవేట్ విమాన వ్యవస్థ నిర్వహణను కౌంటీ తీసుకుంది. ప్రైవేట్ వైమానిక వ్యవస్థను బాగా అభివృద్ధి చేశారు. పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక గ్రౌండ్స్ పెట్టారు. అమెరికాలో నగరీకరణ వేగవంతంగా జరుగుతున్నది. తమ నగరాలకు ప్రజలు రావాలని ఇక్కడ సౌకర్యాలు బాగా పెంచుతున్నారు. ఈ వసతులు పెరగటం వల్ల ఆ నగరానికి ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో లాగా అమెరికాలో నగరీకరణ వేగవంతంగా జరుగుతున్నది. చైనాలో అట్లాగే నగరీకరణ జరుగుతుంది. చైనాలో ప్రజలను బలవంతంగా పట్టణాలకు తరలిస్తున్నారు. కానీ చైనాలో ఒక గ్రామాన్ని తరలించదలుచుకుంటే అందుకు అనుగుణంగా నగరంలో లేదా పట్టణంలో నివాసాలు, ఆసుపత్రులు, వసతులు ముందుగానే ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ చేశాక గ్రామాలలోని ప్రజలను నగరాలకు పంపేస్తున్నారు. నగరీకరణ వల్ల వ్యవసాయరంగం దెబ్బతినదు. తక్కువ మందితో సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తున్నారు. అదే చైనా లో, అమెరికాలో అదే జరుగుతున్నది. గ్రామాల నుంచి వచ్చిన వారికి నగరాల్లో వసతులు పెంచుతున్నారు. అందుకు తగిన విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ దృశ్యాలను సిల్‌సినాటీలో నేను ప్రత్యక్షంగా చూశాను.

గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన వారికి, వారు చేసే పనులకు ప్రత్యేకమైన శిక్షణనిస్తున్నారు. వృత్తి పనులకు సం బంధించిన శిక్షణను వారికి అందిస్తున్నారు. ఒక నగరాన్ని పెంచటానికి విస్తృత పరచటానికి పకడ్బందీగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. 21వ శతాబ్దంలో గ్రామాల సంఖ్యను తక్కువ చేయటం, వ్యవసాయరంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తిని పెంచటం చేస్తున్నారు. గ్రామాలను ఖాళీ చేసి వలస వస్తున్న వారికి ఆదాయ వసతులు పెంచేందుకు పలు శిక్షణలను నివ్వాలి. ప్రత్యామ్నాయ జీవనోపాధి విధానాన్ని పటిష్టపరచాలి. అందుకు వారికి పలురకాల నైపుణ్యాలను అందించాలి. ఇది ప్రపంచంలో జరుగుతున్న పోకడలివి. నగరీకరణకు కావాల్సిన సౌకర్యాలు పెంచాలి.

మన దగ్గర నగరాలకు పట్టణాలకు విస్తృతంగా వలసలు పెరిగాయి. కానీ అందుకు అనుగుణంగా వచ్చిన వారికి వసతులు, స్కూళ్లు, ఇళ్లు నిర్మాణాలు, ఆరోగ్య వసతులు అందుకు సంబంధించిన ప్రణాళికాద్ధంగా పథక రచనలు చేయాలి. గ్రామాల నుంచి భారీగా వస్తున్న వారికి మనం ఏ రకమైన శిక్షణలు ఇవ్వగలుగుతున్నామన్నది ముఖ్యం. వ్యవసాయంపైన ఒత్తిడిని తక్కువ చేయాలి.

పలురకాల వ్యవస్థలను నిర్మించటంతోపాటుగా వాటి నిర్వహణను కూడా చూసుకోవాలి. పట్టణ వాసులకు కొత్త సౌకర్యాలను కల్పించాలి. పట్టణ పాలకవర్గం ఆదాయాలను పెంచాలి. ఇది ఒక్క అమెరికాలోనే కాదు అన్ని దేశా ల్లో అన్ని ప్రాంతాల్లో ఈ పనికి నడుంకట్టాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
నగరీకరణవైపు నడక ప్రారంభించాలనుకున్న ప్రాంతాలన్నీ అందుకు కావల్సిన మౌలిక వసతులను పెంచుకోవాలి. ప్రతి వ్యక్తిని ఒక వినియోగదారునిగా తయారు చేస్తేనే, వారికి వసతులు కల్పిస్తేనే ఆ దేశం, ఆ ప్రాంతం ఆర్థికంగా తులతూగగలుగుతుంది.

హైదరాబాద్ అభివృద్ధిపై కేసీఆర్ పెట్టిన దృష్టిని ఆచరణాత్మక రూపుదాల్చితే మంచి ఫలితాలు వస్తాయి. హైద్రాబాద్ మాదిరిగా తెలంగాణలో ఐదారు నగరాలను అభివృద్ధి చేయాలి. గ్రామాల్లో వ్యవసాయం దెబ్బతినకుండా టెక్నాలజీని పెంచుకోవాలి. అదే సమయంలో నగరీకరణ వేగవంతంగా జరగాలి.

సిల్‌సినాటీలో రెండేళ్లలో జరిగిన నగరీకరణ మార్పులను చూస్తే నాకు మన తెలంగాణలోని నగరాలు గుర్తుకు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల కేంద్రాలను శక్తివంతంగా తీర్చిదిద్దే పని చేయాలి. హైదరాబాద్ అభివృద్ధిపై కేసీఆర్ పెట్టిన దృష్టిని ఆచరణాత్మక రూపుదాల్చితే మంచి ఫలితాలు వస్తాయి. హైద్రాబాద్ మాదిరిగా తెలంగాణలో ఐదారు నగరాలను అభివృద్ధి చేయాలి. గ్రామాల్లో వ్యవసాయం దెబ్బతినకుండా టెక్నాలజీని పెంచుకోవాలి. అదే సమయంలో నగరీకరణ వేగవంతంగా జరగాలి.

2436

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ

country oven

Featured Articles