ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది


Fri,January 30, 2015 03:31 AM

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న
సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో
బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను
ప్రాథమిక స్థాయినుంచి మెరుగుపరుచుకుంటూ వస్తేనే
రేపటి భవిష్యత్తులో సమస్య వుండదు.

ప్రజాస్వామ్య వ్యవస్థకు చట్టసభలు, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహకవర్గం, పత్రికా స్వేచ్ఛ అనేవి నాలుగు స్తంభాల్లాంటివి. ఇందులో దేని ప్రతిపత్తి, ప్రాధాన్యాలు దానికే వుంటాయి. ఇవన్నీ సమాంతరంగా, సమర్థంగా సమన్వయంతో పనిచేసినప్పుడే సమాజం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ప్రజా సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలను చట్టసభల్లో ప్రజాప్రతినిధులు చర్చించి పరిష్కారాల మార్గాలతో చట్టాలు రూపొందిస్తారు. కానీ ఇల్లు అలకగానే పండుగ కాదు అన్నట్లు చట్టం చేయగానే సమస్య పరిష్కారం కాదు. ఆ చట్టాల స్ఫూర్తిని అర్థం చేసుకొని చిత్తశుద్ధితో అమలుచేసే అధికార యంత్రాంగం కావాలి. ప్రభుత్వానికి వున్న విజన్‌ను పథకాల ద్వారా అమలు పరచాల్సిన బాధ్యత ఉద్యోగులది. అందుకే సామాజిక శ్రేయస్సు కోరే అధికార యంత్రాం గం అవసరమవుతుంది.

ఉద్యోగులు అలా చేయాలంటే పబ్లిక్ సర్విస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ లక్ష్యాలు అర్థం చేసుకునే సామాజిక స్పృహ కల్గిన యంత్రాంగం అవసరం. చట్టసభలకు, కార్యనిర్వాహక వర్గానికి మధ్య సరైన సమన్వయం లేకపోతే సమస్యలనేవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారతాయి. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశించిన తర్వాత అధికార యంత్రాంగం స్వరూప స్వభావాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. విధి నిర్వహణలోనూ కొత్త మార్పులు వచ్చాయి. ఉద్యోగులపై ఖర్చుచేసే ప్రతిపైసాను ప్రభుత్వాలు పెట్టుబడిగా పరిగణిస్తాయి. అందువల్లే ఆ పెట్టుబడికి వాళ్ల జవాబుదారీతనం అవసరం.

ఒకప్పుడు ఒక కార్యాలయం వుందంటే అందులో వాచ్‌మెన్, ఎల్‌డీసీ, యూడీసీ, సూపరింటెండెంట్, ఉన్నతాధికారి అంటూ ఉద్యోగ వ్యవస్థ అంచెలంచెలుగా వుండేది. పైగా వాళ్లపైన తాలూ కా స్థాయిలో, జిల్లా స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థలు బలంగా వుండేవి. కానీ ఈనాడు టెక్నాలజీ రావడం వల్ల ఉద్యోగులు ఎవరో ఒక పై అధికారి కనుసన్నల్లో కాకుండా తాము చేస్తున్నటువంటి విధికి తానే కర్త, కర్మ, క్రియ కావాల్సి వస్తుంది. తాను ఏ శాఖలో పనిచేస్తున్నాడు. ఆ శాఖకు సంబంధించిన అవగాహన, అందులోని మౌలిక సమస్యలను అతనే గుర్తించాలి. అంతేకాదు ఆ సమస్యల పరిష్కారానికై తన నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని, సృజనాత్మకతను జోడించి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయడమే ఇవ్వాళ అతని పనికి గీటురాయిగా మారుతోంది. ప్రభుత్వం కూడా ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంచడం కోసం ఎవరి బాధ్యతల్ని వారే నిర్వహించాలనీ, ఉద్యోగులకు ఎలాంటి బాధరబందీ లేకుండా స్వతంత్రంగా, సమర్థంగా పనిచేసే ఉద్యోగులు కావాలని భావిస్తోంది.

తెలంగాణ ఉద్యమం వచ్చేందే నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన. తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులు ఎంతోమంది తరతరాలుగా తాము అనుభవిస్తున్న దారిద్య్రం, దోపిడీ నుంచి విముక్తి పొందడం కోసం ఉద్యమంలో పాల్గొని దాన్ని బలోపేతం చేశారు. అలాంటి నిరుద్యోగ యువకులంతా ఇవ్వాళ ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రంలో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఆచార్య ఘంటా చక్రపాణి అధ్యక్షతన తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఉద్యమశీలి అయిన చక్రపాణి గారు ఈ స్ఫూర్తిని అర్థం చేసుకొని నియామకాలు జరపాలనీ, ఆ నేపథ్యంలోనే రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని యువత నైపుణ్యాన్ని ప్రజాసమస్యలతో జోడించి దాన్ని పరిష్కరించేందుకు సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆచార్య హరగోపాల్ అధ్యక్షతన సిలబస్ నిర్ధారణ, పరీక్ష నిర్వహణ అంశాలపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఒక సభ్యుడిగా నేను మూడుసార్లు కమిటీ భేటీలో పాల్గొన్నాను.

అందులో బంగారు తెలంగాణ సాధనకై ఎన్నో సూచనలు, సలహాలు వచ్చాయి. అందులో ప్రాథమికంగా ఉద్యోగుల నియామకాలకు సంబంధించి తెలంగాణ భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితి అర్థం చేసుకొనే ఉద్యోగవర్గం అవసరం కాబట్టి ఇప్పటికిప్పుడే సంస్కరణలు అన్నింటినీ తెచ్చి వాళ్లపై రుద్దకుండా, రాష్ట్ర లక్ష్యాన్ని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాటిని దశల వారీగా అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇక్కడి యువత ఇప్పటికే ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా చదువుకొని పరీక్షలకు సిద్ధంగా వున్నారు. ఒకవేళ కొత్త సిలబస్‌ను, పరీక్ష విధానాన్ని, సంస్కరణలను తెచ్చినట్లయితే వాటిని పెట్టుబడిగా మార్చుకొనేందుకు మార్కెట్ వ్యవస్థ కాచుక్కూచుంది. అలాంటి కొత్త దుకాణాలకు అవకాశం ఇవ్వకూడదని, అందుకు పిల్లల్ని బలిచేయరాదని ప్రస్తుతానికి స్వల్ప మార్పులతోనే నియామకాలు జరపాలనే కమిటీ నిర్ణయించింది.

కానీ ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం నెరవేరాలంటే ముఖ్యంగా ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను ప్రాథమిక స్థాయినుంచి మెరుగుపరుచుకుంటూ వస్తేనే రేపటి భవిష్యత్తులో సమస్య వుండదు. విద్యా ఉద్యోగానికి ఇవ్వాళ ముడి అనివార్యం కాబట్టి విద్యార్థి విద్యావంతులైనా యువత తాము ఏ శాఖలో చేరబోతున్నారో, ఎందుకు చేరబోతున్నారో, అందని సమస్యలను గుర్తించారా? లేదా? అన్నదాన్ని కూడా మనం గమనించాలి.

రెండోది, మనం రెడీమేడ్‌గా ఉన్న ఫాస్ట్‌ఫుడ్‌ను అందినట్లు కాకుండా అందులోనే సృజనాత్మకతను, విశ్లేషణా సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని వెలికితీయడం కోసం ప్రశ్నాపత్రంలోనో, ఇంటర్వ్యూలోనో మనమే కొన్ని సమస్యల్ని తయారుచేసి వాటిని అతను ఎలా ఎదుర్కొంటాడో గుర్తించాలి. దాన్నిబట్టి అతని చైతన్యస్థాయిని, సామాజిక స్పృహని అంచనా వేయడానికి అవకాశం వుంటుంది. ఇలాంటి మౌలిక మార్పులెన్నింటినో తీసుకొస్తేనే బంగారు తెలంగాణ స్వప్నం మన కార్యనిర్వాహక వర్గంలో భాగమైన ఉద్యోగుల ద్వారా సిద్ధిస్తుంది. అందుకు కంకణబద్ధులైన పబ్లిక్ సర్విస్ కమిషన్ ఛైర్మన్ ఆచార్య ఘంటా చక్రపాణి, ఆచార్య హరగోపాల్ ఆ దిశగా కృషి చేస్తారని బలంగా నమ్ముతాను.

542

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ