శిక్షకు కులముంటుందా?


Wed,May 14, 2014 05:33 AM


మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ ని పాలకులు చెప్పుకుం టూ వస్తున్నారు. విద్యాసంస్థలు నెలకొల్పటంతోనే విద్యాభివద్ధి జరిగినట్లు కాదు. విద్యాసంస్థలతో, నిర్వహణతో, లక్ష్యాలతో విద్యారంగం నిర్వహించబడదు. విద్యారంగాన్ని పటిష్టంగా నిర్మించటం అన్నది ఒక సామాజిక ప్రక్రియ. విద్యార్థులను తీర్చిదిద్దటమంటే మిలటరీ క్యాంపులను నడిపించటం కాదు. మానవతా లక్షణాలుంటేనే ఆ విద్యను విద్యార్థులు స్వీకరిస్తారు. బెనారస్ విశ్వవిద్యాల యం నుంచి వచ్చిన విద్యార్థులు గొప్ప దేశభక్తులు ఎందుకయ్యారు? కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు చైతన్యం గల విద్యార్థులుగా ఎలా సమాజాన్ని కదిలించారు.

ఆవిశ్వవిద్యాలయ విద్యార్థులపై అక్కడి అధ్యాపకుల కషి, ఆ సంస్థను నడిపించిన వైస్ చాన్స్‌లర్‌ల దీక్షే ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. పండిట్ మాలవ్యా బెనారస్ విశ్వవిద్యాల య ఆవరణలో తిరుగుతుంటే అక్కడి వాతావరణంకూడా చార్జ్ అయ్యే ది. అందుకే ఆ విశ్వవిద్యాలయం నుంచి ఎ.ఎస్. రావులాంటి గొప్ప శాస్త్రవేత్తలు వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన ఎందరెందరో పబ్లిక్ రంగానికి అంకితమై తమ జీవితాలను ప్రజలకు అంకితం చేశారు. సామాజి క రంగాలను ప్రభావితం చేస్తూ తరిమెల నాగిరెడ్డి లాంటి మేధావులు బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చారు.

కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ప్రొఫెసర్ రాంరెడ్డి తన సొంత బిడ్డలాగా చూసుకున్నాడు. ఒకవైపున పోరాట వీరులు రెండో వైపున గొప్ప శాస్త్రవేత్తలు వీరంతా విశ్వవిద్యాలయాల ప్రాంగణాల నుంచే పుట్టుకొచ్చారు. అక్కడి వైస్ చాన్స్‌లర్‌లు, ప్రొఫెసర్లు అధికారంతోనో లేక లాఠీలతోనో ఆ ప్రాంగణాలను నిర్వహించలేదు. తమ జీవితాలను అంకిత స్వభావాన్ని ఆచరణాత్మకంగా చూపటం వల్లనే విద్యార్థులు గొప్పవాళ్ళయ్యారు. పాఠాన్ని ఆచరణాత్మకంగా జీవితంగా మలిచారు.విద్యార్థులను తీర్చిదిద్దటానికి, నూతన భావజాలాలను అందించే మార్గదర్శకులుగా ఆనాటి ప్రొఫెస ర్లు, టీచర్లు, వైస్ చాన్స్‌లర్‌లు ప్రయత్నించారు. విద్యార్థులను ప్రేమించటం తరగతి గదిలో మాత్రమే కాకుండా బైటనే అది బలంగా ఏర్పడుతుంది. విద్యార్థులను ఎంతగా పట్టించుకుంటే అదే మోతాదులో మనం చెప్పే చదువునూ పట్టించుకుంటాడు.

ఇపుడు పీడిత వర్గాల నుంచి వచ్చిన పిల్లలు విద్యా ప్రాంగణంలోకి అడుగు మోపుతున్నారు. అట్టడుగు సమాజం నుంచి ఎదిగి వస్తున్న వారు విశ్వవిద్యాలయ ప్రాంగణాలను తమ మట్టిపాదాలతో పునీతం చేస్తున్నారు. పలు రకాల నేపథ్యాల నుంచి విద్యాలయాలకు వస్తున్నా రు. పలు రకాల సంస్కతుల నుంచి వస్తున్నారు. భిన్న సంస్కతుల కలయికల మధ్య సంఘర్షణ ఉంటుంది. భిన్న పరిస్థితులను చూసి విద్యార్థులు తమ వైఖరిని నిర్ణయించుకుంటారు. విశ్వవిద్యాలయ పాలక వర్గాలు ప్రతిక్షణము విద్యార్థుల మేలుకోరేవారనే విశ్వాసం పిల్లల్లో కలిగించాలి.

అలాంటి వాతావరణం,సిగ్నల్స్ పిల్లలకు పంపాలి. ఆ పిల్లల హితం కోసమే ఉన్నామన్న ప్రగాఢ నమ్మకాన్ని విద్యాలయ పాలకులు కలిగించాలి. పిల్లల దగ్గర తమకు తామే ప్రవీణులమన్న అహంకారాన్ని ప్రదర్శించకూడదు. ఆ అహంకారం ప్రదర్శిస్తే గుళ్లోవున్న అయ్యవారిలాగే చూస్తారు. వైస్‌చాన్స్‌లర్‌లు పిల్లలను గౌరవించటం నేర్చుకున్నారు.ఆ విద్యార్థుల మాట వింటేనే కదా మన మాట వింటా రు. పిల్లలను అధికార ముద్రలతో అణిచివేయాలని చూస్తే ఆ విద్యార్థులు సామూహిక బలంతో పాలనా రంగంపైకి వస్తారు. తిరుగుబా టు చేస్తారు.
విద్యార్థుల అకడమిక్ విషయాలు, విజయాలను బట్టి వారిని ప్రోత్సహించాలి. ర్యాంకు హోల్డర్‌లను గౌరవించటంలో తప్పులేదు. కానీ ర్యాంక్ హోల్డర్‌లు కాని వాళ్లను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటమే మనం చేయాల్సిన పని. పిల్లల్లో వున్న ప్రతిభను వెలికి తీయటమే మనం చేయాల్సిన పని. ప్రొఫెసర్లు అంటే పాఠాలను వల్లె వేసేవారు కాదు. విద్యార్థుల్లో వున్న ఆసక్తిని రగిలించి విజ్ఞానం వైపుకు మళ్లించాలి. ఆ విజ్ఞానం సమాజానికి ఉపయోగపడేటట్లు చేయాలి.

అమెరికాలోని సిల్‌సినాటి అనే పట్టణానికి వెళ్లాను. నేను ఏ వూరుకు పోయినా కానీ లైబ్రరీకి వెళ్లటం అలవాటుగా చేసుకున్నాను. సిల్‌సినాటిలోని లైబ్రరీ 3 అంతస్థుల భవనం కాక చుట్టూరా విశాలంగా ఒక ఎకరానికి పైగా ఖాళీ స్థలముంది. నేను వెళ్లినప్పుడు ఆ ఖాళీ స్థలంలో ఒక మూలకు 6 కుర్చీలలో విద్యార్థులున్నారు . వారి మధ్య ఒక ప్రొఫెసర్ కూర్చున్నాడు.

ఆ పిల్లలు తరగతిగదిలో చెప్పిన విషయాలకు సంబంధించిన పుస్తకాలను చూపిస్తూ కొన్ని అంశాలను వివరిస్తున్నా డు. ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో అని నాలో నేను అనుకున్నాను. ఇందులో ఇద్దరు ఆఫ్రో అమెరికన్లు, మరో ఇద్దరు అమెరికన్లు, ఇద్దరు ఇండియన్లు ఉన్నారు. వీరంతా ఓహియో విశ్వవిద్యాలయానికి చెందినవారు. ఈ మాదిరిగా విద్యార్థులతో కలిసి ఉంటే వారికి క్లాసులోనే కాక లైబ్రరీలో కూడా వారికి సహాయం చేస్తే వారు రుణపడి ఉంటారు కదా! ఇదే మంచి టీచర్లు చేయవలసిన పని అనుకుంటాను. కానీ మన దగ్గర విద్యార్థు లు లైబ్రరీ వసతులు పెంచమని అడిగినందుకు వారిని రెస్ట్‌కేట్ చేశారట. ఇది విచారకరం. ఇఫూ ్లలో ఈ సంఘటన జరిగింది. ఇది సుదీర్ఘ పోరాటానికి దారితీసింది. ఆ పోరాటంలో ఒక గ్లాసు పగిలగొట్టినందుకు ముగ్గురు విద్యార్థులను ఇఫ్లూ నుంచి రెస్టికేట్ చేశారు. ఆ పగిలిన గ్లాసుకు డబ్బు కూడా ఇస్తామని విద్యార్థులు ముందుకు వచ్చారు.

ఇఫ్లూ అధికారులు విద్యార్థుల విన్నపాన్ని పట్టించుకోలేదు. పగిలి పోయిన తిరిగి తెచ్చుకోవచ్చును కానీ విద్యార్థులు ప్రొఫెసర్ల మధ్య తెగిన బాంధవ్యాన్ని తిరిగి కలపటం చాలా కష్టమైన పని. చివరకు పోలీసులతో ఆ విద్యార్థులను కొట్టిస్తే ఆ ఘర్షణ ఎటువైపుకు దారి తీస్తుంది? అదే ఒక సంపన్నవంతమైన విద్యార్థులైతే ఇంతదాకా సమస్యను తెస్తారా అని ప్రశ్నిస్తున్నారు. శిక్షకు కూడా కులముంటుం దా? కుల సంకెళ్లను ఛేదించాల్సిన విద్యారంగంలో కుల సంకెళ్లు వేస్తే వ్యవస్థకు అది ప్రమాద సంకేతం అవుతుంది. శిక్షలతో విద్యా ప్రమాణాలు పెరగవు. గురుశిష్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు బతుకవు. ఒక అంతర్జాతీయ విద్యా సంస్థ ఉనికికే ఇది మచ్చగా మారుతుంది. ఇలాంటి అధికారులు సంస్థకు గౌరవం తేవటానికి బదులుగా అపకారం చేసిన వారవుతారని ఇకనైనా గుర్తించటం మంచిది. కేవలం యోగ్యతలు, క్వాలిఫికేషన్లు చూసి వీసీలుగా నియమించటం కంటే వీసీల కున్న సామాజిక దష్టే ప్రమాణం కావాలి.

చుక్కా రామయ్య
(రచయిత: ప్రముఖ విద్యావేత్త )

135

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ

country oven

Featured Articles