మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు


Wed,April 30, 2014 12:48 AM

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇంతకు ముందు గడచి న ఎన్నిక ల్లో పార్టీల మీద, పార్టీల ఎజెండాల మీద చర్చ జరిగేది. ఇపుడు వ్యక్తుల మీద, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్ల మీద ప్రచారం జరుగుతుంది. ఇది ఈసారి కొత్త అంశంగా ఓటర్ల ముందుకు వచ్చింది.

Chukka-Ramaiahపార్టీల నాయకులు ఎన్నికల తర్వాత ఎన్నుకోబడేవారు. రథసారధులు అందరూ ఎన్నికల తర్వాత బైటపడేవారు. ప్రధానంమంత్రి, మంత్రులు సహా ఎన్నికల తర్వాతనే వారిపేర్లు ప్రకటించబడేవి. ఈ ఎన్నికల్లో రథసారధుల పేర్లు ముందుకు వచ్చాయి. పార్టీలు వెనుకబడ్డాయి. ప్రజలు నాయకులను చూసి ఓటెయ్యాలని అని వూహించారు. నాయకుని గుణాలే ఎన్నికలకు కేంద్ర బిందువుయ్యాయి. ఎన్నికలు వ్యక్తుల చుట్టే తిరిగాయి. వ్యక్తులు చేసిన పాపాలు గత చరిత్ర అంతా చర్చానీయాంశం అయిపోయింది. ఒక నాయకుడు ఇంకో నాయకునిపై బుదరలు చల్లుకోవటం, లేదా నిందారోపణలు చేయటం సర్వసాధారణమైపోయాయి. రాబోయే ప్రధానమంత్రుల్లో కొంతమంది రాజకీయాల్లో 20-30 ఏళ్ల అనుభవం ఉన్నవారు ఉండేవారు. వారు పుట్టినప్పటి దొండాకు పసరు దగ్గర నుంచి నేటి వరకు చర్చానీయాం శం అయిపోయింది. ఎన్నికలు భవిష్యత్తుకు రూపురేఖలు దిద్దేందుకు బదులుగా గతం భవిష్యత్తు రూపురేఖలను దిద్దుతుంది. వచ్చే సమాజం గత సమాజం తీరుగా ఉంటుందన్న నమ్మకంలేదు. కొత్త సమస్యలు రావచ్చును.నాయకులకు కొత్త నైపుణ్యా లు అవసరం కావచ్చును. రాజ్యాంగవేత్తలు ఆలోచించి నాయకుని ఎన్నిక ఎన్నికల తర్వాత జరగాలని అన్నారు.

భవిష్యత్తుకు కావాల్సిన నైపుణ్యం గల మనిషి ప్రధానమంత్రి అవుతారని అనుకున్నారు. కానీ ఈఎన్నికలలో ప్రధానమంత్రి, ముఖ్యమం త్రి పేర్లను ప్రకటించటం రాజకీయాలకు ఒక కొత్త మలుపునిచ్చిం ది. ప్రజలు ఓటువేయక ముందు తమ నిర్ణయాన్ని ఏమి చెబుతారోనన్న కుతూహలం ఉండేది ఈ ఎన్నికల లోపల ప్రజలు ఉబ్బిస్తేనే సభలకు వస్తామంటున్నారు. పిల్లలు పైసలిస్తే చదువు చెప్పేందుకు చేర్చుకునే కార్పొరేటు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం.అడ్మిషన్లకు ముందే పిఆర్‌ఓలను ఏర్పాటు చేసుకోవ టం, అడ్మిషన్లు తీసుకోవటం జరుగుతుంది అదే పరిస్థితి సరిగ్గా ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది. ఒక్కొక్క మీటింగ్‌కు లక్షలు వెచ్చించవలసి వస్తుంది. ఇది వరకు మైకులకు ఖర్చు, తిరిగే వాహనాలకు ఖర్చు చేసేవాళ్లు. ఇప్పుడు జేజేలు కొట్టించుకునేందుకు డబ్బులు ఇవ్వాలి. ఒక్క ఓటరుకు నాలుగైదు పార్టీలకు జేజేలు కొట్టే దశకు వచ్చారు. ప్రజా ప్రతినిధులు గెలిచి సంవత్సరానికొక పార్టీ మార్చుకున్న సంస్కతి ప్రజల మనోభావాలపై రుద్దారు.

ఫలితాల వూహాగానాలు పాదరసం కన్నా వేగంగా మారుతూ వచ్చాయి. వూహాగానాలు వేరుగా మారాయి. ఫలితాలు మరో రకంగా వచ్చేటట్లుగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉసరవెల్లి నాయకులను వేదికపైకి రాకుండా చేయాలి. పార్టీల ఫిరాయింపు దారులను, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తుల్ని ఒక్కసారి వోడగొట్టగలిగితే ఇక నాయకులు పదవులకోసం విచ్ఛలవిడిగా పార్టీలు మారరు. ఎన్నికలలో రాజకీయ పార్టీలకు ఓటరు చెక్‌పెట్టే సమయం ఆసన్నమైనది. రాజకీయ పార్టీలు తమ దక్పథాన్ని నిలపగలిగిన వారిని అభ్యర్థులు ఎన్నుకోవాలి. కానీ చాలా వరకు తమ రాజకీయ దక్పథం, భవిష్యత్తుపై దూరదష్టి అన్న ఆలోచనలు కనిపించటం లేదు.
గెలుపు గుర్రాల కోసమే చూస్తున్నారు. అంటే డబ్బులు, కులాన్ని ప్రధానంగా చూస్తూ టిక్కెట్ల పంపిణీ జరిగింది. అందుకే పార్టీలు ప్రకటించిన మ్యానిఫెస్టోలకు ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులకు సంబంధం లేకుండాపోయింది.

పార్టీలు తెలంగాణలో సహజ వనరులను సంరక్షిస్తామని ఎన్నికల్లో విస్తతంగా ప్రచారం చేశాయి. కానీ ఆసంబంధిత పార్టీలు మాత్రం నిలబెట్టిన అభ్యర్థులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నిత్యం సహజ వనరుల ను దోపిడీ చేసే దగాకోరులకు టిక్కెట్లు ఇచ్చారు. అవినీతి లేని పాలనను అంతమొందిస్తామని పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయి. అవినీతిలో పీకల దాకా మునిగిన వారికి, అవినీతి కేసు ల్లో ఇరుకున్నవారికి టిక్కెట్లు ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ భూము లను సంరక్షిస్తామని చెబుతున్నారు. కానీ రియల్‌ఎస్టేట్ బ్రోకర్ల కు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని డబ్బు సంపాదించిన వారికి టిక్కెట్లను ఇచ్చారు.ఇలా చెప్పుకుంటూ పోతే అభ్యర్థుల ఎంపికలోనే అవకతవకలు భారీగా ఉన్నాయి.మరి ఇలాంటి వ్యాపారుల్ని, రియల్‌ఎస్టేట్ ఓనర్లను, అవినీతిపరులను, ఎప్పు డంటే అప్పుడు ఎటంటే అటు పార్టీలు మార్చే వారిని ఎన్నుకుం అసెంబ్లీ ఎలాంటి వారితో నిండుతుందోనన్నది ప్రజాస్వామి కవాదులను ఆందోళన పరుస్తుంది. ఓటును సక్రమంగా వినియోగించుకొమ్మని అందరూ చెబుతున్నారు. ఇది ఆహ్వానించతగిందే కానీ నిలబడ్డ నలుగురిలో అవినీతి మరకలు లేని వారిని ఎంచుకోవటం ఓటరుకు పెద్ద పరీక్షగా మారింది.దేశంలోనే మన రాష్ట్రం లో జరిగినంత ఎన్నికల ఖర్చు మరే రాష్ట్రంలో జరగటం లేదు. ఇప్పటికే ఎన్నికల కమిషన్, పోలీసు విభాగం కలిసి వందల కోట్ల రూపాయలు పట్టుకోవటం జరిగింది.

నవ తెలంగాణను నిర్మిస్తామని అందరూ చెబుతున్నారు. మరి ఈ డబ్బుసంచులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఈ మద్యం సీసా ల గుట్టలు ఎక్కడ నుంచి వస్తున్నాయి. ప్రజలను కార్యకర్తలను మత్తులో వూగించి, నోట్లకట్టలను వెదజల్లే ఇలాంటి ప్రజా ప్రతినిధులు అసెంబ్లీకి వస్తే తెలంగాణకు మరింత ప్రమాదకర రోజు లు సంక్రమిస్తాయి. నవ తెలంగాణను ఎవరు నిర్మిస్తారో గమనించి ఓటెయ్యమని ప్రార్ధిస్తున్నాను. కులం, మతం గోడలను కూల్చగల ప్రజాస్వామిక లౌకికవాదశక్తులను గెలిపిస్తే అది సమాజానికి రక్షణ కవచంగా మారుతుంది.

437

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ