ప్రజాస్వామ్యమే పరిశోధన


Sat,October 6, 2012 03:08 PM

Chukka-Ramaiah talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంలో ఇటీవల నల్గొండ జిల్లాలో జనం తో కలిసి తిరిగాను. ఉద్యమాలు ఏదో ఒక నేపథ్యంలో సామాజిక కోణం నుంచి పుట్టుకొస్తూనే ఉంటాయి. సమస్యలకు పరిష్కారాలు ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతాయని చరిత్ర చెబుతున్నది. అయితే తమ సమస్యల పరిష్కారానికి గళం విప్పడం ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థ ఇచ్చిన హక్కు. ఆ హక్కును కాలరాసే అధికారం ఏ పాలకులకూ లేదు. నల్గొండ జిల్లాలో ఇటీవ ల కొన్ని సంఘటనలలో పోలీసుల అఘాయిత్యాలు కళ్లారా చూశాను. ప్రజల నిస్సహాయత కూడా చూశా ను. ప్రజల కోపాగ్ని కట్టలు తెగడమూ చూశాను. నల్గొండ నుంచి రాత్రి 12 గంటలకు హైదరాబాద్ చేరుకున్నాను. నిత్య జీవిత కార్యక్షికమంగా మారిన వాకింగ్‌కు ఉద యం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి వెళ్లాను. ఆ ఆవరణంతా కలియ తిరిగాను. విశ్వవిద్యాలయాలకు, ఈ ప్రజా ఉద్యమాలకు ఏమైనా సంబంధం ఉంటుందా? అని నాలో ఆలోచనలు మొదలయ్యాయి.

ప్రజా కార్యక్షికమాల లో పౌరులు భాగస్వాములు కావడం ప్రజాస్వామ్యంలో ఒక ప్రధానమైన భాగం. ఆ పనిలోంచి ప్రజలను వేరు చేసి చూడలేం. ప్రపంచంలోని అన్ని యూనివర్సిటీలు ప్రజలకు పాలకులకు మధ్యన ఏర్పడే అగాథాన్ని పూరించేందుకు పెనుగులాడుతున్నాయి. పరిశోధన అనగానే విశ్వవిద్యాలయాల గోడల వరకే, మేధావి వర్గం వరకే పరిమితం చేస్తారు. విశ్వవిద్యాలయాలు ఎంతో గొప్ప పరిశోధన చేస్తా యి. అంతటితో పరిమితం కాకుండా ప్రజాస్వామిక పాలనకు, జ్ఞాన సముపార్జనకు ఏర్పడ్డ అగాథాన్ని పూరించగలుగుతాయి. అంత శక్తిసామర్థ్యాలు విశ్వవిద్యాలయాలకున్నాయి. దాన్నే ‘యాక్షన్ రీసెర్చ్’ అంటారు. నేడు రీసెర్చ్ సమాజ ప్రగతి కోసం ఎంత ప్రధానమో? మానవ సంపద పెంచేందుకు ఎంత అవసరమో? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కూడా ఈ పరిశోధన అంతే అత్యవసరమైనది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కూడా పరిశోధనలో ఒక భాగమైంది.

‘రీసెర్చ్ ఫర్ డెమోక్షికసీ’, ‘డెమోక్షికసీ ఫర్ రీసెర్చ్’. ప్రజలను పాలనా యంత్రాంగంలో భాగస్వామ్యం చేయడమంటే పాలనకు సంబంధించిన చర్చలలో భాగం చేయడమే. నిర్ణయాలు తీసుకోవడంలో భాగం చేయడమే. సమస్యలు పరిష్కరించడంలో భాగం చేయడమే. దీనితో పాలనా యంత్రాంగంలో ఉండే అధికారాలకు, సామాజిక కార్యకర్తలకు మధ్యనున్నటువంటి లోపాన్ని పూరించే అవకాశం ఉంటుంది. దీనివల్ల సామూహికమైన జ్ఞానం పెరిగే అవకాశం, ప్రభుత్వం పౌరుల సమస్యల ను అవగాహన చేసుకోవడానికి, ప్రజలు పాలనలో ఇబ్బందుల ను చూసేందుకు దానికి అవకాశం లభిస్తుంది. దీనిలో మూడంశాలు ఇమిడి ఉంటాయి.

1) చర్చించే వేదిక 2) నిర్ణయాలు చేసే ప్రజాస్వామ్యం 3) సమస్యను పరిష్కరించే ఆచరణాత్మక ప్రజాస్వామ్యం.
telangana talangana patrika telangana culture telangana politics telangana cinemaచర్చించే వేదిక అంటే సెక్ర చర్చలు మాత్రమే కాదు. అసెంబ్లీలో చర్చలు మాత్రమే కాదు. ప్రజలకు సంబంధించిన అంశాలపై గ్రామస్థాయి నుంచి చర్చలు జరగాలి. కొన్నిసార్లు వ్యక్తులతో చర్చలు జరుగుతాయి. కొన్నిసార్లు చిన్నచిన్న గ్రూపులతో చర్చలు జరుగుతాయి. కొన్నిసార్లు పంచాయితీ సభ్యులతో జరుగుతాయి. అంటే చర్చలను కిందిస్థాయి వరకు తీసుకుపోవాలి. సమస్యల పరిష్కారం మేధావి వర్గం, లేదా పాలనాపరమైన సొత్తు అనుకోకూడదు. కిందిస్థాయి గ్రామాల్లో ఉన్న సామాజిక కార్యకర్తలు కూడా చర్చలో భాగస్వాములు అయితే సమస్య పరిశోధనలో ఎక్కువ మంది భాగం అవుతారు. పరిష్కారాలు మేధావి వర్గం మెదళ్ల నుంచే వస్తాయని అనుకోవద్దు. అధికార పీఠాల నుంచే రాల్తాయని అస్సలు అనుకోకూడదు. నల్గొండలో జనంలో తిరుగుతుంటే సామాన్యమైన మనిషి ఎదుర్కొంటున్న సమస్యపైన, తెలంగాణలో రగులుతున్న ఉద్యమంపైన ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారో కళ్లారా చూశాను. చర్చలు చేయడమే పరిశోధనకు మొదటి ప్రాతిపదిక.

అవి ఎంత విశాలంగా ఉంటే మనకంత విస్తృత సమాచారం లభిస్తుంది. వివిధ స్థాయిలలో ప్రతిరోజు ప్రజా సమస్యలపైన, రచ్చబండపైన చర్చలు జరుగుతాయి. ఆ చర్చలే రాష్ట్ర విధానాలకు కూడా ప్రాతిపదికలవుతాయి. రచ్చబండ కిందిస్థాయి చర్చలు కావు. అదొక పరిశోధన వేదిక. పరిశోధన ఎంత విశాలంగా ఉంటే ఫలితాలు కూడా అంత విస్తృతంగా ఉండే అవకాశాలుంటాయి.
నిర్ణయాలు చేసే ప్రజాస్వామ్యం: సమాజంలోని వివిధ వర్గాలకు వివిధ ఆశయాలు విభిన్నంగా ఉంటాయి. విభిన్నమైన నిర్ణయాలు కూడా ఒక్కొక్కసారి మొలకెత్తుతాయి. విభిన్న నిర్ణయాలలో ఏకత్వం, ఏకాభివూపాయం తేవడమే పరిశోధన లక్ష్యం కావాలి.

సమస్య పరిష్కారంలో సంబంధిత వ్యక్తులను కలిపితేనే కిందిస్థాయి బాధలు, కష్టాలు అర్థమవుతాయి. నిరంకుశ ప్రభుత్వాలలో నిర్ణయాలు పైనుంచి రుద్దబడతాయి. ప్రజాస్వామిక వ్యవస్థలో కింది నుంచి మొలకెత్తుతాయి. అవే ప్రజలను ప్రభుత్వం లో భాగస్వాములను చేస్తాయి. ప్రజాభివూపాయాన్ని, ఆచరణాత్మక ప్రజాస్వామ్యాన్ని చెప్పడానికి పాలకులు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వాటిని గౌరవించే అలవాటు చేసుకోవాలి. అదే మాదిరిగా ఆ డేటాను సామరస్యంగా సేకరించడం, సహృదయంతో స్వీకరించడం ప్రజాస్వామ్యానికి కావల్సిన మొదటి లక్షణం.
విశ్వవిద్యాలయాల్లో ఉన్న రీసెర్చ్‌ను ప్రజాజీవితంలోకి తీసుకరావాలి. బ్రిటన్‌లో జరిగిన చిన్న సంఘటనను పార్లమెంటు వరకే పరిమితం చేయలేదు.

దానిపై కిందిస్థా యి నుంచి చర్చలకు అవకాశం కల్పించారు. అదే మాదిరిగా మనం డెమోక్షికసీ తెచ్చుకు న్నాం. కానీ డెమోక్షికటిక్ అటిట్యూడ్ తెచ్చుకోలేదు. ప్రజలను పాలితులుగా చూస్తున్నాం కానీ భాగస్వాములుగా చూడడం లేదు. ప్రజాస్వామ్య ముసుగులో ఫ్యూడల్ రాజకీయాలు నడుపుతున్నారు. పరిశోధనలో చిన్న పెద్దా అనేది ఉండదు. అందరూ సమానమే. నల్గొండలో పోలీసు దాడులకు గురైన ప్రాంతాలలో తిరుగుతుంటే ప్రతి ఊరు నాకొక పరిశోధనశాలగా కనిపించింది. అది నకెరేకల్ కావచ్చును, కోదాడ, సూర్యాపేట కావచ్చును. చౌటుప్పల్, చిట్యాలలు కావచ్చును. సమస్త తెలంగాణ జనం ఏకాక్షిగతతో చర్చిస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రజ లు ఆలోచిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలి. అలా చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచి ఫలితాలొస్తాయి.

మనకు ఒకరినొకరు విశ్వసించే అలవాటు కూడా ముఖ్యం. ఒకరిపై ఒకరికి విశ్వాసం లోపించకూడదు. ఆ ప్రజలకు సంబంధించిన సమస్యల సమాచారాన్ని విశ్లేషించే లక్షణముండాలి. ఆ సమాచారాన్ని ఆధారం చేసుకునే నిర్ణయాలు జరుగుతుండాలి. అప్పుడే సమస్య పరిష్కారంలో ప్రజలు భాగస్వాములవుతారు. అందుకే పరిశోధన అన్నది ప్రజాస్వామ్యం. అసలు ప్రజాస్వామ్యమే పరిశోధన.

-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

35

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతు

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Featured Articles