భాషా సంస్కతులు వికసించేదెప్పుడు?


Tue,April 1, 2014 03:18 AM

భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతులను పరిరక్షించడం కోసం ఆయా పార్టీలు కషిచేయాలి. భాషా సంస్కతుల పరిరక్షణకు కట్టుబడని పార్టీలను ప్రజలు, ఓటర్లు తిరస్కరించాలి. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలుగా ఏర్పడబోతున్న సందర్భం ఇది. ఈ సమయంలోనే ఎన్నికల కాలం వచ్చింది. రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల కోసమే అన్వేషిస్తున్నాయి. గుర్రాల యజమానుల చేతులు మారుతున్నాయి. వలస పదం సిగ్గుపడి అవమానంతో వలసపోయే విధంగా విడబాట్లు, చొరబాట్లు ఉంటున్నాయి. రెండు రాష్ర్టాల ప్రజల సమస్యల గురించి విడిపోతున్న సందర్భంలో పొందవలసిన ప్రయోజనాల గురించి సమైక్యంగా ఆలోచించాల్సిన పార్టీలు ఎవరికి వారే యము నా తీరేలాగా విడగొట్టబడ్డాయి. పార్టీల ప్రయోజనాల కోసమే తప్పా ప్రజల బాగోగులు ఏ పార్టీ ఆలోచించడం లేదు. మ్యానిఫెస్టోలు గెలుపు కోసమే తప్ప, ప్రజల బాగుకోసం రూపొందించడం లేదు. ఎంత సేపూ సంక్షేమ పథకాల గురించే కానీ కొత్తదనం కంటికి కనిపించడం లేదు.

ఆచరణకు యోగ్యం కాని హామీలు ఇచ్చి మ్యానిఫెస్టోలను నీరుగారుస్తున్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టడం ఎన్నికల పార్టీలకు ఆనవాయి తి. ఇప్పటిదాకా ఎవరూ తెలుగు ప్రజల భాషా, కళ, సాంస్కతిక రంగాల విధా నం గురించి ఏ పార్టీ సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైనా భాషా సాంస్కతిక విధానంపై తమ విధానం చెప్పాలని, వాటిని తమ మ్యానిఫెస్టోల్లో చేర్చాలని కోరుతున్నాం. జనసేన మొదలు సమైక్యాంధ్ర నినాదంతో ఏర్పడిన పార్టీలన్నీ భాషా సంస్కతులపై స్పందించాలని కోరుతున్నాం.
తెలంగాణలో టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల భాషా సంస్కతి నినాదంతో ఏర్పడింది. ఉద్యమం చేసింది. కానీ ఆ పార్టీ కూడా ఈ విషయంలో ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా, మిత్రపక్షంగా వ్యవహరించిన కాలంలో భాషా సాంస్కతిక విధ్వంసం జరుగుతుంటే చూస్తూ ఊర్కుంది. అధికార పక్షం ఎమ్మెల్యేలతో కలిసి ఈ విధ్వంసాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు.

కాబట్టి ఇకనైనా బాషా సంస్కతులపై స్పష్టమైన విధానంతో ముందుకుపోవాలని కోరుతున్నాం. తెలంగాణ భాషకు అవమానం జరిగిందనే కారణంతో మొదలైన తెలంగాణ ఉద్యమం చరిత్ర, సంస్కతి వివక్షకు గురయ్యాయని చెప్పి ఉద్యమించడం జరిగింది. కానీ వీటి రక్షణకు చేసింది మాత్రం చాలా తక్కువనే చెప్పవచ్చు. కాబట్టి తెలంగాణ లో పాలన ప్రజల భాషలోనే జరగాలి. అధికారం ప్రజల నుంచి పైకి పురోగమించాలి. పాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే నిర్వహించాలి. ప్రభుత్వంలో భాషా సాంస్కతిక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. భాషా సంస్కతులపై అవగాహన ఉన్న వారిని మంత్రిగా నియమించాలి. కోర్టు తీర్పులన్నీ తెలుగులోనే వెలువరించాలి. ప్రాథమిక స్థాయి బోధన తెలంగాణ భాషలోనే జరగాలి. హైస్కూల్ స్థాయిలో ఆంగ్లం, తెలుగు మాధ్యమాలను ఉంచవచ్చు. తెలంగాణ భాషను ఆధునిక భాషగా తీర్చిదిద్దేందుకు నిరంతర అధ్యయనం జరపాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విశిష్ట తెలుగు భాషా అధ్యయన కేంద్రం ఏర్పాటు చేసిన రోజే దాని కోసం ప్రత్యే క భవనాన్ని కేటాయించాలి. వందకోట్ల రూపాయలను తెలంగాణ రాష్ర్టానికి మంజూరు చేయడానికి కేంద్రానికి లేఖ రాయాలి. సాంస్కతిక విధానం కోసం ప్రత్యేక అధ్యయనం, కషి జరగాలి. ఇసుక తవ్వకాలను నిషేధించాలి. వాగులు, వంకలను రక్షించాలి. గ్రానైట్ మాఫియాను కట్టడి చేయాలి. చారిత్రక కట్టడాలు, గుట్టల ను సంరక్షించాలి. ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లో నూ అనుమతించరాదు. జానపద, గిరిజన, మైనారిటీ భాషా సంస్కతులను పరిరక్షించాలి. ఈ వర్గాలకు చెందిన కళలను, సంగీతాన్ని పరిరక్షించి జాతీయస్థాయి లో వాటికి ప్రాచుర్యం కలిగించాలి.

తెలంగాణ వీరగాథలను ప్రదర్శించే చిందు, ఎల్లమ్మ, ఓగ్గు, యక్షగాన రూపాలకు ప్రాణం పోయాలి. వీటిని దశ్య, శ్రవణ మాధ్యమాలలో డాక్యుమెంట్ చేయాలి. సినిమా రంగానికి ఇచ్చే అన్ని రకాల రాయితీలను జానపద కళాకారులకు ఇవ్వాలి. రుంజ, కడ్డీ వాద్యం, కిన్నెర వంటి అపురూప వాద్యాలను రాష్ట్ర వాద్యాలుగా గుర్తించి బతికించుకోవాలి. వాటికోసం శిక్షణాలయాలను ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ర్టోద్యమంలో ఎదిగి వచ్చిన కళాకారులను, గాయకులను గుర్తించి వారికి కళాకారుల పాసులివ్వాలి. వారికి బస్సు, రైలు ప్రయాణాల్లో రాయితీ ప్రకటించాలి. వత్తి కళాకారులకు ఇచ్చే పింఛన్‌ను మరో వెయ్యి పెంచి ఇవ్వాలి. ప్రతి జిల్లాలకు వెయ్యి మంది కళాకారులను ఆదుకోవాలి. భాషా సంస్కతుల మాదిరిగానే పురావస్తు సంపద, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు తెలియజేయాలి.

నవతెలంగాణ నిర్మాణంలో తెలంగాణ భాషా సంస్కతుల పరిరక్షణ, జానపద కళల రక్షణ ఎంతో ప్రాముఖ్యం కలిగింది. దీనికోసం ప్రభుత్వం తప్పకుండా కట్టుబడి ఉండాలి. భాషా సంస్కతులు విలసిల్లకుండా ఎన్ని అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినా తెలంగాణ సమగ్ర అభివద్ధికాదు. సీమాంధ్రలో కూడా తెలుగు భాషా సంస్కతులను పరిరక్షించడం కోసం ఆయా పార్టీలు కషిచేయాలి. భాషా సంస్కతుల పరిరక్షణకు కట్టుబడని పార్టీలను ప్రజలు, ఓటర్లు తిరస్కరించాలి.
-చుక్కా రామయ్య, గౌరవాధ్యక్షులు
-జయధీర్ తిరుమలరావు, అధ్యక్షులు
భాషా సాంస్కతిక పరిరక్షణ వేదిక, హైదరాబాద్

478

CHUKKA RAMAYYA

Published: Thu,November 17, 2016 01:52 AM

చక్రపాణి పరీక్ష దార్శనికత

తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన మానవవనరుల మహాసైన్యాన్ని తయారు చేసేందుకు ఈ పరీక్షను రూపకల్పన చేశాడు. ఇందుకు ఏ రకమైన పరిజ్ఞానం కావాలో ఎ

Published: Sun,May 29, 2016 01:17 AM

టీచర్ల ఎంపికకు టీఎస్‌పీఎస్సీయే ఉత్తమం

ఉపాధ్యాయ నియామకాలు తరగతి గదిలో సంపూర్ణ మార్పుకు దోహదపడాలి. అది నూతన వ్యవస్థ నిర్మాణానికి పునాది కావాలి. అప్పుడే పాత వ్యవస్థను తుడి

Published: Tue,March 8, 2016 12:12 AM

కేజీ టు పీజీతో వ్యవస్థలో మార్పు

21వ శతాబ్దంలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తరగతి గదే కేంద్ర బిందువు అయ్యింది. ఈనాడు టీచింగ్ లోపల ఛాయిస్ వచ్చింది. వివిధ దేశాల బోధనా పద

Published: Wed,February 3, 2016 12:37 AM

తరగతిగది నుంచే సమాజ నిర్మాతలు

సమాజ నిర్మాణం ఒక బృహత్తర కార్యక్రమం. దానిలో పౌరులను వివిధ విధులను నిర్వహించటాని కి, కర్తవ్యధారులుగా మార్చటం కోసం సన్నద్ధం చేయవలసి

Published: Sat,October 10, 2015 02:00 AM

పోరాటాలు పాఠ్యాంశాలైన వేళ..

పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం పిల్లలు తెలంగాణ చరిత్రను ఇంతగా చదువుతున్నారంటే నా ఒళ్లు పులకరిస్తుంది. గత దశాబ్దాలుగా తెలంగాణ

Published: Sat,September 19, 2015 11:05 PM

చదువు సమాజ పునాది..

నేడు శిశువు పెంపకం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు సమాజం బాధ్యత అని గుర్తించినందులకు అందరూ ఆహ్వానించవలసిందే. సాంకేతికరంగంలో వచ్చ

Published: Tue,August 18, 2015 01:52 AM

గ్రామ రాజ్యానికి బడులే పునాదులు

తెలంగాణ రాష్ట్రం 21వ శతాబ్దంలో ఏర్పడింది. జ్ఞానం చాలా వేగంగా మారుతూ ఉన్న ది. ప్రపంచం పరిశోధనల గుమ్మిగా మారింది. సమాచార విప్లవాలు వ

Published: Wed,July 15, 2015 12:17 AM

గ్రామాలు-సాంకేతిక వ్యవసాయం

ప్రస్తుతం నేను అమెరికాలో సిల్‌సినాటిలో ఉన్నాను. గతంలో రెండు మూడు సార్లు వచ్చాను. ఇదొక పట్టణం. ఓరియస్ రాష్ట్రమది. ఇందులో 4 సిటీలున్

Published: Fri,January 30, 2015 03:31 AM

ప్రాథమిక విద్యే భవిష్యత్తుకు పునాది

ఉద్యోగ నియామక సందర్భంలో తేవాలనుకున్న సంస్కరణలకు ముందు ప్రాథమిక విద్యా వ్యవస్థలో బలమైన పునాది పడాలి. మన రాష్ట్ర విద్యావ్యవస్థను

Published: Tue,December 30, 2014 11:55 PM

నిధులతోనే విద్యానాణ్యత

తెలంగాణ రాష్ట్రం లో విశ్వవిద్యాలయాలకు తల్లిలాంటిది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇది ఎం తో చరిత్ర గల పాత విశ్వవిద్యాలయం. రాజధాని కేంద

Published: Wed,December 10, 2014 11:28 PM

గుట్టల గుండెల్లో చరిత్ర

పాల్కురికి సోమనాథునిది స్వీయరచన అందుకే అది తొలి తెలుగు కావ్యంగా నిలిచింది. ఆయన ఆదికవి అయ్యాడు. ఇంత చరిత్ర ఉన్న దాన్ని నేడు ప్రజలు

Published: Tue,November 11, 2014 03:25 AM

చదువే ప్రగతికి పెట్టుబడి

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన చరిత్రను తను రాసుకుంటూ నూతన చరిత్రను ఆవిష్కరించే పనిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్

Published: Sat,November 1, 2014 03:38 AM

మన రాష్ట్రం మన పరీక్షలు

తెలంగాణ రాష్ట్రం సర్వ సమృద్ధిగా ఎదిగేందుకు భూమిక విద్యారంగం నుంచే జరగాలి. ఆ భూమికకు పాదులను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం తీసుకునే న

Published: Sat,October 18, 2014 02:57 AM

విడిపోయినా పరీక్ష ఒక్కటా?

నేడు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యా ఎవరికి వాళ్లుగా పరీక్షలు నిర్వహించుకోవడమే సమంజసమైంది. రాష్ట్రాలుగా విడిపోయాం కాబట్టి ఎవ

Published: Wed,July 2, 2014 01:05 AM

మన నేలపై మన చరిత్ర

చుక్కా రామయ్య తెలంగాణ ప్రజల సమిష్టి కృషి వల్ల సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఎం ద రెందరో త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ర్టాన్

Published: Fri,June 20, 2014 11:25 PM

మరువలేని రోజు...

పదవీ విరమణ చేసిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇంజనీర్లు వీళ్ళందరు ఈ ప్రాంతానికున్న గొప్ప మానవ వనరులు. వీళ్లందరు తెలంగాణ పునర్నిర

Published: Wed,May 14, 2014 05:33 AM

శిక్షకు కులముంటుందా?

మన ఏలికలు ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాల యం ఏర్పాటు చేశామన్నా రు. సెంట్రల్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామ ని, ఐఐటీలు నెలకొల్పామ

Published: Wed,April 30, 2014 12:48 AM

మ్యానిఫెస్టోలు-అభ్యర్థులు

ఇప్పుడు జరగబో యే ఎన్నికలు భారతదేశ చరిత్రలో కీలకంగా మారబోతున్నాయి.దేశా న్ని కొత్త మలుపుకు తిప్పేందుకు ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఇం

Published: Fri,January 24, 2014 12:04 AM

సాయుధపోరును మలినం చేయొద్దు!

రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వీరతెలంగాణ సాయుధ పోరా టం ప్రస్తావన వచ్చింది. ఈ పోర

Published: Sun,January 12, 2014 12:51 AM

అభిప్రాయాలు చెప్పాల్సిందే!

వె నకటి రోజులలో మాట అంటే నమ్మకం, గౌర వం ఉండేది. ఒక వ్యక్తి ఫలానా విషయానికి సంబంధించి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండేది. ఒకరకంగ

country oven

Featured Articles